Nandini Nursing Home
-
ప్రేక్షకులు తమవాడిగా భావించారు
‘నందిని నర్సింగ్‌హోమ్’ హీరో నవీ¯ŒS విజయ్కృçష్ణ కంబాలచెరువు (రాజమహేందవరం) : ‘అభిమానులు నన్ను కొత్త హీరోలా చూడలేదు. తమవాడు అనుకుని నేను నటించిన ‘నందిని నర్సింగ్‌హోమ్’ చిత్రాన్ని హిట్ చేసినందుకు ఆనందంగా ఉంది’ ఆ చిత్రం హీరో నవీ¯ŒS విజయ్‌కృష్ణ అన్నారు. ‘నందిని నర్సింగ్ హోమ్’ విజయోత్సవయాత్రలో భాగంగా ఆ చిత్రం బృందం కుమారి థియేటర్‌కు శుక్రవారం వచ్చింది. ఈ సందర్భంగా హీరో నవీ¯ŒS విజయ్‌కృష్ణ మాట్లాడుతూ తనను ఆదరిస్తునందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రేక్షకుల కోరికపై సినిమాలోని కొన్ని డైలాగులను చెప్పడంతో థియేటర్ యువత కేరింతలతో మార్మోగింది. నటుడు సీనియర్ నరేష్ మాట్లాడుతూ తన కుమారుడు తొలి సినిమాతోనే విజయబావుటా ఎగురవేయడానికి ప్రధాన కారణం ప్రేక్షక దేవుళ్లేనన్నారు. హీరోయి¯ŒS నిత్యనరేష్ మాట్లాడుతూ ‘కేరింత’ తర్వాత నటించిన ‘నందిని నర్సింగ్ హోమ్’ తనకు మరింత పేరు తీసుకువచ్చిందని, గోదావరి జిల్లా ప్రేక్షకుల అభిమానం మరువలేనిదని అన్నారు. అనంతరం హీరో విజయ్‌కృష్ణ విజయోత్సవ కేక్ కట్ చేసి ప్రేక్షకులకు అభివాదం చేశారు. కార్యక్రమంలో చిత్ర దర్శకుడు పీవీ గిరి, పట్టపగలు వెంకట్రావు, చిత్ర పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యం పాల్గొన్నారు. -
సినిమా చూశాక ఆయన కంట్లో నీళ్లొచ్చాయి
‘‘సినిమా విడుదల ముందు వరకూ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని టెన్షన్ ఉండేది. సినిమా విడుదలయ్యాక చాలా బాగుందని, స్క్రీన్‌ప్లే ఇంకా బావుందని ప్రేక్షకులు అంటుంటే ఆనందం వేసింది’’ అని దర్శకుడు పీవీ గిరి చెప్పారు. నవీన్ విజయ్‌కృష్ణ, నిత్య, శ్రావ్య ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో రాధాకిషోర్. జి, బిక్షమయ్య సంగం నిర్మించిన ‘నందిని నర్సింగ్ హోమ్’ ఇటీవల విడుదలైంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈవీవీ సత్యనారాయణగారు, జనార్ధన మహర్షి దగ్గర అసిస్టెంట్‌గా చేశా. ‘బెండు అప్పారావ్’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ చిత్రాలకు కథ అందించా. నిర్మాత రాధాకిషోర్ నా కజిన్. ‘నందిని నర్సింగ్ హోమ్’ కథ, ఆ కథను నేను న్యారేట్ చేసిన విధానం నిర్మాతలకు నచ్చడంతో నన్నే దర్శకత్వం చేయమన్నారు. కథ విన్న సీనియర్ నరేశ్‌గారు, వారబ్బాయి నవీన్ సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. ఈ చిత్రం మొదటి ఆట చూసిన తర్వాత నరేష్‌గారి కళ్లలో నీళ్లొచ్చాయి. ఈ చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేయాలని అక్కడి నిర్మాతలు అడుగుతున్నారు. నా తదుపరి చిత్రం కథ సిద్ధంగా ఉంది. త్వరలో ఆ వివరాలు చెబుతా’’ అన్నారు. -
నిన్నే.. నన్నే.. నా ఫేవ రెట్స్
‘‘సంగీత దర్శకుడు అచ్చు ఏడేళ్లుగా తెలుసు. మోస్ట్ టాలెంటెడ్. నేను ఊహించినట్టే మంచి సాంగ్స్ ఇచ్చాడు. ‘నిన్నే..’, ‘నన్నే నన్నే..’ నా ఫేవరెట్ సాంగ్స్’’ అన్నారు నవీన్ విజయకృష్ణ. ఆయన హీరోగా పీవీ గిరి దర్శకత్వంలో సంగం బిక్షమయ్య, జి.రాధాకిశోర్ నిర్మించిన ‘నందిని నర్సింగ్ హోమ్’ ఈ నెల 21న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ఆడియో సక్సెస్‌మీట్ నిర్వహించారు. ‘‘ఎడిటర్‌గా మంచి పేరు తెచ్చుకున్న మా అబ్బాయి నవీన్, ఈ సినిమాతో హీరోగానూ మంచి పేరు తెచ్చుకుంటాడనే నమ్మకముంది. మంచి కథ, అచ్చు మంచి సంగీతం ఇచ్చాడు. నిర్మాతలు రాజీ పడకుండా సినిమా తీశారు’’ అన్నారు సీనియర్ నరేశ్. పాటలకు వస్తోన్న స్పందన పట్ల దర్శక-నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. హీరోయిన్లు నిత్యా నరేశ్, శ్రావ్య, పాటల రచయిత రెహమాన్ పాల్గొన్నారు. -
అప్పుడు ఎలా నటించాలో తెలియదు!
‘‘యాభై సంవత్సరాల క్రితం ‘తేనె మనసులు’ చిత్రంలో నటించాను. నాతోపాటు చాలామంది కొత్తవాళ్లతో ఆదుర్తి సుబ్బారావుగారు ఆ చిత్రం తీసి, హిట్ చేశారు. ఆ చిత్రానికి నేను సెలక్ట్ అయినప్పుడు డ్యాన్స్, ఫైట్స్, ఎలా నటించాలో కూడా తెలియదు. నాలుగైదు నెలలు ట్రైనింగ్ ఇచ్చి మరీ సినిమా తీశారు. కానీ, ఈ తరం వారు రెండు మూడేళ్లు అన్ని రంగాల్లో శిక్షణ తీసుకుని సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు. నవీన్ కూడా శిక్షణ తీసుకున్నాడు. తనకు మీ ఆశీర్వాదం (అభిమానులు) ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘నందిని నర్సింగ్ హోమ్’. శ్రావ్య, నిత్య హీరోయిన్లు. పీవీ గిరి దర్శకత్వంలో రాధాకిషోర్.జి, బిక్షమయ్య సంగం నిర్మించారు. అచ్చు స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని హీరో మహేశ్‌బాబు విడుదల చేసి కృష్ణకు అందించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ- ‘‘నవీన్ నాకు చిన్నప్పట్నుంచి తెలుసు. ‘అతడు’, ‘పోకిరి’ చిత్రాలప్పుడు ఎక్కువగా కలిసేవాళ్లం. నా చిత్రాలకు ఫైట్స్ కూడా ఎడిటింగ్ చేశాడు. ‘ఏమవుదామనుకుంటున్నావ్’ అని ఓ సందర్భంలో అడిగితే ‘యాక్టర్ అవుతాను అన్నా!’ అన్నాడు. అప్పుడు తను జోక్ చేస్తున్నాడా? అనిపించింది నాకు. ఎందుకంటే నవీన్ అప్పుడు చాలా లావుగా ఉండేవాడు. ఏడాది తర్వాత తనని కలిస్తే బాగా సన్నబడటంతో పాటు సిక్స్‌ప్యాక్ బాడీలో కనిపించాడు. అప్పుడే తన డెడికేషన్ ఏంటో అర్థమైంది. మనం హార్డ్‌వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందని నమ్ముతాను’’ అన్నారు. ‘‘కథ నచ్చడంతో మొదటి సిట్టింగ్‌లోనే నవీన్ నటించేందుకు ఒప్పుకున్నారు. క్లయిమాక్స్‌లో నవీన్ నటనకు మహేశ్ గుర్తుకొచ్చారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు పీవీ గిరి పేర్కొన్నారు. ఈ వేడుకలో నటి విజయనిర్మల, సీనియర్ నటుడు నరేశ్, దర్శకులు బి.గోపాల్, ఎ.కోదండరామిరెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు ఎమ్మెస్ రాజు, రాజ్ కందుకూరి, హీరోలు సుధీర్‌బాబు, సాయిధరమ్ తేజ్, సంగీత దర్శకుడు కోటి, హీరోయిన్లు శ్రావ్య, నిత్య పాల్గొన్నారు. -
‘నందినీ నర్సింగ్‌హోం’ ఆడియో లాంచ్