nagulapalli
-
జగన్ పర్యటనలో జన సందోహం
-
పిఠాపురం నాగులపల్లిలో వైఎస్ జగన్
-
విద్యుత్‌కు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: విద్యుత్‌కు దేశంలో డిమాండ్ ఏటా భారీగా పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో ఏటా 11 గిగావాట్ల చొప్పున డిమాండ్ పెరగ్గా.. వచ్చే ఆరేళ్ల పాటు ఏటా 15 గిగావాట్ల మేర అధికం అవుతుందని కేంద్ర విద్యుత్ శాఖ అదనపు సెక్రటరీ శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. సుమారు 40 గిగావాట్లు స్టోరేజ్ రూపంలో ఉంటుందన్నారు. ‘‘2030 నాటికి రోజులో సూర్యరశ్మి ఎక్కువగా ఉండే సమయంలో (సోలార్ హవర్స్) అదనంగా 85 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ తోడవుతుంది. అదే నాన్ సోలార్ హవర్స్‌లో 90 గిగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదవుతుంది’’అని శ్రీకాంత్ వెల్లడించారు. 2030 నాటికి స్టోరేజ్ సామర్థ్యంపై ఆధారపడే పరిస్థితి వస్తుందన్నారు. సోలార్ హవర్స్‌లో నిల్వ చేసిన విద్యుత్‌ను, నాన్ సోలార్ హవర్స్‌లో వినియోగించుకోవచ్చన్నారు. ఐఈఈఎంఏ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. బొగ్గు ఆధారిత విద్యుత్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతోపాటు, సోలార్, పవన (విండ్), స్టోరేజ్, ప్రసారం సామర్థ్యాల విస్తరణ కూడా చేపడుతున్నట్టు చెప్పారు. 300 గిగావాట్ల లక్ష్యం.. 2030 నాటికి శిలాజ ఇంధనేతర మార్గాల ద్వారా (పునరుత్పాదక/పర్యావరణ అనుకూల) 500 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని కేంద్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం. ఇప్పటికే పునరుత్పాదక ఇంధన వనరుల రూపంలో 200 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సాధించినట్టు శ్రీకాంత్ వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో మరో 300 గిగావాట్ల సామర్థ్యం ఆచరణలోకి వస్తుందన్నారు. ఇందులో 225 గిగావాట్లు కేవలం సోలార్, పవన విద్యుత్ రూపంలో ఉంటుందని తెలిపారు. సోలార్ సామర్థ్యం దండిగా ఉన్న రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రాంతాలతో కూడిన ఆర్ఈ జోన్లలో సామర్థ్యం ఎక్కువగా వస్తుందన్నారు. గుజరాత్, తమిళనాడు తీరాల్లో ఆఫ్‌షోర్ (సముద్ర జలాలు) విండ్ ఫార్మ్‌లు, ఒడిశా, గుజరాత్, తమిళనాడు తీరాల్లో గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యాల ఏర్పాటు ప్రణాళికలను సైతం వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), డేటా కేంద్రాల రూపంలోనూ విద్యుత్‌కు డిమాండ్ గణనీయంగా పెరగబోతోందన్నారు. దేశం మొత్తాన్ని ఒకే ఫ్రీక్వెన్సీతో నడిచే ఒకే గ్రిడ్‌తో అనుసంధానించడం వల్ల 170 గిగావాట్ల విద్యుత్‌ను, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరఫరా చేయొచ్చన్నారు. పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులు, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నట్టు శ్రీకాంత్ వెల్లడించారు. ‘‘40 గిగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్(బీఈఈఎస్)ను, 19 గిగావాట్ల పీఎస్పీ సామర్థ్యాన్ని ఆరేళ్లలో సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. -
గ్రాండ్‌గా బిగ్‌బాస్ మానస్ భార్య సీమంతం ఫంక్షన్ (ఫోటోలు)
-
చంద్రబాబుపై అసెంబ్లీలో సెటైర్లు వేసిన ఎమ్మెల్యే ధనలక్ష్మి
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో గురువారం భాగంగా మహిళా సాధికారతపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సెటైర్లు వేశారు. చంద్రబాబును అందరూ ముందు చూపు ఉన్న వ్యక్తి అంటుంటారని, అది నిజమేనని తెలిపారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు దేశం పార్టీని ఎప్పుడో ఒకప్పుడు భూస్థాపితం చేస్తారని, రాష్ట్రం నుంచి ముళ్లే మూటా సర్ధుకోవాల్సి వస్తుందని ముందే తెలిసి బాబు హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి విషయాల్లో చంద్రబాబుకు విజన్ ఉందని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: అందుకే కుప్పంలో జనం మొట్టికాయలు వేశారు: సీఎం జగన్ ‘సాధారణంగా అందరూ చెబుతూ ఉంటారు. ఆడవాళ్లు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయని, కానీ ఈ రోజు నేను చెబుతున్నా.. ఆడవాళ్లతో పెట్టుకుంటే రాజ్యాలే కాదు. రాజకీయాలు కూడా కూలిపోతాయని అక్క చెల్లెమ్మలందరు చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పారు. పాపం ఇప్పటికే ఉత్తర కుమారుడిని చూసుకొని చంద్రబాబు ఏడ్వని రోజంటూ లేదు. మరోవైపు కుప్పంలోని ప్రజలు ఆయన్ను నిండా ముంచేశారు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో కూడా తెలీదు. చదవండి: మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ ఏదైమైనా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలోని అక్కాచెల్లెలందరూ సంతోషంగా ఉన్నారు. మా నియోజకవర్గంలో అందరూ కూడా ఎప్పటికీ వైఎస్ జగన్‌కు అండగా ఉంటామని చెబుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర అక్కాచెల్లెలందరి ఆశీస్సులతో, దీవెనలతో మరింత కాలంపాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకు గర్వపడుతున్నాను’ అని ఎమ్మెల్యే ధనలక్ష్మి పేర్కొన్నారు. -
ఇద్దరు యువకుల దుర్మరణం
ఎం.నాగులపల్లి (ద్వారకాతిరుమల) : రాషీ్ట్రయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి పంచాయతీ పరిధిలో మంగళవారం వేకువజామున ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పి.కన్నాపురం పంచాయతీ సత్తాల గ్రామానికి చెందిన అన్నెం రాజేష్ (32), అన్నెం నరసింహరావు (28) వరుసకు సోదరులు. విజయవాడలో బంధువుల ఇంటికి వెళ్లేందుకు పయనమైన రాజేష్‌ను భీమడోలు బస్టాండ్ వద్ద దింపేందుకు వేకువజామున 5 గంటల సమయంలో నరసింహరావు తన ద్విచక్రవాహనంపై రాజేష్‌తో బయలుదేరాడు. ఘటనాస్థలం వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వేగంగా వీరిని ఢీకొట్టింది. దీంతో వాహనంతో సహా వీరిద్దరూ రోడ్డు పక్కన పంట పొలాల్లోకి ఎగిరిపడ్డారు. పొలంలోని విద్యుత్ స్తంభానికి వీరు తగలడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. ఓ హైటెక్ బస్ ముందు వెళుతున్న లారీని అతివేగంతో నిర్లక్ష్యంగా ఓవర్టేక్ చేసే సమయంలో వీరిని ఢీకొట్టిందని స్థానికులు అంటున్నారు. ద్వారకాతిరుమల ఎస్సై టి.నాగవెంకటరాజు, సిబ్బంది ఘటనా స్థలం వద్ద మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతుడు రాజేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరసింహరావుకు గతేడాది వివాహం కాగా భార్య గర్భిణి. వ్యవసాయ కూలీలుగా కుటుంబాలను పోషిస్తున్న వీరి మృతితో గ్రామం శోకసంద్రంగా మారింది.