National Voters Day celebration
-
ఓటు యాంత్రికం కాదు.. బలమైన ఆయుధం
సాక్షి, అమరావతి బ్యూరో: ఓటు అనేది యాంత్రికంగా ఉపయోగించుకునే హక్కు కాదని, ప్రజాస్వామ్యం మనుగడకు అది అత్యంత బలమైన ఆయుధమని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఓటరుగా చేరడానికి యువత ముందుకు రావాలని, అర్హులను ఓటరుగా నమోదు చేయించే బాధ్యత కూడా స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఓటరుగా నమోదయ్యాక ఓటర్ల జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు. శనివారం విజయవాడలో జరిగిన పదో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలంటే హక్కులతో పాటు విధుల గురించి కూడా తెలుసుకోవాలని చెప్పారు. ఓటు హక్కు ద్వారా మన ప్రజాస్వామ్య దేశాన్ని దృఢంగా, అజేయంగా నిలిపేందుకు వీలుంటుందని అన్నారు. ప్రస్తుతం 2020 ఓటర్ల జాబితా సవరణ జరుగుతోందని, ఫిబ్రవరి 14న తుది జాబితా ప్రచురిస్తారని తెలిపారు. ఎన్నికల్లో సమర్థులను ఎన్నుకోవడం మన బాధ్యత, కర్తవ్యమని గవర్నర్ వెల్లడించారు. గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న అదనపు డీజీపీ రవిశంకర్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా, కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప గ్రామీణ ప్రాంతాల ఓటర్లలోనే ఎక్కువ చైతన్యం ఆధునిక సాంకేతికతను జోడించి ఎన్నికలు నిర్వహించడంలో మనదేశం ప్రపంచంలో ఎన్నో దేశాలకంటే ముందంజలో ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ చెప్పారు. ఓటు హక్కును వినియోగించుకోవాలన్న భావన ప్రతి ఒక్కరిలోనూ అంతర్గతంగా ఏర్పడాలన్నారు. అక్షరాస్యత అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఓటర్లు ఎక్కువ చైతన్యం కలిగి ఉన్నారని పేర్కొన్నారు. పట్టణ ప్రాంత ఓటర్లలోనూ ఇలాంటి చైతన్యం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జేసీ కె.మాధవీలత, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కె.రక్షణనిధి, జేసీ–2 మోహన్‌కుమార్, సబ్‌కలెక్టర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. అవార్డుల ప్రదానం గత సార్వత్రిక ఎన్నికలు, ఓటర్ల జాబితా నిర్వహణ, ఓటు హక్కుపై చైతన్యం వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 29 మంది అధికారులకు గవర్నర్ అవార్డులు, ప్రసంశా పత్రాలను అందజేశారు. అదనపు డీజీపీ ఎ.రవిశంకర్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా, కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప తదితరులు అవార్డులు అందుకున్నారు. -
‘సెలవిచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు’
సాక్షి, హైదరాబాద్ : నేడు మెజారిటీ రంగాల్లో మన దేశం టాప్ 10లో ఉండటానికి ప్రజస్వామ్యమే కారణమన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి. శుక్రవారం రవీంద్ర భారతిలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్‌తో పాటు నాగిరెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లిబియాలో అన్ని వనరులు, సంపద ఉన్నా.. ప్రజస్వామ్యం లేదని తెలిపారు. ఫలితంగా అక్కడ తిండి తినలేని దారుణ పరిస్థితులున్నాయన్నారు. గ్రామాల్లో ఏకంగా 90 శాతం ఓట్లు పోల్ అవుతుంటే.. జీహెచ్ఎంసీలో కనీసం 50 శాతం కూడా పోల్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికి జనాలు ఓటు వేయడానికి ముందుకు రావడం లేదని తెలిపారు. ఓటే భవిష్యత్తును నిర్ణయిస్తుంది : గవర్నర్ ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ నరసింహన్ ఓటరు హెల్ప్ లైన్ పోస్టర్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం అభినందనీయమన్నారు. ఎన్నికల రోజు సెలవు ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు.. ఓటు వేయడానికని తెలిపారు. -
దేశ భవిష్యత్ ఓటరుపై ఆధారపడి ఉంది
