Murali (actor)
-
టాలీవుడ్లో విషాదం, నటుడు కన్నుమూత
టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు డీఎంకే మురళి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. మురళి మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా డీఎంకే మురళి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జన్మించారు. పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించగా.. దుర్యోధనుడి మయసభ ఏకపాత్రాభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జర్నలిస్ట్‌గా పని చేసిన ఆయన అందాల రాక్షసితో సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. బస్‌స్టాండ్, తడాఖా, కొత్తజంట, కాయ్ రాజా కాయ్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చదవండి: కృష్ణ హెల్త్ కండీషన్లో ఎలాంటి మార్పు లేదు -
హీరోగా మరో వారసుడు
తమిళ తెరకు మరో వారసుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన పేరు ఆకాష్ మురళి. దివంగత నటుడు మురళి రెండవ కుమారుడు, యువ నటుడు అధర్వ సోదరుడే ఈ ఆకాష్ మురళి. కాగా, ఇంతకుముందు నటుడు విజయ్ కథానాయకుడిగా మాస్టర్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఎక్స్ బి ఫిలిమ్స్ క్రియేటర్స్ సంస్థ తాజాగా నిర్మిస్తున్న చిత్రం ద్వారా ఆకాశ మురళి కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. దీనికి విష్ణువర్దన్ దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్‌లో కమర్షియల్ దర్శకుల్లో ఈయన ఒకరు. చాలా గ్యాప్ తర్వాత ఈయన తమిళంలో ఆకాష్ మురళి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. -
కొత్త కథాంశం
ఇటీవల విడుదలైన వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో అభిలాష్ పాత్రలో మంచి నటనను కనబరిచి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ యువ నటుడు అధర్వ మురళి. తమిళంలో అధర్వ హీరోగా నటించిన చిత్రం ‘బూమరాంగ్’. ఆర్. కణ్ణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ఇందూజ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘‘కమర్షియల్ హంగులతో పాటు ప్రేక్షకులు కోరుకునే కొత్త కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. అధర్వ అద్భుతంగా నటించారు. రధన్ మంచి ఆల్బమ్ ఇచ్చారు. త్వరలో పాటలను, అక్టోబరులో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు సీహెచ్ సతీష్‌కుమార్. సతీష్, ఆర్జె బాలాజీ, ఉపేన్ పటేల్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు ప్రసన్న ఎస్.కుమార్ కెమెరామన్. -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: మురళీమోహన్ (నటుడు) విజయశాంతి (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. దీనికి చంద్రుడు అధిపతి కావడం వల్ల సంవత్సరమంతా ఒడుదొడుకులతో కూడుకుని ఉంటుంది. ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టకుండా, గతంలో చేపట్టిన వాటిని కొన సాగించడం మంచిది. ఉద్యోగులు జాబ్ మారడం అంత మంచిది కాదు. ఒకవేళ మారిన ట్లయితే అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. తల్లి లేదా భార్య తరఫు వారి నుంచి సహాయ సహకా రాలు అందుతాయి. చంద్రుడి ప్రభావం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కొత్త కొత్త ఐడియాలు ప్రదర్శించి లాభపడతారు. హామీలు, మధ్యవర్తిత్వాలు తగవు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీలోని సృజనాత్మక తకు గుర్తింపు లభిస్తుంది. కవులు, కళాకారుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన పరిచయాలు ముఖ్యంగా ఆపోజిట్ సెక్స్వారితో జరిగే పరిచయాల వల్ల బాగా లబ్ధి పొందుతారు. మానసిక ఒత్తిడి లేకుండా శ్రద్ధ వహించాలి. లక్కీనంబర్స్: 1,2,6,9; లక్కీ కలర్స్: బ్లూ, వైట్, సిల్వర్, శాండల్; లక్కీ డేస్: సోమ, మంగళ, శుక్రవారాలు. సూచనలు: చంద్రకాంతమణిని ఉంగరంగా ధరించడం, పాలు, బియ్యంతో చేసిన పాయసాన్ని అనాథలకు పెట్టడం, చంద్రుని కాంతి తగిలేలా రోజూ కొద్దిసేపు గడపటం, అమ్మకాని, తత్సమానురాలైన వారిని కాని ఆదరించడం, గౌరవించడం మంచిది. - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు