రెడీ ఫర్‌ లాంగ్‌ ఇన్నింగ్స్‌! | YS Jagan left a strong impression on the agriculture sector | Sakshi
Sakshi News home page

రెడీ ఫర్‌ లాంగ్‌ ఇన్నింగ్స్‌!

Published Sun, Dec 17 2023 5:32 AM | Last Updated on Sun, Dec 17 2023 9:44 AM

YS Jagan left a strong impression on the agriculture sector - Sakshi

ఆ రైతు పేరు అప్పలనాయుడు. విజయనగరం జిల్లా జామి మండల వాస్తవ్యులు. వ్యవసాయ రంగంపై వైఎస్‌ జగన్‌ వేసిన బలమైన ముద్ర గురించి చెబుతూ ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. అది ‘రైతు భరోసా’ పేరుతో అందజేస్తున్న నగదు సాయం గురించి కాదు. అందుబాటులోకి వచ్చిన 9 గంటల నాణ్యమైన విద్యుత్తు గురించీ కాదు. ఈ–క్రాప్‌ ప్రయోజనాల గురించి కాదు. ఆర్‌బీకే సెంటర్లు అందజేస్తున్న నైపుణ్యాభివృద్ధి, యంత్ర సేవ గురించి కూడా కాదు. ధాన్యం పండించే తనలాంటి రైతులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వల్ల ఎకరాకు పదినుంచి పన్నెండు వేల రూపాయల పరోక్ష లబ్ధి చేకూరుతున్నదని అప్పలనాయుడు చెప్పుకొచ్చారు.

ఇదేమీ రహస్యం కాదు. రైతులందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే. కానీ మన అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులే దీన్ని గుర్తించినట్టు లేదు. గుర్తించినా ఎక్కడా మాట్లాడినట్టు లేదు. అప్పలనాయుడు చెప్పిన ఆ లెక్కను ఒకసారి చూద్దాం. విత్తనాల కోసం ఒకసారి, ఎరువుల కోసం మరొకసారి కనీసం రెండుసార్లు రైతులు మండల కేంద్రానికి వెళ్లవలసి వచ్చేది. రానూపోనూ ప్రయాణ ఖర్చులూ, భోజనం ఖర్చుతో పాటు ఒకరోజు వేతనాన్ని ఆ రైతు కోల్పోవలసి వచ్చేది. దానికితోడు ఎరువుల బస్తాలు తెచ్చుకునేందుకు ఆటో ఖర్చులు అదనం. ఎకరాకు సరిపోయే విత్తనాలకు ఆర్‌బీకేలో ఇప్పుడు 300 రూపాయలు ప్రభుత్వ రాయితీ లభిస్తున్నది. అప్పుడీ భారం రైతు మీదనే పడేది. 

ఎరువుల కొరతను అవకాశంగా తీసుకొని... అవసరం లేని పురుగు మందుల డబ్బా తీసుకుంటేనే ఎరువుల బస్తా ఇస్తామని వ్యాపారులు పేచీ పెట్టేవారు. ఇప్పుడా వృథా ఖర్చు పూర్తిగా పోయింది. ధాన్యం దిగుబడి సగటున ఎకరాకు 30 నుంచి 33 బస్తాలు (75 కిలోల బస్తా) వస్తుంది. ఆ రోజుల్లో దళారులు కొనుగోలు చేసేటప్పుడు ప్రతి క్వింటాల్‌కు అదనంగా కనీసం 5 కిలోలు తూకం వేసుకునేవారు. ఇప్పుడు క్వింటాల్‌ ధాన్యానికి మద్దతు ధర రూ.2100. తప్పుడు తూకంతో ఎకరాకు ఒకటిన్నర క్వింటాళ్ల కిమ్మత్తు పైకాన్ని రైతు కోల్పోయేవాడు. ఆ రోజుల్లో మద్దతు ధర మీద క్వింటాల్‌కు 150 నుంచి 200 రూపాయల వరకు దళారులు మినహాయించుకొని రైతులకివ్వడం సర్వ సాధారణం. ఇవన్నీ లెక్కేసి చూస్తే అధమపక్షం రైతుకు జరుగు తున్న లబ్ధి ఎకరాకు పన్నెండు వేల పైమాటేనని అప్పల నాయుడు లెక్క. ఊరూరా వెలసిన ఆర్‌బీకే సెంటర్ల పుణ్యమా అని రైతుకు దొరికిన గొప్ప ఊరట ఇది.

వ్యవసాయ రంగంలో ఇటువంటి మార్పులు ఇంకెన్నో ఉన్నాయి. ఇనుమడించిన రైతు ఆత్మవిశ్వాసానికి గుర్తుగా ఈ ఒక్క గొంతుక చాలు. ఈ ఆత్మవిశ్వాసం ఒక్క రైతాంగంలోనే కాదు. వెనుకబడిపోయిన అన్ని వర్గాల్లోనూ కనిపిస్తున్నది. వెన్నెముకలు నిటారుగా నిలబడుతున్నవి. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వపు విప్లవశంఖారావం పేద వర్గాలను ఉత్తేజితం చేస్తున్నది. సాధికార రథయాత్రలతో వారిప్పుడు జాగృతమవుతున్నారు. పైసా ఖర్చు లేకుండా పాతిక లక్షల విలువైన వైద్య సేవలను పెద్దాసుపత్రుల్లో పొందగలిగే అవకాశం ఇప్పుడు రాష్ట్రంలోని 90 శాతం ప్రజలకు ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో అందుబాటులో ఉన్నది. ఇంత పెద్ద ఉచిత పథకం ఇంకెక్కడా లేదు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత పటిష్ఠంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తయారయ్యాయి. ఫ్యామిలీ డాక్టర్‌ బృందాలు పల్లెపల్లెనా పర్యటిస్తున్నాయి. అన్ని స్థాయిల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఔట్‌ పేషంట్ల సంఖ్య యాభై శాతం నుంచి వందశాతం వరకు పెరిగింది. ఈ పెరుగుదల అక్కడ లభిస్తున్న వైద్య సేవల నాణ్యతా ప్రమాణాలకు సూచిక.

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విద్యా విధానం ఇప్పటికే జాతీయ – అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలనందుకుంటు న్నది. నిరుపేద కుటుంబాల్లో పుట్టిన బిడ్డలు ఐక్యరాజ్య సమితి వేదికపై నిలబడి తమ గళాన్ని వినిపించడం సంచలనాన్ని సృష్టించింది. పెద్దపెద్ద నగరాల్లో సంపన్నుల సంతానానికి మాత్రమే లభించే నాణ్యమైన చదువును సర్కారు బడుల్లో పేద పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా సమకూర్చింది. నాడు శిథిలావస్థకు చేరిన సర్కారు బడులు మళ్లీ వసంతాన్ని చిగురిస్తున్నాయి. కొత్త తరానికి అత్యవసరమైన డిజిటల్‌ సాంకేతికతను పాఠశాల స్థాయి విద్యార్థులకు కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పెత్తందారీ శక్తులు పేదల విద్యపై కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నా జగన్‌ ప్రభుత్వం విద్యా విప్లవంలో వెనక్కి తిరిగి చూడటం లేదు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సాధించిన విజయాలు ఈ మూడు రంగాలకే పరిమితం కాలేదు. సమస్త జీవన రంగాల్లోనూ ఊర్ధ్వ ముఖ చలనం మనకు కనిపిస్తుంది. అందుకు కారణం ప్రభుత్వ కర్తవ్యాలపై అధినేతకు ఉన్న స్పష్టమైన అవగాహన. ఒక నిర్దిష్ట మైన లక్ష్యం, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన కచ్చిత మైన ప్రణాళికను రూపొందించుకోవడంలో జగన్‌ ప్రభుత్వం దేశంలో అందరికంటే ముందువరసలో నిలబడింది. రాజ్యాంగ మౌలిక సూత్రమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వాన్ని సాధించడం కోసం ఇంత వేగంగా పనిచేసిన ప్రభుత్వం కూడా ఇంకొకటి లేదు. అందువల్ల సహజంగానే పెత్తందారీ శక్తుల కంటగింపునకు కూడా ఈ ప్రభుత్వం గురవుతున్నది.

ఆంధ్రప్రదేశ్‌లో పెత్తందారీ శక్తుల రాజకీయ నాయకత్వం మరింత ప్రమాదకరమైన మాఫియా ముఠా. క్షీరసాగర మథ నంలో అమృతంతోపాటు గరళం కూడా పుట్టిందట. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పుడు అభివృద్ధితోపాటు దాని కవలగా పుట్టిన అవినీతి పాలిటి వారసత్వం ఈ ముఠా. పేద ప్రజల సాధికారతకు పెద్ద శత్రువు ఈ యెల్లో ముఠా.అందువల్లనే అది జగన్‌ ప్రభుత్వంపై కత్తి కట్టింది. అధర్మ యుద్ధాన్ని ప్రకటించింది. అందుకు ప్రతిగా ప్రభుత్వం వెనుక పేదవర్గాలు సమీకృతమవుతున్నాయి. కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో రాష్ట్రం పెత్తందార్లు – పేదవర్గాలు అనే రాజకీయ వైరి శిబిరాలుగా చీలిపోయింది. ఈ రెండు శిబిరాలూ ఇప్పుడు ఎదురెదురు మోహరించి నిలబడ్డాయి.

