రన్నింగ్ ట్రైన్‌తో ఆటలు..
ఓ యువకుడు సరదాకు చేసిన స్టంట్ ప్రాణాల మీదకు తెచ్చింది. నాందేడ్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో 26 ఏళ్ల యువకుడు చేతులతో రైలు కిటికీ రాడ్డులను పట్టుకొని ఫుట్ బోర్డుపై స్టంట్ చేశాడు. చేతులతో పట్టుకుని కాళ్లు కిందకు చాచి వేలాడాడు. కొద్దిసేపటి తర్వాత కాళ్లు కింద రాళ్లను తగలడంతో చేతులు జారి కిందపడిపోయాడు. వేగంగా వెళ్లే రైలులోంచి యువకుడు రాళ్ల మీద పడటంతో తీవ్రగాయాలయ్యాయి. గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు నెట్‌ఇంట్లో హల్చల్ చేస్తోంది.
అయితే యువకుడి విన్యాసాలను చూస్తున్న ప్రయాణికులు రైలు చైన్‌ను లాగి, అతన్ని హెచ్చరించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండకపోయేదని నెటిజన్లు స్పందిస్తున్నారు. మొబైల్లో వీడియోను షూట్ చేసిన ట్రైన్లోనే ఉన్న మరో యువకుడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. సామాజికి మాధ్యమాల్లో లైకులు, షేర్ల కోసం యువకులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి స్టంట్లు చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి.