n tulasi reddy
-
‘అరుంధతి నక్షత్రంలా చెయొద్దు’
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం బదులు కనిపించని అరుంధతి నక్షత్రాన్ని సీఎం చంద్రబాబు చూపిస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. వివాహ కార్యక్రమంలో చివరి అంకంలో పురోహితుడు నూతన వధూవరులకు ఆకాశంలో అరుంధతీ నక్షత్రాన్ని చూడమంటారని, కానీ ఇంతవరకు ఆ నక్షత్రాన్ని చూసిన వధూవరులెవ్వరూ లేరన్నారు. అదే తరహాలోనే సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణం చేపట్టనున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచం మెచ్చేలా, స్వర్గాన్ని తలపించేలా అమరావతిని నిర్మిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం కోతలు పిట్టల రాయుడిని తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. -
‘బాబువైఫల్య దీక్ష చేపడితే బాగుండేది’
విజయవాడ: టీడీపీ రెండేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు నవ నిర్మాణదీక్షకు బదులు వైఫల్య దీక్ష చేస్తే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్లో తులసిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారన్నారు. నవనిర్మాణ దీక్ష పేరిట రూ.3 కోట్లు దుబారా ఖర్చు చేశారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అవినీతి పెరిగిందన్నారు. ఓటుకు నోటు కేసే ఇందుకు నిదర్శనమన్నారు. అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిలో కనీసం ఒక్కదాన్ని కూడా అమలుచేయలేకపోయారన్నారు. బెల్టు షాపుల్ని రద్దుచేస్తానని చెప్పి రెట్టింపు చేశారన్నారు. రుణమాఫీ వల్ల అరకొర లబ్ధి మాత్రమే చేకూరిందన్నారు. హంద్రీ-నీవా సుజలస్రవంతి పథకం ఎక్కడ అమలుజరుగుతోందని చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఐదుశాతం కూడా గ్రామాలకు శుద్ధ జలాలు అందడం లేదని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.