అనుమానాస్పదస్థితిలో ఓ ఫారెస్టు కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మిర్యాలగూడలోని వాపల్లినగర్‌లో మంగళవారం ఉదయం జరిగింది. నకిరేకల్ మండలం సందుపల్లి గ్రామానికి చెందిన నల్లగొండ ముత్తయ్య(45) ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మిర్యాలగూడ వాపల్లినగర్‌లో ఆమెతో సహ జీవనం చేస్తున్నాడు.
మొదటి భార్య సందుపల్లిలో నివాసం ఉంటుంది. ఈ నేపధ్యంలో మంగళవారం తెల్లవారుజామున సహజీవనం చేస్తున్న మహిళ ఇంటిగేటుకి సెల్‌ఫోన్ వైర్‌తో ఉరివేసుకున్నాడు. అయితే మృతిడి ఒంటి తీవ్రగాయాలు ఉండటంతో ఆయన్ని ఎవరో హత్య చేసి ఉంటారని స్థానికులకు భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.