Mutual Fund Association
-
ఫండ్స్ నిర్వహణ ఆస్తుల్లో 7% వృద్ధి
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 2023 మార్చి నాటికి సగటున రూ.40.05 లక్షల కోట్లకు చేరాయి. 2022 మార్చి నాటికి ఉన్న రూ.37.70 లక్షల కోట్లతో పోలిస్తే 7 శాతం వృద్ధి చెందినట్టు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ నికరంగా 0.72 శాతమే పెరగడం గమనార్హం. అదే కాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ రూ.5.86 లక్షల కోట్ల మేర తగ్గిపోయింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల ఏయూఎంలో రిటైల్ ఇన్వెస్టర్లకు సంబంధించిన ఏయూఎం (ఈక్విటీ, హైబ్రిడ్, సొల్యూషన్ ఓరియెంటెడ్) 2023 మార్చి చివరికి రూ.6,83,296 కోట్లకు చేరుకుంది. ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతూ వెళ్లడం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈక్విటీ మార్కెట్ల పట్ల నమ్మకాన్ని ప్రదర్శించడంగా యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ అన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం తదితర అనిశ్చితుల్లోనూ మార్కెట్ పట్ల ఇన్వెస్టర్లు నమ్మకంగా ఉండడాన్ని ప్రస్తావించారు. 2022–23లో ఈక్విటీ ఫండ్స్‌లోకి నికరంగా రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు యాంఫి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సిప్ రూపంలో నెలవారీ పెట్టుబడులు కూడా ఎప్పటికప్పుడు నూతన గరిష్టాలకు చేరుతున్నాయి. 2023–24 సంవత్సరంలోనూ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ప్రవాహం మెరుగ్గానే ఉంటుందన్న అంచనాను వెంకటేశ్ వ్యక్తం చేశారు. సిప్ ఖాతాల సంఖ్య మార్చి చివరికి 6.36 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో 21.65 లక్షలు మేర పెరిగింది. -
మ్యూచువల్ ఫండ్స్‌లోనే తక్కువ ఫిర్యాదులు
ముంబై: భారతీయ మ్యచువల్ ఫండ్స్ పరిశ్రమ మొత్తం ఫైనాన్షియల్ మార్కెట్ వ్యవస్థలోనే అతి తక్కువ ఫిర్యాదులతో మెరుగైన స్థానంలో ఉందని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ప్రకటించింది. పరిశమ్రపై ఉన్నవి నిరాధార దూషణలే తప్పించి, వాస్తవాలు వేరని పేర్కొంది. భారత మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఎంతో పారదర్శకతతో, సమగ్ర సమాచారాన్ని వెల్లడిస్తున్నట్టు తెలిపింది. నెలవారీ ఫండ్స్ పెట్టుబడుల సమాచారం వెల్లడించడం ఆధారంగా 26 దేశాల్లో భారత్‌కు మొదటిస్థానాన్ని మార్నింగ్‌స్టార్ ఇచ్చినట్టు యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ ప్రకటించారు. యాంఫి ఇన్వెస్టర్ల నుంచి, పంపిణీదారుల నుంచి నేరుగా, సెబీ ద్వారానూ ఫిర్యాదులు అందుకుంటుందని వివరించారు. ఇలా వచ్చే ఫిర్యాదులను సాధారణమైన, తీవ్రమైన అని రెండు రకాలుగా వర్గీకరిస్తామని చెప్పారు. ‘‘డివిడెండ్ రాకపోవడం, అకౌంట్ స్టేట్మెంట్, కమీషన్ రాకపోవడం, రికార్డ్ అప్డేట్ చేయకపోవం సాధారణ ఫిర్యాదులు. దరఖాస్తు ఫారాల్లో అక్రమాలకు పాల్పడడం, మార్కెట్ యూనిట్లు, ఫండ్స్‌లో అవకతవకలకు పాల్పడడం, పంపిణీదారుల సేవల్లో లోపాలను తీవ్రమైనవిగా పరిగణిస్తాం’’అని వివరించారు. 2017 ఏప్రిల్ నుంచి 2022 సెప్టెంబర్ మధ్య కేవలం 5,330 ఫిర్యాదులు వచ్చినట్టు వెల్లడించారు. ఇదే కాలంలో ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు రూ.40 లక్షల కోట్లకు చేరాయన్నారు. బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులు, బీమా, స్టాక్స్‌లో ఫిర్యాదులు చాలా ఎక్కువగా ఉంటాయన్నారు. -
యాంఫి సీఈవోగా రాజేంద్రన్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ సమాఖ్య ఏఎంఎఫ్ఐ(యాంఫి) సీఈవోగా ఆంధ్రా బ్యాంక్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్. రాజేంద్రన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఏఎంఎఫ్ఐ సీఈవోగా వ్యవహరిస్తున్న హెచ్.ఎన్.సినార్ పదవీ కాలం సెప్టెంబర్‌లో ముగుస్తుంది. సినార్ పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో రాజేంద్రన్ సీఈవోగా నియమితులవుతారు. రాజేంద్రన్ గతంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈడీగా పనిచేశారు.