Nandan nilekanl
-
పురస్కారం: అమ్మా ఎలా ఉన్నారు!
కులదీప్ దంతెవాడియాకు ఆ జ్ఞాపకం ఇంకా తాజాగానే ఉంది. ఆయన బెంగళూరులోని ఒక స్వచ్ఛందసంస్థ నిర్వాహకుడు. ఆరోజు ఒక డోనర్‌తో ఆయన సమావేశం ఏర్పాటయింది. ముందు అనుకున్నదాని ప్రకారం 45 నిమిషాల సమావేశం అది. కానీ ఈ సమావేశం పూర్తికావడానికి రెండు గంటల సమయం పట్టింది. దీనికి కారణం ఆ డోనర్. సంస్థ పని తీరు గురించి ఆమె ఎన్నో విషయాలు అడిగారు. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఆమెలో ఎంతో కనిపించింది. వెళుతున్నప్పుడు... ‘మీరు బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. రాత్రి నిద్ర లేదా?’ అని దంతెవాడియాను అడిగి తెలుసుకున్నారు. ఎంతోమంది తో, ఎన్నో సమావేశాల్లో పాల్గొన్న తనకు ఇలాంటి ఆత్మీయ ప్రశ్న ఎదురు కావడం తొలిసారి! ఆ డోనర్ పేరు రోహిణి నిలేకని. దంతెవాడియా తన స్వచ్ఛంద సంస్థ ద్వారా చేపట్టిన వివిధ రకాల కార్యక్రమాలకు మూడు సంవత్సరాల కాలంలో అయిదుకోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు రోహిణి. ‘రోహిణి నిలేకని ఎవరు?’ అనే ప్రశ్నకు జవాబుగా ఆమె భర్త నందన్ నిలేకని (ఇన్ఫోసిస్ సహ–వ్యవస్థాపకుడు) పేరు వినిపించవచ్చు. అంతకంటే ఎక్కువగా ‘ఆమె మంచి రచయిత్రి’ అనే మాట ఎక్కువగా వినిపించవచ్చు. ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రోహిణి ఒక పత్రికలో రిపోర్టర్‌గా పనిచేశారు. ‘స్టిల్‌బార్న్’ నవల ద్వారా ఆమె సృజనాత్మక ప్రపంచంలోకి వచ్చారు. ఈ నవలను పెంగ్విన్ ప్రచురించింది. ‘అన్ కామన్‌గ్రౌండ్’ పేరుతో పాత్రికేయురాలిగా తన అనుభవాలకు అక్షర రూపం ఇచ్చారు. ‘ఆర్ఘ్యం’ ఫౌండేషన్ ద్వారా సామాజికసేవా రంగంలోకి ప్రవేశించారు. ‘యాదృచ్ఛికంగా ఈ రంగంలోకి వచ్చాను’ అని ఆమె చెబుతున్నప్పటికీ, సామాజిక విషయాలపై ఆమె చూపే ఆసక్తి అపురూపం అనిపిస్తుంది! పట్టణం నుంచి మారుమూల పల్లె వరకు రోహిణి ఎన్నో ప్రయాణాలు చేస్తుంటారు. ఆ ప్రయాణంలో తనకు ఎదురైన అందరి క్షేమసమాచారం కనుక్కుంటారు. ‘ఎలా ఉన్నారు?’ అని పలకరించడానికి చుట్టరికం అక్కరలేదు కదా! ‘ప్రాజెక్ట్‌లపై కాదు ప్రజాసమూహాల సంక్షేమంపై రోహిణి పెట్టుబడి పెడతారు. అదే ఆమె బలం’ అంటుంటారు. అది లాభం ఆశించి పెట్టే పెట్టుబడి కాదు. వారి అభివృద్ధిని ఆశించి చేసే పెట్టుబడి. ఎప్పటికప్పుడూ క్షేత్రస్థాయిలో కొత్త కొత్త రంగాలను ఎంచుకోవడం ఆమె విధానం. ఈ సంవత్సరం కొత్తగా మెంటల్ హెల్త్, సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్...మొదలైన రంగాలను ఎంపిక చేసుకున్నారు. ‘పోయేటప్పుడు ఏం పట్టుకెళతాం!’ అనేది తత్వం. ‘బతికి ఉన్నప్పుడు ఏం చేశాం?’ అనేది వాస్తవం. ‘యాదృచ్ఛికంగానే సంపన్నురాలయ్యాను’ అంటున్న రోహిణి తన సంపాదనను సామాజిక సంక్షేమంపై అధికం గా కేటాయిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే రోహిణి నిలేకని తాజాగా ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్–2022 విజేత(గ్రాస్రూట్స్ ఫిలాంత్రపిస్ట్ విన్నర్) అయ్యారు. -
ఇన్ఫోసిస్ సీఈఓపై కేంద్రం అగ్రహాం
దేశ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఆదాయపు పన్ను శాఖ జూన్ 7 కొత్త ఐటీ పోర్టల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ పోర్టల్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఐటీ పోర్టల్ ప్రారంభించి రెండున్నర నెలలు కావస్తున్న ఇంకా సాంకేతిక సమస్యలు వస్తుండటంతో కేంద్రం ఇన్ఫోసిస్ సీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోర్టల్ లో ఇంకా ఎందుకు చాలా సమస్యలు కొనసాగుతున్నాయో ఆడగటానికి ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ను ఆర్థిక మంత్రిత్వ శాఖ పిలిచినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.(చదవండి: దూసుకెళ్తున్న దేశీయ స్టార్టప్ సంస్థలు) "ఆగస్టు 21 నుంచి సైట్ ఎందుకు అందుబాటులో లేదు, కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ ప్రారంభించిన 2.5 నెలల తర్వాత కూడా ఇంకా ఎందుకు సాంకేతిక సమస్యలు ఎందుకు పరిష్కరించలేదో తెలియజేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్"కు సమన్లు జారీ చేసింది. పన్ను చెల్లింపుదారులు, పన్ను నిపుణులు,ఇతర భాగస్వాములు తెలియజేసిన ఈ-ఫైలింగ్ పోర్టల్ సమస్యలపై కేంద్రం ఇన్ఫోసిస్ ను ప్రశ్నించింది. ఈ సమస్యల గురించి గత వారం సీతారామన్ మాట్లాడుతూ.. "కొత్త సైట్ లో సమస్యలు రాబోయే రెండు-మూడు వారాల్లో పూర్తిగా పరిష్కారం కానున్నట్లు" అన్నారు. "నేను ఇన్ఫోసిస్ కు నిరంతరం గుర్తు చేస్తున్నాను, ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నందన్ నీలేకని దానిని పరిష్కరిస్తామని నాకు హామీలు ఇస్తున్నారు" అని ఆమె తెలిపారు. 2019 జనవరి నుంచి 2021 జూన్ మధ్య కాలంలో ఈ పోర్టల్ అభివృద్ధి చేసినందుకు ఇన్ఫోసిస్ కు ప్రభుత్వం ₹164.5 కోట్లు చెల్లించింది. Ministry of Finance has summoned Sh Salil Parekh,MD&CEO @Infosys on 23/08/2021 to explain to hon'ble FM as to why even after 2.5 months since launch of new e-filing portal, glitches in the portal have not been resolved. In fact,since 21/08/2021 the portal itself is not available. — Income Tax India (@IncomeTaxIndia) August 22, 2021 -
‘మా కంపెనీలో అటెండర్ షేర్ల విలువ రూ.15 కోట్లు’
30 Years Of Economic Reforms.. సాక్షి, వెబ్‌డెస్క్: అనుమతులు, ఆంక్షలు, రెడ్ టేపిజంల మధ్య కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చి జులై 24తో 30 ఏళ్లు పూర్తవుతున్నాయి. పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ల ద్వయం అమల్లోకి తెచ్చిన ఈ సంస్కరణల ఫలితాలు అందిపుచ్చుకుని ఎదిగిన సంస్థల్లో మేటీగా నిలిచిన వాటిలో ఇన్ఫోసిస్ కూడా ఉంది. ఆర్థిక సంస్కరణలకు ముందు, ఆ తర్వాత దేశంలో పరిస్థితి ఎలా ఉండేది, ఇన్ఫోసిస్ ఎదుగుదల గురించిన వివరాలను ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి జాతీయ మీడియాకు తెలిపారు. ఆ విశేషాలు మీ కోసం... కలలు నిజమయ్యాయి 1991 జులై 21న పీవీ నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాతే మేము కన్న కలలన్నీ నిజం అయ్యాయి. నా దృష్టిలో ఎంటర్ప్రెన్యూర్ అంటే తనకు వచ్చిన ఐడియా ఎండ్ యూజర్‌కి ఉపయోగకరంగా ఉండాలి, కొత్త ఉద్యోగాలు సృష్టించగలగాలి, ఇన్వెస్టర్లకు లాభాలను అందివ్వాలి, పన్నుల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచాలి. అయితే ఆర్థిక సంస్కరణలకు ముందు ఇవన్నీ జరిగేందుకు ప్రతీ చోట అనుమతులు అనే అడ్డంకులు ఉండేవి. కానీ ఆర్థిక సంస్కరణలు ఈ పరిస్థితిని మార్చేశాయి. ఎంటర్ప్రెన్యూర్లు తాము కన్న కలలను నిజం చేసుకోవడానికి సులువైన దోవ దొరికింది. అంతకు ముందు కంప్యూటర్లు కొనడమనేది ఎంతో కష్టమైన వ్యవహారంగా ఉండేది. కంప్యూటర్లు కొనాలంటే 1981 జులైలో ఇన్ఫోసిస్ కంపెనీ స్థాపించిన కొత్తలో ఐబీఎం 4342 కంప్యూటర్లు కొనేందుకు మూడేళ్లలో 50 సార్లు ఢిల్లీకి వెళ్లి అధికారులతో మాట్లాడాల్సి వచ్చింది. ఎంతో కష్టపడితే కానీ కంప్యూటర్లు వచ్చేవి కాదు. ఇలా మేము ఎదురు చూపుల్లో ఉంటుండగా.. మరోవైపు టెక్నాలజీకి సంబంధించి ప్రతీ ఆరు నెలలకు అమెరికాలో మార్పులు వచ్చేవి. ప్రతీ ఆరు నెలలకు కొత్త కంప్యూటర్లు అక్కడ మార్కెట్లోకి వచ్చేవి. పైగా పాత కంప్యూటర్‌తో పోల్చితే యాభై శాతం మెరుగైన పనితీరు, 30 శాతం తక్కువ ధరతో కొత్త కంప్యూటర్లు వచ్చేవి. దీంతో మళ్లీ ఆర్డర్లలో మార్పులు చేయాల్సి వచ్చేది. వాటికి త్వరగా అనుమతులు సాధించడం మరో ప్రహసనంగా ఉండేది. ఒక్క కంప్యూటరనే కాదు ఆఖరికి టెలిఫోన్ పొందాలన్నా కష్టమే. ఆ రోజుల్లో ప్రభుత్వ అధికారులు, లేదా రిటైర్డ్ అధికారుల ఇళ్లకే కనెక్షన్ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. నిధుల సమస్య ఆరోజుల్లో టెలిఫోన్ కనెక్షన్, కంప్యూటర్లు కొనేందుకే ఇబ్బంది పడే మాకు నిధుల సేకరణ పెద్ద సమస్యగా ఉండేది. ఇక బ్యాంకులకు సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఎక్స్‌పోర్ట్స్ గురించి ఎంత చెప్పినా అర్థం అయ్యేది కాదు, పెట్టుబడిదారులు మా వైపు చూసేవారు కాదు. ఇలా కంపెనీ స్థాపించిన తర్వాత పదేళ్ల పాటు బాలారిష్టాలనే ఎదుర్కొన్నాం. ఆ సమయంలోనే మా కంపెనినీ రూ. 2 కోట్లకు కొంటామంటూ ఆఫర్ వచ్చింది. ఫౌండర్లలో కొందరు అమ్మేద్దామనుకున్నారు కూడా. కానీ ఈ రోజు కంపెనీ విలువ 6.5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ ఎదుగుదలకు ఆర్థిక సంస్కరణలు ఎంతగానో తోడయ్యాయి. ఐపీవోకి 1991లో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో వేగం పెరిగింది. అనుమతుల కోసం వేచి చూసే సమయం తగ్గింది. విదేశాల నుంచి ఎదైనా తెప్పించుకోవడం తేలికైంది. ఈ సంస్కరణలు ఇచ్చిన ధైర్యంతో 1992 డిసెంబరులో ఇన్ఫోసిస్ స్థాపించిన పదేళ్లకు స్టాక్ మార్కెట్‌కి వచ్చాం. నందన్ నీలేకని, బీ బాలకృష్ణన్, వీఆర్ నాయక్‌లు కంపెనీ టార్గెట్, రిస్క్‌లను వివరిస్తూ మంచి ప్రొజెక్షన్ ఇచ్చారు. అదే సమయంలో ఇనామ్ వ్యవస్థాపకులు వల్లభ్ బన్సాలీ, నేమీష్ షాలు సహకారం అందించారు. స్టాక్ మార్కెట్‌కి రక్షణగా 1992లోనే సెబీ కూడా ఏర్పాటైంది. దీంతో ఇన్ఫోసిస్‌కు నిధుల సమస్య క్రమంగా దూరమైంది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగాం. షేర్ వాల్యూ అత్యంత కింది స్థాయి ఉద్యోగి సంక్షేమం, అభివృద్ధి లక్క్ష్యంగా కంపెనీ పనితీరు ఉండాలని మహ్మాత్మా గాంధీ చెప్పిన మాటల స్ఫూర్తితో 1994, 1998లో ఎంప్లాయిస్ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈఎస్ఓపీ)ని అమలు చేశాం. మంచి ప్రతిభ కనబరిచిన ప్రతీ ఉద్యోగికి అటెండర్, ప్యూన్ నుంచి డైరెక్టర్ల వరకు షేర్లు కేటాయించాం. ఈ షేర్టు అట్టి పెట్టుకున్న చాలా మంది అటెండర్లు, ఫ్యూన్లు కనీసం 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఆదాయం పొందారు. 1994, 1998 ప్లాన్‌లో లేని ఎంప్లాయిస్ కోసం కనీసం పది షేర్ల వంతున 2008లో కేటాయించాం. ఇప్పుడు ఆ షేర్ల విలువల 1.30 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పుడా ఉద్యోగులు ఆదాయపు పన్ను కడుతున్నారు, చూడచక్కని ఇళ్లు కట్టకున్నారు, మంచి కార్లలలో తిరుగుతున్నారు. సెలవుల్లో కుటుంబాలతో కలిసి విదేశీ ప్రయాణాలకు వెళ్తున్నారు. ఈ మార్పు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఆర్థిక సంస్కరణలు అమలు జరిగి ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. విలువలతో.. దేశ బంగారు భవిష్యత్తు కొత్తతరం ఎంట్రప్యూనర్లపైనే ఆధారపడి ఉంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పోటీ తత్వంతో పాటు విలువలు పాటించే లక్షణం కూడా ఉండాలి. పవర్ బై ఇంటెలెక్ట్ డ్రైవెన్ బై వాల్యూస్ అనేది ముఖ్యం. అదే విధంగా మన దగ్గర జనాభా ఎక్కువ. కానీ ఇందులో నైపుణ్యం కలిగిన వారు చాలా తక్కువ. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంగ్లీష్ ప్రపంచ అనుసంధాన భాష, ఇంకా మాట్లాడితే ఇంగ్లీష్ ఇప్పుడు ఇండియా భాష. ఆ భాషపై పట్టు పెంచుకోవాలి. అదే విధంగా నిత్యం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చెప్పే విధంగా మన దగ్గర బోధన జరగడం లేదు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచేలా విద్యావిధానంలో మార్పు రావాలి. ఉద్యోగాలు సృష్టించే స్టేట్స్, ఎగుమతులు పెంచే స్టేట్స్‌కి ప్రత్యేక ప్రోత్సహాకాలు అందివ్వాలి అప్పుడు మన సమాజం మరింతగా ముందుకు వెళ్తుంది. -
ఆర్టీజీఎస్, నెఫ్ట్ చార్జీల రద్దు
ముంబై: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్టీజీఎస్, నెఫ్ట్‌పై చార్జీలను ఎత్తివేయాలంటూ నందన్ నీలేకని ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆర్బీఐ అమలుపరిచింది. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ (నెఫ్ట్) ద్వారా చేసే నగదు బదిలీలపై చార్జీలను తొలగిస్తూ, బ్యాంకులు సైతం కస్టమర్లకు దీన్ని బదలాయించాలని కోరింది. రూ.2 లక్షల వరకు నిధుల బదిలీకి నెఫ్ట్‌ను వినియోగిస్తుండగా, రూ.2 లక్షలకు పైన విలువైన లావాదేవీలకు ఆర్టీజీఎస్ వినియోగంలో ఉంది. దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ నెఫ్ట్ లావాదేవీలపై రూ.1–5 వరకు, ఆర్టీజీఎస్‌పై రూ.5–50 వరకు చార్జ్ చేస్తోంది. డిజిటల్ రూపంలో నిధుల బదిలీకి ప్రోత్సాహం ఇచ్చేందుకు చార్జీలను ఎత్తివేయాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ పేర్కొంది. వాస్తవానికి ఆర్టీజీఎస్, నెఫ్ట్‌లపై చార్జీలను ఎత్తివేయడమే కాకుండా, రోజులో 24 గంటల పాటు ఈ సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, దిగుమతి చేసుకునే పీవోఎస్ మెషిన్లపై సుంకాలు ఎత్తివేయాలని, ఇలా ఎన్నో సూచనీలను నీలేకని కమిటీ సిఫారసు చేసింది. కానీ, ఇతర అంశాలపై ఆర్బీఐ స్పందించినట్టు లేదు. ఏటీఎం చార్జీల సమీక్షపై కమిటీ ఏటీఎంల వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి లావాదేవీల చార్జీలను సమీక్షించాలన్న బ్యాంకుల వినతులను మన్నిస్తూ ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈవో చైర్మన్‌గా, భాగస్వాములు అందరితో కలసి ఈ కమిటీ ఉంటుందని తెలిపింది. తొలిసారి భేటీ అయిన తేదీ నుంచి రెండు నెలల్లోపు ఈ కమిటీ నివేదికను సమర్పించాల్సిన ఉంటుందని పేర్కొంది. -
డిజిటల్ చెల్లింపుల కమిటీ చీఫ్‌గా నందన్ నిలేకని
సాక్షి, ముంబై : దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నాయి. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల్లో నగదు వాడకాన్ని తగ్గించేందుకు చాలాకాలంగా డిజిటల్ చెల్లింపులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. డిజిటల్ వాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ సహా పలు రకాలుగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ చొరవ చూపుతున్నాయి. కాగా, భారత్‌లో డిజిటల్ చెల్లింపుల మదింపునకు మంగళవారం ఆర్బీఐ నందన్ నిలేకని నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది.డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఐదుగురు సభ్యులతో ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీకి నిలేకని నేతృత్వం వహిస్తారు. ఇన్పోసిస్ వ్యవస్ధాపకుల్లో ఒకరైన నందన్ నిలేకని యూపీఏ హయాంలో ఆధార్ అమలును పర్యవేక్షించే యూఐడీఏఐకి చైర్మన్‌గా వ్యవహరించారు. -
ఆధార్‌తో సర్కారుకు ఎంత ఆదా అయిందో తెలుసా!
వాషింగ్టన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్ కార్డు స్కీమ్‌తో వేల కోట్లు ఆదా అయ్యాయని దాని రూపకర్త నందన్ నిలేకాని చెప్పారు. లబ్ధిదారుల జాబితాల్లో అక్రమాలకు చెక్ పెట్టడం ద్వారా ఆధార్ మూలంగా దాదాపు రూ 50,000 కోట్లు దుర్వినియోగం కాకుండా అడ్డుకోగలిగామని అన్నారు. గత యూపీఏ హయాంలో చేపట్టిన ఈ పథకాన్ని ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీల నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం సమధికోత్సాహంతో ప్రోత్సహిస్తోందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కూడా అయిన నిలేకాని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో డిజిటల్ ఎకానమీ ఫర్ డెవలప్మెంట్ అనే అంశంపై జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మెరుగైన డిజిటల్ మౌలిక వసతుల నిర్మాణంతో శీఘ్రగతిన ముందుకెళ్లడం అభివృద్ధి చెందుతున్న దేశాలకు మంచి అవకాశమని చెప్పారు. ఆధార్‌ను ఇప్పటివరకూ వంద కోట్ల మందిపైగా నమోదు చేసుకున్నారని తెలిపారు. లబ్ధిదారులు, ఉద్యోగుల జాబితా నుంచి నకిలీలు, డూప్లికేట్లను గుర్తించి వారిని తొలగించడంతో ప్రభుత్వ ఖజానాకూ పెద్ద ఎత్తున నిధులు ఆదా అయ్యాయని అన్నారు.ఆధార్ కారణంగా తాము 50 కోట్ల మంది ఐడీలను వారి బ్యాంక్ ఖాతాలకు జోడించామని, ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ వ్యవస్థకు బాటలు పరిచామని చెప్పారు. ఆధార్‌తో మరెన్నో అద్భుతాలను ఆవిష్కరించనున్నామని నిలేకాని తెలిపారు. -
నందన్ నీలేకని సెకండ్ ఇన్నింగ్స్
-
నందన్ నీలేకని సెకండ్ ఇన్నింగ్స్
ముంబై: అందరూ ఊహించినట్టుగానే, ఆశించినట్టుగానే నందన్ నీలేకని ఇన్ఫోసిస్ బోర్డు ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. దీంతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా తన ప్రస్థానాన్ని కొనసాగించానున్నారు. మరోవైపు శేషసాయి, రవి వెంకటేషన్ బోర్డులోని తమపదవులకు రాజీనామా చేశారు. వీరితోపాటు విశాల్ సిక్కా బోర్డుకు రిజైన్ చేశారు. ఇన్ఫీ సీఎండీ గా విశాల్ సిక్కా అనూహ్య రాజీనామాతో బోర్డులో తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే.