music launch
-
కత్రినా కైఫ్ 'ఫోన్ బూత్' మూవీ ఆడియో లాంఛ్ (ఫొటోలు)
-
Kamal haasan- Simbu: శింబు కోసం కమల్ హాసన్
మానాడు సక్సెస్ తర్వాత శింబు కథానాయకుడిగా నటించిన చిత్రం వెందు తనిందదు కాడు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. విన్నై తాండి వరువాయా, అచ్చం యన్బదు మడమయడ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత శింబు, గౌతమ్ మీనన్‌ల కాంబోలో వస్తున్న చిత్రం ఇది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలోని కాలత్తుకు నీ వేనుం అనే పాట, ఏఆర్ రెహ్మాన్ పాడిన మరక్కుమా నెంజమ్ అనే పాట ఇప్పటికే విడుదలై సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. ఐసరి గణేష్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 15వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. కాగా చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని సెప్టెంబర్ రెండవ తేదీ చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ సంగీత కచేరి నిర్వహించబోతున్నట్లు వర్గాలు తెలిపారు. కాగా, ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనాలని నిర్మాత ఐసరి గణేష్ మంగళవారం కమలహాసన్‌ను స్వయంగా కలిసి ఆహ్వానించారు. చదవండి: (కోబ్రాపై భారీ అంచనాలు.. కాలేజీ యాజమాన్యానికి సెలవు కోసం విద్యార్థుల లేఖ) -
శంకర్ 'ఐ' ఆడియో ఫంక్షన్‌కు హాలీవుడ్ హీరో
చెన్నై: సంచలన తమిళ దర్శకుడు శంకర్ తాజా చిత్రం 'ఐ' ఆడియో పంక్షన్‌కు హాలీవుడ్ యాక్షన్ స్టార్ ఆర్నాల్డ్ ష్క్వార్జ్నెగ్గర్ వస్తున్నారు. చెన్నైలో ఈ నెల 15న జరిగే ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ష్క్వార్జ్నెగ్గర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 32 సెకెన్ల నిడివిగల యూ టూబ్ వీడియోలో తన అభిమానులనుద్దేశించి మాట్లాడారు. 'అద్భుతమైన చిత్రాన్ని తీసిన గొప్ప దర్శకుడు శంకర్‌కు నా అభినందనలు. ఐ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొంటున్నా. ఈ ఈవెంట్ విజయవంతమవుతుంది' అని ష్క్వార్జ్ నెగ్గర్ అన్నారు. విక్రమ్ హీరోగా నటించిన ఐ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ స్వరాలందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో మనోహరుడు పేరుతో విడుదల చేస్తున్నారు. -
'కర్లే ప్యార్ కర్లే' చిత్రం ఆడియో