ప్రేమించి మోసం చేసిన తన సొంత బావతో వివాహం జరిపించాలని కోరతూ.. ఓ మైనర్ బాలిక సోమవారం బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. పెళ్లికి ముందే గర్భవతిని చేసి ఇప్పుడు తనకు సంబంధం లేదని బుకాయిస్తున్న తన బావతోనె వివాహం జరిపించాలని ప్రాధేయపడుతోంది.
వివరాలు.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరేడు గ్రామానికి చెందిన బాలిక(17) పదో తరగతి వరకు చదువుకుంది. ఇంటి పక్కన ఉంటూ బీటెక్ పూర్తిచేసిన బావ కోట ముత్తయ్యను ప్రేమించింది. మూడేళ్లుగా వీరి మధ్య ప్రేమాయణం సాగింది. అనంతరం బాలిక గర్భవతి అని తేలడంతో.. యువకుడు ముఖం చాటేశాడు. దీంతో బాలిక విషయం తల్లిదండ్రులకు తెలిపింది.
ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ముత్తయ్యపై చింతకాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని పిలిచి విచారణ చేపట్టగా.. తనకు బాలిక గర్భానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో.. అతన్ని రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం బాలికను అబార్షన్ చేయించుకోమని బలవంతం చేస్తుండటంతో.. ఆమె నగరంలోని బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. తన కడుపున పుట్టే బిడ్డకు తండ్రిగా ఉండటంతో పాటు మైనార్టీ తీరగానే తనను పెళ్లి చేసుకునే విధంగా తన బావను ఒప్పించాలని బాలిక వేడుకుంటోంది.
బావతో పెళ్లి జరిపించండి.. ప్లీజ్
Published Mon, Apr 4 2016 1:36 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement