Nagar Kurnool trainee dsp
-
ట్రైనీ డిఎస్పీపై సారా మాఫియా దాడి
-
ట్రైనీ డిఎస్పీపై సారా మాఫియా దాడి
మహబూబ్నగర్లో సారా మాఫియా రెచ్చిపోయింది. నాగర్ కర్నూలులోని ట్రైనీ డిఎస్పీ భాషాపై సారా మాఫియా దాడి చేసింది. ఆ ఘటనలో డీఎస్పీతోపాటు మరో ముగ్గురు పోలీసుల గాయపడ్డారు. దాంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గోపాల్పేట మండలం పొల్కంపల్లి తండాలో అక్రమంగా సారా కాస్తున్నారని సమాచారం అందడంతో భాషా నేతృత్వంలోని పోలీసులు బృందం తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లింది. దాంతో స్థానిక సారా మాఫియా అగ్రహంతో వారిపై దాడికి తెగబడింది.