ప్రేక్షకులు తమవాడిగా భావించారు
ప్రేక్షకులు తమవాడిగా భావించారు
Published Fri, Oct 28 2016 10:14 PM | Last Updated on Tue, Oct 2 2018 3:16 PM
‘నందిని నర్సింగ్‌హోమ్’ హీరో నవీ¯ŒS విజయ్‌కృçష్ణ
కంబాలచెరువు (రాజమహేందవరం) :
‘అభిమానులు నన్ను కొత్త హీరోలా చూడలేదు. తమవాడు అనుకుని నేను నటించిన ‘నందిని నర్సింగ్‌హోమ్’ చిత్రాన్ని హిట్ చేసినందుకు ఆనందంగా ఉంది’ ఆ చిత్రం హీరో నవీ¯ŒS విజయ్‌కృష్ణ అన్నారు. ‘నందిని నర్సింగ్ హోమ్’ విజయోత్సవయాత్రలో భాగంగా ఆ చిత్రం బృందం కుమారి థియేటర్‌కు శుక్రవారం వచ్చింది. ఈ సందర్భంగా హీరో నవీ¯ŒS విజయ్‌కృష్ణ మాట్లాడుతూ తనను ఆదరిస్తునందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రేక్షకుల కోరికపై సినిమాలోని కొన్ని డైలాగులను చెప్పడంతో థియేటర్ యువత కేరింతలతో మార్మోగింది. నటుడు సీనియర్ నరేష్ మాట్లాడుతూ తన కుమారుడు తొలి సినిమాతోనే విజయబావుటా ఎగురవేయడానికి ప్రధాన కారణం ప్రేక్షక దేవుళ్లేనన్నారు. హీరోయి¯ŒS నిత్యనరేష్ మాట్లాడుతూ ‘కేరింత’ తర్వాత నటించిన ‘నందిని నర్సింగ్ హోమ్’ తనకు మరింత పేరు తీసుకువచ్చిందని, గోదావరి జిల్లా ప్రేక్షకుల అభిమానం మరువలేనిదని అన్నారు. అనంతరం హీరో విజయ్‌కృష్ణ విజయోత్సవ కేక్ కట్ చేసి ప్రేక్షకులకు అభివాదం చేశారు. కార్యక్రమంలో చిత్ర దర్శకుడు పీవీ గిరి, పట్టపగలు వెంకట్రావు, చిత్ర పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యం పాల్గొన్నారు.
Advertisement
Advertisement