కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు,మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్ నగేశ్
మెదక్ మున్సిపాలిటీ: దేశ భవిష్యత్తు ఓటరుపై ఆధారపడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ నగేశ్ విద్యార్థులకు సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవంలో భాగంగాలో శుక్రవారం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు కోసం నమోదు చేసుకోవాలన్నారు. ఓటుహక్కు నమోదు చేసుకుంటే సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యంలో యువతదే కీలక పాత్ర అని, దేశం అభివృద్ధి చెందాలంటే ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఓటరు నమోదు పట్ల ఇళ్లు, పట్టణాలు, గ్రామాల్లో చైతన్యం కల్పించాలన్నారు. ఆర్డీఓ మెంచు నగేశ్ మాట్లాడుతూ యువత తలుచుకుంటూ ఏదైన సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ యాదగిరి, డీటీ మహేందర్, ఆర్‌ఐ చరణ్, వీఆర్‌ఓ నాగరాజు, ప్రిన్సిపాల్ నరసింహం, సింహారెడ్డి, పెద్దిరాజు, మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అమరావతి, అధ్యాపకులు వెంకటేశ్వర్లు, కృష్ణ ప్రసాద్, కిరణ్‌కుమార్, నాగరాణి, జ్యోతి,రేఖ, రూహితరణమ్, సరళ, శృతి, సలీమ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment