Muttiah
-
మాస్.. మాస్‌గా..!
విశాల్, శ్రీదివ్య జంటగా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘రాయుడు’. ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ అధినేత జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. విశాల్ కెరీర్లో ‘రాయుడు’ క్రేజీ చిత్రమవుతుంది. మేలో పాటలను, అదే నెల 20న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘రఘువరన్ బీటెక్’ చిత్రానికి దర్శకత్వం వహించిన వేల్రాజ్ ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ అందించడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమాన్, సమర్పణ: విశాల్. -
అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి
అనుమానాస్పదస్థితిలో ఓ ఫారెస్టు కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మిర్యాలగూడలోని వాపల్లినగర్లో మంగళవారం ఉదయం జరిగింది. నకిరేకల్ మండలం సందుపల్లి గ్రామానికి చెందిన నల్లగొండ ముత్తయ్య(45) ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మిర్యాలగూడ వాపల్లినగర్లో ఆమెతో సహ జీవనం చేస్తున్నాడు. మొదటి భార్య సందుపల్లిలో నివాసం ఉంటుంది. ఈ నేపధ్యంలో మంగళవారం తెల్లవారుజామున సహజీవనం చేస్తున్న మహిళ ఇంటిగేటుకి సెల్‌ఫోన్ వైర్‌తో ఉరివేసుకున్నాడు. అయితే మృతిడి ఒంటి తీవ్రగాయాలు ఉండటంతో ఆయన్ని ఎవరో హత్య చేసి ఉంటారని స్థానికులకు భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బావతో పెళ్లి జరిపించండి.. ప్లీజ్
ప్రేమించి మోసం చేసిన తన సొంత బావతో వివాహం జరిపించాలని కోరతూ.. ఓ మైనర్ బాలిక సోమవారం బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. పెళ్లికి ముందే గర్భవతిని చేసి ఇప్పుడు తనకు సంబంధం లేదని బుకాయిస్తున్న తన బావతోనె వివాహం జరిపించాలని ప్రాధేయపడుతోంది. వివరాలు.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరేడు గ్రామానికి చెందిన బాలిక(17) పదో తరగతి వరకు చదువుకుంది. ఇంటి పక్కన ఉంటూ బీటెక్ పూర్తిచేసిన బావ కోట ముత్తయ్యను ప్రేమించింది. మూడేళ్లుగా వీరి మధ్య ప్రేమాయణం సాగింది. అనంతరం బాలిక గర్భవతి అని తేలడంతో.. యువకుడు ముఖం చాటేశాడు. దీంతో బాలిక విషయం తల్లిదండ్రులకు తెలిపింది. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ముత్తయ్యపై చింతకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని పిలిచి విచారణ చేపట్టగా.. తనకు బాలిక గర్భానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో.. అతన్ని రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం బాలికను అబార్షన్ చేయించుకోమని బలవంతం చేస్తుండటంతో.. ఆమె నగరంలోని బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. తన కడుపున పుట్టే బిడ్డకు తండ్రిగా ఉండటంతో పాటు మైనార్టీ తీరగానే తనను పెళ్లి చేసుకునే విధంగా తన బావను ఒప్పించాలని బాలిక వేడుకుంటోంది. -
చెట్టినాడ్ గ్రూప్‌లో కుటుంబపోరు
చెన్నై: దక్షిణాదికి చెందిన ప్రముఖ పారిశ్రామిక గ్రూప్‌ల్లో ఒకటైన చెట్టినాడ్ గ్రూప్ ఆధిపత్యానికి కుటుంబ పోరు తారాస్థాయికి చేరింది. ప్రధానంగా సిమెంటు వ్యాపారం చేసే ఈ రూ. 4,000 కోట్ల గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ ఎంఏఎం రామస్వామిని తప్పించడంలో ఆయన దత్తపుత్రుడు కృతకృత్యులయ్యారు. ఫ్లాగ్షిప్ కంపెనీ చెట్టినాడ్ సిమెంట్ కార్పొరేషన్ డెరైక్టర్‌గా రామస్వామిని ఎంపిక చేయకుండా పక్కన పెడుతూ బుధవారం బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందుకు వాటాదారులు సైతం అంగీకరించారు. కంపెనీల చట్టం 2013లోని 152 సెక్షన్ ప్రకారం రొటేషన్ పద్ధతిలో 82ఏళ్ల రామస్వామి పదవీ విరమణ చేసినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో డెరైక్టర్‌గా ఎంపిక చేయలేదని తెలిపింది. రామస్వామికి దత్త పుత్రుడు అయిన ఎంఏఎంఆర్ ముత్తయ్య కంపెనీకి ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చైర్మన్ ఎమిరిటస్‌గా...: రామస్వామిని తిరిగి డెరైక్టర్‌గా ఎంపిక చేయలేదని, అయితే చైర్మన్ ఎమిరిటస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారని ముత్తయ్య వాటాదారులకు వివరించారు. లోక్‌సభ మాజీ సభ్యులైన రామస్వామి గుండె సంబంధ నొప్పితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా ఏజీఎంకు హాజరుకాలేకపోయారు. కాగా, ఈ గ్రూప్ ఇటీవలే 0.8 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల ఆంధ్రప్రదేశ్‌లోని అంజనీ పోర్ట్లాండ్ సిమెంట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సీబీఐ అరెస్ట్‌ల నేపథ్యం: రూ. 