Kho-Kho
-
భారత్ ‘ఖో ఖో’ కూత పాక్‌తో షురూ
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ప్రప్రథమ ఖోఖో ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. భారత్ ఆతిథ్యమిచ్చే ఈ గ్రామీణ క్రీడ మెగా ఈవెంట్లో పురుషుల విభాగంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య జనవరి 13న జరిగే తొలి మ్యాచ్‌తో ప్రపంచకప్‌కు తెరలేవనుంది. 13 నుంచి 19 వరకు జరిగే ఈ ఈవెంట్లో 24 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో 21 పురుషుల జట్లు, 20 మహిళా జట్లు బరిలోకి దిగుతాయి. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే పోటీకి ముందుగా అట్టహాసంగా ప్రారంబోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రపంచకప్ సీఈఓ విక్రమ్ దేవ్ డోగ్రా తెలిపారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘13 నుంచి 16వ తేదీ వరకు లీగ్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. 17న నాలుగు క్వార్టర్ ఫైనల్స్ పోటీలు నిర్వహిస్తాం. మరుసటి రోజే (18) సెమీఫైనల్స్, ఇరు విభాగాల్లో 19న జరిగే ఫైనల్స్‌తో టోర్నీ ముగుస్తుంది’ అని అన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంతో పాటు గ్రేటర్ నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ టోర్నీ కోసం జవహర్లాల్ స్టేడియంలో ప్రస్తుతం భారత పురుషులు, మహిళా జట్ల ప్రాబబుల్స్‌కు శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఇందులో నుంచి తుది జట్లను త్వరలోనే ప్రకటిస్తామని భారత ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్ఐ) అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ చెప్పారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మెగా ఈవెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. 615 మంది ప్లేయర్లు, 125 మంది సహాయ సిబ్బందికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. -
ఫైనల్లో తెలుగు యోధాస్
పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వాలిఫయర్–2లో తెలుగు యోధాస్ 67–44 తో గుజరాత్ జెయింట్స్ జట్టును ఓడించింది. అరుణ్ గున్కీ 16 పాయింట్లు, ప్రజ్వల్ 14 పాయింట్లు సాధించి తెలుగు యోధాస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. నేడు జరిగే ఫైనల్లో ఒడిషా జగర్‌నాట్స్‌తో తెలుగు యోధాస్ తలపడుతుంది. -
Ultimate Kho Kho: క్వాలిఫయర్–2కు తెలుగు యోధాస్
పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ జట్టు క్వాలిఫయర్–2 మ్యాచ్‌కు అర్హత పొందింది. చెన్నై క్విక్గన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో తెలుగు యోధాస్ 61–43తో గెలిచింది. తెలుగు యోధాస్ కెప్టెన్ ప్రతీక్, ఆదర్శ్ రాణించారు. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఒడిశా జగర్‌నాట్స్, గుజరాత్ జెయింట్స్ క్వాలిఫయర్–1లో తలపడగా ... ఒడిశా జగర్‌నాట్స్ 57–43తో నెగ్గి ఫైనల్ చేరింది. నేడు జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్‌తో తెలుగు యోధాస్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఒడిశాతో ఆడుతుంది. -
Ultimate Kho Kho: ముంబై బోణీ
పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో ముంబై ఖిలాడీస్ బోణీ కొట్టింది. టోర్నీ ఆరంభమ్యాచ్‌లో గుజరాత్ జెయంట్స్ చేతిలో కంగుతిన్న ముంబై సోమవారం జరిగిన పోరులో 51–43తో రాజస్తాన్ వారియర్స్‌పై విజయం సాధించింది. ముంబై ఆటగాడు గజానన్ షెన్గళ్ డైవ్లతో అదరగొట్టాడు. మొత్తం 16 పాయింట్లు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ విజయ్ హజారే, రోమన్ కొరె, అవిక్ సింఘా చకచకా పాయింట్లు సాధించడంతో తొలి అర్ధభాగంలోనే ముంబై 29–20 స్కోరుతో ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో రాజస్తాన్ వరుసగా పాయింట్లు చేసి పోటీలో పడింది. ఆఖర్లో ముంబై ఆటగాళ్ల జోరు కొనసాగడంతో విజయం సాధించింది. -
