Mutual cooperation
-
Russia-North Korea relations: మరింత బలమైన మైత్రీబంధం
సియోల్: పశ్చిమ దేశాల ఆంక్షల కత్తులు వేలాడుతున్నా రష్యా, ఉత్తర కొరియాలు మైత్రిబంధంతో మరింత దగ్గరయ్యాయి. శత్రుదేశం తమపై దాడి చేస్తే తోటి దేశం సాయపడేలా కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపైనా విస్తృతస్తాయి చర్చలు జరిపి కొన్ని కీలక ఉమ్మడి ఒప్పందాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉ.కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ సంతకాలు చేశారు. ఘన స్వాగతం పలికిన కిమ్సరిగ్గా 24 ఏళ్ల తర్వాత ఉ.కొరియాలో పర్యటిస్తున్న పుతిన్‌కు ప్యాంగ్యాంగ్ నగర శివారులోని ఎయిర్‌పోర్ట్‌లో కిమ్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కిమ్–2 సంగ్ స్క్వేర్‌లో వేలాది మంది చిన్నారులు బెలూన్లు ఊపుతూ పుతిన్‌కు ఆహ్వానం పలికారు. సైనికుల నుంచి పుతిన్ గౌరవవందనం స్వీకరించారు. తర్వాత అక్కడే తన సోదరి కిమ్ యో జోంగ్‌ను పుతిన్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అక్కడి విమోచనా స్మారకం వద్ద పుతిన్ నివాళులర్పించారు.పలు రంగాలపై ఒప్పందాలు‘కుమ్సుసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్’ అధికార భవనానికీ పుతిన్, కిమ్‌లు ఒకే కారులో వచ్చారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సంస్కృతి, మానవ సంబంధాల రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 1991లో సోవియట్ రష్యా పతనం తర్వాత ఇంతటి విస్తృతస్థాయిలో ఒప్పందాలు కుదర్చుకోవడం ఇదే మొదటిసారి. ‘ఈ ఒప్పందం అత్యంత పటిష్టమైంది. కూటమి అంత బలంగా ఇరుదేశాల సత్సంబంధాలు కొనసాగుతాయి. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి పూర్తి మద్దతు, సాయం ప్రకటిస్తున్నా’’ అని కిమ్ అన్నారు. అయితే ఉ.కొరియా ఎలాంటి సాయం చేయబోతోందనేది కిమ్ వెల్లడించలేదు. ‘‘ మైత్రి బంధాన్ని సమున్నత శిఖరాలకు చేర్చే విప్లవాత్మకమైన ఒప్పందమిది. అయితే ఉ.కొరియాకు సైనిక సాంకేతిక సహకారం అనేది ఈ ఒప్పందంలో లేదు’ అని పుతిన్ స్పష్టంచేశారు. ఇరుదేశాల సరిహద్దు వెంట వంతెన నిర్మాణం, ఆరోగ్యసంరక్షణ, వైద్య విద్య, సామాన్య శాస్త్ర రంగాల్లోనూ ఒప్పందాలు కుదిరాయని రష్యా ప్రకటించింది.కారు నడిపిన పుతిన్, కిమ్కుమ్సుసాన్ ప్యాలెస్‌కు బయల్దేరిన సందర్భంగా వారు ప్రయాణించిన లిమో జిన్ కారును పుతిన్ స్వయంగా నడిపారు. మార్గ మధ్యంలో ఒక చోట ఆగి పచ్చిక బయళ్లపై కొద్దిసేపు నడుస్తూ మట్లాడు కున్నారు. మార్గమధ్యంలో మరో చోట ఆగి పుతిన్‌కు కిమ్ టీ పార్టీ ఇచ్చారు. తర్వాత సంగీత కచేరీకి వెళ్లారు. తర్వాత కిమ్ సైతం పుతిన్‌ను వెంటబెట్టుకుని ఆ కారును నడిపారు. ఒప్పందాల తర్వాత పుతిన్ చిత్రప టం ఉన్న కళాఖండాలను పుతిన్‌కు కిమ్ బహూకరించారు. కిమ్‌కు పుతిన్ రష్యాలో తయారైన ఆరాస్ లిమోజిన్ కారు, టీ కప్పుల సెట్, నావికా దళ ఖడ్గాన్ని బహుమ తిగా ఇచ్చారు. కిమ్‌కు పుతిన్ లిమోజిన్ కారును బహుమతిగా ఇవ్వడం ఇది రెండోసారి. -
దంపతులుగా జీవిస్తుంటే... జోక్యమొద్దు: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో ఒక్కటిగా జీవిస్తున్న అమ్మాయి, అబ్బాయి మధ్యలోకి మూడో వ్యక్తి జోక్యం తగదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. వారి కుటుంబ సభ్యులు అయినా కూడా జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. కుల, మతాలతో సంబంధం లేకుండా, ఒక్కటిగా బతికే జంటకు తగిన రక్షణ కల్పించాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుషార్ రావు గేదెల అన్నారు. రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, అధికార యంత్రాంగానిదేనన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తండ్రి అభీష్టానికి విరుద్ధంగా తనకు నచ్చిన వ్యక్తితో కలిసి ఉంటున్న ఓ యువతి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. యూపీలో తన తండ్రి చాలా పరపతి గల వ్యక్తి అని, ప్రాణభయంతో తరచూ వేర్వేరు హోటళ్లకు మారుతూ కాలం వెళ్లదీస్తున్నామని, రక్షణ కల్పించేదాకా మా దంపతులకు మనశ్శాంతి ఉండదని ఆమె కోర్టుకు నివేదించారు. -
భారత్‌తో సహకారం అవసరం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో శాంతి నెలకొనాలంటే భారత్‌లో పరస్పర సహకారం అవసరమని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఆ దేశ పార్లమెంటు ఎన్నికలకోసం తమ పార్టీ మేనిఫెస్టోను సోమవారం ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్.. ఇస్లామిక్ సంక్షేమ దేశంగా పాక్‌ను మారుస్తానని హామీ ఇచ్చారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారానికి బ్లూప్రింట్ తమ వద్ద ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాలకు పాటిస్తామన్నారు. తమపార్టీ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, పాలనాపరమైన ఇబ్బందులను 100 రోజుల్లోనే పరిష్కరించేందుకు అవసరమైన వ్యూహాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ‘పాకిస్తాన్లో శాంతి నెలకొనేందుకు మన సరిహద్దుదేశమైన భారత్‌తో సహకారాత్మక సత్సంబంధాలు అవసరం. పాకిస్తాన్ ప్రాధాన్యాలను గుర్తిస్తూ.. సరిహద్దు దేశాలతో ఘర్షణలేకుండా పరస్పర సానుకూల వాతావరణాన్ని నిర్మిస్తాం’ అని మేనిఫెస్టోలో ఇమ్రాన్ పేర్కొన్నారు. భారత్, చైనా, రష్యా సహా పలు దేశాలతో ద్వైపాక్షిక, బహుపాక్షిక సంబంధాలు ఏర్పర్చుకుంటామన్నారు. జూలై 25న పాకిస్తాన్ పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. -
పాత్రికేయ అంశాల్లో పరస్పర సహకారం
ఐజేయూ- పీఎఫ్‌యూజే ఒప్పందం హైదరాబాద్: పాత్రికేయులకు సంబంధించిన వృత్తిపరమైన అంశాలు, విద్యా శిక్షణ తదితర విషయాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని ఇండియా, పాకిస్తాన్లకు చెందిన ప్రముఖ జర్నలిస్టు సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), పాకిస్తాన్ ఫెడరల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (పీఎఫ్‌యూజే) మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరిందని ఐజేయూ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు దేశాల్లోని వర్కింగ్ జర్నలిస్టుల మధ్య సత్స ంబంధాలు మరింత బలోపేతం కావాలని, వృత్తిపరమైన అంశాలలో పరస్పర సహకారం అందించుకోవాలనే ఉద్దేశంతోనే ఎంవోయూ కుదుర్చుకున్నాయి. కరాచీలో జరిగిన అంతర్జాతీయ సెమినార్లో పా ల్గొన్న 15 దేశాల జర్నలిస్టుల సమక్షంలో ఈ నెల 3న ఈ ఒప్పంద పత్రాలపై ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, పీఎఫ్‌యూజే సెక్రటరీ జనరల్ అమిన్ యూసష్ సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఐజేయూ కోశాధికారి షబీనా ఇందర్జిత్, పీఎఫ్‌యూజే అధ్యక్షుడు రాణా మహమ్మద్ అజీమ్ పాల్గొన్నారు. -
‘పరస్పర సహకారం’పై విచారణ
డీసీఓ చక్రధర్ హన్మకొండ అర్బన్ : జిల్లా సహకార శాఖలో అక్రమ డిప్యూటేషన్లపై ‘పరస్పర సహకారం’ శీర్షికతో సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. మొత్తం డిప్యూటేషన్లపై విచారణ చేసి... రద్దు చేస్తామని జిల్లా సహకార అధికారి చక్రధర్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్లు జరిగినట్లు గుర్తించామన్నారు. అవసరంలేకున్నా డిప్యూటేషన్లు చేసిన విషయంలో ఆరా తీస్తున్నామని తెలిపారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.