తెలంగాణ జట్లకు టైటిల్స్
జాతీయ స్కూల్‌గేమ్స్ ఖోఖో
కరీంనగర్ స్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన 60వ జాతీయ స్థాయి పాఠశాలల అండర్-14 బాలబాలికల ఖోఖో చాంపియన్‌షిప్ పోటీల్లో రెండు విభాగాల్లోనూ తెలంగాణ జట్లు విజయకేతనం ఎగురవేశారుు. కరీంనగర్ మండలం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో ఈ నెల 8 నుంచి జరుగుతున్న ఈ పోటీలు ఆదివారం ముగిశారుు.
దేశంలోని 23 రాష్ట్రాల నుంచి 23 బాలుర, 22 బాలికల జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. బాలుర విభాగంలో కర్ణాటక జట్టు రెండో స్థానంలో, మహారాష్ట్ర, గుజరాత్ జట్లు వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో ఢిల్లీ జట్టు రెండో స్థానంలో, కర్ణాటక, గుజరాత్ జట్లు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.