జలీల్ ఖాన్ కు వైఎస్ జగన్ పరామర్శ
విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు జలీల్ ఖాన్ సోదరుడు మున్వర్ ఖాన్(56) ఆకస్మిక మృతిపట్ల పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జలీల్ ఖాన్ ను ఫోన్ లో వైఎస్ జగన్ పరామర్శించి సంతాపం తెలిపారు.
జలీల్‌ఖాన్ సోదరుడు మున్వర్‌ఖాన్ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఎమ్మెల్యే, ఆయన సోదరుడు వన్‌టౌన్‌లోని తారాపేటలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ రోజు ఉదయం మున్వర్ఖాన్కు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు మున్వర్ ఖాన్ ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా... ఆయన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.