nandikotukur
-
వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి
సాక్షి, నందికొట్కూరు(కర్నూలు) : కొనేటమ్మపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కురువ రాజుపై అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచు, టీడీపీ నాయకుడు పోతుల రామిరెడ్డి దాడి చేశాడు. బ్రాహ్మణకొట్కూరు హెడ్‌కానిస్టేబుల్ తిమ్మప్ప తెలిపిన వివరాల మేరకు.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొనేటమ్మపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చేందుకు రాజు ప్రయత్నించడంతో జీర్ణించుకోలేని రామిరెడ్డి గురువారం దాడి చేసినట్లు బాధితుడి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. -
ప్రత్యే హోదా ఇచ్చిన వారికే కేంద్రంలో మద్దతు
-
‘పొత్తు’పొడిస్తే.. పుట్టి మునిగినట్లే!
తమ్ముళ్లకు బీజేపీ బెంగ సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆచరణసాధ్యం కాని హామీలతో ఇప్పటికే ప్రజల్లో చులకనైన చంద్రబాబు.. ఇప్పుడు పార్టీ శ్రేణులకూ కొరకరాని కొయ్యలా తయారయ్యారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే మనుగడ లేదని గోడ మీద పిల్లుల్లా ఉన్న పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించిన బాబు తన బలం పెరిగిందనే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ మాటున విభజనవాదులకు సీట్లు కట్టబెట్టి నిన్న మొన్నటి వరకు పార్టీకి అండగా నిలిచిన నేతలకు హ్యాండిచ్చారు. కనీసం వారితో మాటమాత్రమైనా చర్చించకుండా తీసుకున్న నిర్ణయాన్ని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలో కర్నూలు, నంద్యాల, నందికొట్కూరు నియోజకవర్గాలు ఈ కోవకు చెందినవే. తాజాగా ఆ పార్టీ బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతోంది. అదే జరిగితే టీడీపీనే నమ్ముకున్న మరికొందరు నాయకులు తమ సీట్లను వదులుకోక తప్పని పరిస్థితి. ‘పొత్తు’ పొడిచినట్లయితే.. పాణ్యం, ఆలూరు, ఆదోని స్థానాలపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతల భవిష్యత్ ప్రశ్నార్థకం కానుంది. పాణ్యం నియోజకవర్గంలో పార్టీకి నేతలు కరువైన సమయంలో టిక్కెట్ ఇస్తాననే అధినేత హామీతో రియల్టర్ కేజే రెడ్డి పచ్చ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత విభజనవాది మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించారు. శ్రీశైలంలో ప్రజలు చీదరించుకోవడంతో ఆయన దృష్టి పాణ్యంపై పడింది. వీరిద్దరి మధ్య సీటు విషయంలో కొనసాగుతున్న పేచీ పార్టీ నాయకులు, కార్యకర్తలను సైతం గందరగోళపరుస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు కుదిరితే జిల్లాలో ఆ పార్టీ రెండు సీట్లు కోరనున్నట్లు తెలుస్తోంది. పాణ్యం.. కోడుమూరు.. నందికొట్కూరు.. ఆలూరు.. ఆదోని నియోజకవర్గాల్లో రెండింటిని బీజేపీ కోరుకోవచ్చనే చర్చ ఉండటంతో ఆయా స్థానాల్లో ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్న టీడీపీ నేతలకు కంటి మీద కునుకు దూరమవుతోంది. కాటసాని ఇంట్లో కమలదళం బీజేపీతో టీడీపీ పొత్తు అనేక మలుపులు తిరుగుతుండగానే ఆ పార్టీ ముఖ్య నేతలు పలువురు కర్నూలులోని పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఇంట్లో సమావేశం కావడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. బుధవారం నగరంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తదితరులు హాజరయ్యారు. సమావేశానంతరం బీజేపీ నేతలు కాటసానితో భేటీ అయ్యారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించగా.. టీడీపీతో పొత్తు ఖరారైతే పాణ్యం టిక్కెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను వారి ముందుంచినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే కేజే రెడ్డి, ఏరాసుల రాజకీయ భవిష్యత్తు వీధిన పడినట్లే. ఆలూరులో నీరజ ఎటువైపో... బీజేపీ ఇటీవల జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో ఆలూరు నుంచి సదానంద, నీరజారెడ్డి పేర్లు తెరపైకి తీసుకొచ్చారు. వారం రోజుల క్రితం వరకు ఆమె కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన జైసమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. ఊహించని విధంగా బీజేపీ ప్రకటించిన జాబితాలో ఈమె పేరు ఉండటం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. బీసీ కార్డుతో టిక్కెట్ దక్కించుకున్న వీరభద్రగౌడ్ ఆశలు నీరుగారినట్లే. మరి బీసీలకు పెద్దపీట వేస్తామంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఈ సామాజిక వర్గానికి ఏమి సమాధానం చెబుతారో వేచి చూడాలి. ఆదోనిలో మూడుముక్కలాట బీజేపీ సీనియర్ నేత, జాతీయ కార్యవర్గ సభ్యుడైన బద్రి నారాయణప్ప తనయుడు నీలకంఠ బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆ పార్టీ ఈయన అభ్యర్థిత్వాన్ని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌జైన్ బీజేపీలో చేరేందుకు బుధవారం తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. బీజేపీ, టీడీపీ పొత్తు కుదిరితే ఆయన ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు భవితవ్యం మూడు ముక్కలాటగా మారింది. -
మున్సి‘పోల్’కు సిద్ధం
ఎనిమిది పురపాలక సంఘాల్లో నేడు పోలింగ్ సాక్షి, కర్నూలు: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అధికార యంత్రాంగం ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని నంద్యాల, ఆదోని, డోన్, ఎమ్మిగనూరు పురపాలక సంఘాలతో పాటు ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, గూడూరు నగర పంచాయతీల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల విధుల్లో 3,061 మంది సిబ్బంది పాల్పంచుకోనున్నారు. మొత్తం నాలుగు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల పరిధిలో 5,20,703 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 486 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులకు 609 మంది పోలింగ్ అధికారులు, మరో 609 మంది సహాయ పోలింగ్ అధికారులు.. 1843 మంది సిబ్బందిని నియమించారు. వీరితో పాటు ఎక్కడికక్కడ పట్టణ పరిధిని బట్టి జోనల్ అధికారులు, రూట్ అధికారులను ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజున 486 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) వినియోగిస్తుండగా.. మరో 154 యంత్రాలను రిజర్వులో ఉంచారు. ఇప్పటికే వీటిని పోలింగ్ కేంద్రాలకు చేరవేయగా శనివారం రోజున సిబ్బందికి శిక్షణనిచ్చారు. ఎన్నికల సంఘం ఈసీఐఎల్ నుంచి నిపుణులైన ఇంజనీర్లు ఎనిమిది మందిని జిల్లాకు కేటాయించింది. వీరు కేటాయించిన పట్టణాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 229 వెబ్ కెమెరాలతో పోలింగ్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్ నిఘా బృందాలతో పాటు 90 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. నాలుగు పట్టణాల్లో 195 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.. 229 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. వీటన్నింటిపైనా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియనంతటినీ వీడియో కవరేజీ చేయనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. 5 గంటల్లోపు క్యూలో ఉన్న ఓటర్లకు ఎంత ఆలస్యమైనా ఓటింగ్‌కు అవకాశం కల్పించనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న మొదటి ఎన్నికలు కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.