Mumbai win
-
Ultimate Kho Kho: ముంబై బోణీ
పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్లో ముంబై ఖిలాడీస్ బోణీ కొట్టింది. టోర్నీ ఆరంభమ్యాచ్లో గుజరాత్ జెయంట్స్ చేతిలో కంగుతిన్న ముంబై సోమవారం జరిగిన పోరులో 51–43తో రాజస్తాన్ వారియర్స్పై విజయం సాధించింది. ముంబై ఆటగాడు గజానన్ షెన్గళ్ డైవ్లతో అదరగొట్టాడు. మొత్తం 16 పాయింట్లు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ విజయ్ హజారే, రోమన్ కొరె, అవిక్ సింఘా చకచకా పాయింట్లు సాధించడంతో తొలి అర్ధభాగంలోనే ముంబై 29–20 స్కోరుతో ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో రాజస్తాన్ వరుసగా పాయింట్లు చేసి పోటీలో పడింది. ఆఖర్లో ముంబై ఆటగాళ్ల జోరు కొనసాగడంతో విజయం సాధించింది. -
సీకే నాయుడు ట్రోఫీ విజేత ముంబై
అహ్మదాబాద్: బీసీసీఐ దేశవాళీ అండర్–25 టోర్నీ (కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ)ను ముంబై సొంతం చేసుకుంది. బుధవారం ముగిసిన ఫైనల్ మ్యాచ్లో ముంబై 75 పరుగుల తేడాతో విదర్భపై విజయం సాధించింది. ఈ నాలుగు రోజుల మ్యాచ్లో ముంబై తొలి ఇన్నింగ్స్లో 468 పరుగులు చేయగా విదర్భ 385 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 83 పరుగుల ఆధిక్యం సాధించిన ముంబై రెండో ఇన్నింగ్స్లో 113 పరుగులకే కుప్పకూలింది. 197 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన విదర్భ 121 పరుగులకే ఆలౌటైంది. ట్రోఫీని అందుకుంటున్న ముంబై కెప్టెన్ హార్దిక్ తమోరే -
చెత్రి ‘హ్యాట్రిక్’నార్త్ ఈస్ట్పై ముంబై గెలుపు
ముంబై: భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి ‘హ్యాట్రిక్’ గోల్స్తో చెలరేగడంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ముంబై సిటీ ఎఫ్సీ సొంతగడ్డపై మరో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో 5-1తో నార్త్ ఈస్ట్ యునెటైడ్ ఎఫ్సీని చిత్తు చేసింది. ముంబై తరఫున చెత్రి (25, 40, 48వ. ని.), నోర్డి (51వ ని.), బెర్టిన్ (87వ ని.) గోల్స్ చేయగా... బోతాంగ్ (29వ ని.) నార్త్ ఈస్ట్కు ఏకైక గోల్ అందించాడు. ఈ సీజన్లో ఇది రెండో హ్యాట్రిక్. చెన్నైయిన్కు చెందిన స్టీవెన్ మెండోజా... గోవాపై తొలి హ్యాట్రిక్ సాధించాడు. 10 పాయింట్లతో ముంబై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. గురువారం జరిగే మ్యాచ్లో అట్లెటికో డి కోల్కతా.. ఢిల్లీ డైనమోస్తో తలపడుతుంది.