national unity
-
జాతీయ సమైక్యత అందరి బాధ్యత
- ముస్లిం స్వాతంత్య్ర సమర యోధుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఇలియాస్ - 26న జాతీయ సర్వమత సమ్మేళనం కర్నూలు సీక్యాంప్: కుల,మత, వర్గాలతో సంబంధం లేకుండా దేశ ప్రజలందరూ శాంతియుతంగా జీవించాలని, అందకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముస్లిం స్వాతంత్య్ర సమర యోధుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్ అన్నారు. ఈ నెల 26న కర్నూలు చౌక్‌బజార్‌లో నిర్వహిస్తున్న జాతీయ సర్వమత సమ్మేళనం కార్యక్రమ పోస్టర్‌ను శనివారం కృష్ణానగర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇలియాస్ మాట్లాడుతూ దేశ ప్రజల్లో అనైక్యత వల్లా అశాంతి పెరిగిపోతోందన్నారు. ఈ అశాంతిని తగ్గించడమే లక్ష్యంగా తగ్గించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న జాతీయ సర్వమత సమ్మేళనానికి మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు, పాస్టర్ ప్రభుదాస్, హజ్రత్ మౌలానా సయ్యద్ అష్‌హద్ రహీది మదని ముఖ్యాతిథులుగా హాజరై ప్రసంగిస్తారన్నారు. డీఐజీ రమణకుమార్, జిల్లా ఎస్పీ ఆకెరవికృష్ణ కూడా హాజరవుతారని తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంఘం సెక్రటరీ మౌలానా అబ్దుల్ ఖదీర్, ట్రెజరర్ మహ్మద్ గౌస్, సభ్యులు జిలాన్‌బాషా, అబ్దుల్‌వాజీద్, మౌలానా శుకర్రం తదితరులు పాల్గొన్నారు. -
ఐక్యత కోసం..
పటేల్ సేవలు మరువలేనివి బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజేశ్వర్‌రావు బీజేపీ ఆధ్వర్యంలో ఐక్యతా ర్యాలీ హన్మకొండ : దేశ ఐక్యత కోసం ఉక్కుమనిషి సర్దార్ వల్లబాబాయి పటేల్ ఎనలేని కృషి చేశారని బీజేపీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు అన్నారు. వల్లబాబాయి పటే ల్ జయంతిని కేంద్ర ప్రభుత్వం జాతీయ ఐక్య తా దినంగా ప్రకటించింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఐక్యతా ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం హన్మకొండ సుబేదారి లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఐక్యతా ర్యా లీ నిర్వహించారు. ఈ ర్యాలీని డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ ప్రా రంభించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీని ఉద్దేశించి రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ.. నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని(తెలంగాణ ప్రాంతాన్ని) విడిపించి సమైఖ్య దేశం లో విలీనం చేయడంలో పటేల్ పాత్ర కీలకం అన్నారు. లేకపోతే తెలంగాణ మరో కాశ్మీరులా ఉండేదని పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ఐక్యతకు కృషి చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కో సం పోరాడిన బీఆర్ అంబేద్కర్, నేతాజీ సుభా ష్ చంద్రబోస్. సర్దార్ వల్లబాబాయి పటేల్‌కు రావాల్సిన గుర్తింపు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. పటేల్‌ను ఆదర్శంగా తీసుకొని యువత, విద్యార్థులు మందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు చింతాకుల సునీల్, మాజీ ఎమ్మెల్యే ఒంటేరు జయపాల్, నాయకులు చాడా శ్రీనివాస్‌రెడ్డి, రావుల కిషన్, రావు అమరేందర్‌రెడ్డి, డా క్టర్ టి.విజయలక్ష్మి, డాక్టర్ రామగళ్ళ పరమేశ్వ ర్, గాదె రాంబాబు, మల్లాడి తిరుపతిరెడ్డి, దిలీ ప్నాయక్, కుమారస్వామి, శ్రీరాముల మురళీమనోహర్, గుజ్జ సత్యనారాయణరావు, సి.హెచ్.రాజిరెడ్డి, శేషగిరిరావు, రఘునారెడ్డి, త్రిలోకేశ్వర్‌రావు, మార్టీన్ లూథర్, జన్నె మొగిళి, పుప్పాల రాజేందర్, బన్న ప్రభాకర్, జలగం రంజిత్, బండి సాంబయ్య, వీసం రమణారెడ్డి, నక్క రాంనర్సయ్య, రాజెందర్ పాల్గొన్నారు. -
జాతీయ సమైక్యతకు చిహ్నం... నుమాయిష్
అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: నుమాయిష్ జాతీయ సమైక్యతకు చిహ్నంగా నిలుస్తుందని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం రాత్రి 74వ నుమాయిష్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళ్యాన్ జ్యోతి సేన్ గుప్తా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. భారత రాజ్యాంగం ఎంతో ఉత్తమమైనదని, తామంతా రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోటీ ప్రపంచంలో సవాళ్లను నేటి యువత, విద్యార్థులు ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో రాణించాలని సూచించారు. మారుతున్న ఆధునిక సాంకేతిక రంగానికి అనుగుణంగా విద్యార్థులు తమ భవిష్యత్‌ను మలచుకోవాలని సూచించారు. నుమాయిష్‌లో న్యాయ సలహాల కోసం ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ సెల్ ద్వారా కొందరికైనా ప్రయోజనం కలిగి ఉంటుందని భావిస్తున్నానన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే నుమాయిష్ వాణిజ్య పరంగా అభివృద్ధి సాధించేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు, యువత నుమాయిష్‌లో స్టాళ్లను సందర్శించడం వల్ల ఆయా స్టాళ్లలో ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులపై అవగాహన కలుగుతుందన్నారు. అంతకుముందు ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి అశ్విన్‌మార్గం మాట్లాడుతూ సొసైటీ అందిస్తున్న సేవలను వివరించారు. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖామంత్రి కె.జానారెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ 1938 సంవత్సరం నిజాంల హయాంలో ప్రారంభమైన నుమాయిష్ అంచలంచెలుగా అభివృద్ధి సాధించి అఖిల భారత వస్తు ప్రదర్శన శాలగా ఎదిగి, అంతర్జాతీయస్థాయి ఖ్యాతిని ఆర్జించిందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణాలోని వెనుకబడిన ప్రాంతాల్లో 18 విద్యాసంస్థలను స్థాపించి, 35వేల మంది విద్యార్థులకు విద్యనందిస్తుందన్నారు. దేశంలోనే తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించిన ఘనత సొసైటీకే సొంతమన్నారు. అనంతరం అఖిల భారత వస్తు ప్రదర్శన శాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా, సందర్శకులకు అసౌకర్యం కలుగకుండా సహకరించినందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, 2012 పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పలువురు విద్యార్థులకు శంకర్జీ మెమోరియల్ గోల్డ్ మెడల్స్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా ప్రధానం చేశారు.