10 లక్షలు లంచం తీసుకున్న కేసులో చెన్నై రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అయిన ఎం.మను నీతి చోలన్ను సీబీఐ అరెస్ట్ చేసిన ఒక రోజు తరువాత కంపెనీ ఏజీఎంలో రామస్వామిని డెరైక్టర్‌గా ఎంపిక చేయకుండా పక్కనపెట్టడంతో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కంపెనీ అజమాయిషీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న ప్రత్యర్థి వర్గానికి చెక్‌పెట్టేందుకు వీలుగా బుధవారంనాటి ఏజీఎంను రద్దు చేయమంటూ చోలన్కు రామస్వామి లంచం ఇవ్వజూసినట్లు సీబీఐ పేర్కొంది. రామస్వామి స్వల్పకాలంపాటు జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ద్వారా లోకసభలో సభ్యులయ్యారు. కర్ణాటక తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అన్నామలై యూనివర్శిటీకి ప్రోచాన్సలర్గా వ్యవహరించారు. ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయన్న కారణంగా తమిళనాడు ప్రభుత్వం యూనివర్శిటీని చేజిక్కించుకుంది. -
భారీగా గంజాయి పట్టివేత
పాడేరులో 200, గొలుగొండలో 40, చింతపల్లిలో 20 కిలోల స్వాధీనం ముగ్గురు తమిళ వ్యాపారుల అరెస్ట్ జిల్లా రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్, ఎక్సైజ్ శాఖ డెప్యుటీ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు పోలీసులు ఎక్సైజ్ అధికారులు కదిలారు. ఏజెన్సీ నుంచి భారీగా జరుగుతున్న గంజాయి రవాణాను అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు. ఫలితంగా ఏజెన్సీలో మూడు చోట్ల బుధవారం మొత్తం 260 కిలోల గంజాయి దొరికింది. ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఆ నిందితులంతా తమిళనాడుకు చెందిన వ్యాపారులు. పాడేరు : జి.మాడుగుల మండలం మద్దిగరువు ప్రాంతం నుంచి పాడేరు మీదుగా అనకాపల్లికి గంజాయితో వెళ్తున్న జీపును బుధవారం తెల్లవారుజామున పాడేరు ఎక్సైజ్ అధికారులు బొక్కెళ్ళు సమీపంలో పట్టుకున్నారు. అయితే ఆ జీపులో ఉన్నవారు తప్పించుకొని పరారయ్యారు. ఏపీ 35 యు 4353 నంబరుగల జీపును ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. అందులో ఉన్న 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. జీపు రికార్డుల ఆధారంగా నిందితుల ఆచూకీ కనుక్కొంటామని చెప్పారు. ఈ దాడుల్లో మొబైల్ పార్టీ సీఐ ఉపేంద్ర, స్థానిక స్టేషన్ ఎస్సైలు గంగాధరం, జ్ఞానేశ్వరి, హెచ్‌సీలు వర్మ, శ్రీనివాస్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చింతపల్లి రూరల్: ఏజెన్సీ నుంచి తరలిస్తున్న 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు తమిళులను అరెస్ట్ చేసినట్లు అన్నవరం ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు. వాహనాలను తనిఖీ చేస్తుండగా పనసలపాడు గ్రామం వద్ద అనుమానిత వ్యక్తులను తనిఖీ చేశామన్నారు. జి.మాడుగుల మండలం కొక్కిరాపల్లి పంచాయతీ మారుమూల గ్రామాల నుంచి కాలిబాటన వస్తున్నవారి వద్ద 20 కేజీల గంజాయి దొరికిందని చెప్పారు. సుమారు రూ. 40 వేల విలువైన ఆ గంజాయిని స్వాధీనం చేసుకొని, తమిళనాడుకు చెందిన కొటియన్ (35), ముత్తయ్య (39), మురుగేషన్ (45)లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గొలుగొండ: కేడీపేట నుంచి నర్సీపట్నం వైపు తరలిస్తున్న 40 కిలోల గంజాయిని గొలుగొండ పోలీసులు బుధవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. చింతపల్లి మండలం వంగసార గ్రామానికి చెందిన ఎస్.బాల మురళీకృష్ణను అరెస్టు చేశారు. అతను మోటార్ బైక్‌పై గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామని ఎస్సై జోగారావు తెలిపారు.