ఓటు హక్కుకు మీరెందుకు దూరం
పట్టణవాసులను ప్రశ్నించిన గవర్నర్
ఎన్నికలప్పుడు పెట్టిన కేసులు, సీజ్ చేసిన నగదు ఏమవుతోంది
ఎన్నికల నిబంధనల్లో భారీ మార్పులు అవసరం
జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో గవర్నర్ నరసింహన్
సాక్షి, హైదరాబాద్: ‘ఓటరుగా నమోదు చేసుకుంటున్నప్పటికీ హక్కును విని యోగించు కోవడంలో దూరంగా ఉంటు న్నారు. పట్టణ ప్రాంతంలో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం కొంత మెరుగ్గా ఉంది. చైతన్య వం తులైన పట్టణ వాసులు ఓటు హక్కును వినియోగించుకోకపోవడం దేశానికి చాలా నష్టం.’అని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసిం హన్ అభిప్రాయపడ్డారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరిం చుకుని బుధవారం రవీంద్రభారతిలో జరి గిన కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు, ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం అత్యంత తక్కువగా ఉండడం బాధాక రమన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రక్రియలో నిబంధనల్లో భారీ మార్పులు చేయాల్సిన ఆవ శ్యకత ఉందన్నారు. ‘నేను గవర్నర్‌గా కాకుండా సాధారణ పౌరుడిగా మాట్లాడు తున్నా.. ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికే తల వంపులు కలిగించే విషయం. ఎన్నికల సందర్భంగా వేల కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా రూ.కోట్ల నగదును సీజ్ చేయడం జరు గుతుంది. అయితే ఈ కేసుల పరిశీలన, తీర్పులపై ఎలాంటి సమాచారం ఉండదు.
అదే విధంగా పట్టుబడ్డ నగదు ఎక్కడ జమవుతోంది?. ఇలాంటి సందేహాలు ఎక్కువ శాతం ఒటర్ల మదిని ప్రశ్నిస్తు న్నాయి.’ అని అన్నారు. ఎన్నికల కేసులను మూడు నెలల్లో పరిష్కరిం చాలనే నిబంధన తీసుకురావాలని, బాధ్యు లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకురావాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. యువత ప్రశ్నించే విధా నాన్ని అలవర్చుకోవాలని, ఓటు వేసి అత్యు త్తమ ప్రభుత్వ ఏర్పాటుకు పునాది వేయాల న్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వ ర్‌లాల్ మాట్లాడుతూ ఓటు హక్కును వినియో గించుకోకపోవడంతో ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోతామన్నారు. ఓటర్లు సైతం పోటీ తత్వా న్ని అలవర్చుకోవాలని, ఉద్యమంలా ఓటు హక్కును వినియోగించుకుంటే స్వచ్చమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. అనంతరం నేషనల్ ఓటర్స్‌డే పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు, విధుల్లో అత్యు త్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, ఉద్యో గులకు గవర్నర్ బహుమతులు అందజేశారు.