ఖో–ఖో లీగ్‌లో జీఎంఆర్, అదానీ ఫ్రాంచైజీలు
సాక్షి, హైదరాబాద్: మరో గ్రామీణ క్రీడకు కార్పొరేట్ సంస్థలు వెన్నుదన్నుగా నిలిచేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే ప్రొ కబడ్డీ అద్భుతమైన ఆదరణ చూరగొనగా... ఖో ఖో కూడా అల్టిమేట్ ఖో ఖో (యూకేకే) పేరుతో ఫ్రాంచైజీ టోర్నీగా మనల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. దీంట్లో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ జీఎంఆర్ గ్రూప్, గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్‌లు భాగమయ్యాయి. తమ సొంత రాష్ట్రాలకు చెందిన జట్లను ఈ రెండు కార్పొరేట్ సంస్థలు దక్కించుకున్నాయి. జీఎంఆర్‌కు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ, ప్రొ కబడ్డీ లీగ్‌లో యూపీ యోధ జట్టు ఉన్నాయి. జీఎంఆర్ స్పోర్ట్స్ తెలంగాణ ఫ్రాంచైజీని... అదానీ స్పోర్ట్స్‌లైన్ గుజరాత్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయని యూకేకే ప్రమోటర్, డాబర్ గ్రూప్ చైర్మన్ అమిత్ బర్మన్ వెల్లడించారు. క్రీడల్లోనూ భారత్ అగ్రగామిగా అవతరించేందుకు తమవంతుగా కృషి చేస్తున్నామని, గ్రామీణ క్రీడలైన కబడ్డీ, రెజ్లింగ్, ఖో ఖోలకు మరింత ఆదరణ పెరిగేందుకు దోహదం చేస్తామని జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్ తెలిపారు. అల్టిమేట్ ఖో ఖో (యూకేకే) బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల్ని సోనీ సంస్థ దక్కించుకుంది. సోనీ టీవీ చానెళ్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘సోనీ లివ్’లో యూకేకే పోటీలు స్ట్రీమింగ్ కానున్నాయి. చదవండి:SL vs AUS: శ్రీలంకతో ఆస్ట్రేలియా తొలి టి20.. మ్యాక్స్‌వెల్ మాయ చేస్తాడా..? -
జీసీపీఈ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి పురుషుల ఖో–ఖో టోర్నమెంట్లో జీసీపీఈ దోమలగూడ జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ కాలేజి (నారాయణగూడ) ప్రాంగణంలో జరిగిన ఈ టోర్నీలో జీసీపీఈ జట్టు విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో జీసీపీఈ 8–7తో నిజాం కాలేజిపై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో సిద్ధార్థ కాలేజి 8–1తో భవన్స్ న్యూ సైన్స్ (నారాయణగూడ) జట్టును ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో నిజాం 14–9తో భవన్స్పై, జీసీపీఈ 14–7తో సిద్ధార్థ జట్లపై గెలుపొందాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త కార్యదర్శి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
ఖో–ఖో విజేత సెయింట్ పాయ్స్
సాక్షి, హైదరాబాద్: వైఎంసీఏ నారాయణగూడ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్గిల్ విక్టరీ స్పోర్ట్స్ మీట్లో సెయింట్ పాయ్స్ బాలికల జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఖో–ఖో సీనియర్ బాలికల టైటిల్‌పోరులో సెయింట్ పాయ్స్ హైస్కూల్ 25–23తో మంచి స్కూల్ బాలాపూర్‌పై విజయం సాధించింది. జూనియర్ బాలుర ఫైనల్లో శ్రీవిద్య హైస్కూల్ 25–17తో శ్రీ మోడల్ హైస్కూల్‌ను ఓడించింది. జూనియర్ బాలికల కేటగిరీలో బేగాస్ హైస్కూల్ 8–3తో సెయింట్ ఫిలోమినా హైస్కూల్‌పై గెలుపొందింది. మరోవైపు వాలీబాల్ ఈవెంట్లో శ్రీవిద్య సెకం డరీ స్కూల్ తిలక్‌నగర్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో శ్రీవిద్య స్కూల్ 25–17తో దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్ (కర్మన్‌ఘాట్)పై గెలిచింది. -
