Mumbai police arrested
-
‘పెళ్లి’ పేరుతో మహిళలకు వల
సాక్షి, సిటీబ్యూరో: పెళ్లి పేరుతో ఎరవేసి ఎదుటి వారి నుంచి అందినకాడికి దండుకుని మోసం చేయడంలో ఉత్తరాదికి చెందిన ముఠాలు దిట్ట. కొందరు నైజీరియన్లు సైతం అక్కడి మెట్రో నగరాలకు అడ్డాగా చేసుకుని ఈ తరహా మాట్రిమోనియల్ ఫ్రాడ్స్‌కు పాల్పడుతున్నారు. అయితే, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. కచ్చితంగా చెప్పాలంటే 53 ఏళ్ల వృద్ధుడు వరుసపెట్టి మాట్రిమోనియల్ ఫ్రాడ్స్ చేస్తున్నాడు. గత ఏడాది వైజాగ్‌కు చెందిన మహిళను వంచించి అక్కడ అరెస్టయి జైలుకెళ్లగా.. తాజాగా ముంబైకి చెందిన వితంతువును నిండా ముంచి మళ్లీ కటకటాల పాలయ్యాడు. గత వారం చోటు చేసుకున్న ఈ అరెస్టు అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏసీబీ జేడీగా వైజాగ్‌లో మోసం నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన మాచర్ల శ్యాంమోహన్ గతంలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేశాడు. వివాహితుడైన ఇతడికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అయితే, కొన్నాళ్లుగా మాట్రిమోనియల్ సైట్స్‌ను వేదికగా చేసుకుని మోసాలకు తెర లేపాడు. వివిధ పేర్లు, హోదాలతో రిజిస్టర్ చేసుకునే ఇతగాడు ప్రధానంగా విడాకులు తీసుకున్న, వితంతువులైన మహిళలను టార్గెట్ చేసుకుంటున్నాడు. గత ఏడాది విశాఖపట్నంకు చెందిన 35 ఏళ్ల డాక్టర్‌ను మాట్రిమోనియల్ సైట్ ద్వారా ఎంచుకున్నాడు. భర్త నుంచి వేరుపడిన ఈ బాధితురాలితో తాను అవినీతి నిరోధక శాఖలో జాయింట్ డైరెక్టర్ అని, నెలకు రూ.50 వేల జీతం వస్తుందని నమ్మబలికాడు. వివాహం చేసుకుంటానని చెప్పిన శ్యామ్ మోహన్ ఆపై ఆమెను తన మాటలతో గారడిలో పడేశాడు. మన కోసం బెంగళూరులో ఓ ఇల్లు ఖరీదు చేశానని, అందులో ఏర్పాటు చేయడానికి రెండు ఏసీలు పంపాలని కోరాడు. ఈ మాటలు నమ్మిన బాధితురాలు రూ.లక్ష వెచ్చించి వాటిని పంపగా అందుకున్న తర్వాత మాట్లాడటం మానేశాడు. చివరకు అసలు విషయం తెలుసుకున్న బాధితురాలు అక్కడి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు గత ఏడాది సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. డాక్టర్ని అంటూ ముంబై మహిళకి.. విశాఖపట్నం కేసులో బెయిల్‌పై వచ్చిన శ్యాంమోహన్ తన పంథా మార్చుకోలేదు. మరో మాట్రిమోనియల్ సైట్లో డాక్టర్‌గా నమోదు చేసుకున్నాడు. ఆ సైట్ ద్వారా ముంబైలోని నెహ్రూనగర్‌కు చెందిన మహిళకు ఎర వేశాడు. భర్త నుంచి వేరుపడిన ఆమె మరో వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాను హైదరాబాద్‌కు చెందిన వైద్యుడినని ఈ ఏడాది జూలై 1న పరిచయం చేసుకున్న శ్యామ్ తన తల్లిదండ్రుల్ని కలవడానికి సిటీకి రమ్మన్నాడు. బాధితురాలు ముంబై నుంచి హైదరాబాద్ చేరుకోగా ఆమెను బంజారాహిల్స్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెకు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడటంతో పాటు ఆమె నుంచి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశాడు. స్వస్థలానికి తిరిగి వెళ్లిన బాధితురాలు అక్కడి నెహ్రూనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు శ్యామ్‌ను అక్కడకు రప్పించి అరెస్టు చేయాలని నిర్ణయించారు. దీంతో ఆ మహిళ మరికొన్నాళ్లు శ్యామ్‌తో మాటలు కొనసాగించేలా చేశారు. చివరకు అతడు మరో రూ.6.5 లక్షలు ఇవ్వాలంటూ ఆమెను కోరాడు. ఈ మొత్తం ఇస్తానంటూ ఆమెతో చెప్పించిన పోలీసులు తీసుకోవడానికి ముంబై రమ్మన్నారు. ఆదివారం అక్కడకు వెళ్లిన శ్యామ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతగాడు ఇంకా అనేక మందిని ఇదే పంథాలో మోసం చేశాడని, అయితే వారు ఫిర్యాదు చేయకపోవడంతో ఇతడి మోసాలు కొనసాగుతున్నాయని నెహ్రూనగర్ పోలీసులు చెబుతున్నారు. -
అనూహ్యతో ఆరోజు ఉన్నదెవరు?
-
మలుపు తిరుగుతున్న అనూహ్య కేసు!
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన మచిలీపట్నంకు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య (23) హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ముంబయి లోక్మాన్య తిలక్ టెర్మినల్ సీసీ ఫుటేజీ దర్యాప్తులో కీలకంగా మారింది. అనూహ్యతో ఓ వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రైలు దిగిన తర్వాత ఆమె ఓ వ్యక్తితో కలిసి వెయిటింగ్ రూమ్‌లోకి వెళ్లినట్టు గుర్తించారు. అతను అనుహ్యకు తెలిసిన వ్యక్తే అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఇంత వరకూ అతన్ని అదుపులోకి తీసుకోలేదని అంటున్నారు. అతన్ని పట్టుకుంటే హత్యకు సంబంధించిన కీలక సమాచారం లభిస్తుందని ముంబయి పోలీసులు భావిస్తున్నారు. మరో వైపు దర్యాప్తులో భాగంగా రైల్వే పోలీసులు, ముంబయు క్రైమ్ బ్రాంచ్ ప్రతినిధులు హైదరాబాద్ బయల్దేరినట్టు తెలుస్తోంది. అయితే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సింగవరపు ఎస్తేర్ అనూహ్య ఈనెల 5న అదృశ్యమైన 11 రోజుల తర్వాత కంజూర్‌మార్గ్‌కు సమీపంలో శవమై లభించిన విషయం విదితమే. హత్యకు ముందు ఆమెను ఐదు రోజుల పాటు లైంగిక దాడికి గురిచేశారని, చిత్రహింసలు పెట్టారని పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. కాగా ఈ కేసులో ఐదుగురు నిందితులను కుంజూర్‌మార్గ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు క్యాబ్ డ్రైవర్లు, ఇద్దరు వ్యభిచారగృహ నిర్వాకులు ఉన్నారు. అయితే విచారణ అనంతరం వారిని విడిచి పెట్టారు. అనూహ్య హత్య కేసులో పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. ఇది వస్తే అసలు హత్య ఎలా జరిగింది..? ఎప్పుడు జరిగింది..? దేనితో చేశారు..? మరోవైపు ఆ మృతదేహం అనూహ్యదేనా..? అనే తదితర ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. దీంతో పోలీసులు కూడా అనేక మంది అటో డ్రైవర్లతోపాటు రికార్డులో ఉన్న నేరస్తులను విచారించిన అనంతరం ఫోరెన్సిక్ నివేదిక కోసమే ఎదురుచూస్తున్నట్టుగా కన్పిస్తోంది. దీంతో ఈ నివేదికలో ఏమి ఉండనుందనే అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. -
పోలీసుల అదుపులో 'అనుహ్య' నిందితులు!
-
పోలీసుల అదుపులో 'అనుహ్య' నిందితులు!
ముంబైలో దారుణహత్యకు గురైన మచిలీపట్నం యువతి అనుహ్య కేసులో నగర పోలీసులు కీలక పురోగతి సాధించారు. అనుహ్య కేసుకు సంబంధించి నలుగురు ఆటో డ్రైవర్లను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురు డ్రైవర్లను పోలీసు స్టేషన్‌కు తరలించి పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ముంబైలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా అనుహ్య పని చేస్తుంది. అయితే క్రిస్టమస్ సెలవులు నేపథ్యంలో అనుహ్య స్వస్థలం వచ్చింది. సెలవులనంతరం ఆమె ఈ నెల మొదటివారంలో ముంబై పయనమైంది. ఆ క్రమంలో అనుహ్య ఆచూకీ తెలియకుండా పోయింది. దాంతో ఆమె తండ్రి హరి ప్రసాద్ తీవ్ర ఆందోళన చెందారు. దాంతో ఆయన ముంబై వచ్చి అనుహ్య కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా ఆయన ముంబై పోలీసులను ఆశ్రయించారు. వారిని నుంచి సరైన స్పందన లేకపోవడంతో హరిప్రసాద్ తన బంధువులతో గాలించారు. దీంతో నగరంలోని కంజూర్‌మార్గ్ ప్రాంతంలో కాలిపోయిన ఉన్న మృతదేహన్ని అనుహ్యగా గుర్తించారు. అనుహ్య మరణంపై ముంబై పోలీసులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారని ఆమె తండ్రి హరిప్రసాద్ శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలసి విజ్ఞప్తి చేశారు. దాంతో ఆ కేసుపై దర్యాప్తు వేగవంతం చేయాలని మహారాష్ట్ర సీఎంకు షిండే ఆదేశాలు జారీ చేశారు. ఆ క్రమంలో నలుగురు ఆటో డ్రైవర్లను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.