
పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో ముంబై ఖిలాడీస్ బోణీ కొట్టింది. టోర్నీ ఆరంభమ్యాచ్‌లో గుజరాత్ జెయంట్స్ చేతిలో కంగుతిన్న ముంబై సోమవారం జరిగిన పోరులో 51–43తో రాజస్తాన్ వారియర్స్‌పై విజయం సాధించింది. ముంబై ఆటగాడు గజానన్ షెన్‌గళ్ డైవ్‌లతో అదరగొట్టాడు.
మొత్తం 16 పాయింట్లు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ విజయ్ హజారే, రోమన్ కొరె, అవిక్ సింఘా చకచకా పాయింట్లు సాధించడంతో తొలి అర్ధభాగంలోనే ముంబై 29–20 స్కోరుతో ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో రాజస్తాన్ వరుసగా పాయింట్లు చేసి పోటీలో పడింది. ఆఖర్లో ముంబై ఆటగాళ్ల జోరు కొనసాగడంతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment