National Highways construction
-
Fact check: బాబు కోసమేగా ‘హైవే’దన రామోజీ?
పచ్చపైత్యం ప్రకోపించడంతో మతిభ్రమించినట్టు ప్రవర్తిస్తున్నారు. తప్పుడు కథనాలతో జనాన్ని నమ్మించేందుకు వికృత రాతలతో పేట్రేగిపోతున్నారు. చేతిలో ఈనాడు పత్రిక ఉందని వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. కళ్లకు పచ్చ గంతలు కట్టుకున్న రామోజీ అడ్డగోలు కథనాలు అచ్చేయిస్తున్నారు. ప్రభుత్వంపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేసేందుకు ప్రతి అంశాన్నీ ఆయుధంగా మలచుకుంటున్నారు. జాతీయ రహదారులపైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఓ కథనాన్ని వండేశారు. కానీ వారికి తెలియందేంటంటే... వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడం. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఐదేళ్లలోనే జాతీయ రహదారుల నిర్మాణం జోరుగా సాగింది. అంతేగాదు... కొత్త జాతీయ రహదారుల పనులు కూడా ప్రజల కళ్లకు కనపడుతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి పాదనలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జాతీయ రహదారులకు భారీగా నిధులు కేటాయించింది. 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి ఏకంగా రూ.71, 200కోట్లు కేటాయించడమే అందుకు నిదర్శనం. ఆ నిధులతో ఏకంగా 3,770 కి.మీ.మేర జాతీయ రహదారుల అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో రూ.40వేల కోట్లు 2022–23లోనే మంజూరు చేశా రు. ఇక జాతీయ రహదారుల్ని అభివృద్ధి చేసేందుకు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. కేవలం ఏడాదిలోనే 6,933 హెక్టార్ల భూమిని సేకరించి ఇచ్చింది. అందులో ప్రభుత్వ భూమి 1,571 హెక్టార్లు కాగా ప్రైవేటు భూమి 5,362 హెక్టార్లు. బాబు చేతులెత్తేస్తే జగన్ పూర్తి చేశారు ► చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.13,353 కోట్లు వెచ్చించగా... వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలోనే రూ.25,304 కోట్లు ఖర్చు చేసింది. ► గత ప్రభుత్వం నిర్మించకుండా చేతులెత్తేసిన విజయవాడలోని బెంజ్ సర్కిల్ పశ్చిమ ఫ్లైఓ వర్, కనకదుర్గ ఫ్లైఓవర్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపేసిన విజయవాడ పశ్చిమ బైపాస్ ఆరులేన్ల రహదారి నిర్మాణాన్ని కూడా తుది దశ కు తీసుకువచ్చింది ఈ ప్రభుత్వమే. ► గొండిగొలను నుంచి అమరావతి మీదుగా గుంటూరు జిల్లా కాజా వరకు విజయవాడ పశ్చిమ బైపాస్ ఆరులేన్ల రహదారి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ► విజయవాడ నుంచి గుంటూరు జిల్లా కాజా వరకు తూర్పు బైపాస్ నిర్మాణానికి ఆమోదించేలా కేంద్రాన్ని ఒప్పించింది. వాస్తవాలు మరచి దుష్ప్రచారం ► 2022–23లో కొండమోడు – పేరేచర్ల మధ్య జాతీయ రహదారిని రూ.1,032.52 కోట్లతో విస్తరించాలని నిర్ణయించింది. కానీ దేశవ్యాప్తంగా భారత్ మాల ప్రాజెక్టుల కింద మంజూరైన ప్రాజెక్ట్‌లను తదుపరి ఉత్తర్వుల వరకు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ 18న ఆదేశించింది. దాంతో టెండర్ల ప్రక్రియ పూర్తి కావచ్చినప్పటికీ కాంట్రాక్టును ఖరారు చేయలేదు. ► 2021–22లో ముద్దనూరు–బి.కొత్తపల్లి రహదారిని రూ.1,020కోట్లతో మంజూరు చేశారు. ఆ ప్రాజెక్ట్ టెండరు ప్రక్రియ తుదిదశలో ఉంది. ► 2022–23 వార్షిక ప్రణాళికలో మొత్తం 450 కి. మీ. మేర 9 రహదారుల నిర్మాణానికి రూ.7,807 కోట్లతో ఆమోదించగా అందులో మూడు ప్రాజెక్ట్‌లకు ఎల్వోఏ మంజూరు చేయగా మిగిలిన ఆరు ప్రాజెక్ట్‌లు టెండరు దశలో ఉన్నాయి. ► 2023 నవంబర్ 10న కేంద్ర జాతీయ రహదారుల సంస్థ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో దేశవ్యాప్తంగా భారత మాల ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కెబినెట్ సబ్‌కమిటీ అనుమతి వచ్చే వరకు దేశంలో భారత మాల కింద కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయకూడదని నిర్ణయించింది. అనంతరం 2017 తరువాత ఆమోదించిన భారత మాల ప్రాజెక్ట్‌లను 20శాతం కంటే ఎక్కువ నిధులు కేటాయించకూడదని మరో నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా భారత మాల ప్రాజెక్ట్‌ల టెండర్ల ప్రక్రియ నిలుపుదల చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం ఈనాడు రామోజీరావు వక్రబుద్ధికి నిదర్శనం. -
రూ. 930 కోట్లతో ఆరు బైపాస్ రహదారులు .. కీలక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారులను జిల్లా ప్రధాన రహదారులను అనుసంధానించే కీలక ప్రాజెక్టులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈమేరకు రాష్ట్రంలో ఆరు బైపాస్ రహదారుల నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. ఒకేసారి ఆరు బైపాస్‌ల నిర్మాణానికి ఆమోదించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రూ. 930 కోట్లతో మొత్తం 64.20 కి.మీ. మేర ఈ ఆరు బైపాస్ రహదారులను నిర్మించనున్నారు. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, పర్యాటకపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆరు పట్టణాలను జాతీయ రహదారులతో అనుసంధానిస్తూ ఈ బైపాస్‌ల నిర్మాణానికి రూపకల్పన చేశారు. వాటిలో రాయలసీమలోని తాడిపత్రి, వి.కోట, బైరెడ్డిపల్లి, ఆదోని, పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఉన్నాయి. సరుకు రవాణా వాహనాల రద్దీ పెరిగిన దృష్ట్యా ఈ ఆరు పట్టణాల్లో బైపాస్ రహదారులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు ప్రతిపాదనలు పంపింది. వీటిని ఇటీవల ఎన్హెచ్ఏఐ ఆమోదించింది. ఎన్హెచ్ఏఐ నిర్మించనున్న ఆరు బైపాస్ రహదారుల ప్రణాళిక ఇలా.. ► బెంగళూరు–చెన్నై రహదారిని అనుసంధానిస్తూ చిత్తూరు జిల్లా వి.కోట వద్ద నాలుగు లేన్ల బైపాస్ రహదారిని నిర్మిస్తారు. 10 కి.మీ. ఈ రహదారి నిర్మాణానికి రూ. 120 కోట్లు కేటాయించారు. ► కర్నూలు జిల్లా బైరెడ్డిపల్లి వద్ద నాలుగు లేన్ల బైపాస్ రహదారిని ఆరు కి.మీ. నిర్మిస్తారు. రూ. 70 కోట్లతో నిర్మాణానికి ఆమోదించారు. ► తాడిపత్రిలో పేవ్డ్ షోల్డర్స్‌తో రెండు లేన్ల బైపాస్ రహదారిని నిర్మిస్తారు. 10 కి.మీ. ఈ రహదారిని రూ. 95 కోట్లతో నిర్మించడానికి ఆమోదం తెలిపారు. ► ఆదోనిలో పేవ్డ్ షోల్డర్స్‌తో రెండు లేన్ల బైపాస్ రహదారిని నిర్మిస్తారు. 7 కి.మీ. ఈ రహదారి నిర్మాణానికి రూ. 80 కోట్లు కేటాయించారు. ► నరసాపురం వద్ద చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిని అనుసంధానిస్తూ పేవ్డ్ షోల్డర్స్‌తో రెండు లేన్ల బైపాస్ రహదారి నిర్మిస్తారు. 23.20 కి.మీ. ఈ రహదారిని రూ. 490 కోట్లతో నిర్మించడానికి ఆమోదించారు. ► అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు వద్ద పేవ్డ్ షోల్డర్స్‌గా బైపాస్ రహదారి నిర్మిస్తారు. 8 కి.మీ. ఈ రహదారి నిర్మాణానికి రూ. 75 కోట్లు కేటాయించారు. -
హైవేల కోసం రాష్ట్ర భూసేకరణ విధానం!
కేంద్రానికి ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం - కేంద్ర విధానం వల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఫిర్యాదు - పరిహారం పెరిగితే ఆ మొత్తాన్ని కేంద్రమే భరించాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల నిర్మాణంలో స్పీడు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల భూసేకరణలో జాప్యం ఏర్పడుతోందని అభిప్రాయపడుతోంది. వాటికి బదులుగా రాష్ట్ర నిబంధనలను రూపొంది స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు వేల కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారులకు అనుమతులు పొందిన విషయం తెలిసిందే. హైవేలను వేగంగా నిర్మించేవిధంగా రూపొందించిన రాష్ట్రప్రభుత్వ భూసేకరణ నిబంధనలకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్రానికి లేఖ రాసింది. కేంద్ర విధానాలను అనుసరిస్తే జాతీయ రహదారుల నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదని పేర్కొంది. కొత్త భూసేకరణ విధానం వల్ల పరిహారం చెల్లింపు పెరిగితే దాన్ని కేంద్రమే భరించాలని కోరడం కొసమెరుపు. ఆ రోడ్డును చూడండి... హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిని 4 వరసలుగా మార్చే పని ఏళ్ల క్రితం మొదలైంది. అతి కష్టమ్మీద హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట రోడ్డు కలిసే వరకు ఈ పనులు పూర్తయ్యాయి. అక్కడి నుంచి వరంగల్ వరకు పనులు జరగాల్సి ఉంది. ఏడాది క్రితమే టెండర్లు పిలిచి ఎల్ అండ్ టీకి పనులు అప్పగించారు. గత ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు నిర్మాణ సంస్థతో అగ్రిమెంటు కూడా జరగలేదు. ఈ రోడ్డు విస్తరణకు భారీగా భూమిని సేకరించాల్సి ఉంది. కానీ కేంద్రప్రభుత్వం ఇచ్చే పరిహారానికి స్థానికులు అంగీకరించటం లేదు. దీనిపై కోర్టుల్లో పెద్ద సంఖ్యలో కేసులు దాఖలయ్యాయి. ఫలితంగా రోడ్డు నిర్మాణ పనులు ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు. ఈ దుస్థితిని రాష్ట్రప్రభుత్వం తాజాగా కేంద్రం ముందుంచింది. సాగునీటి ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా చేసేందుకు భూసేకరణ చట్టాన్ని మార్చామని, దీంతో ప్రాజెక్టుల నిర్మాణంలో ఊపు వచ్చినందున జాతీయ రహదారుల నిర్మాణం కోసం భూసేకరణకూ రాష్ట్రప్రభుత్వ విధానాన్నే అనుసరించాలని నిర్ణయించినట్టు కేంద్రానికి తెలి పింది. దీనిపై కేంద్రమంత్రితో చర్చించేం దుకు త్వరలోనే రోడ్లు భవనాల శాఖ మంత్రి, అధికారులు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.