మెదక్ మున్సిపాలిటీ: దేశ భవిష్యత్తు ఓటరుపై ఆధారపడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ నగేశ్ విద్యార్థులకు సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవంలో భాగంగాలో శుక్రవారం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు కోసం నమోదు చేసుకోవాలన్నారు. ఓటుహక్కు నమోదు చేసుకుంటే సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యంలో యువతదే కీలక పాత్ర అని, దేశం అభివృద్ధి చెందాలంటే ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఓటరు నమోదు పట్ల ఇళ్లు, పట్టణాలు, గ్రామాల్లో చైతన్యం కల్పించాలన్నారు. ఆర్డీఓ మెంచు నగేశ్ మాట్లాడుతూ యువత తలుచుకుంటూ ఏదైన సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ యాదగిరి, డీటీ మహేందర్, ఆర్ఐ చరణ్, వీఆర్ఓ నాగరాజు, ప్రిన్సిపాల్ నరసింహం, సింహారెడ్డి, పెద్దిరాజు, మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అమరావతి, అధ్యాపకులు వెంకటేశ్వర్లు, కృష్ణ ప్రసాద్, కిరణ్‌కుమార్, నాగరాణి, జ్యోతి,రేఖ, రూహితరణమ్, సరళ, శృతి, సలీమ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటు హక్కుకు మీరెందుకు దూరం
పట్టణవాసులను ప్రశ్నించిన గవర్నర్ ఎన్నికలప్పుడు పెట్టిన కేసులు, సీజ్ చేసిన నగదు ఏమవుతోంది ఎన్నికల నిబంధనల్లో భారీ మార్పులు అవసరం జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ సాక్షి, హైదరాబాద్: ‘ఓటరుగా నమోదు చేసుకుంటున్నప్పటికీ హక్కును విని యోగించు కోవడంలో దూరంగా ఉంటు న్నారు. పట్టణ ప్రాంతంలో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం కొంత మెరుగ్గా ఉంది. చైతన్య వం తులైన పట్టణ వాసులు ఓటు హక్కును వినియోగించుకోకపోవడం దేశానికి చాలా నష్టం.’అని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసిం హన్ అభిప్రాయపడ్డారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరిం చుకుని బుధవారం రవీంద్రభారతిలో జరి గిన కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు, ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం అత్యంత తక్కువగా ఉండడం బాధాక రమన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రక్రియలో నిబంధనల్లో భారీ మార్పులు చేయాల్సిన ఆవ శ్యకత ఉందన్నారు. ‘నేను గవర్నర్‌గా కాకుండా సాధారణ పౌరుడిగా మాట్లాడు తున్నా.. ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికే తల వంపులు కలిగించే విషయం. ఎన్నికల సందర్భంగా వేల కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా రూ.కోట్ల నగదును సీజ్ చేయడం జరు గుతుంది. అయితే ఈ కేసుల పరిశీలన, తీర్పులపై ఎలాంటి సమాచారం ఉండదు. అదే విధంగా పట్టుబడ్డ నగదు ఎక్కడ జమవుతోంది?. ఇలాంటి సందేహాలు ఎక్కువ శాతం ఒటర్ల మదిని ప్రశ్నిస్తు న్నాయి.’ అని అన్నారు. ఎన్నికల కేసులను మూడు నెలల్లో పరిష్కరిం చాలనే నిబంధన తీసుకురావాలని, బాధ్యు లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకురావాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. యువత ప్రశ్నించే విధా నాన్ని అలవర్చుకోవాలని, ఓటు వేసి అత్యు త్తమ ప్రభుత్వ ఏర్పాటుకు పునాది వేయాల న్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వ ర్లాల్ మాట్లాడుతూ ఓటు హక్కును వినియో గించుకోకపోవడంతో ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోతామన్నారు. ఓటర్లు సైతం పోటీ తత్వా న్ని అలవర్చుకోవాలని, ఉద్యమంలా ఓటు హక్కును వినియోగించుకుంటే స్వచ్చమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. అనంతరం నేషనల్ ఓటర్స్డే పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు, విధుల్లో అత్యు త్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, ఉద్యో గులకు గవర్నర్ బహుమతులు అందజేశారు.