
జూరాల క్రస్టుగేట్ల నుంచి విడుదలవుతున్న వరద ›ప్రవాహం.
జూరాల: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం ఇన్‌ఫ్లో పెరగడంతో సాయంత్రం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరదకుతోడు నారాయణపూర్‌నుంచి ఇన్‌ఫ్లో కలిపి 50వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో జూరాల ప్రాజెక్టులో నాలుగు క్రస్టుగేట్లను ఎత్తి 8320 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అదే విధంగా జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ఆరు టర్బైన్లలో విద్యుదుత్పత్తిని పూర్తిస్థాయిలో చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 48వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఆరు యూనిట్ల ద్వారా 230 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు.