సినిమా చూశాక ఆయన కంట్లో నీళ్లొచ్చాయి | Nandini Nursing Home: Comedians run riot | Sakshi
Sakshi News home page

సినిమా చూశాక ఆయన కంట్లో నీళ్లొచ్చాయి

Published Tue, Oct 25 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

సినిమా చూశాక ఆయన కంట్లో నీళ్లొచ్చాయి

సినిమా చూశాక ఆయన కంట్లో నీళ్లొచ్చాయి

‘‘సినిమా విడుదల ముందు వరకూ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని టెన్షన్ ఉండేది. సినిమా విడుదలయ్యాక చాలా బాగుందని, స్క్రీన్‌ప్లే ఇంకా బావుందని ప్రేక్షకులు అంటుంటే ఆనందం వేసింది’’ అని దర్శకుడు పీవీ గిరి చెప్పారు. నవీన్ విజయ్‌కృష్ణ, నిత్య, శ్రావ్య ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో రాధాకిషోర్. జి, బిక్షమయ్య సంగం నిర్మించిన ‘నందిని నర్సింగ్ హోమ్’ ఇటీవల విడుదలైంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈవీవీ సత్యనారాయణగారు, జనార్ధన మహర్షి దగ్గర అసిస్టెంట్‌గా చేశా. ‘బెండు అప్పారావ్’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ చిత్రాలకు కథ అందించా.

నిర్మాత రాధాకిషోర్ నా కజిన్. ‘నందిని నర్సింగ్ హోమ్’ కథ, ఆ కథను నేను న్యారేట్ చేసిన విధానం నిర్మాతలకు నచ్చడంతో నన్నే దర్శకత్వం చేయమన్నారు. కథ విన్న సీనియర్ నరేశ్‌గారు, వారబ్బాయి నవీన్ సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. ఈ చిత్రం మొదటి ఆట చూసిన తర్వాత నరేష్‌గారి కళ్లలో నీళ్లొచ్చాయి. ఈ చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేయాలని అక్కడి నిర్మాతలు అడుగుతున్నారు. నా తదుపరి చిత్రం కథ సిద్ధంగా ఉంది. త్వరలో ఆ వివరాలు చెబుతా’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement