పెద్దాయన ఇకలేరు..
జిల్లా రాజకీయాలను నాలుగు దశాబ్దాల పాటు శాసించిన యోధుడు. తలపండిన రాజకీయ ఉద్ధండులను ఎదిరించి నిలబడి ఎదిగిన భీష్మాచార్యుడు. శిఖరంగా నిలబడి ఎంతో మంది రాజకీయ ఎదుగుదలకు దోహదపడిన మార్గదర్శి. విలువలతో కూడిన రాజకీయాలు నెరిపిన ఆచార్యుడు. ప్రత్యర్థులను తన రాజకీయ చాతుర్యంతో మట్టి కరిపించిన అపర చాణక్యుడు. జిల్లాలోని రాజకీయ నేతలకు, ప్రజలకు పెద్దాయన అయిన డాక్టర్ నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఉపాధ్యాయుడిగా జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర రాజకీయాల్లో కీలకభూమిక పోషించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం కాలధర్మం చెందారు.
వెంకటగిరిటౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో విలక్షణ రాజకీయాలు నెరపి తనదైన ముద్రవేసిన పెద్దాయన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మృతితో శుక్రవారం వెంకటగి రి ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులే కా కుండా ఇతర పార్టీల నేతలు సైతం పెద్దాయనతో తమకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఒరేయ్ కిష్టయ్యా.. ఏరా రమణారెడ్డి అంటూ అప్యాయంగా పల కరించే పెద్దాయన ఇక లేరన్న వాస్తవాన్ని వారు జీర్ణించుకొలేకపోతున్నారు.
వాకాడులో 1935 ఫిబ్రవరి 20న జన్మించిన నేదురుమల్లి రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమంత్రి పదవిని పొందడం వెంకటగిరి నుంచి ప్రాతినిథ్యంతోనే సాధ్యమయింది. ఉపాధ్యాయుడిగా ఉద్యోగంతో ప్రారంభమయిన ఆయన జీవితం 1972లో రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన అప్పటి నుంచి ఢిల్లీ స్థాయి నాయకులతో సాన్నిహిత్యం నెరిపేవారు. అంచెలంచెలుగా ఎదిగి సీఎం పీఠం అధిరోహించారు. 1972 నుంచి 1978 వరకు రాజ్యసభ సభ్యుడిగా, 1978 నుంచి 1984 వరకు ఎమ్మెల్సీగా కొనసాగిన సమయంలోనే రాష్ట్ర రెవెన్యూ, పరిశ్రమలు, వ్యవసాయం, విద్యుత్ శాఖ ల మంత్రిగా పనిచేశారు.
1988-89లో పీసీపీ అధ్య క్షుడిగా పనిచేశారు. 1989 ఎన్నికల్లో వెంకటగిరి నుం చి ఎమ్మెల్యేగా ఎన్నికై 1990లో రాష్ట్రముఖ్యమంత్రి పదవిని పొందారు. అనంతరం 1988లో బాపట్ల, 1999లో నరసరావుపేట, 2004లో విశాఖపట్నం నుంచి ఎంపీ వరుస విజయాలు సాధించారు. 2009లో సోనియాగాంధీ సూచనతో రాజ్యసభ స భ్యుడుగా ఎంపికైనా తిరిగి 2010లో మరోసారి రా జ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. అలంకరించిన ఏ పదవికయినా వన్నె తెచ్చే పెద్దాయన కష్టాలు వచ్చినపుడు ధైర్యంగా ఎదుర్కోవడం, సమయం వచ్చినపుడు ప్రత్యర్థులను ముప్ప తిప్పలు పెట్టే రాజకీయ చతురత ఆయనకే సొంతమని రా జకీయ విశ్లేషకుల భావన. దాదాపు 30 ఏళ్ల పాటు జిల్లా రాజకీయాలను శాసించారు.
పార్టీ వీర విధేయుడు నేదురుమల్లి
జిల్లాలో తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా జనార్దన్‌రెడ్డి కొనసాగారు. ఎన్టీఆర్ ప్రభజనంతో టీడీపీ హవా కొనసాగిన రోజుల్లో సైతం పార్టీ కోసం కష్టపడి పని చేశారు. ఒ కానొక సందర్భంలో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయి నా అలకపాన్పు ఎక్కకుండా విలువలతో కూడిన రాజకీయం నెరపారు.
పెద్దాయన కోసం ప్రాణత్యాగం
2007 సెప్టెంబర్ 7న జనార్దన్‌రెడ్డి జీవితంలో చేదుజ్ఞాపకాన్ని మిగిల్చింది. ఎస్వీ యూనివర్సిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్ అందుకునేందుకు వెళుతుండగా ఆయనపై మావోయిస్టులు మందపాతర తో హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో కారు డ్రైవ ర్ మల్లికార్జున్‌రెడ్డితో పాటు ముఖ్య అనుచరులు బి. నాగార్జున్‌రెడ్డి, వెంటగిరికి చెందిన పాయసం దశ య్య మృతి చెందడం నేదురుమల్లిని కలిచి వేసింది.
తొలినాళ్లలో నల్లపరెడ్డి అనుచరుడు
కోట : నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి రాజకీయ ఆరంగేట్రం చేసిన తొలినాళ్లలో అప్పట్లో జిల్లాలో చక్రం తిప్పుతున్న నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి అనుచరుడుగా కొనసాగారు. అనంతరం జరిగిన పరిణామాలతో నల్లపరెడ్లతో విభేదించాడు. 1972లో అ ప్పటి సీఎం పీవీ నరసింహారావు నల్లపరెడ్లను కా దని గూడూరు టికెట్‌ను శారదాంబకు ఇచ్చారు. రెబల్ అభ్యర్థిగా నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పోటీ చేయడంతో శారదాంబను గెలిపించే బాధ్యత నే దురుమల్లిపై పడింది. దీంతో నల్లపరెడ్లతో విభేదించి నేదురుమల్లి ఆమె విజయానికి కృషి చేశారు.
అప్పటి నుంచి పీవీ అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఆ ఎన్నికల్లో శారదాంబ ఓడినప్పటికీ జనార్దన్‌రెడ్డి నరసింహారావు ఆశీస్సులతో రాజ్యసభ సభ్యుడయ్యారు. అప్పటి నుంచి నల్లపరెడ్లు, నేదురుమల్లి రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగారు. గూడూరు నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించడంతో వెంకటగిరి నుంచి రెండు వర్గాల వారు ఒకరిపై మరొకరు పోటీకి దిగేవారు.
నేదురుమల్లి మృతి తీరని లోటు
- నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మృతి జిల్లాకే కాక రాష్ట్రానికి కూడా తీరని లోటని వైఎస్సార్సీపీ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో గుర్తింపు పొందారన్నారు. రాజకీయంగా జిల్లాకు పేరు తెచ్చిన జనార్దన్‌రెడ్డి నేడు ప్రజల మధ్యన లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి మనో ధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని ఇవ్వాలని భగవంతుడ్ని ప్రార్థించారు.
రాజకీయ భిక్ష పెట్టింది జనార్దన్‌రెడ్డే : ఎల్లసిరి
వాకాడు,న్యూస్‌లైన్ : తమ వంటి వారికి రాజకీయ భిక్షపెట్టింది నేదురుమల్లి జనార్దన్రెడ్డేనని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి అన్నారు. జనార్దన్‌రెడ్డి మరణవార్త వినగానే ఎల్లసిరి, గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ అభ్యర్థి పాశం సునీల్‌కుమార్ వా కాడులోని ఆయన సోదరుడు వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నేదురుమల్లి పద్మనాభరెడ్డిని పరామర్శించి, ఓదార్చా రు. ఎల్లసిరి విలేకర్లతో మాట్లాడుతూ జనార్దన్‌రెడ్డి రాజకీయంలో తనదైన శైలిలో చేయి తిరిగిన నేతగా చక్రం తిప్పుతూ ఉన్నత పదవులు పొందారన్నారు. తమ వంటి ఎంతో మందికి రాజకీయ ఓనమాలు నేర్పించి అవకాశాలు కల్పించారన్నారు.
ఆయనకు తాను రాజకీయంలో తాత్కాలికంగా దూరమైనప్పటికీ ఒక మహోన్నతమైన రాజకీయ గురువును కోల్పోయినందుకు గుండెలు పిండుతున్నాయన్నారు. జిల్లాలో కాంగ్రెస్ కార్యాలయాన్ని నిర్మించాలని జనార్దన్‌రెడ్డి సంకల్పించినప్పుడు తామంతా ఆయనతో పాటు కష్టపడి పని చేసి నెల్లూరులో ఇందిరాభవన్‌ను ఏర్పాటు చేశామన్నారు. దీనిని చూసి ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలు నిర్మించారన్నారు. అయితే ఒకే ఒక బాధ మాత్రం తమని వేధిస్తోందన్నారు. జాతీయ నాయుకుడిగా ఎదిగి కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన జనార్దన్‌రెడ్డిని అధిష్టానం గుర్తించి కేంద్ర మంత్రిగా చోటు కల్పించలేదన్నారు. జనార్దన్‌రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులు రాజ్యలక్ష్మమ్మకు, రామ్‌కుమార్‌రెడ్డి, గౌతమ్‌రెడ్డి, భరత్‌రెడ్డి, అశోక్‌రెడ్డికి దైవ ఆశీస్సులు
మెండుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
నేదురుమల్లి కృషికి ప్రతిఫలం ఇందిరాభవన్
సాక్షి, నెల్లూరు : నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి చేసిన ప్రత్యేక కృషి ఫలితంగా 1987లో ఇందిరాభవన్ ఏ ర్పాటయింది. 1987 డిసెంబర్ 22న అప్పటి ఏఐసీసీ అధ్యక్షులు రాజీవ్‌గాం ధీతోఇందిరాభవన్ను ప్రారంభింపజేశారు. ఆ సమయంలో డీసీసీ అధ్యక్షుడి గా నువ్వుల వెంకటరత్నం నాయుడు ఉన్నారు. 2012లో ఇందిరాభవన్‌ను ఏఐసీసీ ట్రస్ట్‌కు అప్పగించారు.
ఆయన చనిపోయేదేంది..?
నేదురుమల్లి ప్రధాన అనుచరుల్లో ఒకరైన పట్రా ప్రకాశరావును శుక్రవారం ‘సాక్షి ప్రతినిధి’ మూలాపేటలోని ఆయన నివాసంలో కలిసి విషయం తె లియజేయగా ‘ఆయన చనిపోయేదేంది ...?’ అం టూ ప్రకాశరావు అమాయకంగా ముఖం పెట్టా రు. వయోభారంతో ఆయన ప్రస్తుతం మతిస్థిమి తం కోల్పోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. నేదురుమల్లి దంపతుల ఫొటోను ఆయనకు ఇవ్వ గా దాన్ని తదేకంగా చూశారు. ఎన్బీకేఆర్ హాస్టల్లో చదువుకుని వార్డెన్‌గా పనిచేస్తున్న ప ట్రా ప్రకాశరావును ఉద్యోగానికి రాజీనామా చేయించి మూడు సార్లు గూడూరు ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత నేదురుమల్లికే దక్కుతుంది.
హెడ్‌నర్సుకు ఎమ్మెల్సీ పదవి...
నెల్లూరు అమెరికన్ హాస్పిటల్లో హెడ్ నర్సుగా పనిచేస్తున్న ఎతిల్ తేరేను నేదురుమల్లి అప్పట్లో ఎమ్మెల్సీ చేశారు. డీపీఆర్ఓ పసల పెంచలయ్యను ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా చేశారు. గూడూరుకు చెందిన గౌస్మొహిద్దీన్ను రాజ్యసభ సభ్యుడిగా, బ్యాంక్ మేనేజర్ నెలవల సుబ్రహ్మణ్యంను ఎంపీ, ఎమ్మెల్యేను చేశారు. బీఎస్సీ పూర్తి చేసి ఇంట్లో ఉంటున్న కుడుముల పద్మశ్రీని సైతం ఎంపీ చేసిన ఘనత నేదురుమల్లిదే. ప్రస్తుత కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చింది నేదురుమల్లి. ఇలా అనేక మందిని రాజకీయాల్లోకి
తీసుకొచ్చిన ఘనత నేదురుమల్లికే దక్కుతుంది.
జనార్దన్‌రెడ్డి మరణం తీరని లోటు
సాక్షి, నెల్లూరు : మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మృతికి వైఎస్సార్సీపీ నేతలు శుక్రవారం సంతాపం తెలిపారు.
తీరనిలోటు : ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
సామాన్య ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నేదురుమల్లి జనార్ద్దన్రెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటని నెల్లూరు ఎంపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించి జిల్లాకు గర్వకారణమయ్యారన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రతీక నేదురుమల్లి జీవితం అన్నారు. తన రాజకీయ ఆరంగేట్రానికి కారణమైన జనార్దన్‌రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. జనార్దన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
రాజకీయ దురందరుడు :
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్
జిల్లా ఖ్యాతిని జాతీయ వ్యాప్తంగా చాటిన రాజకీయ దురందురుడు జనార్దన్‌రెడ్డి మృతి తీరని లోటని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ అన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేం దుకు ఆయన చేసిన కృషిని మేరిగ మురళీ శ్లాఘించారు. జనార్దన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
తీరని లోటు : డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్, నగర ఎమ్మెల్యే అభ్యర్థి
జిల్లా రాజకీయ పంధాను మార్చిన వ్యక్తిగా నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సేవలు ప్రశంసనీయమన్నారు. విలువలతో కూడిన రాజకీయంతో జిల్లా పేరును నిలబెట్టిన నేదురుమల్లి మరణం జిల్లా వాసులకు తీరని లోటని పేర్కొన్నారు. జనార్దన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
విలువలతో కూడిన రాజకీయాన్ని నడిపారు : డీసీసీబీ చైర్మన్ ధనుంజయరెడ్డి
నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మరణం తీరని లోటని డీసీసీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాన్ని నడిపి జిల్లా గొప్పతనాన్ని ఢిల్లీ స్థాయిలో చాటిన వ్యక్తిగా జిల్లా ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారన్నారు. జనార్దన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
సూళ్లూరుపేట అభివృద్ధి ప్రదాత నేదురుమల్లి
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సూళ్లూరుపేట ని యోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బద్దెపూడి వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. సూ ళ్లూరుపేట బస్టాండ్ సెం టర్లో ఆయన చిత్రప టం ఏర్పాటు చేసి కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులర్పించారు.
ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కొంతమంది నాయకులు కన్నీటి పర్యం తమయ్యారు. బద్దెపూడి మాట్లాడుతూ నేదురుమల్లి సూళ్లూరుపేటతో విడదీయరాని అనుబంధాన్ని కొనసాగించారన్నారు. సూళ్లూరుపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సూళ్లూరుపేట-కోట రోడ్డు, వేనాడు, ఇరకం, పేర్నాడు దీవులకు కరెంట్, రోడ్డు సౌకర్యం కల్పించారన్నారు. 1989లో ఆయన వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖ మంత్రిగా ఉన్నపుడు తాగునీటి పథకాలు, పక్కా ఇళ్లు ఏర్పాటు చేయించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఎందరో నేతలకు ఆ యన రాజకీయ బాటలు వేశారన్నారు.
చెంగాళమ్మ ఆలయ పాలకమండలి చైర్మన్ ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ నేదురుమల్లి రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి, సూళ్లూరుపేట ప్రాంతానికి తీరని లోటన్నారు. స్థానిక బజారు సెంట ర్లో ఉన్న నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కాంప్లెక్స్‌లోని వ్యాపారస్తులంతా ఆయ న చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ముత్తు ముద్దుకృష్ణ మొదలియార్, డీసీఎంఎస్ డెరైక్టర్ జెట్టి వేణుయాదవ్, జిల్లా ఎస్సీ సెల్ నేత బూదూరు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలకా యుగంధర్, కోదండరామిరెడ్డి, నలుబోయిన రాజసులోచన మ్మ, దొరై, అయితా శ్రీధర్ నేదురుమల్లి చిత్రపటానికి నివాళులర్పించారు.
రాజకీయ భీష్మాచార్యుడు నేదురుమల్లి
సాక్షి, నెల్లూరు/ గూడూరు/వాకాడు: జిల్లాలో సుమారు నాలుగున్నర దశాబ్దాల పాటు తనదైన శైలిలో రాజకీయాలను శాసించిన భీష్మాచార్యుడు, పెద్దాయన మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ నేదురుమల్లి జ నార్దన్‌రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచా రు. జిల్లా రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. వాకాడులో సామాన్య రైతు కు టుంబంలో జన్మించిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి బడి పంతులుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి, ఎంపీగా అనేక పదవులను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి కడ వరకు కాంగ్రెస్‌లో ఉం టూనే ఆయన కాల ధర్మం చెందటం గమనార్హం. అనేక ఆటుపోట్లు ఎదురైనా పార్టీ పట్ల అంకితభావంతో, చిత్తశుద్ధితో ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుం చి పీసీసీ కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పార్టీ పదవులు అలంకరించిన ఘనత నేదురుమల్లికే ద క్కుతుంది.
కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఇం దిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సంజయ్‌గాంధీ, పీవీ నరసింహారావు వంటి మ హామహులతో ఆయన ఎంతో సాన్నిహిత్యం కొనసాగించారు. ఎంత ఎది గినా ఒదిగి ఉండే గుణంతోనే ఆయన ఈ స్థాయికి ఎదిగారు. 1970లో నె ల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ ఆ తర్వాత 1972లో అ ప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు అండతో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. 1978లో శాసన మండలి సభ్యుడుగా ఎంపికై రెవెన్యూ, వి ద్యుత్, భారీ పరిశ్రమలశాఖా మంత్రిగా పనిచేశారు. 1983లో తొలిసారిగా వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి చేతిలో ఓటమిపాలైన నేదురుమల్లి 1988లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.
1989లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా నేదురుమల్లి గెలుపొంది చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయం, అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 1990-92 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. 1994లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ 1998లో బాపట్ల, 1999లో నరసారావుపేట నుంచి, 2004లో విశాఖపట్నం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మూడుసార్లు లోకసభకు ఎన్నికైనప్పటికీ ఆయనకు నెల్లూరు లోక్‌సభ నుంచి ఎంపీగా కావాలనే కోరిక బలంగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీలకు రిజర్వుడుగా ఉంటున్న నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని జనరల్‌కు కేటాయించే ప్రక్రియలో నేదురుమల్లి కృషి కూడా ఉంది. ఏఐసీసీలో కూడా నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కీలకంగా వ్యవహరించేవారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, స్టాండింగ్ కమిటీల చైర్మన్‌గా కూడా ఆయన పనిచేశారు.
తీరని కలగా.. నేదురుమల్లికి నెల్లూరు ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రి కావాలనేది తీరని కలగానే మిగిలిపోయింది. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధమైనప్పటికీ, ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజ్యసభకు ఎంపిక చేశారు.
అప్పట్లో కేంద్ర మంత్రి అవుతానని భావించిన నేదురుమల్లి ఆశలు అడియాశలే అయ్యాయి.
నేదురుమల్లి నీడలో ఎదిగిన నేతలు.. జిల్లా రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేశారు. ఆయన అండదండలతో ఎందరో నేతలుగా ఎదిగారు. నేదురుమల్లి రాజకీ యం విలక్షణంగా ఉంటుంది. ఆయన ఎంతో గుంబనం గా వ్యవహరిస్తూ చివరి నిమిషం వరకు తన మనస్సులోని మాటను బయటపెట్టేవారు కాదు.
కలలో కూడా తాము రా జకీయాల్లో ఇంత స్థాయికి ఎదుగుతాయని ఊహించని ఎందరి నో ఆయన రాజకీయాల్లో ప్రవేశం కల్పించడమే కాకుండా వారు ఉన్నత స్థానానికి ఎదిగేందుకు దోహదపడ్డారు. తన మాటకు వి లువివ్వని, తనను ధిక్కరించిన వారికి తానేంటో చూపించడంలో కూడా ఆయనదో ప్రత్యేక శైలి. సుధీర్ఘకాలం తిరుపతి పార్లమెంట్ సభ్యుడుగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన డాక్టర్ చింతామోహన్‌కు సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ 1996లో పార్టీ టికెట్ కాకుండా చేసి ఒక బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న నెలవల సుబ్రహ్మణ్యానికి టికెట్ ఇప్పించడమే కాకుండా ఎంపీగా చేసిన ఘనత కూడా ఆయనదే.
జి ల్లాలో రాజకీయంగా ఎదిగిన వారిలో వేమారెడ్డి వెంకురెడ్డి(డీసీసీ అధ్యక్షుడు), గూడూరుకు చెందిన గౌస్‌మొహిద్దీన్ (ఎంపీ రాజ్యసభ), ఎతిల్ తేరే (ఎమ్మెల్సీ), మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సీవీ శేషారెడ్డి, పట్రా ప్రకాశరావు, పసల పెంచలయ్య, చేవూరు దేవకుమార్‌రెడ్డి, కుడుముల పద్మశ్రీ, మాగుంట సుబ్బరామిరెడ్డి, పనబాక లక్ష్మి, నెలవల సుబ్రహ్మణ్యం, వాకా టి నారాయణరెడ్డి, జేకేరెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, చెంచలబాబుయాదవ్, కొ డవలూరు ధనుంజయరెడ్డి, కొండాపురం రామమ్మ, సరస్వతి వంటి నేతలు ఉన్నారు. తాను దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఉంటున్నప్పటికీ గృహిణిగా నే ఉన్న తన సతీమణి రాజ్యలక్ష్మిని రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చే యగలిగారు. అయితే ఎంతో కాలంగా తన పెద్ద కుమారుడు రాంకుమార్‌రెడ్డిని ఎమ్మెల్యేను చేయాలనే కోరిక తీరక ముందే తుది శ్వాస విడిచారు.