
వైఎస్సార్ హయాంలో ముస్లింలకు చేయూత: అక్బరుద్దీన్ ఓవైసీ
ఎంఐఎం పోరాట ఫలితమే : అక్బరుద్దీన్ ఓవైసీ
ఎదులాపురం, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో ముస్లింలకు రిజర్వేషన్, స్కాలర్‌షిప్‌ల పెంపు జరిగిందని, ఇది ఎంఐఎం పార్టీ పోరాటాల ఫలితమేనని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్‌ఎస్ తదితర పార్టీలన్నీ ముస్లింలను కేవలం ఓటుబ్యాంకు కోసమే వినియోగించుకుంటున్నాయే తప్ప వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంక్షలు లేని తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరారు.