Muskaan
-
రామాయణం చదివైనా బాగుపడు తల్లీ
ముస్కాన్ రస్తోగీ(muskaan rastogi).. గత పదిరోజులుగా ఇటు మీడియా అటు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పేరు ఇది. ప్రాణంగా ఆమెను ప్రేమించిన భర్తను.. గంజాయి మత్తులో ప్రియుడితో కలిసి జోగుతూ ముక్కలు చేసి, ఆపై డ్రమ్ములో ఆమె దాచిన వైనం ‘మీరట్ ఉదంతంగా’గా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఆమెలో సత్పరివర్తన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెబుతున్నారు ఎంపీ అరుణ్ గోవిల్.టీవీ రామాయణంతో అన్ని భాషల ప్రజలకు చేరువైన నటుడు అరుణ్ గోవిల్.. మీరట్ ఎంపీ అనే సంగతి తెలిసిందే కదా. తాజాగా.. ఆదివారం చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు వెళ్లి అక్కడి ఖైదీలకు ఆయన 1,500 రామాయణ ప్రతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తన నుంచి రామాయణం ప్రతి అందుకున్న వెంటనే ముస్కాన్ భావోద్వేగానికి గురైందని ఆయన అన్నారు.‘‘రామాయణం పుస్తకాన్ని(Ramayana Book) అందుకోగానే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయ్. ఇది ఆమె జీవితంలో కచ్చితంగా చీకట్లు పారదోలుతుందని చెప్పాను. ఇది చదివైనా జీవితంలో బాగుపడమని.. మంచి మార్పు రావాలని కోరుకుంటున్నట్లు ముస్కాన్‌తో అన్నాను’’ అని అరుణ్ గోవిల్(Arun Govil) మీడియాకు వివరించారు. ముస్కాన్‌తో పాటు ఈ కేసులో సహా నిందితుడు సాహిల్ శుక్లా కూడా రామాయణం అందుకున్నాడట. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా 11 లక్షల రామాయణ కాపీలను పంచాలని అరుణ్ గోవిల్ నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలోనే ఇంటింటికీ రామాయణం అనే కార్యక్రమం చేపట్టిన ఆయన.. ఇలా ఖైదీలకూ పంపిణీ చేశారు.మీరట్‌లో మార్చి 4వ తేదీన సౌరభ్ తివారీ హత్య జరిగింది. భర్తను ముక్కలు చేసి డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో సీల్ చేసిందామె. ఆపై ప్రియుడితో కలిసి జాలీగా ట్రిప్పులు వేసింది. భర్త మృతదేహాన్ని మాయం చేసే క్రమంలో దొరికిపోతామనే భయంతో తన తల్లిదండ్రులకు ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో వాళ్లే ఆమెను దగ్గరుండి పోలీసులకు అప్పజెప్పారు. ఈ కేసులో భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు తరలించారు. మొదట్లో తమకు భోజనం వద్దని.. గంజాయి కావాలని.. ఇద్దరినీ ఓకే బ్యారక్ ఉంచాలంటూ జైలు సిబ్బందితో గొడవలకు దిగారు వాళ్లు. ఈ క్రమంలో వైద్యుల పర్యవేక్షణలో వాళ్లకు చికిత్స అందింది. అయితే వైద్య పర్యవేక్షణ ముగియడంతో అధికారులు వాళ్లకు పనులు అప్పజెప్పబోతున్నారు. రిమాండ్ మీద ఉన్న వీళ్లు.. కోర్టు విచారణ పూర్తయ్యేదాకా కుట్లు అల్లికలతో ముస్కన్, కూరగాయాలు పండిస్తూ సాహిల్ గడపబోతున్నారు.అది ఏఐ జనరేటెడ్ వీడియో!రిమాండ్ ఖైదీగా ఉన్న ముస్కాన్ ఓ పోలీస్ అధికారితో ఏకాంతంగా గడిపినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ అయ్యింది. అయితే అది నకిలీ వీడియో అని.. తన ప్రతిష్టకు భంగం కలిగించే యత్నమని చెబుతూ సదరు అధికారి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. అది ఏఐ జనరేటెడ్ వీడియోగా తేల్చారు. అంతేకాదు.. దానిని అప్లోడ్ చేసిన అకౌంట్‌ను గుర్తించిన పోలీసులు, దీని వెనుక ఉన్నవాళ్లను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు.. ముస్కాన్, సాహిల్ పేరిట కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతుండడం విశేషం. -
మేము ఇద్దరం జైల్లో కూడా కలిసే ఉంటాం..!