సమాజంలో పేదలు – పెత్తందార్లు అనే చీలిక వచ్చి నప్పుడు మెజారిటీ ప్రజలైన పేదవర్గాలే ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధిస్తారని చెప్పడానికి ఏ సర్వేనూ ఆశ్రయించ వలసిన పని లేదు. కామన్‌సెన్స్‌ చాలు. గతంలో అంతో ఇంతో విశ్వసనీయతను నిరూపించుకున్న కొన్ని సర్వే సంస్థలు కూడా మరోసారి వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేయబోతున్నదని ఇప్పటికే ప్రకటించాయి. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని చాలా సంస్థలు చెప్పాయి. అందరి లోకీ సీట్ల సంఖ్యను వాస్తవానికి అతి దగ్గరగా టైమ్స్‌నౌ – ఈటీజీ గ్రూప్‌ అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 65, బీఆర్‌ఎస్‌కు 41, బీజేపీకి 7, ఎమ్‌ఐఎమ్‌కు 6 సీట్లు వస్తాయని ఈ గ్రూప్‌ అంచనా వేసింది. 96 శాతం కచ్చితత్వాన్ని నిరూపించుకున్నది.

టైమ్స్‌ నౌ – ఈటీజీ గ్రూప్‌ తాజా సర్వే ప్రకారం ఆంధ్ర ప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ సీట్లకు గాను వైసీపీ 24 నుంచి 25 సీట్లను గెలుచుకోబోతున్నది. టీడీపీకి సున్నా నుంచి ఒక్క సీటు వరకు లభించే అవకాశం ఉన్నది. అంటే టీడీపీ మహా అయితే ఒక్క సీటు గెలుచుకుంటుంది. ఈ సీట్లను అసెంబ్లీ స్థానాల లెక్కలోకి అనువదిస్తే ఫలితం సుస్పష్టం. గతంలో గెలి చిన 151 కంటే పైమాటే తప్ప తగ్గే అవకాశం ఉండదు. కర్ణాటక ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిన సంస్థల్లో పొలి టికల్‌ క్రిటిక్‌ ఒకటి. ఆ సంస్థ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సర్వే చేసి గత ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఓట్ల శాతాన్ని యథాతథంగా నిలబెట్టుకుంటుందని నిర్ధారించింది. టీడీపీ కంటే వైసీపీ 11 శాతం ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటుందని చెప్పింది. 2019 ఎన్ని కల ఫలితాలు పునరావృతమవుతాయని అర్థం.

ఈ పరిస్థితి యెల్లో ముఠాకు అర్థమైనందు వల్లనే అది నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తిస్తున్నది. ఆంధ్రప్రదే శ్‌లో రాబోయే ఎన్నికల ఫలితాలను అంచనా వేయ డానికి మూడు పద్ధతులున్నాయి. వివిధ వర్గాలకు చెందిన తటస్థ ఓటర్ల మనోభిప్రాయాలను తెలుసుకోవడం మొదటి పద్ధతి. గతంలో క్రెడిబిలిటీని నిలబెట్టుకున్న జాతీయ సంస్థల సర్వేలను గమనించడం రెండో పద్ధతి. ఇది కొంతమేరకు ట్రెండ్‌ను సూచిస్తుంది. ఇక ఏపీకి మాత్రమే పరిమితమైన మూడో పద్ధతి. యెల్లో మీడియాను గమనించడం. సునామీ, భూకంపాలు వచ్చే ముందు కొన్ని రకాల జంతువులు, పక్షులు విచిత్రంగా ప్రవర్తిస్తాయి. తమకు ఇష్టంలేని ప్రభుత్వం రాబో తున్నదని నిర్ధారణ కాగానే యెల్లో మీడియా ప్రవర్తన కూడా జుగుప్సాకరంగా మారిపోతుంది. ఇదొక లిట్మస్‌ టెస్ట్‌.

ఇప్పుడు యెల్లో మీడియా ప్రవర్తిస్తున్న తీరును బట్టి కూడా వైసీపీ భారీ విజయాన్ని అంచనా వేసుకోవచ్చు. పేద పిల్లలకు మంచి చదువులు వద్దట. ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇస్తే చెడి పోతారట, సంపన్నుల పిల్లలకిస్తే ఫరవాలేదు. వారు చెడిపోరు. వారు పుట్టుకతోనే సద్బుద్ధి కలిగి ఉంటారు. వారు సజ్జనులు. దుర్జనులైన అలగా జనానికి ట్యాబ్‌లు ఇస్తే తక్షణం చెడిపోతారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వాళ్లను చెడగొడుతున్నదట. పైగా ఈ ప్రభుత్వం పన్నులు వేస్తున్నదట. ఆ అధికారం ఒక్క చంద్ర బాబుకే ఉండాలట! ఈ రకమైన యెల్లో మీడియా విపరీత ప్రవర్తనను తెలుగు పాఠక జనం ఇంకో వంద రోజులు భరించ వలసి ఉంటుంది.

