mumbi
-
ఆ నగరాల్లో చుక్కలనంటిన రియల్ ఎస్టేట్ ధరలు! రూ. 8 కోట్లకు ఎంత వస్తుందంటే..
దేశంలోని మూడు మెట్రోపాలిటన్ నగరాలు ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో రియల్ ఎస్టేట్ ధరలు చుక్కలనంటాయి. వాటి ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ 2022లో ధరల పెరుగుదలను నమోదు చేసింది. ఈ మూడు నగరాలు నైట్ ఫ్రాంక్ ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ (పీఐఆర్ఐ 100)లో ఉన్నత స్థానాలకు చేరుకున్నాయి. ఒక మిలియన్ డాలర్లు (రూ.8,24,43,400)కు ఏయే నగరాల్లో ఎంత స్థలం కొనుగోలు చేయొచ్చో నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ గణాంకాలను విడుదల చేసింది. (ఇదీ చదవండి: టయోటా కార్లపై తగ్గని మోజు.. భారీగా పెరిగిన అమ్మకాలు!) నైట్ ఫ్రాంక్ డేటా ప్రకారం.. అమెరికన్ డాలర్ల పరంగా ముంబై ప్రపంచంలో 18వ అత్యంత ఖరీదైన ప్రైమ్ రెసిడెన్షియల్ మార్కెట్. ఈ నగరం ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ 6.4 శాతం ధరల పెరుగుదలను నమోదు చేసింది. 2021లో 92వ స్థానంతో పోలిస్తే 2022 పీఐఆర్ఐ 100 సూచీలో 37వ స్థానానికి చేరుకుంది. ముంబైలో ఒక మిలియన్ డాలర్లతో 113 చదరపు మీటర్ల వరకు కొనుగోలు చేయవచ్చు. 2023లో కూడా ముంబై ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ విలువు 3 శాతం మేర పెరగనుంది. ఇక ఢిల్లీలో ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ 1.2 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2021లో 93వ ర్యాంక్‌తో ఉండగా 2022లో 77వ ర్యాంక్‌కు చేరుకుంది. ఇక్కడ ఒక మిలియన్ డాలర్లతో 226 చదరపు మీటర్ల స్థలాన్ని కొనుగోలు చేయవచ్చు. (ఇదీ చదవండి: సిమ్‌కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్’ టెక్నాలజీ!) బెంగళూరు ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ విలువ 3 శాతం పెరిగింది. 2021లో 91వ ర్యాంక్‌తో పోల్చితే 2022లో ఇండెక్స్‌లో 63వ స్థానానికి చేరింది. ఈ నగరంలో ఒక మిలియన్ డాలర్లతో 385 చదరపు మీటర్లను కొనుగోలు చేయవచ్చు. నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ మాట్లాడుతూ.. ‘భారత రెసిడెన్షియల్ మార్కెట్లు గత అనేక త్రైమాసికాలుగా డిమాండ్‌లో వృద్ధిని కనబరుస్తూ విలువలు పెరిగాయి. దేశంలోని ప్రైమ్ రెసిడెన్షియల్ మార్కెట్ హై-ఎండ్ ప్రాపర్టీల అమ్మకాల ఊపును పెంచింది’ అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని ఇతర మార్కెట్ల విలువలు క్షీణిస్తున్నప్పటికీ, టోక్యో తర్వాత ఏపీఏసీ మార్కెట్లలో 6.4 శాతం పెరుగుదలతో ముంబై రెండవ స్థానంలో ఉందన్నారు. (ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!) -
ముంబైను ముంచెత్తుతున్న వర్షాలు... జలదిగ్బంధంలో నగరం