ఉత్తర ప్రదేశ్ మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ మర్డర్ కేసులో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు వెలుగులోకి చూస్తుండగా.. ముస్కాన్ రాక్షసత్వంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. భర్తను చంపాక అతనితో జాలీగా ట్రిప్పులు వేసిన ముస్కాన్.. అతని పుట్టినరోజుతో పాటు హోలీ పార్టీ కూడా జరుపుకుంది. అయితే ఈ కేసులో వీరద్దర్నీ అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. దీనిలో భాగంగా చౌదరి చరణ్ సింగ్ జైల్ లో ఉన్న వీరిని పోలీసులు విచారిస్తున్నారు.జైల్లో కూడా కలిసే ఉంటామని..భర్తను హత్య చేసి జైలు పాలయ్యానన్న కనీస పశ్చాత్తాపం కూడా ముస్కాన్ లో కనిపించడం లేదు. జైల్లో కూడా తామిద్దరం కలిసే ఉంటామని పట్టుబట్టారు. ఇద్దర్నీ వేరు వేరు సెల్ లో వేయకండి.. తాము ఇద్దరం ఒకే చోట ఉంటామంటూ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇది జైలు నియమాలకు విరుద్ధమని, ఇలా ఒక పురుషుడు, ఒక మహిళ కలిసి ఉండటం సాధ్యం కాదని సదరు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ వారిద్దరితో మిగతా ఖైదీలు ఎవరూ మాట్లాడలేదని జైలు సూపరెండెంట్ విరేష్ రాజ్ శర్మ తెలిపారు. తొలిరోజు వీరు ఏమీ తినలేదని, తర్వాత నుంచి భోజనం చేస్తున్నారన్నారు. అయితే ఒకే సెల్ లో ఉంచాలని కోరినట్లు విరేష్ రాజ్ శర్మ పేర్కొన్నారు. ఇది విరుద్దం కావడంతో వారి అభ్యర్థనను తిరస్కరించినట్లు చెప్పారు. వీరిద్దరికి సెపరేట్ బారక్ లు ఇచ్చామని, దాంతో వారు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఉండదన్నారు.వీరిద్దరూ డ్రగ్స్‌కు బానిసలువీరిద్దరూ డ్రగ్స్ కు బానిసలైన సంగతని విరేష్ రాజ్ శర్మ పేర్కొన్నారు. మెడికల్ రిపోర్ట్ లు ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా వీరికి ట్రీట్ మెంట్ కు కూడా ఇప్పించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఇండియన్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి తెలియజేశారు.మాకు లాయర్ ను ఏర్పాటు చేయండితమ తరఫున వాదించడానికి లాయర్ కావాలని విజ్ఞప్తి చేశారు ఆ నిందితులిద్దరూ. తమ కుటుంబానికి న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే స్థోమత లేదని, అందుచేత తమ తరఫున వాదించడానికి ప్రత్యేక గవర్నమెంట్ లాయర్ ను ఏర్పాటు చేయాలని చెప్పినట్లు మరో సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.#WATCH | Saurabh Rajput murder case | On accused Muskan Rastogi and Sahil Shukla, Senior Jail Superintendent Viresh Raj Sharma says, "They arrived 3 days ago and they said that they be lodged together or nearby barracks. They were told that as per the system in jail, there is no… pic.twitter.com/5vKpgzXEe0— ANI (@ANI) March 23, 2025ప్రియుడితో కలిసి భర్త హత్యసౌరభ్ గుండెల్లో కత్తితో మూడు సార్లు పొడిచింది. కత్తి లోతుగా అతడి గుండెల్లో దిగబడింది. ముస్కాన్ అతి దారుణంగా సౌరభ్ గుండెను చీల్చి పడేసింది. తర్వాత తలను శరీరంనుంచి వేరు చేసింది. శరీరాన్ని ముక్కలుముక్కలుగా కొసి పడేసింది. ముక్కల్ని డ్రమ్‌లో పడేసింది. ముస్కాన్ చేసిన దారుణం తెలిసి డాక్టర్లే షాక్ అయిపోయారు.ఇక, పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. ముస్కాన్ పినతల్లిని కలిశారు. ఆమె ముస్కాన్‌పై ఫైర్ అయింది. చేసిన ఘోరానికి తన కూతురికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేసింది. ఈ దారుణంలో ముస్కాన్ హస్తంతో పాటు ఆమె ప్రియుడు సాహిల్ హస్తం కూడా ఉంది. ఇద్దరూ కలిసి, పక్కా ప్లాన్ ప్రకారం సౌరభ్‌ను చంపేశారు. మృతదేహాన్ని కనిపించకుండా చేసి తప్పించుకుందామనుకున్నారు. చాలా నాటకాలు ఆడారు. అవేవీ ఫలించలేదు. సౌరభ్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సౌరభ్ గురించి ఎంక్వైరీ చేయగా.. మర్డర్ విషయం బయటపడింది.ప్రేమ పెళ్లి.. ప్రియుడి కోసం..ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ అదే ప్రాంతానికి చెందిన ముస్కాన్ రస్తోగి ప్రేమించుకున్నారు. 2016లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్యతో గడపడానికి టైం దొరకటం లేదని నేవీలో ఉద్యోగం మానేశాడు. ఇంట్లో గొడవలు అవ్వటంతో భార్యతో కలిసి వేరుకాపురం పెట్టాడు. 2019లో వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. బిడ్డపుట్టిన తర్వాత సౌరభ్‌కు ఓ దారుణమైన విషయం తెలిసింది. ముస్కాన్.. ఆమె స్నేహితుడు సాహిల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. ఈ విషయమై సౌరభ్, ముస్కాన్‌ల మధ్య గొడవలు అయ్యాయి. పరిస్థితి విడాకుల వరకు వెళ్లింది. కూతురు కోసం సౌరభ్ వెనక్కు తగ్గాడు. మళ్లీ జాబ్‌లో జాయిన్ అయ్యాడు. 2023లో విదేశానికి వెళ్లిపోయాడు. 2025 ఫిబ్రవరి నెలలో కూతురి పుట్టిన రోజు ఉండటంతో ఇండియా వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్, సాహిల్ .. అతడ్ని చంపేశారు. ఆరేళ్ల చిన్నారి తండ్రి హత్యను కళ్లారా చూసింది.. తన తల్లి మరో వ్యక్తితో కలిసి తండ్రిని ప్లాస్టిక్ డ్రమ్ములో దాచడం గమనించింది. అయితే, అది దాచడం కాదని, నాన్నను చంపేశారని ఆ చిన్నారికి తెలియదు. మీ నాన్న ఏరమ్మా అని అడిగిన చుట్టుపక్కల వాళ్లకు ‘డ్రమ్ములో ఉన్నాడు’ అంటూ చెప్పింది. ఆ మాటల వెనకున్న విషాదం తెలియక చిన్నపిల్ల ఏదో చెబుతోందని వారంతా అనుకున్నారు. కానీ నిజంగానే పాప తండ్రి నిర్జీవంగా మారి డ్రమ్ములో సమాధి అయ్యాడని వారు ఊహించలేకపోయారు. -
‘రాగల 24 గంటల్లో’ ఫస్ట్ లుక్
-
‘రాగల 24 గంటల్లో’ ఫస్ట్ లుక్
‘‘ఆకాశవాణి.. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది’ అంటూ రేడియోలో వార్తలు వింటుంటాం. ఆ విధంగా రాగల 24 గంటల్లో చాలా ఫేమస్. బాగా పాపులర్ అయిన ‘రాగల 24 గంటల్లో’ అనే పదాలను తన సినిమా టైటిల్‌గా పెట్టుకున్నారు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. సత్యదేవ్, ఇషా రెబ్బా జంటగా శ్రీరామ్, ముస్కాన్ సేథ్, గణేశ్ వెంకట్రామన్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ కానూరి నిర్మాత. ‘ఢమరుకం’ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరరెక్కిన ఈ సినిమా మొదటి పోస్టర్‌ను నిర్మాత సి.కల్యాణ్, రెండో పోస్టర్‌ను శ్రీనివాస్ రెడ్డి బావ, పులివెందులకు చెందిన వ్యాపారవేత్త దంతులూరి కృష్ణ విడుదల చేశారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘వెరైటీ టైటిల్స్‌తో ఆసక్తికరమైన చిత్రాలను తీసి విజయాలను సాధించే దర్శకుడు శ్రీను. ఈ సినిమాను అద్భుతమైన స్క్రీన్‌ప్లే బేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దారని నాకు తెలుసు. ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన శ్రీనివాస్ కానూరికి మంచి పేరుతో పాటు లాభాలు రావాలి’’ అన్నారు. ‘‘నేను ఈ సినిమా రషెస్ చూశా. సత్యదేవ్, ఇషా, శ్రీరామ్‌ల నటన సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ఆర్టిస్ట్‌ల నుంచి నటన రాబట్టడం మా బావకు వెన్నతో పెట్టిన విద్య’’ అన్నారు దంతులూరి కృష్ణ. శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ కానూరి, సంగీత దర్శకుడు రఘు కుంచె, ‘గరుడవేగ’ ఫేమ్ కెమెరామెన్ అంజి, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారి ఆలోచనకు అత్యున్నత పురస్కారం!
చుట్టూ మురికివాడలు. ఎటు చూసినా పేదరికం. అయినా తొమ్మిదేళ్ల ముస్కాన్ అహిర్వార్ వెనుకంజ వేయలేదు. తన ఆలోచనే ఆలంబనగా చేసుకొని మురికివాడల్లోని తనలాంటి పిల్లలకు చదువు చెప్పేందుకు కృషి చేసింది. తన దగ్గర ఉన్న పుస్తకాలతో భోపాల్ నగరంలోని మురికివాడలోనే ఓ గ్రంథాలయాన్ని తెరిచింది. 121 పుస్తకాలతో తనలాంటి పేదపిల్లలు చదుకోవడానికి ఓ నీడ కల్పించింది. చిన్నారి ముస్కాన్ కృషి అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలను తెచ్చిపెట్టింది. తాజాగా కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక సలహా సంస్థ నీతి ఆయోగ్ చిన్నారి ముస్కాన్ కృషిని గుర్తించింది. ఆమెను 'థాట్ లీడర్' పురస్కారానికి ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 12మంది ఈ పురస్కారానికి ఎంపికవ్వగా.. అందులో అతి పిన్నవయస్కురాలు ముస్కానే. రియో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన రెజ్లర్ సాక్షి మాలిక్ చేతులమీదుగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ముస్కాన్ ఈ పురస్కారాన్ని అందుకున్నది.