Narsingi police
-
రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేసిన నార్సింగి పోలీసులు
-
పోలీసుల అదుపులో రేవంత్ రెడ్డి
-
చర్లపల్లి జైలుకు రేవంత్.. 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను పోలీసులు భారీ బందోబస్తు నడుమ చర్లపల్లి జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. జన్వాడలో నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ ఫామ్ హౌస్‌పై డ్రోన్ కెమెరా వాడిన కేసులో రేవంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రేవంత్.. అక్కడి నుంచి నేరుగా నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. డ్రోన్ కెమెరా వాడిన కేసులో తనపై సెక్షన్ 188, 287, 109, 120(b) కింద కేసు ఎలా నమోదు చేస్తారని రేవంత్ పోలీసులతో వాదనకు దిగారు. అలాగే ఆ ఘటనకు సంబంధించి తన ప్రమేయం గురించి వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన పోలీసులకు సహకరించేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ప్రభుత్వాస్రత్రికి తరలించారు. అనంతరం ఆయన్ని ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. (చదవండి : భూ ఆక్రమణ.. వాల్టా ఉల్లంఘన!) కాగా, ఈ కేసుకు సంబంధించి సెక్షన్ 184, 187, 11 రెడ్ విత్ 5ఏ, రెడ్‌క్రాఫ్ట్ యాక్ట్ కింద రేవంత్‌రెడ్డితోసహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే వీరిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి ఆదేశాల మేరకే వీరు డ్రోన్ ఎగరవేసినట్టు పోలీసులు తేల్చారు. రేవంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు భారీగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి.(చదవండి : హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ సోదరులు) -
హైదరాబాద్‌లో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠా ఆట కట్టించారు సైబరాబాద్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. డ్రస్ సరఫరా చేసే ఇద్దరు నైజీరియన్లతో పాటు ఓ ముంబై మహిళను అరెస్ట్ చేసినట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం.. పుప్పాలగూడ ఫ్రెండ్స్ కాలనీలో కొకైన్ సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన నార్సింగ్ పోలీసులు... సైబరాదాద్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. తమ తనిఖీల్లో ఇద్దరు నైజీరియా వ్యక్తులను, ఓ ముంబై మహిళను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 80 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొకైన్ విలువ 4 లక్షల రూపాయలు ఉంటుంది. సైజీరియాకు చెందిన ఎమ్మాన్యుల్ ఉముడు (43) ఏ1, ఇదుష్ ప్లస్ (45) ఏ2 లు బిజినెస్ వీసా మీద కొన్నేళ్ల కిందట భారత్‌కు వచ్చి ముంబైలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మాన్యుల్-ఏ1, లీలా శివకుమార్ (37) ఏ3 ని వివాహం చేసుకున్నాడు. వీరు గ్రాముకు రూ.4000 నుంచి రూ.5000 ధరకు కొకైన్‌ను విక్రయించేవారు. గతేడాది డిసెంబర్లో తమ వ్యాపారాన్ని హైదరాబాద్‌కు వ్యాప్తి చేయాలన్న ఉద్దేశంతో భార్యాభర్తలు ఎమ్మాన్యుల్-లీలా శివకుమార్‌లు నగరానికి మకాం మార్చారు. తమకు అందిన సమాచారంతో పుప్పలగూడలోని ఫ్రెండ్స్ కాలనీ, సాయి బాలాజీ రెసిడెన్సీలో ఆకస్మిక దాడులు చేపట్టిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. -
ఐదుగురి మృతి కేసులో పలు అనుమానాలు?
సాక్షి, హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బయటపడ్డ ఐదు మృతదేహాల సంఘటనలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారులో రెండు మృతదేహాలు, మరో ముగ్గురి మృతదేహాలు రోడ్డు పక్కన లభించిన విషయం తెలిసిందే. అయితే వారంతా ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా హత్యకు పాల్పడ్డారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కాగా మృతుల్లో రెండు కుటుంబాలకు చెందినవారు ఉన్నారు. అమీన్‌పూర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి భార్య లక్ష్మి, కూతురు సింధూజతోపాటు.... లక్ష్మీ సోదరి కుమారుడు ప్రభాకర్‌రెడ్డి, ఆయన భార్య మాధవి, కుమారుడు వర్షిత్‌గా గుర్తించారు. (కారులో ఉన్న మృతదేహాలు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు వర్షిత్) కాగా రవీందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కలిసి స్టాక్ మార్కెట్ బిజినెస్ చేసేవారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వీరంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని రవీందర్ రెడ్డి చెబుతున్నారు. తమకు ఎవరూ శత్రువులు లేరని, ఎవరిపైనా అనుమానాలు లేవన్నారు. వీరంతా రెండు రోజుల క్రితం ప్రాజెక్ట్ చూసి వస్తామని వెళ్లారని, కాగా మొన్న సాయంత్రం తిరిగి వస్తున్నామని తెలిపారు. అంతలోనే ఏం జరిగిందో ఏమో ... ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీంతో రెండ్రోజుల క్రితమే వారు మిస్సైనట్లు ఇంటి యాజమాని రవీందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంటలో ఇంటికి వస్తామన్నారు... గంట లోపు ఇంటికి వస్తున్నామని చెప్పి... తిరిగిరాని లోకాలకు వెళ్లారంటూ మృతుడు ప్రభాకర్‌రెడ్డి సోదరుడు దినేశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు ఏం జరిగిందో తెలియడం లేదని కన్నీరుమున్నీరయ్యాడు. బయటకు వెళుతున్నామని.. ఇంటి తాళాలు అక్కడే ఉన్నాయని చెప్పారన్నారు. సాయంత్రానికి ఫోన్లన్నీ స్వీచ్ ఆఫ్ వచ్చాయని ఏం జరిగిందో అంతుచిక్కడం లేదని దినేశ్‌రెడ్డి బోరున విలపిస్తున్నాడు కారులో పాయిజన్ వాసన ... మరోవైపు సీపీ సందీప్ శాండిల్య... సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని, ఆత్మహత్యా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నామన్నారు. కారులో పాయిజన్ వాసన వస్తోందని, పోస్ట్‌మార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని సీపీ పేర్కొన్నారు. అలాగే కారులో పురుగుల మందు ఉన్న రెండు బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. -
సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
రాజేంద్రనగర్: గండిపేట్ చెరువులో దూకి సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన సందీప్ సింగ్(27) బెంగళూర్‌లో ఓ సాప్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 12న బెంగళూర్ నుంచి ఇంటికి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొలేకపోతున్నానని బాధపడుతుండటంతో తల్లిదండ్రులు అతడిని ఓదార్చారు. బుధవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన సందీప్ సింగ్ గండిపేట్ ప్రాంతానికి వచ్చి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వాహనంతో పాటు గట్టు వద్ద సెల్‌ఫోన్ వివరాలతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై దాడి: బుకీల అరెస్టు
హైదరాబాద్: రాజేంద్రనగర్ మండలం హైదర్షాకోట్ గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై బుధవారం అర్థరాత్రి ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు బుకీలను అదుపులోకి తీసుకుని, రూ.87వేలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 8 సెల్ఫోన్లు, ఒక కారు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకుని, నిందితులను నార్సింగి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కటకటాల్లోకి కిరాతకుడు
నార్సింగి, యువకుడి హత్య.. యువతి కిడ్నాప్, లైంగికదాడి కేసును నార్సింగ్ పోలీసులు ఛేదించారు. ఈ ఘోరానికి పాల్పడిన ఇద్దరు కిరాతకుల్లో ఒకడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. నార్సింగి పోలీసు స్టేషన్లో మంగళవారం రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. రాజేంద్రనగర్ మండలం పీరంచెరువు గ్రామం హిమగిరికాలనీకి చెందిన యువతి (19), భర్తతో కలిసి ఉంటోంది. ఈమెకు అత్తాపూర్ రింగ్‌రోడ్డు మొఘల్కానాల ప్రాంతానికి చెందిన మహ్మద్ అఫ్రోజ్‌తో వివాహేతర సంబంధం ఉంది. తన భర్తతో ఈమెకు తరచూ గొడవ జరుగుతుండేది. ఇదే క్రమంలో గతనెల 18న గొడవ జరుగగా భర్త ఆమెను కొట్టి ఇంటి నుంచి పారిపోయాడు. వెంటనే ఆ యువతి తన ప్రియుడు అఫ్రోజ్‌కు ఫోన్‌కు చేయగా అతను తన బైక్‌పై వచ్చాడు. ఆమెను చికిత్స నిమిత్తం అదే రాత్రి వట్టేపల్లికి తీసుకెళ్లాడు. చికిత్స అనంతరం రాత్రి ఒంటి గంటకు ఇద్దరూ హిమగిరి కాలనీకి బయలుదేరారు. మార్గం మధ్యలో తప్పతాగి ఉన్న గోపన్‌పల్లికి చెందిన మహ్మద్ మోసియొద్దీన్, సయిద్ ఇద్రీస్ అలియాస్ సమీర్లు బ్లాక్ కలర్ టయోటా కారులో వీరి బైక్‌ను వెంబడించారు. అఫ్రోజ్ యువతి ఇంటి సమీపానికి వచ్చి బైక్‌ను ఆపగానే.. ఇద్రీస్, మోసియొద్దీన్లు కర్రతో దాడి చేశారు. తీవ్రగాయాలు కావడంతో అతను కుప్పకూలాడు. యువతి అరుస్తున్నా లెక్క చేయకుండా ఇద్దరూ ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేసుకుపోయారు. గోపన్‌పల్లిలోని ఓ షెడ్డులోకి కారును తీసుకెళ్లారు. కారులోనే ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. 19వ తేదీ ఉదయం 7 గంటలకు కారులో బాధితురాలిని తీసుకొని టోలిచౌకీ గెలాక్సీ థియేటర్ వద్దకు వచ్చారు. కారును రోడ్డుపై నిలిపి టిఫిన్ తినేందుకు హాటల్లోకి వెళ్లగానే బాధితురాలు తప్పించుకుంది. నేరుగా నార్సింగ్ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. రక్తపు మడుగులో పడి ఉన్న అఫ్రోజ్‌ను పోలీసులు ఉస్మానియాకు తరలించగా చికి త్స పొందుతూ మృతి చెందాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోసియొద్దీన్, ఇద్రీస్లను నిందితులగా గుర్తించారు. మంగళవారం నిందితుల్లో ఇద్రీస్‌ను పట్టుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మోసియొద్దీన్ కోసం గాలిస్తున్నారు. వీరిద్దరూ గతంలో మియాపూర్, దుండిగల్ పోలీసు స్టేషన్ల పరిధుల్లో పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు మిస్టరీని ఛేదించడంలో ప్రతిభ కనపర్చిన నార్సింగి ఇన్స్పెక్టర్ ఆనంద్‌రెడ్డి, ఎస్ఐ హఫీజ్‌లను ఏసీపీ అభినందించారు.