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కురుస్తున్న భారీ వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మంగళవారం ఉదయం వీధుల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తెగ ఇబ్బందిపడ్డారు. సియాన్, అంధేరిలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు చేరుకున్నాయి. కొన్ని రూట్లలో రైళ్లు, బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ అయింది. ముంబైతో పాటు సమీప జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఆదేశించారు. మొదటి వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే ఇక ముందుముందు తెరిపి లేకుండా భారీ వర్షాలు కురిస్తే ముంబై పరిస్ధితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. వర్షాకాలానికి ముందు బీఎంసీ రూ.కోట్లు ఖర్చుచేసి మురికి కాల్వలు, నాలాలు శుభ్రం చేయిస్తుంది. వర్షా కాలంలో వర్షపు నీరు సాఫీగా సముద్రంలోకి వెళ్లేందుకు వీలుగా పనులు చేపడుతుంది. కానీ ఇప్పటికే కురిసిన భారీ వర్షానికి దాదర్ సర్కిల్, ఫైవ్ గార్డెన్, హిందూకాలనీ, చెంబూర్, వడాల, రఫీ మహ్మద్ కిడ్వాయి మార్గ్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. గతంలో నీరు నిల్వని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వర్షపు నీరు నిలిచిపోవడం మొదలైంది. వీటితోపాటు రెండు రోజుల కిందట సెంట్రల్ రైల్వే మార్గంలో థానే, కల్యాణ్ దిశగావెళ్లే లోకల్ రైలు సేవలు కొద్దిసేపు స్తంభించిపోయాయి. పశ్చిమ మార్గంలో అంధేరీ స్టేషన్ సమీపంలో ఉన్న సబ్వేలో కూడా వర్షపు నీరు చేరింది. మూడు అడుగుల మేర వర్షపు నీరు చేరడంతో గత్యంతరం లేక సబ్ వేను మూసివేయాల్సిన పరిస్ధితి వచ్చింది. చివరకు విద్యుత్ మోటర్ పంపుల ద్వారా నీటిని బయటకు తోడాల్సి వచ్చింది. నీరంత బయటకు తోడేసిన తరువాత మరమ్మతులు చేసి సబ్వేను పునఃప్రారంభించారు. అదేవిధంగా ముంబైలోని పేడర్ రోడ్‌పై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ రహదారిని పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. హిందూమాత, దాదర్, తిలక్ నగర్, గాంధీ మార్కెట్ ప్రాంతాల్లో నీరు నిలిచింది. దీంతో బీఎంసీ ఖర్చుచేసిన రూ.కోట్లు వృథా పోయినట్లు స్పష్టమైతోంది. ఏటా వర్షా కాలంలో హిందూమాత, దాదర్ టీటీ, పరేల్ టీటీ, అంధేరీలో మిలన్ సబ్వేలో వర్షపు నీరు చేరడం పరిపాటే. ఏటా వర్షా కాలంలో తమకు ఈ తిప్పలు తప్పవని స్ధానికులు వాపోతుంటారు. కాని బీఎంసీ మాత్రం మురికి కాల్వలు, నాలాలు వంద శాతం శుభ్రం చేశామని, ఈసారి వర్షా కాలంలో నీరు నిల్వదని ప్రగల్భాలు పలుకుతోంది. కానీ ఏటా వర్షా కాలంలో జరిగే పరిణామాల్లో ఏమాత్రం మార్పు ఉండదు. యథాతధంగా రోడ్లన్నీ జలమయం కావడం, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడం, లోకల్ రైళ్లకు అంతరాయం కల్గడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. #WATCH | Maharashtra: Sion area of Mumbai witnessed waterlogging in the wake of heavy rains in the city. Visuals from last night. pic.twitter.com/tjniUJ74RE — ANI (@ANI) July 5, 2022 (చదవండి: స్పైస్ జెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం...కరాచీలో అత్యవసర ల్యాండింగ్) -
ఒకటి రెండూ కాదు.. వందేళ్లకు పైబడ్డ చరిత్ర, మరెన్నో విశేషాలు!
మార్పు అనేది ఓ కొత్త సంస్కృతికి ఆహ్వానం పలుకుతుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే హోటల్ రంగంలో కూడా ఆ మార్పు మొదలైంది. మనిషి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. వివిధ పనులపై వెళ్లే క్రమంలో వివిధ ప్రాంతాల్లో నివాసం ఉండాల్సి వచ్చింది. దీంతో చిన్న చిన్న హోటల్స్ నుంచి ఫైవ్, సెవెన్ స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు వచ్చేశాయి. అయితే ఎన్ని మార్పులు వచ్చినా గడిచిన కాలాన్ని అంత తొందరగా మరచిపోనివ్వదు చరిత్ర. అలాగే కొన్ని భారతీయ హోటల్స్‌కు ఓ వందేళ్లకు పైబడ్డ చరిత్ర ఉంది. వాటి వివరాల ఏంటో ఓ సారి చూద్దాం.. పర్వతాలను చూస్తూ.. ఓ పట్టు పట్టొచ్చు! పశ్చిమ బెంగాల్‌లోని గ్లెనరీ అనే రెస్టారెంట్ డార్జిలింగ్‌లోని కొండ పట్టణ ప్రాంతాల్లో అత్యంత ప్రసిద్ధ రెస్టారెంట్లలో ఒకటి. దీనికి 130 ఏళ్ళకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడి భోజనం అద్భుతంగా ఉంటుదని వినికిడి. విందు ఏర్పాటు కోసం ఓ ప్రత్యేకమైన స్థలాన్ని కూడా కేటాయించారు. అంతేకాకుండా గ్లెనరీలో బేకరీ కూడా ఉంది. కొండ ప్రాంతంలో ఉన్న ఈ రెస్టారెంట్లో పర్వతాలను చూస్తూ విందు ఆరగించడానికి ప్రత్యేక సీట్లను కూడా ఏర్పాటు చేశారు. 150 సంవత్సరాల చరిత్ర ముంబైలోని లియోపోల్డ్ కేఫ్ రెస్టారెంట్, బార్‌కు 150 సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగ్రవాదులు 2008 వ సంవత్సరంలో జరిపిన ముంబై దాడుల లిస్టులో ఈ రెస్టారెంట్ ఉండటంలో దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఆ భయంకరమైన దాడులకు సంబంధించి భద్రపరిచిన బుల్లెట్ గుర్తులను రెస్టారెంట్లో చూడవచ్చు. ప్రస్తుతం ఈ ప్రదేశం పర్యాటకులకు, స్థానికులకు ఎంతో ఇష్టమైనది. ప్రసిద్థ వ్యక్తులు చేతుల మీదుగా.. కోల్‌కతాలోని ఈ ఇండియన్ కాఫీ హౌస్‌ను ప్రసిద్థ వ్యక్తులు సత్యజిత్ రే, మృణాల్ సేన్, అమెరికన్ కవి అలెన్ గిన్స్బర్గ్ 1876లో స్థాపించారు. అయితే ఆల్బర్ట్ హాల్ అనే పేరు గల ఈ రెస్టారెంట్‌ను 1947 తర్వాత కాఫీ హౌస్‌గా పేరు మార్చారు. కబాబ్‌లు నోటిలో ఇట్టే కరిగిపోతాయి ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ టుండే కబాబీ తినుబండాగారానికి ఘనమైన చరిత్ర ఉంది. ఈ టుండే కబాబీ 115 సంవత్సరాల పురాతనమైనది. దీన్ని 1905లో ప్రారంభించారు. ఇక్క 125 రకాల వంటకాలు దొరుకుతాయని చెబుతారు. ఇక్కడి కబాబ్‌లు నోటిలో ఇట్టే కరిగిపోతాయని ప్రతీతి. చదవండి: శాంతి బోధకులమే కానీ, మా జోలికొస్తే ఊరుకోం.. -
9, 0, 5, 6, 0, 0
ముంబై: ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు స్కోర్లు ఇలా ఉన్నాయి. ముగ్గురు టాపార్డర్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. మరో ముగ్గురు బ్యాట్స్ మెన్స్ డకౌట్ కావడం గమనార్హం. రిషబ్ పంత్, ఆదిత్యా తారే, అండర్సన్ లు ఖాతా తెరవకుండానే సున్నా పరుగుకే పెవిలియన్ బాట పట్టారు. సంజూ శాంసన్ (9), కరణ్ నాయర్ (5), శ్రేయస్ అయ్యర్ లు సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యారు. బౌలింగ్ తో ముంబై టాప్ ఆర్డర్ ను దెబ్బతీసిన ఢిల్లీ, అదే తరహాలో ముంబై బౌలర్ల ముందు తలవంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 143 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి నిర్దేశించింది. 144 పరుగుల లక్ష్యంగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాట్స్ మెన్స్ తడబడ్డారు. ఈ క్రమంలో ముంబై బౌలర్లు మెక్ క్లినగన్ మూడు వికెట్లు పడగొట్టగా, హార్ధిక్ పాండ్యా, బుమ్రా చెరో వికెట్ దక్కంచుకున్నారు. పాండ్యా తారేను రనౌట్ చేశాడు. ముంబై 10 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది.