Narra Raghava reddy
-
నర్రాకు కన్నీటి వీడ్కోలు
చిట్యాల: సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డికి ప్రజలు కన్నీటివీడ్కోలు పలి కారు. శుక్రవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండ లం వట్టిమర్తిశివారులోని ఆయన వ్యవసాయ క్షేత్రం లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరి గాయి.అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర సాగింది. పోలీసులు గాలిలోకి తుపాకులతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. నివాళులర్పించినవారిలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, సీఎల్పీ నేత జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. -
అధికార లాంఛనాలతో 'నర్రా' అంత్యక్రియలు
హైదరాబాద్ : ప్రజా సేవకుడు, కమ్యూనిస్టు కురవృద్ధుడు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. నర్రా రాఘవరెడ్డి (91) గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం నర్రా రాఘవరెడ్డి 11 గంటల వరకు పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచి అనంతరం నకిరేకల్ కేంద్రానికి తరలిస్తారు. అక్కడి నుంచి వట్టిమర్తి గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారని . అంత్యక్రియలకు తమ్మినేని వీరభద్రం, రాఘవులుతోపాటు ఇతర రాష్ట్ర నాయకులు హాజరవుతారన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు సంతాప దినాలను పాటించి గ్రామ గ్రామాన సంతాప సభలు నిర్వహిస్తామని తెలిపారు. -
నర్రా కన్నుమూత
షుగర్‌తో బాధపడుతున్న రాఘవరెడ్డి నార్కట్‌పల్లి కామినేనిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస నేడు నల్లగొండ జిల్లా వట్టిమర్తిలో అంత్యక్రియలు చిట్యాల/నార్కట్‌పల్లి/నకిరేకల్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి(91) గురువారం సాయంత్రం అనారోగ్యంతో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో కన్నుమూశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని వట్టిమర్తిలోని తన నివాసంలో ఆయన 20 రోజుల క్రితం జారి కిందపడ్డాడు. మధుమేహంతో బాధపడుతున్న నర్రా తీవ్ర అస్వస్థతకు గురవడంతో తొలుత హైదరాబాద్‌లోని నిమ్స్ అసుపత్రికి తరలించారు. కోలుకున్నాక పది రోజుల క్రితం వట్టిమర్తికి తీసుకువచ్చారు. కాగా గురువారం ఆయన మరోసారి తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఉదయం 11 గంటల సమయంలో నార్కట్‌పల్లి శివారులోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో చికిత్స పొందుతూ సాయంత్రం ఆరు గంటల సమయంలో నర్రా మృతిచెందారు. ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం నల్లగొండలోని సీపీఎం కార్యాలయానికి తరలించారు. శుక్రవారం ఆయన స్వగ్రామం వట్టిమర్తిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. నర్రా మరణవార్త తెలుసుకున్న సీపీఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. పార్టీలు, నేతల సంతాపం సాక్షి, హైదరాబాద్: నర్రా రాఘవరెడ్డి మృతి పట్ల సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పార్టీ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సహాయకార్యదర్శి పల్లా వెంకటరెడ్డి సంతాపం ప్రకటించారు. రాష్ర్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రాఘవరెడ్డి జీవితం స్ఫూర్తిదాయకమని శ్లాఘించారు. నర్రా మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. నర్రాకు జోహార్లు అర్పిస్తూ, వారి కుటుంబసభ్యులకు సీపీఎం తరఫున పార్టీ తెలంగాణ కార్యదర్మి తమ్మినేని వీరభద్రం సానుభూతి వ్యక్తంచేశారు. అట్టడుగు నుంచి అగ్ర స్థాయికి.. సీపీఎం విధానాలకు ఆకర్షితుడైన నర్రా రాఘవరెడ్డి 1949లో పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. తర్వాత వట్టిమర్తి గ్రామ శాఖ కార్యదర్శిగా మొదలుకుని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడి వరకు వివిధ హోదాల్లో పని చేశారు. 1959లో వట్టిమర్తి సర్పంచ్‌గా ఎన్నికై ఏడేళ్ల పాటు కొనసాగారు. 1967లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. తొలి ప్రయత్నం లోనే శాసనసభకు ఎన్నికయ్యారు. 1972లో జరిగిన ఎన్నికల్లో పార్టీలో వర్గ విభేదాల వల్ల ఓటమి పాలయ్యారు. 1978 నాటికి పార్టీని నియోజకవర్గంలో పటిష్టం చేసి తిరిగి గెలుపొందారు. అప్పటినుంచి వరుసగా 1984, 1989, 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. 1983 నుంచి ఏడేళ్లపాటు శాసన సభలో సీపీఎంపక్ష నాయకుడిగా పని చేశారు. 1999 తర్వాత వయస్సు మీద పడటం, అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. -
నర్రా కన్నుమూత
-
సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి కన్నుమూత
నల్లగొండ: నల్లగొండ జిల్లా నకిరేకల్ సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి (92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన్ను నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. నర్రా రాఘవరెడ్డి స్వస్థలం చిట్యాల మండలం వట్టిమర్తి. నకిరేకల్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఎన్నో సేవలను అందించారు. 1924లో కమలమ్మ, రామిరెడ్డి దంపతులకు చిట్యాల మండలం వట్టిమర్తిలో పుట్టిన నర్రా రాఘవరెడ్డి.. 1950లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. తొలిసారి 1967లో నకిరేకల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి 1967, 73, 83, 84, 89, 93 సంవత్సరాల్లో అదే నియోజకవర్గం నుంచి ఎన్నికవుతూ వచ్చారు. తర్వాత ఆయన అనారోగ్యానికి గురి కావడంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తుంటే ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, స్పీకర్లు కూడా మంత్రముగ్ధులై వినేవారు. అసెంబ్లీ ప్రసంగాల్లో సమయం, సందర్భాలకు తగినట్లుగా సామెతలు చెప్పడంలో ఆయన దిట్ట. అలాగే అధికార పక్షానికి కీలెరిగి వాతపెట్టడంలో కూడా ఆయనను మించినవారు లేరు. ఏమాత్రం ఆవేశ కావేషాలకు పోకుండానే.. సుతిమెత్తగా వాతలు పెడుతూ తనకు కావల్సిన సమాధానాలను అధికార పక్షం నుంచి రప్పించుకునేవారు. చిట్టచివరి వరకు నీతి నిజాయితీలే ఆస్తిగా బతికారు తప్ప.. ఆస్తులు వెనకేసుకోలేదు. అత్యంత నిరాడంబరమైన జీవితం గడిపేవారు. ముంబాయికి వలస.. రాఘవ రెడ్డి ముంబాయికి వెళ్లి.. 13రూపాయల వేతనానికి గైక్వాడ్ జౌళి మిల్లులో చేరారు. అక్కడ కార్మికులు పని గంటల కోసం పోరాడే సమయంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అప్పుడే కార్మిక నాయకుడిగా ఎదిగారు. ఆయన 1948లో తిరిగి స్వగ్రామం వట్టిమర్తికి చేరుకున్నారు. రజాకారులకు వ్యతిరేకంగా.. 1948లో తెలంగాణ సాయుధ పోరాటం సాగుతోంది. ఈ నేపథ్యంలో మునుగోడు మండలం పలివెల గ్రామంలో రజాకారులకు వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహించారు.. పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో నిర్వహిస్తున్న ఉద్యమాలకు ఆకర్షితుడై ఉద్యమంలో పనిచేశారు. రాజకీయాలలో చెరగని ముద్ర రాజకీయాలపై నర్రా రాఘవరెడ్డి చెరగని ముద్ర వేశారు. 1949లో పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని ఇచ్చింది. ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీలో గ్రామ శాఖ కార్యదర్శిగా మొదలుకొని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుని వరకు వివిధ హోదాలలో పని చేశారు. కమ్యూనిస్టు పార్టీలో గ్రామ స్థాయిలో చురుకుగా పని చేయడంతో 1959 లో వట్టిమర్తి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై ఏడేళ్ల పాటు పని చేశారు. సర్పంచ్‌గా ఎన్నికైన ఏడాదే 1959 లో నార్కట్‌పల్లి సమితి ప్రెసిడెంట్‌గా ఎన్నికై 1964 వరకు కొనసాగారు. మొత్తంగా ఆయన 90 ఏళ్ల జీవితంలో సర్పంచ్‌గా, సమితి ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా సుమారు 37 ఏళ్ల పాటు ప్రజా ప్రతినిధిగా కొనసాగారు.. 1983 నుంచి ఏడేళ్ల పాటు శాసన సభలో సీపీఎం పక్ష నాయకునిగా పని చేశారు. ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చిన తీసుకోకుండా ఆదర్శంగా ఉన్నారు. ఆరోగ్య కారణాలతో పార్టీ ప్రజా ప్రాతినిధ్య పదవి నుంచి తప్పుకున్నారు. రాఘవరెడ్డి మృతిపట్ల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు, సీనియర్ నాయకుడు బీవీ రాఘవులు, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు తదితరులు సంతాపం తెలిపారు. -
నిరాడంబర రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం
నర్రా రాఘవరెడ్డి- ఆదర్శం: నిస్వార్ధం, నిరాడంబరత, నిజాయితీ, సేవాతత్పరత మూర్తీభవించిన వామపక్ష యోధుడు. ప్రజా కళాకారుడిగా ఆరు సార్లు ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యల పరిష్కారానికి అహరహం శ్రమించిన అవిశ్రాంత నేత నర్రా రాఘవరెడ్డి. దీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన నిష్కలంక నేతగా పేరుగాంచారు. నేటి తరం నేతలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సీపీఎం సీనీయర్ నాయకుడు నర్రా రాఘవరెడ్డి నిస్వార్ధం, నిరాడంబరత, నిజాయి తీ, సేవాతత్ప రత నిండిన నేతగా ప్రజాభిమా నం పొందారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండ లం వట్టిమర్తిలో 1924లో నర్రా రాంరెడ్డి, కన కమ్మ దంపతులకు జన్మించిన ఆయన చిన్నతనం లోనే తల్లి మరణించడంతో మారుతల్లి పెట్టే కష్టాలు భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోయారు. కార్మికునిగా, కళాకారుడిగా.. కొన్నాళ్లు హైదరాబాద్‌లోని ఒక హోటల్లో వర్కర్ గా పనిచేశాక ముంబై వెళ్లి రూ.13 వేతనానికి గైక్వాడ్ జౌళి మిల్లులో చేరారు. జీఎం ఖాన్ సహకారంతో కార్మిక నాయకుడిగా ఎదిగారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి కళాకారునిగా స్థానిక సమస్యలను పల్లె సుద్దులతో మిళితం చేసి జనరంజకంగా వివరించేవారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. 1949లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన ఆయన పార్టీలో వివిధ హోదాలలో పనిచేశారు. 1959 నుంచి ఏడేళ్ల పాటు వట్టిమర్తి గ్రామ సర్పంచ్‌గా , నార్కట్‌పల్లి సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1967లో మొదటిసారి నకిరేకల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో మోటార్ సైకిల్‌పై నియోజకవర్గమంతా తిరిగి ప్రచారం చేశారు. కార్యకర్తల ఇళ్లలోనే భోజనం చేస్తూ రూ. 300 ఖర్చుచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1972లో ఓడిపోయినా 1978,1984, 1989, 1994, 1999 ఎన్నికల్లో గెలుపొందారు. ఏడేళ్ల పాటు శాసనసభ లో సీపీఎం పక్ష నాయకునిగా పనిచేశారు. ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థలాన్ని కూడా తీసుకోలేదు. తన హయాం లో 50కిపైగా గ్రామాలకు రహదారుల నిర్మాణం, విద్యుత్, మంచి నీటి సౌకర్యాలను కల్పించారు. శ్రీశైలం ఎడమ కాలువ, మూసీ కాల్వపై లిఫ్టులను సాధించారు. - 90 ఏళ్ల జీవితంలో 37 ఏళ్లు ప్రజా ప్రతినిధిగా ఉన్నారు. - 1978 నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్ఫూర్తిదాయకులు: పుచ్చలపల్లి సుందరయ్య, జీఎం ఖాన్ అభిమానించే సహచరులు: బీఎన్ రెడ్డి, సుద్దాల హనుమంతు, కొండవీటి గురునాధ్‌రెడ్డి, రాచమల్ల రామచంద్రం - ఇష్టమైనవి: ప్రజాకళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాడిగేదెల పెంపకం