Murali varthelli
-
రెడీ ఫర్ లాంగ్ ఇన్నింగ్స్!
ఆ రైతు పేరు అప్పలనాయుడు. విజయనగరం జిల్లా జామి మండల వాస్తవ్యులు. వ్యవసాయ రంగంపై వైఎస్ జగన్ వేసిన బలమైన ముద్ర గురించి చెబుతూ ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. అది ‘రైతు భరోసా’ పేరుతో అందజేస్తున్న నగదు సాయం గురించి కాదు. అందుబాటులోకి వచ్చిన 9 గంటల నాణ్యమైన విద్యుత్తు గురించీ కాదు. ఈ–క్రాప్ ప్రయోజనాల గురించి కాదు. ఆర్బీకే సెంటర్లు అందజేస్తున్న నైపుణ్యాభివృద్ధి, యంత్ర సేవ గురించి కూడా కాదు. ధాన్యం పండించే తనలాంటి రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం వల్ల ఎకరాకు పదినుంచి పన్నెండు వేల రూపాయల పరోక్ష లబ్ధి చేకూరుతున్నదని అప్పలనాయుడు చెప్పుకొచ్చారు. ఇదేమీ రహస్యం కాదు. రైతులందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే. కానీ మన అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులే దీన్ని గుర్తించినట్టు లేదు. గుర్తించినా ఎక్కడా మాట్లాడినట్టు లేదు. అప్పలనాయుడు చెప్పిన ఆ లెక్కను ఒకసారి చూద్దాం. విత్తనాల కోసం ఒకసారి, ఎరువుల కోసం మరొకసారి కనీసం రెండుసార్లు రైతులు మండల కేంద్రానికి వెళ్లవలసి వచ్చేది. రానూపోనూ ప్రయాణ ఖర్చులూ, భోజనం ఖర్చుతో పాటు ఒకరోజు వేతనాన్ని ఆ రైతు కోల్పోవలసి వచ్చేది. దానికితోడు ఎరువుల బస్తాలు తెచ్చుకునేందుకు ఆటో ఖర్చులు అదనం. ఎకరాకు సరిపోయే విత్తనాలకు ఆర్బీకేలో ఇప్పుడు 300 రూపాయలు ప్రభుత్వ రాయితీ లభిస్తున్నది. అప్పుడీ భారం రైతు మీదనే పడేది. ఎరువుల కొరతను అవకాశంగా తీసుకొని... అవసరం లేని పురుగు మందుల డబ్బా తీసుకుంటేనే ఎరువుల బస్తా ఇస్తామని వ్యాపారులు పేచీ పెట్టేవారు. ఇప్పుడా వృథా ఖర్చు పూర్తిగా పోయింది. ధాన్యం దిగుబడి సగటున ఎకరాకు 30 నుంచి 33 బస్తాలు (75 కిలోల బస్తా) వస్తుంది. ఆ రోజుల్లో దళారులు కొనుగోలు చేసేటప్పుడు ప్రతి క్వింటాల్‌కు అదనంగా కనీసం 5 కిలోలు తూకం వేసుకునేవారు. ఇప్పుడు క్వింటాల్ ధాన్యానికి మద్దతు ధర రూ.2100. తప్పుడు తూకంతో ఎకరాకు ఒకటిన్నర క్వింటాళ్ల కిమ్మత్తు పైకాన్ని రైతు కోల్పోయేవాడు. ఆ రోజుల్లో మద్దతు ధర మీద క్వింటాల్‌కు 150 నుంచి 200 రూపాయల వరకు దళారులు మినహాయించుకొని రైతులకివ్వడం సర్వ సాధారణం. ఇవన్నీ లెక్కేసి చూస్తే అధమపక్షం రైతుకు జరుగు తున్న లబ్ధి ఎకరాకు పన్నెండు వేల పైమాటేనని అప్పల నాయుడు లెక్క. ఊరూరా వెలసిన ఆర్బీకే సెంటర్ల పుణ్యమా అని రైతుకు దొరికిన గొప్ప ఊరట ఇది. వ్యవసాయ రంగంలో ఇటువంటి మార్పులు ఇంకెన్నో ఉన్నాయి. ఇనుమడించిన రైతు ఆత్మవిశ్వాసానికి గుర్తుగా ఈ ఒక్క గొంతుక చాలు. ఈ ఆత్మవిశ్వాసం ఒక్క రైతాంగంలోనే కాదు. వెనుకబడిపోయిన అన్ని వర్గాల్లోనూ కనిపిస్తున్నది. వెన్నెముకలు నిటారుగా నిలబడుతున్నవి. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వపు విప్లవశంఖారావం పేద వర్గాలను ఉత్తేజితం చేస్తున్నది. సాధికార రథయాత్రలతో వారిప్పుడు జాగృతమవుతున్నారు. పైసా ఖర్చు లేకుండా పాతిక లక్షల విలువైన వైద్య సేవలను పెద్దాసుపత్రుల్లో పొందగలిగే అవకాశం ఇప్పుడు రాష్ట్రంలోని 90 శాతం ప్రజలకు ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో అందుబాటులో ఉన్నది. ఇంత పెద్ద ఉచిత పథకం ఇంకెక్కడా లేదు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత పటిష్ఠంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తయారయ్యాయి. ఫ్యామిలీ డాక్టర్ బృందాలు పల్లెపల్లెనా పర్యటిస్తున్నాయి. అన్ని స్థాయిల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఔట్ పేషంట్ల సంఖ్య యాభై శాతం నుంచి వందశాతం వరకు పెరిగింది. ఈ పెరుగుదల అక్కడ లభిస్తున్న వైద్య సేవల నాణ్యతా ప్రమాణాలకు సూచిక. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విద్యా విధానం ఇప్పటికే జాతీయ – అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలనందుకుంటు న్నది. నిరుపేద కుటుంబాల్లో పుట్టిన బిడ్డలు ఐక్యరాజ్య సమితి వేదికపై నిలబడి తమ గళాన్ని వినిపించడం సంచలనాన్ని సృష్టించింది. పెద్దపెద్ద నగరాల్లో సంపన్నుల సంతానానికి మాత్రమే లభించే నాణ్యమైన చదువును సర్కారు బడుల్లో పేద పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా సమకూర్చింది. నాడు శిథిలావస్థకు చేరిన సర్కారు బడులు మళ్లీ వసంతాన్ని చిగురిస్తున్నాయి. కొత్త తరానికి అత్యవసరమైన డిజిటల్ సాంకేతికతను పాఠశాల స్థాయి విద్యార్థులకు కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పెత్తందారీ శక్తులు పేదల విద్యపై కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నా జగన్ ప్రభుత్వం విద్యా విప్లవంలో వెనక్కి తిరిగి చూడటం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిన విజయాలు ఈ మూడు రంగాలకే పరిమితం కాలేదు. సమస్త జీవన రంగాల్లోనూ ఊర్ధ్వ ముఖ చలనం మనకు కనిపిస్తుంది. అందుకు కారణం ప్రభుత్వ కర్తవ్యాలపై అధినేతకు ఉన్న స్పష్టమైన అవగాహన. ఒక నిర్దిష్ట మైన లక్ష్యం, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన కచ్చిత మైన ప్రణాళికను రూపొందించుకోవడంలో జగన్ ప్రభుత్వం దేశంలో అందరికంటే ముందువరసలో నిలబడింది. రాజ్యాంగ మౌలిక సూత్రమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వాన్ని సాధించడం కోసం ఇంత వేగంగా పనిచేసిన ప్రభుత్వం కూడా ఇంకొకటి లేదు. అందువల్ల సహజంగానే పెత్తందారీ శక్తుల కంటగింపునకు కూడా ఈ ప్రభుత్వం గురవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో పెత్తందారీ శక్తుల రాజకీయ నాయకత్వం మరింత ప్రమాదకరమైన మాఫియా ముఠా. క్షీరసాగర మథ నంలో అమృతంతోపాటు గరళం కూడా పుట్టిందట. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పుడు అభివృద్ధితోపాటు దాని కవలగా పుట్టిన అవినీతి పాలిటి వారసత్వం ఈ ముఠా. పేద ప్రజల సాధికారతకు పెద్ద శత్రువు ఈ యెల్లో ముఠా.అందువల్లనే అది జగన్ ప్రభుత్వంపై కత్తి కట్టింది. అధర్మ యుద్ధాన్ని ప్రకటించింది. అందుకు ప్రతిగా ప్రభుత్వం వెనుక పేదవర్గాలు సమీకృతమవుతున్నాయి. కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో రాష్ట్రం పెత్తందార్లు – పేదవర్గాలు అనే రాజకీయ వైరి శిబిరాలుగా చీలిపోయింది. ఈ రెండు శిబిరాలూ ఇప్పుడు ఎదురెదురు మోహరించి నిలబడ్డాయి. సమాజంలో పేదలు – పెత్తందార్లు అనే చీలిక వచ్చి నప్పుడు మెజారిటీ ప్రజలైన పేదవర్గాలే ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధిస్తారని చెప్పడానికి ఏ సర్వేనూ ఆశ్రయించ వలసిన పని లేదు. కామన్సెన్స్ చాలు. గతంలో అంతో ఇంతో విశ్వసనీయతను నిరూపించుకున్న కొన్ని సర్వే సంస్థలు కూడా మరోసారి వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేయబోతున్నదని ఇప్పటికే ప్రకటించాయి. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చాలా సంస్థలు చెప్పాయి. అందరి లోకీ సీట్ల సంఖ్యను వాస్తవానికి అతి దగ్గరగా టైమ్స్‌నౌ – ఈటీజీ గ్రూప్ అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 65, బీఆర్ఎస్కు 41, బీజేపీకి 7, ఎమ్ఐఎమ్కు 6 సీట్లు వస్తాయని ఈ గ్రూప్ అంచనా వేసింది. 96 శాతం కచ్చితత్వాన్ని నిరూపించుకున్నది. టైమ్స్ నౌ – ఈటీజీ గ్రూప్ తాజా సర్వే ప్రకారం ఆంధ్ర ప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ సీట్లకు గాను వైసీపీ 24 నుంచి 25 సీట్లను గెలుచుకోబోతున్నది. టీడీపీకి సున్నా నుంచి ఒక్క సీటు వరకు లభించే అవకాశం ఉన్నది. అంటే టీడీపీ మహా అయితే ఒక్క సీటు గెలుచుకుంటుంది. ఈ సీట్లను అసెంబ్లీ స్థానాల లెక్కలోకి అనువదిస్తే ఫలితం సుస్పష్టం. గతంలో గెలి చిన 151 కంటే పైమాటే తప్ప తగ్గే అవకాశం ఉండదు. కర్ణాటక ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిన సంస్థల్లో పొలి టికల్ క్రిటిక్ ఒకటి. ఆ సంస్థ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సర్వే చేసి గత ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఓట్ల శాతాన్ని యథాతథంగా నిలబెట్టుకుంటుందని నిర్ధారించింది. టీడీపీ కంటే వైసీపీ 11 శాతం ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటుందని చెప్పింది. 2019 ఎన్ని కల ఫలితాలు పునరావృతమవుతాయని అర్థం. ఈ పరిస్థితి యెల్లో ముఠాకు అర్థమైనందు వల్లనే అది నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తిస్తున్నది. ఆంధ్రప్రదే శ్లో రాబోయే ఎన్నికల ఫలితాలను అంచనా వేయ డానికి మూడు పద్ధతులున్నాయి. వివిధ వర్గాలకు చెందిన తటస్థ ఓటర్ల మనోభిప్రాయాలను తెలుసుకోవడం మొదటి పద్ధతి. గతంలో క్రెడిబిలిటీని నిలబెట్టుకున్న జాతీయ సంస్థల సర్వేలను గమనించడం రెండో పద్ధతి. ఇది కొంతమేరకు ట్రెండ్‌ను సూచిస్తుంది. ఇక ఏపీకి మాత్రమే పరిమితమైన మూడో పద్ధతి. యెల్లో మీడియాను గమనించడం. సునామీ, భూకంపాలు వచ్చే ముందు కొన్ని రకాల జంతువులు, పక్షులు విచిత్రంగా ప్రవర్తిస్తాయి. తమకు ఇష్టంలేని ప్రభుత్వం రాబో తున్నదని నిర్ధారణ కాగానే యెల్లో మీడియా ప్రవర్తన కూడా జుగుప్సాకరంగా మారిపోతుంది. ఇదొక లిట్మస్ టెస్ట్. ఇప్పుడు యెల్లో మీడియా ప్రవర్తిస్తున్న తీరును బట్టి కూడా వైసీపీ భారీ విజయాన్ని అంచనా వేసుకోవచ్చు. పేద పిల్లలకు మంచి చదువులు వద్దట. ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇస్తే చెడి పోతారట, సంపన్నుల పిల్లలకిస్తే ఫరవాలేదు. వారు చెడిపోరు. వారు పుట్టుకతోనే సద్బుద్ధి కలిగి ఉంటారు. వారు సజ్జనులు. దుర్జనులైన అలగా జనానికి ట్యాబ్‌లు ఇస్తే తక్షణం చెడిపోతారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వాళ్లను చెడగొడుతున్నదట. పైగా ఈ ప్రభుత్వం పన్నులు వేస్తున్నదట. ఆ అధికారం ఒక్క చంద్ర బాబుకే ఉండాలట! ఈ రకమైన యెల్లో మీడియా విపరీత ప్రవర్తనను తెలుగు పాఠక జనం ఇంకో వంద రోజులు భరించ వలసి ఉంటుంది. మరోపక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి కూల్‌గా తన సామాజిక న్యాయ సిద్ధాంతానికి మరింత పదును పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల మార్పు చేర్పులు చేసిన 11 సీట్లను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇందులోనే బీసీలకు మరో రెండు సీట్లు పెంచారు. గెలుపు మీద పూర్తిస్థాయి విశ్వాసం ఉన్నవారే ఇటువంటి ప్రయోగాలకు సిద్ధమవుతారు. రెండోసారి గెలుపు కోసం మాత్రమే కాదు, సుదీర్ఘ ఇన్నింగ్స్‌కే జగన్మోహన్రెడ్డి పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్న దనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం ఒక్క రైతాంగంలోనే కాదు. వెనుకబడి పోయిన అన్ని వర్గాల్లోనూ కనిపిస్తున్నది. వెన్నెముకలు నిటారుగా నిలబడుతున్నవి. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో జగన్ ప్రభుత్వపు విప్లవ శంఖారావం పేద వర్గాలను ఉత్తేజితం చేస్తున్నది. సాధికార రథయాత్ర లతో వారిప్పుడు జాగృతమవుతున్నారు. పైసా ఖర్చు లేకుండా పాతిక లక్షల విలువైన వైద్య సేవలను పెద్దా సుపత్రుల్లో పొందగలిగే అవకాశం ఇప్పుడు రాష్ట్రంలోని 90 శాతం ప్రజలకు ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో అందుబాటులో ఉన్నది. ఇంత పెద్ద ఉచిత పథకం ఇంకెక్కడా లేదు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత పటిష్ఠంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు తయారయ్యాయి. ఫ్యామిలీ డాక్టర్ బృందాలు పల్లెపల్లెనా పర్యటిస్తున్నాయి. అన్ని స్థాయి ల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఔట్ పేషంట్ల సంఖ్య యాభై నుంచి వందశాతం పెరిగింది. ఈ పెరుగుదల అక్కడ లభిస్తున్న వైద్యసేవల నాణ్యతా ప్రమాణాలకు సూచిక. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విద్యా విధానంఇప్పటికే జాతీయ – అంతర్జాతీయ స్థాయిలో ప్రశంస లనందుకుంటున్నది. నిరుపేద కుటుంబాల్లో పుట్టిన బిడ్డలు ఐక్యరాజ్య సమితి వేదికపై నిలబడి తమ గళాన్ని వినిపించడం సంచలనాన్ని సృష్టించింది. పెద్దపెద్ద నగరాల్లో సంపన్నుల సంతానానికి మాత్రమే లభించే నాణ్యమైన చదువును సర్కారు బడుల్లో పేద పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా సమకూర్చింది. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చాలా సంస్థలు చెప్పాయి. అందరిలోకీ సీట్లసంఖ్యను వాస్తవానికి అతి దగ్గరగా టైమ్స్‌నౌ – ఈటీజీ గ్రూప్ అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 65, బీఆర్ఎస్కు 41, బీజేపీకి 7, ఎమ్ఐఎమ్కు 6 సీట్లు వస్తాయని ఈ గ్రూప్ అంచనా వేసింది. 96 శాతం కచ్చితత్వాన్ని నిరూపించుకున్నది. టైమ్స్ నౌ – ఈటీజీ గ్రూప్ తాజా సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ సీట్లకు గాను వైసీపీ 24 నుంచి 25 సీట్లను గెలుచు కోబోతున్నది. టీడీపీకి సున్నా నుంచి ఒక్క సీటు వరకు లభించే అవకాశం ఉన్నది. అంటే టీడీపీ మహా అయితే ఒక్క సీటు గెలుచుకుంటుంది. ఈ సీట్లను అసెంబ్లీ స్థానాల లెక్కలోకి అనువదిస్తే ఫలితం సుస్పష్టం. గతంలో గెలిచిన 151 కంటే పైమాటే తప్ప తగ్గే అవ కాశం ఉండదు. కర్ణాటక ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిన సంస్థల్లో పొలిటికల్ క్రిటిక్ ఒకటి. ఆ సంస్థ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సర్వే చేసి గత ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఓట్ల శాతాన్ని యథాతథంగా నిలబెట్టుకుంటుందని నిర్ధారించింది. టీడీపీ కంటేవైసీపీ 11 శాతం ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటుందని చెప్పింది. 2019 ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతా యని అర్థం. ఈ పరిస్థితి యెల్లో ముఠాకు అర్థమైనందు వల్లనే అది నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తిస్తున్నది. - వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సామాజిక భద్రత గాలిలో దీపం!
హుదూద్ విలయాన్ని ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొన్నదని ప్రచారం సాగుతోంది. నాలుగు రోజుల ముందే తెలిసి సంభవించిన ఉత్పాతాన్ని ఎదుర్కోవడానికి పూర్తిగా సంసిద్ధమై ఉంటే విద్యుత్ పునరుద్ధరణ ఇంత ఆలస్యమయ్యేదా? జనం తాగునీటి కోసం సైతం ఇంకా కటకటలాడాల్సి వచ్చేదా? తొలి తెలంగాణ ప్రభుత్వ హయాంలో 250 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పంటలు ఎండిపోతున్నాయని, రైతులు ఆత్మహ త్యలకు పాల్పడవచ్చని తెలుసు. కానీ, ఊరూరా, వాడవాడలా జేఏసీలను నిర్మించి ఉద్యమ ప్రస్థానం సాగించిన పార్టీ ప్రభుత్వానికి.. రైతులకు ధైర్యం చెప్పే కార్యక్రమం చేపట్టడం సాధ్యం కాలేదా? సాంఘికశాస్త్రం ‘దేశమంటే మనుజులోయ్’ అన్నది గురజాడ మాట. ‘దేశమంటే ఓటరోయ్’ అన్నది నేటి ఏలికల మాట. నాలుగు ఓట్లను వెనకేసుకునేందుకు కావాల్సిన రాజకీయ వ్యూహాలంటే మన నాయకులకు బోలెడంత శ్రద్ధ. పౌర సంక్షేమం, సాంఘిక భద్రతలతో ముడిపడిన విషయాలపై అలాంటి ముందస్తు ఆలోచనలు చేయడంలో మాత్రం ఆ ఆసక్తి కనబడదు. సమాజంలో అవాంఛనీయమైన ధోరణులు తలెత్తబోతున్నాయనే సూచనలు కనిపించినప్పుడుగానీ, విపత్తులు ఎదురు కాబోతున్నాయనే హెచ్చరికలు అందినప్పుడుగానీ ప్రభుత్వాలకు ఉండవలసిన సన్నద్ధత, ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం మృగ్యం. పెపైచ్చు గోరంత పనికి కొండంత ప్రచార రాగం తీసే విపరీత ధోరణి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిణామాలనే తీసుకుందాం. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక జీవనాడిగా భాసిల్లుతుందని భావిస్తున్న విశాఖ పట్నం(ఉత్తరాంధ్రసహా) పై పెనుగాలులతో ప్రకృతి విరుచుకు పడింది. తెలం గాణ రాష్ట్రం ఏర్పడిన ఈ నాలుగున్నర మాసాల్లో సుమారు 250 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వార్తలొస్తున్నాయి. ఈ రెండు ఉత్పాతాలను రెండు ప్రభుత్వాలు ఎలా ఎదుర్కొంటున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ నెల పన్నెండో తేదీ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు హుదూద్ తుపాను విశాఖపట్నం వద్ద తీరం దాటింది. గంటకు 200 కిలో మీటర్ల వేగపు పెనుగాలులతో విధ్వంసం సృష్టించి వెళ్లింది. అంతకు ముందురోజు... అంటే పదకొండో తేదీనాటి వాతావరణ హెచ్చ రికను ఒకసారి చూడండి. తుపాను తీరం దాటే సమయానికి పన్నెండు గంటల ముందు నుంచి ఆ తర్వాత మరో 24 గంటలపాటు- మొత్తంగా 36 గంటలసేపు 160 నుంచి 180 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని స్పష్టంగా చెప్పింది. ఇంకోరోజు ముందుకెళ్దాం. పదో తేదీ నాటి వాతావరణ హెచ్చరిక... హుదూద్ తుపాను విశాఖపట్నం వద్దే తీరం దాటబోతోంది. ఆ సమయంలో భీకరమైన గాలులు వీస్తాయి. అక్టోబర్ 9 నాటి వాతావరణ హెచ్చరిక... విశాఖపట్నం- గోపాల్పూర్ (ఒడిశా)ల మధ్య హుదూద్ తుపాను 12వ తేదీన తీరం దాటుతుంది. ఆ సమయంలో గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. విశాఖపట్నాన్ని ప్రచండ మారుతం తాకబోతోందన్న విషయం మూడు రోజుల ముందే స్పష్టంగా తెలుసు. ఒక్కోరోజు గడుస్తున్న కొద్దీ మరింత స్పష్టంగా, లెక్కకట్టిన చందంగా తుపాను ప్రభావాన్ని వాతావరణ శాస్త్రం కళ్లకు కట్టింది. ఈ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రప్రభుత్వం తీరప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కేంద్రప్రభుత్వం నౌకాదళాన్ని, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే ఎన్డీఆర్ఎఫ్ను సమాయత్తం చేసింది. పదమూడో తేదీ మధ్యాహ్నం సమయానికి ముఖ్యమంత్రి విశాఖ పట్నం చేరుకున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహించి, సహాయ కార్యక్రమాలను సమన్వయం చేసే పనిని ప్రారంభించారు. స్థూలంగా ఇదీ ప్రభుత్వ స్పందన. ఈ మాత్రం పనిని ఆకాశానికెత్తే స్తోత్ర కైవారాలు మూడోరోజు నుంచే మొదలయ్యాయి. కొందరు అధికారులు, మరికొందరు మేధావులనుకునేవాళ్ల ఇంటర్వ్యూలు కొన్ని పత్రికల్లో అచ్చవుతున్నాయి. కొన్ని చానళ్లలో ప్రసారమ వుతున్నాయి. ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించడం ఎప్పుడూ చూడలేదం టారు వారు. అసలు ముఖ్యమంత్రి విశాఖపట్నంలో మకాం వేయడమేమిటని ఆశ్చర్యపోతారు. ప్రధానమంత్రి స్వయంగా సమీక్షలో పాల్గొనడమేమిటని నివ్వెరపోతారు. అసలు ఈ ప్రభుత్వం ఉన్నది కనుకే ఇంత తక్కువమంది (36 మంది) చనిపోయారని కొందరు సూత్రీకరిస్తారు. ‘‘అనుభవమండీ... అనుభ వం, నేనందుకే చెప్పాను అనుభవజ్ఞుడు పాలకుడవ్వాలని’’ మరొకాయన తన దూరదృష్టిని జనానికి గుర్తుచేస్తారు. ఈ తుపాను ప్రమాదాన్ని ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నదని తామే ఒక నిర్ధారణకు వచ్చేసి, ప్రజ లంతా ఇదే అభిప్రాయాన్ని నమ్మితీరాలని చేస్తున్న ఈ ప్రచారం ఇలావుంటే... సామాన్యుల బుర్రలను మాత్రం అనేక సందేహాలు తొలిచేస్తున్నాయి. ప్రచం డమైన గాలులు వీస్తాయని మూడు నాలుగు రోజుల ముందే తెలుసుకదా... ఆ స్థాయి గాలులకు కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పడిపోతాయనీ, చెట్లు కూలిపోతాయని ఎందుకు ఊహించలేకపోయారు? అంధకారం ఆవరించే అవకాశంవుందని ఎందుకు అంచనా వేయలేకపోయారు? అంచనా వేసివుంటే తుపాను తీరం దాటడానికి ముందుగానే విద్యుత్ సిబ్బందిని, పరికరాలను సమీకరించి, ఎందుకు సిద్ధం చేయలేదు. అలా చేసి వున్నట్టయితే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ ఇంత ఆలస్యమయ్యేది కాదుగదా? ముందస్తు వ్యూహం ఉన్నట్లయితే విపత్తు సంభవించాక ఇన్ని రోజుల తర్వాత కూడా జనం తాగు నీటి కోసం ఎందుకు క్యూల్లో నిలబడాల్సివస్తోంది. కాలకృత్యాలు తీర్చుకోవ డానికీ ఎందుకు అవస్థలు పడాల్సివస్తోంది. పాలు, కూరగాయలను గంటల తరబడి నిలబడి మరీ అధిక ధరలకు ఎందుకు కొనుక్కోవలసి వస్తోంది? ఐదు రోజుల తర్వాత బంగాళదుంపల కోసం బెంగాల్ ముఖ్యమంత్రికి ఫోన్ చేయడ మేమిటి? ఈ పని ముందుగానే చేయలేరా? ఐదు రోజుల తర్వాత కూడా విశాఖ వీధుల్లో ఆకలికేకలు ఎందుకు వినాల్సివస్తోంది? తాను విశాఖలో ఉండటంవల్ల ప్రజలకు, అధికారులకు నైతిక బలాన్నిచ్చినట్టవుతుందని భావిస్తున్న ముఖ్య మంత్రి తుపానుకు ముందురోజే అక్కడ ఎందుకు మకాం వేయలేదు? ఇక తెలంగాణలో రైతన్నల ఆత్మహత్యలు కొత్తగా ఇప్పుడు ప్రారంభమైనవి కాకపోవచ్చు. కానీ, ఈ నాలుగు మాసాల్లో పెరిగాయి. విద్యుత్ సమస్య కూడా ఈ ప్రభుత్వం సృష్టించింది కాకపోవచ్చు. కానీ, మరింత జటిలంగా మారింది. ఈ నాలుగు మాసాల్లో సుమారు 250 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రని చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ మరో రెండు మూడు వారాల్లో పూర్తవుతుం దనగా ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. ఇక పంటల దిగుబడి మీద ఆశలు పూర్తిగా అడుగంటడంతో, చేసిన అప్పులు గుర్తుకొచ్చి రైతులు పిట్టల్లా రాలు తున్నారు. ఈ సంవత్సరం సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. అయి నాసరే సాధారణ సాగులో 90 శాతానికి పైగా రైతులు సాగుచేశారు. ఏరువాక జూన్‌లో వుంటే మన బ్యాంకులు ఖరీఫ్ అప్పులను అక్టోబర్ నాటికి గానీ ఇవ్వవు. అప్పటికే ఖరీఫ్ పూర్తయ్యే దశలో ఉంటుంది. ప్రైవేట్ అప్పులను అధిక వడ్డీకి తీసుకొని రైతులు సాగు ప్రారంభిస్తారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరలు 180 శాతం పెరిగితే ఇదేకాలంలో మద్ధతు ధర 10 శాతం పెరి గింది. ఇన్ని కష్టాలతో సాగు ప్రారంభించిన రైతును వర్షాలు తొలిదెబ్బ తీస్తే, కరెంట్ మలిదెబ్బ తీసింది. ఒక మడి పూర్తిగా తడిసిన తర్వాతే రెండో మడిలోకి నీరు పారేలా ఉంటుంది మన వ్యవసాయ పద్ధతి. ఉదయం-రాత్రి... ఇలా రెం డు దఫాలుగా కరెంటు ఇవ్వడంతో తడిపిన ప్రతిసారీ మొదటి మడి తడవడమే తప్ప రెండో మడిలోకి నీరు పారదు. ఇచ్చిన కరెంట్ ఒకేసారి ఇస్తే కొంతైనా ఫలితముండేదేమో! పొట్టకొచ్చిన పంట చివరి తడులు లేక కళ్లముందే మాడి పోయింది. రుణాలు రెన్యువల్ అయివుంటే అక్టోబర్ నాటికైనావచ్చే బ్యాంకు రుణాలతో పీకల మీదున్న అప్పులను రైతు తీర్చుకునేవాడు. రుణమాఫీ ప్రక్రి య పూర్తికాకపోవడంతో ఆ ఆశాలేదు. అవమానభారాలు గుర్తుకొచ్చి బతుకు మీద ఆశ చస్తోంది. అరువుకు దొరికే మద్యం చావడానికి ధైర్యాన్నిస్తోంది. ఈ వ్యవహారంలో తొలి తెలంగాణ ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తుందని ప్రజలు ఆశించారు. ఎందుకంటే, ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఉద్యమానికి సారథ్యం వహించిన పార్టీ. కానీ, ఈ మొత్తం సీజన్లో ఏ దశలోనూ ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషించలేదు. పంటలు ఎండిపోతున్నాయని తెలుసు. రైతు లు ఆత్మహత్యలకు పాల్పడతారనీ తెలుసు. కానీ, గ్రామగ్రామాన ఆత్మహత్య లకు వ్యతిరేకంగా ఉద్యమస్ఫూర్తితో జన చేతన కార్యక్రమాలు నిర్వహించాలన్న శ్రద్ధ మాత్రం దానికి కలుగలేదు. ఊరూరా, వాడవాడనా, జేఏసీలను నిర్మించి ఉద్యమ ప్రస్థానం సాగించిన పార్టీకి రైతులకు ధైర్యం చెప్పే కార్యక్రమం చేపట్ట డం సాధ్యం కాలేదా? నాలుగు వేలమంది తెలంగాణ కళాకారులను గుర్తించి వారికి ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని హామీనిచ్చిన ప్రభుత్వానికి, కళాబృందాలతో గ్రామగ్రామానా ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి మనసు రాలేదా? ఉద్యమపార్టీ రాజకీయ పార్టీగా పరివర్తన చెందింది కాబట్టి బహుశా ఇక అటువంటి ఆలోచనలు రాకపోవచ్చు. తక్కువ శ్రమతో ఎక్కువ ప్రచారం దొరికే బతుకమ్మలు, గోల్కొండ కోటలు, ట్యాంక్‌బండ్ విగ్రహాలు వుండగా సాంస్కృతికోద్యమాలు, సాంఘికోద్యమాలు ఎవరు తలకెత్తుకుంటారు? వర్థెల్లి మురళి -
సాంస్కృతిక ఉద్యమమే శరణ్యం
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏటా రూ. 50 వేల కోట్లకు పైగా మద్యంపై వెచ్చిస్తున్నారు. ఇందులో నిరుపేద కష్టజీవుల చెమట చుక్కల వాటానే ఎక్కువ. మద్యం వారి కష్టార్జితాన్నే కాదు, కష్టం చేసే శక్తిని కూడా హరించేస్తోంది. ఈ వ్యసనం వల్ల గ్రామీణ యువతను నిష్క్రియాపరత్వం ఆవహిస్తోంది. దీన్ని తక్షణం నియంత్రించాల్సి ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జన జీవితం మధ్య నుండి మద్యాన్ని ఊడ్చి పారేసేందుకు సిద్ధపడాలి. మోదీ ఆదర్శంగా ‘పరిశుభ్రత-పని సంస్కృతి’ నినాదంతో ప్రజలలో మద్య నియంత్రణస్ఫూర్తిని రగిలించడానికి సిద్ధం కావాలి. అప్పుడే ఇదో ఉద్యమం రూపును తీసుకుంటుంది. సాంఘికశాస్త్రం కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలు... సరికొత్త నినాదాలు! గడచిన నాలుగు మాసాలుగా ఒకటే సందడి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు దేశమంతటా కూడా. మన్మోహన్సింగ్ నిస్తేజ పాలనతో విసిగివేసారిన ప్రజలకు ప్రధానిగా నరేంద్ర మోదీ పంచ రంగుల త్రీడీ కలలాగా కనిపిస్తున్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ఆయన సాధించింది ఏమీ లేకపోయినా, నాటకీయంగా చెబుతున్న మాటలకు, ప్రకటిస్తున్న కార్యక్రమాలకు 4జీ ప్రచారం లభిస్తోంది. మిగతా విషయాల మాట ఎలా ఉన్నా, ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ పేరుతో ఆయన చేపట్టిన పారి శుద్ధ్య కార్యక్రమం మాత్రం అందరి ప్రసంశలనందుకుంటోంది. ఇది పూర్తిగా మోదీ బుర్రలో పుట్టిన కొత్త ఆలోచన కాకపోవచ్చు. మునుపటి ప్రభుత్వం కూడా ‘నిర్మల్ భారత్ అభియాన్’ పేరుతో ఒక పథకాన్ని రూపొందించి ఉండ వచ్చు. కానీ క్రియాశీల రాజకీయ నాయకత్వ లోపం వల్ల మూలనపడ్డ ఆ పథ కాన్ని దుమ్ముదులిపి, కొత్త హంగులద్ది ఉద్యమ స్ఫూర్తినివ్వడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని స్వాగతించవలసిందే. జనాభాలో అరవై శాతం బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్న దేశం, ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలు, పట్టణాల్లో సగానికిపైగా మనవేననే ఖ్యాతిని మోస్తున్న దేశం... జీవ నదులను నిర్జీవమైన మురుగునీటి డ్రైనేజీ కాల్వలుగా దిగజార్చుకున్నామన్న భుజ కీర్తులను ధరించిన దేశం... అణుశక్తిని ఎక్కుపెడితేనేమి? అంగారకుడిని ముట్ట డిస్తేనేమి? అంతర్జాతీయ సమాజం ముందు సిగ్గుతో తలవంచుకు నిలవాల్సిన దుస్థితిలో ఉన్నాం. ఈ మురికిని వదిలించుకుంటేనే మనం తలెత్తుకోగలిగేది. అందుకే ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా వచ్చే ఐదేళ్లూ కొనసాగాలనీ, పరి శుభ్ర భారతాన్ని మహాత్మాగాంధీకి 150వ జయంతి కానుకగా ఇవ్వగలగాలనీ కోరుకుందాం. మద్యం కాటేస్తోంది... నిష్క్రియాపరత్వం వికటిస్తోంది సామాజిక రుగ్మతలను జయించడానికి ప్రభుత్వ పథకాలు మాత్రమే సరిపోవని దశాబ్దాల అనుభవం మనకు నేర్పిన గుణపాఠం. ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తేనే, జన చేతనను వెలిగిస్తేనే ప్రజలను భాగస్వాములుగా మారిస్తేనే ఫలితాలను సాధించగలుగుతాం. కొత్తగా ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలకు ఇది మరింత అవసరం. నవ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని కేసీఆర్, నవ్యాంధ్రను సువర్ణాంధ్రగా మార్చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. సంక ల్పాలకు స్వాగతం. ఈ బృహత్తర లక్ష్యాలను చేరుకోవాలంటే రెండు రాష్ట్రాల రాజకీయ నాయకత్వం, పాలనా యంత్రాంగం గుర్తించి, పరిహరించాల్సిన విప రిణామం ఒకటుంది. మన గ్రామసీమల్లో పని సంస్కృతి వేగంగా పతనమవు తోంది. గ్రామీణ యువతలో నిష్క్రియాపరత్వం ప్రమాదకరంగా ఆవహిస్తోంది. కారణం.. అందరికీ తెలిసిందే. విశృంఖల మద్య ప్రవాహం! రెండు రాష్ట్రాల్లోని 150 గ్రామాల్లో ఇటీవల ‘సాక్షి’ ప్రతినిధులు చేపట్టిన శాంపిల్ సర్వేలో దిగ్భ్రాం తికరమైన వాస్తవాలు బయటపడ్డాయి. మద్యం గ్రామాలను కబళిస్తోంది. పని చేసే వారైన 25 నుంచి 50 ఏళ్ల వయస్కులే ఎక్కువగా మద్యానికి బానిసలవు తున్నారు. వారిలో పనిచేసే శక్తి నశిస్తోంది. కొందరు పనిచేయడమే మానేసి, వీధుల వెంట తిరుగుతున్నారు. ఈ పరిస్థితి రెండు రాష్ట్రాల్లోనూ ఉంది. తెలం గాణలో కొంచెం ఎక్కువ, ఆంధ్రప్రదేశ్‌లో కొంచెం తక్కువ. తేడా స్వల్పం! మద్యం మోగిస్తున్న చావు డప్పు దాదాపు అన్ని గ్రామాల్లో పనిచేసే వయసులో ఉన్న పురుషుల్లో ఇరవై శాతం మద్యానికి పూర్తిగా బానిసలైపోయారు. మిగతావారిలో అప్పుడప్పుడూ తాగే వారి సంఖ్య ఎక్కువ. తాగుడుకు బానిసలైనవారిలో వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, చిన్న వృత్తి పనులవారే అత్యధికులు. వీరి కుటుంబాల పోషణ భారం ఆడవాళ్ల మీదనే పడింది. తల్లులో, భార్యలో కూలీనాలీ చేసి కుటుంబా లకు అండగా ఉంటున్నారు. జేబులో డబ్బులుంటే 130 రూపాయలతో ఎర్ర మందు (క్వార్టర్ బాటిల్ చీప్ లిక్కర్), లేకుంటే, భార్యల కష్టార్జితాన్ని కొట్టి లాక్కుని పది, ఇరవై రూపాయలతో గుడుంబా ప్యాకెట్లు కొంటారు. సంపాదన లేకపోయినా మందు బిల్లు నెలకు రూ. 1,500కు తగ్గదు. డబ్బు లేకపో యినా, అరువు ఇవ్వడానికి మద్యం అమ్మక కేంద్రాలు సిద్ధం. గ్రామాల్లో సగ టున ప్రతి 250 గడపలకో బెల్టు షాపు. 25 గడపలకో గుడుంబా సెంటర్ అందు బాటులో ఉన్నాయి. వెయ్యి గడపల గ్రామంలో రోజువారీ మద్యం వ్యయం రూ. 30 నుంచి రూ. 40 వేలు. ఏటా కోటి నుంచి కోటిన్నర! ఇందులో అత్య ధిక వాటా నిరుపేదలదే. సంసార భారం మోస్తున్న మహిళల కష్టార్జితం సగాని కంటే ఎక్కువ! చీప్ లిక్కర్, నాటు సారాల ప్రభావంతో ఆరోగ్యకరమైన శరీ రాలు శిథిలమవుతున్నాయి. కాళ్లూ చేతులూ లాగేస్తున్నాయంటూ ఏ పనీ చేయ లేకపోతున్నారు. వారానికి ఒకటి రెండు రోజులు పనికి వెళ్లినా, రోజుకు రెండు మూడు గంటలకు మించి పనిచేయలేకపోతున్నారు. ఆ సంపాదనా మందుకే. ఆరోగ్యాలు పాడైనవారి వైద్య ఖర్చుల కోసం భార్యలు పడే కష్టాలు వర్ణనా తీతం. అప్పుల కోసం ఎక్కని గుమ్మం, దిగని గుమ్మం ఉండటం లేదు. ప్రతి గ్రామంలోనూ ఏటా పది, పన్నెండు మంది ఈ వ్యసనం వల్ల అకాల మరణాల పాలవుతున్నారు. సగటున నెలకోసారి ఊళ్లో మద్యం చావు డప్పు మోగుతోంది. సన్నకారు, చిన్నకారు రైతులు ఈ వ్యసనం వల్ల సొంత వ్యవసాయం పను లు చేసుకోలేకపోతున్నారు. కరెంటు వస్తే బోరు మోటార్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం వరకే వారు పరిమితం. పనులన్నీ భార్యాబిడ్డల పైనే! కూలీతో పాటు నాటు సారా ప్యాకెట్టు, కల్లు సీసా నుంచి క్వార్టర్ బాటిల్ దాకా ఫ్రీ ఆఫర్ ప్రకటిస్తే తప్ప మధ్యతరహా రైతులు, చిన్న పరిశ్రమలకు కూలీలు దొరకడం లేదు. దీంతో అనేక మంది వ్యవసాయాన్నే మానుకుంటున్నారు. సంకల్ప లోపంతోనే చేటు ఈ దుస్థితికి నిందించాల్సింది మన రాజకీయ నాయకత్వాన్నే. ఆచరణ సాధ్యం కాదన్న నెపంతో మద్య నిషేధాన్ని ఎత్తివేసినా, కనీసం దాన్ని నియంత్రించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయడం లేదు. పెపైచ్చు ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచు కోడానికి కోటాలు నిర్ణయించడం శోచనీయం. ఏపీ ఆర్థికమంత్రి ఇటీవల ఎక్సైజ్ ఆదాయం పెరగాలని బహిరంగంగానే పిలుపునివ్వడం కూడా చూశాం. రెండు రాష్ట్రాల్లో కలిపి ఎక్సైజ్ ఆదాయం గత ఏడాది రూ. 20 వేల కోట్ల పైచిలుకు. అయితే ఇది ప్రభుత్వ రాబడి మాత్రమే. ప్రజలు చేసిన ఖర్చు అంతకంటే చాలా ఎక్కువ. మద్యం ఉత్పత్తిదారునికి చెల్లించిన సొమ్ము, రిటైల్ వ్యాపారి కమీషన్ కలిపి మరో నలభై శాతం వరకు ఉంటుంది. మొత్తం వినియోగదారులు చెల్లించింది 28 వేల కోట్ల పైచిలుకు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా సరఫరా అయ్యే నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం మార్కెట్ ఇందులో సగం ఉంటుందని అంచనా. అంటే మరో రూ.14 వేల కోట్లు. ఇక నాటుసారా, కల్లు వాటా మరో పది వేల కోట్ల రూపాయలు ఉంటుంది. మొత్తంగా ఏడాదికి రూ. 50 వేల కోట్లకుపైగా తెలుగు ప్రజలు మద్యంపై వెచ్చిస్తున్నారు. ఇందులో నిరుపేదలైన కష్టజీవుల చెమట చుక్కల వాటానే ఎక్కువ. మద్యం వారి కష్టార్జితాన్నే కాదు, కష్టం చేసే శక్తిని కూడా హరించేస్తోంది. ఇది ప్రమాదకరం. దీన్ని తక్షణం నియంత్రించాల్సిన అవసరం ఉంది. మద్యంపై మొన్నటి ఎన్నికల్లో ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే స్పష్టమైన విధానాన్ని ప్రకటించింది. నియోజకవర్గానికి ఒకటే వైన్ షాపు ఉంటుందనీ, నాటుసారా, బెల్టు షాపులు లేకుండా చూసేందుకు ప్రతి ఊళ్లో పది మంది మహిళా కానిస్టేబుళ్లను నియమి స్తామనీ ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఈ ప్రస్తావన ఎందుకు అవసరమైందంటే దృఢమైన రాజకీయ సంకల్పం లేనిదే మద్యం మహమ్మారిని నియంత్రించడం అసాధ్యం. విషమిస్తున్న ఈ సామాజిక రుగ్మతను నియంత్రించడానికి ప్రభుత్వా లు, పార్టీలు చిత్తశుద్ధితో కృషిచేస్తే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తారన డంలో సందేహం లేదు. మోదీ ‘స్వచ్ఛ భారత్’ పిలుపునకు ప్రజలు స్పందించిన తీరే అందుకు నిదర్శనం. ఆయన స్ఫూర్తితో మన రెండు రాష్ట్రాల రాజకీయ నాయకత్వం మద్యాన్ని జనజీవితం మధ్య నుండి ఊడ్చి పారేసేందుకు సిద్ధప డాలి. మోదీని ఆదర్శంగా తీసుకొని ‘పరిశుభ్రత-పని సంస్కృతి’ అనే నినా దంతో ప్రజలలో మద్య నియంత్రణ చైతన్యం కల్పించడానికి సిద్ధం కావాలి. అప్పుడే ఇదో ఉద్యమం రూపును తీసుకుంటుంది. రెండు రాష్ట్రాల్లోని అత్యధిక భాగం గ్రామాల్లో పనిచేయాలనుకుంటే పనిదొరకని పరిస్థితులు తక్కువ. కూలి రేట్లు గౌరవప్రదంగానే ఉన్నాయి. భార్యాభర్తలిద్దరు పనిచేస్తే, ప్రభుత్వం అం డగా నిలిస్తే బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇవ్వగల పరిస్థితులున్నాయి. కద లాల్సింది ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు. సంఘ సేవకు లంతా ఈ సాంస్కృతిక ఉద్యమంలో ముందు నిలవాలి. వర్థెల్లి మురళి