వాయు వేగం.. గురి తప్పని లక్ష్యం
తన జట్టు క్రీడాకారుడు ఖో.. అనగానే రేసుగుర్రంలా పరుగెడతాడు వెంకటేష్. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు ఇక ముచ్చెమటలే. మెరుపులా దూసుకెళ్తూ అవతలి జట్టు క్రీడాకారుల్ని ఔట్ చేస్తాడు. వాయివేగంతో.. గురి తప్పని లక్ష్యంతో ఆడుతూ ఆట అంటే ఏంటో చూపెడుతాడు. జట్టు విజయం కోసం ఒక్కడే పోరాడుతాడు. చూసేవాళ్లకు ఇదేదో ఇంద్రజాలమా అన్నట్లు ఆశ్చర్యం కలిగిస్తాడు. అందుకే ఆయన అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఓ కుగ్రామానికి చెందిన ఈ విద్యార్థి త్వరలో ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లే చాన్స్ కొట్టేశారు. -ఎమ్మిగనూరు టౌన్ కె. వెంటేష్ది నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలం అలువాల గ్రామం. వీరిది ఓ చిన్న రైతు కుటుంబం. తల్లిదండ్రులు కె.ఈరన్న, పార్వతి. పాఠశాల స్థాయి నుంచే వెంకటేష్ ఖోఖోలో రాణించేవారు. ప్రస్తుతం ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈయన బైపీసీ (సెకెండ్ ఇయర్) చదువుతున్నారు. ఎనిమిదో తరగతిలో చదువుతున్నప్పుడు ఆటలో ప్రావీణ్యాన్ని చూసి ఆ హైస్కూల్ పీఈటీ ప్రభాకర్ ఖోఖోలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆయన ప్రోత్సాహంతో నంద్యాలలో జిల్లా స్థాయి అండర్-14, గన్నవరంలో సబ్ జూనియర్స్, ఏలూరు, ఆదిలాబాద్‌లో పైకా పోటీల్లో పాల్గొని మంచి క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ మీట్స్‌తో పాటు జిల్లా, రాష్ట్రస్థాయి పైకా పోటీలు, జోనల్స్ పోటీల్లో పాల్గొంటూ తన సత్తాను చాటుతూ వచ్చారు. జట్టు ఓడినా అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం, ప్రకాశం జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్-19 ఖోఖో పోటీలకు జిల్లా జట్టు తరఫున వెంకటేష్ ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రాణించడంతో ఇటీవల ఉజ్జయినిలో జరిగిన అండర్-19 జాతీయ ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ఆడారు. అందులో ఆంధ్రప్రదేశ్ జట్టు విజయం సాధించకపోయినా వెంకటేష్ కనబరిచిన ప్రతిభ జాతీయ సెలెక్టర్లను ఆకట్టుకుంది. దీంతో డిసెంబర్లో ఆస్ట్రేలియాలో జరిగే అండర్-19 అంతర్జాతీయ ఖోఖో పోటీలకు ఇండియా జట్టుకు సెలెక్టర్లు ఆయనను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండియా జట్టుకు ఎంపికైన ఏకైక క్రీడాకారుడు వెంకటేష్ కావడం విశేషం. -
తెలంగాణ జట్లకు టైటిల్స్
జాతీయ స్కూల్‌గేమ్స్ ఖోఖో కరీంనగర్ స్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన 60వ జాతీయ స్థాయి పాఠశాలల అండర్-14 బాలబాలికల ఖోఖో చాంపియన్‌షిప్ పోటీల్లో రెండు విభాగాల్లోనూ తెలంగాణ జట్లు విజయకేతనం ఎగురవేశారుు. కరీంనగర్ మండలం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో ఈ నెల 8 నుంచి జరుగుతున్న ఈ పోటీలు ఆదివారం ముగిశారుు. దేశంలోని 23 రాష్ట్రాల నుంచి 23 బాలుర, 22 బాలికల జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. బాలుర విభాగంలో కర్ణాటక జట్టు రెండో స్థానంలో, మహారాష్ట్ర, గుజరాత్ జట్లు వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో ఢిల్లీ జట్టు రెండో స్థానంలో, కర్ణాటక, గుజరాత్ జట్లు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.