Muslims reservation
-
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
న్యూఢిల్లీ: భారత్‌లోని హిందువుల జనాభా తగ్గుతోందని, మైనారిటీల జనాభా క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యయనంలో తేలింది. 1950 నుంచి 2015 మధ్య దేశంలోని మొత్తం జనాభాలో హిందువుల జనాభా 7.8 శాతం తగ్గినట్లు వెల్లడయ్యింది. 1950లో దేశ జనాభాలో హిందువులు 84 శాతం మంది ఉండగా, 2015 నాటికి దాదాపు 78 శాతానికి పడిపోయినట్లు అధ్యయనం వెల్లడించింది. ఇదే సమయంలో మొత్తం జనాభాలో ముస్లింల జనాభా 9.84 శాతం నుంచి 14.09 శాతానికి చేరింది. -
ఆ నినాదాలను త్యజించే దమ్ము సంఘ్ పరివార్‌కు ఉందా?
మలప్పురం(కేరళ): స్వాతంత్రోద్యమ వేళ దేశాన్ని ఒకతాటి మీదకు తెచి్చన జాతీయస్థాయి నినాదాలు పురుడుపోసుకోవడంలో ముస్లింల పాత్ర కూడా ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. సంఘ్ పరివార్ శ్రేణుల్లో ఎప్పుడూ ప్రతిధ్వనించే రెండు నినాదాలను వాస్తవానికి ముస్లింలు తొలిసారిగా ఎలుగెత్తి చాటారని విజయన్ అన్నారు. వివాదాస్పద పౌరసత్వ(సవరణ)చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) నేతృత్వంలో నాలుగురోజులుగా జరుగుతున్న ర్యాలీలో విజయన్ పాల్గొని ప్రసంగించారు. ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే మలప్పురం జిల్లాలోనే ఈ సభ జరగడం గమనార్హం. ‘‘ముస్లిం పాలకులు, సాంస్కృతిక సారథులు, ముస్లింలు ఉన్నతాధికారులు ఎందరో దేశ చరిత్ర, స్వతంత్ర సంగ్రామంలో పాలుపంచుకున్నారు. వీటిపై ఏమాత్రం అవగాహన లేని సంఘ పరివార్ నేతలు ఇక్కడికొచ్చి భారత్ మాతాకీ జై అని నినదించాలని డిమాండ్లుచేస్తున్నారు. వాస్తవానికి భారత్ మాతాకీ జై, జైహింద్ అని నినదించింది ముస్లింలని సంఘ్ పరివార్‌కు తెలీదనుకుంటా. తెలిస్తే ఆ నినాదాలను ఇవ్వడం సంఘ్ పరివార్ మానుకుంటుందా? అజీముల్లా ఖాన్ భారత్ మాతాకీ జై అంటే, అబిద్ హసన్ అనే భారత దూత ‘జై హింద్’ అని నినదించారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తనయుడు దారా షికోహ్ సంస్కృతంలో ఉన్న 50 ఉపనిషత్తులను పర్షియన్లోకి తర్జుమాచేశారు. అలా భారతీయ రచనలు విశ్వవ్యాప్తమయ్యేలా తన వంతు కృషిచేశారు. ఇవేం తెలియని సంఘ్ నేతలు భారత్‌లోని ముస్లింలను పాకిస్తాన్‌కు పంపేయాలని మొండిపట్టు పడుతుంటారు. సీఏఏతో ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని మోదీ సర్కార్ కుట్ర పన్నింది. వీటిని కేరళ పౌరులు సహించరు’’ అన్నారు. సీఏఏ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేయంపై కాంగ్రెస్‌కు పెద్దగా ఆసక్తి లేదని ఆరోపించారు. హిట్లర్ నియంతృత్వ పోకడల నుంచే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు పురుడుపోసుకున్నాయని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు దేశ అంతర్గత శత్రువులని ఆర్ఆర్ఎస్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన ఎంఎస్ గోల్వాల్కర్ గతంలో ఒక పుస్తకంలో వ్యాఖ్యానించారని విజయన్ గుర్తుచేశారు. -
ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
బాన్సువాడ/కామారెడ్డి : ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పించడానికి ముఖ్య మంత్రి కేసీఆర్ అన్ని విధాలా చర్యలు తీసుకొంటున్నారని, కేంద్రంలో కీలకపాత్ర పోషి స్తే రిజర్వేషన్ సాధిస్తామని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గార్డెన్లో, బాన్సువాడలోని భారత్ గార్డెన్ ఫంక్షన్ హాల్లలో టీఆర్ఎస్ నిర్వహించిన ముస్లింల సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. ఆయా సభల లో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ఏనా డూ బీజేపీతో కలవలేదన్నారు. స్వాతం త్య్రం వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు కాం గ్రెస్, బీజేపీలు దేశానికి చేసిందేమీ లేదన్నా రు. తెలంగాణలో 17 స్థానాల్లో గెలిపిస్తే 170 స్థానాలతో సమానంగా పోరాటం చేస్తామన్నారు. ఐదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వైపు దేశం మొత్తం చూస్తోందని, ఆయన ప్రధానమంత్రి అయితే దేశం ఎంతో అభివృద్ధి చెంది బంగారు భారతదేశంగా మారుతుంద ని యావత్ దేశ ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రధాని అయితే కశ్మీర్ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని ఆ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు. కాంగ్రెస్ వారు ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల ఒరిగిందేమీ లేదని మహమూద్ అలీ పేర్కొన్నారు. సచార్ కమిటీ నివేదికను పక్కన పెట్టారన్నారు. రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం అమ్మాయిల వివాహానికి కేవలం రూ. 25 వేలు ఇచ్చి ప్రచారానికి ఫొటోలు దిగేవారని, తాము రూ. 1,00,116 ఇస్తున్నా ప్రచారం చేసుకోవడం లేదని పేర్కొన్నారు. ఐదేళ్లలో రూ. 634 కోట్లు షాదీ ముబారక్‌లో లబ్ధిదారులకు అందించామన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. మరోసారి ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రాజేశ్వర్, సుభాష్‌రెడ్డి, టీఆర్ఎస్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబొద్దీన్, మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరి సుష్మ, వైస్ చైర్మన్ మసూద్‌అలీ, నాయకులు ముస్తాక్ హుస్సేన్, జహీరుద్దీన్, అసద్, నేరెళ్ల ఆంజనేయులు పాల్గొన్నారు. -
ముస్లింలకు ఒరిగిందేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, ఎన్నికలకు ముందు కేసీఆర్ మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని నమ్మించి ఓట్లు దండుకున్నాడని, రాబోయే ఎన్నికల్లో ముస్లింలు గుణపాఠం చెప్పడం ఖాయమని అల్‌ఇండియా సున్ని ఉలేమా బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా హమీద్ హుస్సేన్ షుత్తరీ విరు చుకుపడ్డారు. బుధవారం డబీర్‌పురాలోని సంస్థ కార్యాల యంలో రాబోయే ఎన్నికలకు సున్ని ఉలేమా బోర్డు రూపొందించిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా షుత్తరీ మాట్లాడుతూ, ప్రతి ఏటా మైనార్టీలకు కేటాయించే బడ్జెట్ నాలుగేళ్లలో ఏ సంవత్సరం కూడా 40% కంటే ఎక్కువ విడుదల కాలేదన్నారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తానని హామీఇచ్చిన కేసీఆర్ ప్రస్తుతం ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ ముస్లింల ప్రయోజనాలకోసం పాటుపడకుండా తమ వ్యక్తిగత ప్రయోజనాలకు కోసం పని చేస్తుందన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలతో ముస్లింల సంక్షేమం, అభివృద్ధి జరగలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ సెక్యులర్ పార్టీ తాము ప్రతిపాదిస్తున్న అంశాలకు పూర్తి స్థాయిలో అంగీకరిస్తే అ పార్టీకి మద్ధతు ఇస్తామని తెలిపారు. వక్ఫ్ బోర్డులో జరుగుతున్న అక్రమాలపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు. ముస్లింలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, ఉర్దూ మీడియం స్కూళ్లు, కాలేజీల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు తారీక్ ఖాద్రీ, అబ్దుల్ వాసే తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ హయాంలో ముస్లింలకు చేయూత: అక్బరుద్దీన్ ఓవైసీ
ఎంఐఎం పోరాట ఫలితమే : అక్బరుద్దీన్ ఓవైసీ ఎదులాపురం, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో ముస్లింలకు రిజర్వేషన్, స్కాలర్‌షిప్‌ల పెంపు జరిగిందని, ఇది ఎంఐఎం పార్టీ పోరాటాల ఫలితమేనని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ తదితర పార్టీలన్నీ ముస్లింలను కేవలం ఓటుబ్యాంకు కోసమే వినియోగించుకుంటున్నాయే తప్ప వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంక్షలు లేని తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరారు. -
వైఎస్ వల్లే ముస్లింలకు రిజర్వేషన్లు
సిద్దిపేటజోన్, న్యూస్‌లైన్: ఇద్దరు నేతల చొరవ కారణంగానే ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయని ఎంఐఎం నాయకుడు, బహదూర్‌పురా ఎమ్మెల్యే మోజంఖాన్ స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ కృషి ఫలితంగానే రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయన్నారు. శనివారం ఆయన సిద్దిపేటకు వచ్చిన సందర్భంగా పలు వార్డుల్లో ఎంఐఎం పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీల పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందన్నారు. 2004 సంవత్సరానికి ముందు ముస్లింల పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. 2004 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ముస్లింలకు సముచిత రిజర్వేషన్లు ఇవ్వాలని ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకవచ్చారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్న వైఎస్ హామీ ఇచ్చి ఆ వెంటనే హామీని నెరవేర్చారని కొనియాడారు. నూతన రిజర్వేషన్లతో ప్రస్తుతం మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి గౌరవ ప్రదంగా బతుకుతున్నారని తెలిపారు. సామాన్యులకు దూరమైన కార్పొరేట్ విద్య అందుబాటులోకి రావడంతోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో వారికి ఎంతో లబ్ధిచేకూరిందన్నారు. హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తోందని మోజంఖాన్ అన్నారు. జాతీయ స్థాయిలో కూడా విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యే మోజంఖాన్‌కు స్థానిక కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో ప్రధాన వీధులగుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సాజీద్‌పురా, నసీర్‌నగర్, చార్వదాన్, భారాహిమామ్లలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఒవైసీ చౌక్, సలార్చౌక్ల వద్ద కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.