దేశంలోని మూడు మెట్రోపాలిటన్ నగరాలు ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో రియల్ ఎస్టేట్ ధరలు చుక్కలనంటాయి. వాటి ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ 2022లో ధరల పెరుగుదలను నమోదు చేసింది. ఈ మూడు నగరాలు నైట్ ఫ్రాంక్ ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ (పీఐఆర్‌ఐ 100)లో ఉన్నత స్థానాలకు చేరుకున్నాయి. ఒక మిలియన్ డాలర్లు (రూ.8,24,43,400)కు ఏయే నగరాల్లో ఎంత స్థలం కొనుగోలు చేయొచ్చో నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ గణాంకాలను విడుదల చేసింది.
(ఇదీ చదవండి: టయోటా కార్లపై తగ్గని మోజు.. భారీగా పెరిగిన అమ్మకాలు!)
నైట్ ఫ్రాంక్ డేటా ప్రకారం.. అమెరికన్ డాలర్ల పరంగా ముంబై ప్రపంచంలో 18వ అత్యంత ఖరీదైన ప్రైమ్ రెసిడెన్షియల్ మార్కెట్. ఈ నగరం ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ 6.4 శాతం ధరల పెరుగుదలను నమోదు చేసింది. 2021లో 92వ స్థానంతో పోలిస్తే 2022 పీఐఆర్‌ఐ 100 సూచీలో 37వ స్థానానికి చేరుకుంది. ముంబైలో ఒక మిలియన్ డాలర్లతో 113 చదరపు మీటర్ల వరకు కొనుగోలు చేయవచ్చు. 2023లో కూడా ముంబై ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ విలువు 3 శాతం మేర పెరగనుంది.
ఇక ఢిల్లీలో ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ 1.2 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2021లో 93వ ర్యాంక్‌తో ఉండగా 2022లో 77వ ర్యాంక్‌కు చేరుకుంది. ఇక్కడ ఒక మిలియన్ డాలర్లతో 226 చదరపు మీటర్ల స్థలాన్ని కొనుగోలు చేయవచ్చు.
(ఇదీ చదవండి: సిమ్‌కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్’ టెక్నాలజీ!)
బెంగళూరు ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ విలువ 3 శాతం పెరిగింది. 2021లో 91వ ర్యాంక్‌తో పోల్చితే 2022లో ఇండెక్స్‌లో 63వ స్థానానికి చేరింది. ఈ నగరంలో ఒక మిలియన్ డాలర్లతో 385 చదరపు మీటర్లను కొనుగోలు చేయవచ్చు.
నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ మాట్లాడుతూ.. ‘భారత రెసిడెన్షియల్ మార్కెట్‌లు గత అనేక త్రైమాసికాలుగా డిమాండ్‌లో వృద్ధిని కనబరుస్తూ విలువలు పెరిగాయి. దేశంలోని ప్రైమ్ రెసిడెన్షియల్ మార్కెట్ హై-ఎండ్ ప్రాపర్టీల అమ్మకాల ఊపును పెంచింది’ అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని ఇతర మార్కెట్ల విలువలు క్షీణిస్తున్నప్పటికీ, టోక్యో తర్వాత ఏపీఏసీ మార్కెట్లలో 6.4 శాతం పెరుగుదలతో ముంబై రెండవ స్థానంలో ఉందన్నారు.
(ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!)
Comments
Please login to add a commentAdd a comment