Narayanapur Dam
-
శ్రీశైలం చెంతకు కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: ఎగువ నుంచి కృష్ణా జలాలు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు 33,499 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 813.7 అడుగుల్లో 36.56 టీఎంసీలకు చేరుకుంది. గరిష్ట నీటి మట్టం 885 అడుగులున్న ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 179.26 టీఎంసీలు అవసరం. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కొనసాగుతుండటంతో కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 79 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుత్కేంద్రం, గేట్ల ద్వారా 69 వేల క్యూసె క్కులను దిగువకు వదులుతున్నారు. నారాయ ణపూర్ డ్యామ్‌లోకి లక్ష క్యూసెక్కులు చేరుతుండగా.. 1,08,860 క్యూసెక్కులను విద్యుత్కేంద్రం, గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.దాని దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టులోకి శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో 90,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 17 క్రస్టుగేట్లను ఎత్తి 66,810 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలారు. అలాగే ఎగువ, దిగువ జెన్కో జల విద్యుత్కేంద్రంలోని 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపట్టగా ఇందుకోసం 33,084 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే, కుడి, ఎడమ కాల్వలతోపాటు నెట్టెంపాడు, భీమా లిఫ్టులకు కలిపి మొత్తం 1,04,416 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, నాగార్జున సాగర్‌లోకి ఎలాంటి వరద ప్రవాహం లేదు.తుంగభద్రలో...కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌లోకి 1,03,787 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 68.77 టీఎంసీలకు చేరుకుంది. మరో 37 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తేస్తారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టు నిండుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.అటు కృష్ణా ప్రధానపాయ.. ఇటు తుంగభద్ర బేసిన్లలో శనివారం వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆదివారం కూడా వరద ఇదే రీతిలో కొనసాగుతుందని కేంద్ర జలసంఘం (సీడ బ్ల్యూసీ) అంచనా వేసింది. ఎగువన ఆల్మట్టి, నారా యణపూర్ జలాశయాలు ఇప్పటికే నిండగా, మరో మూడు నాలుగో రోజుల్లో తుంగభద్ర జలాశయం సైతం నిండే అవకాశాలున్నాయి. దీంతో మరో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం జలా శయానికి వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశముంది. వర్షాలు కొనసాగితే నెలాఖరు లోగా శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండే అవకాశాలున్నాయి.మూసీ ప్రాజెక్టుకు జలకళకేతేపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతుండటంతో జలకళ సంతరించుకుంది. హైదరాబాద్‌తోపాటు మూసీ నది పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. బిక్కేరు వాగు నుంచి కూడా నీరు వస్తుండటంతో మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. శనివారం ఉదయం ప్రాజెక్టుకు 810 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో.. సాయంత్రానికి ఒక్కసారిగా 1700 క్యూసెక్కులకు పెరిగింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.06 టీఎంసీల నీరు ఉంది. -
కృష్ణమ్మ మళ్లీ ఉగ్రరూపం
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల): నారాయణపూర్ డ్యామ్ దిగువన కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో, కర్నూలు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆదివారం విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా, తుంగభద్ర, ఉప నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. దాంతో కృష్ణమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,88,090 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 15,833, హంద్రీ–నీవా ద్వారా 914, కల్వకుర్తి ద్వారా 1,167 క్యూసెక్కులు తరలిస్తున్నారు. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,75,680 క్యూసెక్కులను, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,112 క్యూసెక్కులు.. వెరసి 4,37,792 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.2 అడుగుల్లో 210.99 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 4,02,366 క్యూసెక్కులు ప్రవాహం వస్తోంది. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువలకు 20,589 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ స్పిల్ వే 26 గేట్లు, ప్రధాన విద్యుత్కేంద్రం ద్వారా 4,63,888 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 588.6 అడుగుల్లో 307.87 టీఎంసీల నీరు నిల్వ చేస్తున్నారు. సాగర్ నుంచి భారీగా నీరు విడుదల చేయడంతో దిగువన లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సాగర్ నుంచి వస్తున్న ప్రవాహంతో పులిచింతల ప్రాజెక్టులోకి చేరుతున్న వరద గంట గంటకూ పెరుగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 3,87,289 క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్ వే గేట్లు, విద్యుత్ కేంద్రం ద్వారా 3,99,834 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 169.19 అడుగుల్లో 37.23 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,10,692 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 14,962 క్యూసెక్కులను విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 1,95,090 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మంగళవారం ఉదయానికి ప్రకాశం బ్యారేజ్‌లోకి వచ్చే వరద 4.50 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికవర్గాలు తెలిపాయి. కృష్ణా బేసిన్లో మంగళవారమూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో మరో మూడు రోజులపాటు కృష్ణాలో వరద ఉద్ధృతి కొనసాగే అవకాశం ఉంది. -
జూరాల నాలుగు గేట్ల ఎత్తివేత
జూరాల: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం ఇన్‌ఫ్లో పెరగడంతో సాయంత్రం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరదకుతోడు నారాయణపూర్నుంచి ఇన్‌ఫ్లో కలిపి 50వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో జూరాల ప్రాజెక్టులో నాలుగు క్రస్టుగేట్లను ఎత్తి 8320 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అదే విధంగా జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ఆరు టర్బైన్లలో విద్యుదుత్పత్తిని పూర్తిస్థాయిలో చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 48వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఆరు యూనిట్ల ద్వారా 230 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. -
జూరాలకు బిర బిరా కృష్ణమ్మ
ఎగువనున్న కర్ణాటక ప్రాజెక్టులు నిండటంతో కృష్ణా జలాలు బుధవారం రాత్రికి లేక గురువారం ఉదయం జూరాలకు చేరనున్నాయి. ప్రస్తుతం నారాయణపూర్ డ్యామ్ నుంచి 77వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ఆల్మట్టి నుంచి నీటి విడుదల భారీగా ఉండటంతో నారాయణఫూర్ నుంచి ఔట్ ఫ్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆశగా రాష్ట్ర ప్రాజెక్టులు.. ఎగువ వర్షాలతో కర్ణాటకలోని ప్రాజెక్టుల్లో సుమారు 200 టీఎంసీల నీరు చేరగా, రాష్ట్రంలోని ప్రాజెక్టులో మాత్రం కేవలం 8టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. దీంతో మన ప్రాజెక్టులన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 590 అడుగుల మట్టానికి గానూ నీటి నిల్వ 503 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలో 885 అడుగులకు గానూ కేవలం 788 అడుగులో 23టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉంది. జూరాలలో కేవలం 9.66 టీఎంసీలకు 3.58 టీఎంసీల నీరు ఉంది. రెండేళ్లుగా సరైన ప్రవాహాలు లేక వట్టిపోయిన ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి.