‘కోడ్’ కూసింది
నెల్లూరు:
‘మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతోనే సోమవారం నుంచి జిల్లా అంతా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నా చట్ట పరంగా వారికి ప్రభుత్వ కార్యక్రమాలకు ఎలాంటి ఆహ్వానం పంపరాదు.
అధికారులు నాయకుల వెంట కలసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే వేటు వేస్తాం’ అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎన్. శ్రీకాంత్ హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన ఆయన సోమవారం రాత్రి సాక్షి ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు.
జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్, నాయుడుపేట నగర పంచాయతీ, ఆత్మకూరు, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, కావలి మున్సిపాలిటీల్లో 661 పో లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు చె ప్పారు. పోలింగ్‌కు 700 ఈవీఎంలు అవసరంగా కాగా, 66 ఈవీఎంలు తక్కువ రావడంతో వాటిని తెప్పించేందుకు ఎన్నికల సంఘాన్ని సంప్రదించామన్నారు. ఎన్నికలకు 3వేల మంది సిబ్బందిని సన్నద్ధం చేశామన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పోరుపై స్పష్టత
ఆనం విజయకుమార్‌రెడ్డిని బరిలోకి దించబోతున్నారు. సోమవారం నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో వివేకా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇకపోతే ఈ సారి సర్వేపల్లి నుంచి కాకుండా రూరల్ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మానసికంగా సిద్ధపడ్డారు. ఇందులో భాగంగానే ఆయన గత మూడు రోజులుగా నెల్లూరు రూరల్ నియోజక వర్గ పర్యటనలకు వెళుతున్నారు. ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో సోమిరెడ్డి తానీసారి రూరల్ నుంచే పోటీకి దిగబోతున్నానని చెప్పకనే చె ప్పారు. దీంతో నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చ ంద్రమోహన్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డి పోటీ చేస్తారనేది తేలిపోయింది.
ఇక సిటీ విషయానికి వస్తే డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ గతంలో పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద పోటీ చేయబోతున్నారు. రూరల్ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తన మిత్రుడు శ్రీధరకృష్ణారెడ్డితో తలపడనున్నారు. దీంతో ఈ నియోజక వర్గానికి సంబంధించిన ప్రధాన పార్టీల అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చింది.
‘కోడ్’ కూసింది
పంపిణీని నియంత్రించడం, వాటి రవాణాను అరికట్టడం కోసం పోలీసు సిబ్బందితో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. డబ్బు, మద్యం అక్రమ పంపిణీ, రవాణా మీద నిఘా వేయడానికి అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ వివరించారు. ఎన్నికలు జరుగుతున్న కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి సమాచారం, ఫిర్యాదుల కోసం 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారం సాయంత్రానికి ఇవి పనిచేసే ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, ఇతర అంశాలకు సంబంధించి ప్రజలెవరైనా ఈ కాల్ సెంటర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. రాష్ట్ర శాసనసభ సుప్త చేతనావస్థలో ఉన్నందువల్ల మంత్రులు లేరని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నా వారికి ఎలాంటి అధికారాలు ఉండవని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులెవరూ వీరిని అధికారిక కార్యక్రమాలు ఆహ్వానించరాదని, వారు పిలిస్తే కార్యక్రమాలకు హాజరు కాకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడం కోసం ఈనెల 7వ తేదీ జిల్లాలోని అధికారులందరితో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు జరుగుతున్న పట్టణాల్లో రాజకీయ పార్టీల హోర్డింగులు, ఫ్లెక్స్‌లు ఉండరాదన్నారు.
వీటిని తొలగించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. ఎన్నికల అధికారుల అనుమతి తీసుకుని జరిపే ప్రచారానికి సంబంధించిన ఖర్చు ఆయా రాజకీయ పార్టీల ఖాతాలోకి జమ చేస్తామన్నారు. నామినేషన్ల పర్వం ముగిశాక జరిగే ప్రచారానికి సంబంధించిన ఖర్చు అభ్యర్థుల ఖాతాలోకి వెళుతుందని కలెక్టర్ చెప్పారు. ఎన్నికల్లో ఓటర్లు డబ్బు, మద్యం తీసుకోవడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. దీని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అన్ని మున్సిపాలిటీల స్థాయిలో 7వ తేదీ నుంచి తహశీల్దార్ల ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక తయారు చేసినట్టు కలెక్టర్ శ్రీకాంత్ వెల్లడించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, నిజాయితీగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నగరంలో ఆదివారం దీపం పథకం కింద సిలిండర్లు, ఇతర పథకాలకు సంబంధించిన ఆస్తుల పంపిణీపై వచ్చిన ఫిర్యాదులపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.