మరోపక్క వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూల్‌గా తన సామాజిక న్యాయ సిద్ధాంతానికి మరింత పదును పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల మార్పు చేర్పులు చేసిన 11 సీట్లను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇందులోనే బీసీలకు మరో రెండు సీట్లు పెంచారు. గెలుపు మీద పూర్తిస్థాయి విశ్వాసం ఉన్నవారే ఇటువంటి ప్రయోగాలకు సిద్ధమవుతారు. రెండోసారి గెలుపు కోసం మాత్రమే కాదు, సుదీర్ఘ ఇన్నింగ్స్‌కే జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్న దనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఆత్మవిశ్వాసం ఒక్క రైతాంగంలోనే కాదు. వెనుకబడి పోయిన అన్ని వర్గాల్లోనూ కనిపిస్తున్నది. వెన్నెముకలు నిటారుగా నిలబడుతున్నవి. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో జగన్‌ ప్రభుత్వపు విప్లవ శంఖారావం పేద వర్గాలను ఉత్తేజితం చేస్తున్నది. సాధికార రథయాత్ర లతో వారిప్పుడు జాగృతమవుతున్నారు. పైసా ఖర్చు లేకుండా పాతిక లక్షల విలువైన వైద్య సేవలను పెద్దా సుపత్రుల్లో పొందగలిగే అవకాశం ఇప్పుడు రాష్ట్రంలోని 90 శాతం ప్రజలకు ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో అందుబాటులో ఉన్నది. ఇంత పెద్ద ఉచిత పథకం ఇంకెక్కడా లేదు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత పటిష్ఠంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు తయారయ్యాయి. ఫ్యామిలీ డాక్టర్‌ బృందాలు పల్లెపల్లెనా పర్యటిస్తున్నాయి. అన్ని స్థాయి ల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఔట్‌ పేషంట్ల సంఖ్య యాభై నుంచి వందశాతం పెరిగింది. ఈ పెరుగుదల అక్కడ లభిస్తున్న వైద్యసేవల నాణ్యతా ప్రమాణాలకు సూచిక.

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విద్యా విధానంఇప్పటికే జాతీయ – అంతర్జాతీయ స్థాయిలో ప్రశంస లనందుకుంటున్నది. నిరుపేద కుటుంబాల్లో పుట్టిన బిడ్డలు ఐక్యరాజ్య సమితి వేదికపై నిలబడి తమ గళాన్ని వినిపించడం సంచలనాన్ని సృష్టించింది. పెద్దపెద్ద నగరాల్లో సంపన్నుల సంతానానికి మాత్రమే లభించే నాణ్యమైన చదువును సర్కారు బడుల్లో పేద పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా సమకూర్చింది.

మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని చాలా సంస్థలు చెప్పాయి. అందరిలోకీ సీట్లసంఖ్యను వాస్తవానికి అతి దగ్గరగా టైమ్స్‌నౌ – ఈటీజీ గ్రూప్‌ అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 65, బీఆర్‌ఎస్‌కు 41, బీజేపీకి 7, ఎమ్‌ఐఎమ్‌కు 6 సీట్లు వస్తాయని ఈ గ్రూప్‌ అంచనా వేసింది. 96 శాతం కచ్చితత్వాన్ని నిరూపించుకున్నది. టైమ్స్‌ నౌ – ఈటీజీ గ్రూప్‌ తాజా సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ సీట్లకు గాను వైసీపీ 24 నుంచి 25 సీట్లను గెలుచు కోబోతున్నది. టీడీపీకి సున్నా నుంచి ఒక్క సీటు వరకు లభించే అవకాశం ఉన్నది. అంటే టీడీపీ మహా అయితే ఒక్క సీటు గెలుచుకుంటుంది.

ఈ సీట్లను అసెంబ్లీ స్థానాల లెక్కలోకి అనువదిస్తే ఫలితం సుస్పష్టం. గతంలో గెలిచిన 151 కంటే పైమాటే తప్ప తగ్గే అవ కాశం ఉండదు. కర్ణాటక ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిన సంస్థల్లో పొలిటికల్‌ క్రిటిక్‌ ఒకటి. ఆ సంస్థ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సర్వే చేసి గత ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఓట్ల శాతాన్ని యథాతథంగా నిలబెట్టుకుంటుందని నిర్ధారించింది. టీడీపీ కంటేవైసీపీ 11 శాతం ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటుందని చెప్పింది. 2019 ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతా యని అర్థం. ఈ పరిస్థితి యెల్లో ముఠాకు అర్థమైనందు వల్లనే అది నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తిస్తున్నది.

- వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement