సాక్షి, ముంబై : దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నాయి. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల్లో నగదు వాడకాన్ని తగ్గించేందుకు చాలాకాలంగా డిజిటల్ చెల్లింపులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. డిజిటల్ వాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ సహా పలు రకాలుగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ చొరవ చూపుతున్నాయి.
కాగా, భారత్‌లో డిజిటల్ చెల్లింపుల మదింపునకు మంగళవారం ఆర్బీఐ నందన్ నిలేకని నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది.డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఐదుగురు సభ్యులతో ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీకి నిలేకని నేతృత్వం వహిస్తారు. ఇన్పోసిస్ వ్యవస్ధాపకుల్లో ఒకరైన నందన్ నిలేకని యూపీఏ హయాంలో ఆధార్ అమలును పర్యవేక్షించే యూఐడీఏఐకి చైర్మన్‌గా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment