joint collecter
-
‘పచ్చ’మూక అక్రమాలపై జాయింట్ కలెక్టర్ కన్నెర్ర
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాప్తాడు నియోజకవర్గం ప్రసన్నాయపల్లి పంచాయతీ చిన్మయనగర్‌లోని రూ.100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలు కాజేసినా అధికారులు గుర్తించకపోవడంపై జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24.49 ఎకరాల భూమి అన్యాక్రాంతంపై ‘ప్రభుత్వ భూములపై పచ్చమూక’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై జేసీ స్పందించారు. డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ప్రసన్నాయపల్లిలోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెట్టారు? రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్ల నమోదుకు సహకరించిన అధికారులెవరు? రూ.100 కోట్లకు పైగా విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నా స్థానికఅధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిషేధిత జాబితాలో ఉన్న భూమిని ఎలా రిజిష్టర్ చేశారు? అన్న కోణాల్లో విచారణ జరపాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. వారు రెండు,మూడు రోజుల్లో నివేదికను జేసీకి అందజేయనున్నారు. దాని ఆధారంగా నిందితులపై క్రిమినల్ కేసులు పెడతామని జేసీ ‘సాక్షి’కి తెలిపారు. భూములను పరిశీలించిన తహసీల్దార్ అన్యాక్రాంతమైన ప్రసన్నాయపల్లి పరిధిలోని ప్రభుత్వ భూములను రాప్తాడు తహసీల్దార్ బి.ఈరమ్మ బుధవారం పరిశీలించారు. రెవెన్యూ అధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు జరిగాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిషేధిత జాబితాలో ఉన్నా సబ్రిజిస్ట్రార్ల తప్పిదం వల్లే ప్రైవేటు వ్యక్తులకు రిజిష్టర్ చేశారంటూ ధర్మవరం ఆర్డీవోకు నివేదిక పంపారు. అదే సమయంలో వెబ్‌ల్యాండ్‌లో నమోదైన పేర్ల ఆధారంగా మాజీ మంత్రి పరిటాల సునీత అనుచరుడు పంజగల శ్రీనివాసులు భార్య పంజగల ప్రసన్నతో పాటు మరో పది మందికి నోటీసులు పంపారు. చదవండి: Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన చార్మీ -
బాల్ సరిగా వెయ్.. కరోనా బాధితులతో జేసీ వాలీబాల్
బొబ్బిలి: కరోనా వైరస్ బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిశోర్‌కుమార్ ముందడుగు వేశారు. కోవిడ్ కేర్ సెంటర్‌కు వెళ్లి వారితో కలిసి ఆటలాడి వారిలో ఆందోళన పోగొట్టారు. ఆయన బుధవారం బొబ్బిలి గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలోని కోవిడ్ కేర్ సెంటర్‌ను పరిశీలించారు. అక్కడున్న 123 మంది కరోనా వైరస్ బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారు చెప్పిన చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి అక్కడే ఉన్న తహసీల్దార్ ఆర్.సాయికృష్ణ, సీఎస్‌డీటీ బలివాడ గౌరీశంకర్‌లకు ఆదేశాలిచ్చారు. కరోనా వల్ల ఏం కాదని, జాగ్రత్తలు మాత్రం ముఖ్యమని చెబుతూ బాధితులతో కలిసి వాలీబాల్ ఆడారు. బాల్ సరిగా వెయ్.. అంటూ వారిని ఉత్సాహపరిచారు. దీంతో కోవిడ్ బాధితులు కూడా ఉత్సాహంగా ఆయనతో ఆడారు. రోజూ మూడు షిఫ్ట్‌ల్లో వైద్యులు, సిబ్బంది ఉండాలని, త్వరితగతిన రికవరీ అయ్యేలా వారిలో ధైర్యాన్ని నూరిపోయాలని జేసీ అధికారులకు సూచించారు. చదవండి: ‘జగనన్న ప్రాణవాయువు’ రథచక్రాలు ప్రారంభం ఆత్మ బంధువులు: మానవత్వమే ‘చివరి తోడు’ -
కనీసం నీళ్లివ్వకపోతే ఎలా..?
సాక్షి, అనంతపురం : ‘కరోనా బాధితులు తీవ్ర భయాందోళనల్లో ఉంటారు. అలాంటి వారికి మనమే రక్షణగా ఉండాలి. సక్రమంగా సేవలందించాలి. అలాంటిది కనీసం వారికి తాగునీరు కూడా అందించకపోతే ఎలా...? మీరు చెప్పండి... నిజంగా ఈ వార్డులో కనీస మౌలిక సదుపాయాలున్నాయా...? ఒక్క రోజు మీరిక్కడుండి తర్వాత మాట్లాడండి’ అంటూ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్, ఇన్చార్జ్ ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మపై జాయింట్ కలెక్టర్ అట్టాడ సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఇస్త్రీ బట్టల్లో రూ.5 లక్షల బంగారం దొరికినా..) సర్వజనాస్పత్రిలో కరోనా బాధితుల వెతలపై ‘మేమిక్కడ ఉండలేం బాబోయ్’ శీర్షికన ‘సాక్షి’లో ఆదివారం వెలువడిన కథనంపై కలెక్టర్ గంధం చంద్రుడు స్పందించారు. అక్కడున్న పరిస్థితులను పరిశీలించి, నివేదిక ఇవ్వాలంటూ జేసీ సిరిని ఆదేశించారు. దీంతో అసిస్టెంట్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌తో కలిసి ఆదివారం ఉదయం ఆమె సర్వజనాస్పత్రిని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఐడీ వార్డులో రోగులనుభవిస్తున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పత్రికలు ఎండగట్టవా అంటూ సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలపై మండిపడ్డారు. (తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్) నేరుగా ఐడీ వార్డులోకి జేసీ.. ఐడీ వార్డులో ఉన్న రోగుల వద్దకు వెళ్లేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది వెనుకంజ వేస్తున్న ప్రస్తుత తరుణంలో జేసీ సిరి ధైర్యంగా నేరుగా ఐడీ వార్డులో కాలు పెట్టారు. ఆ సమయంలో ఆస్పత్రిలోని ఉన్నతాధికారులు సైతం ఆమె వెంట లోపలకు వెళ్లేందుకు భయపడ్డారు. కరోనా బాధితుల వద్దకే వెళ్లి నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను చాలా ఓపిగ్గా విన్నారు. వార్డులో నీటి సౌకర్యం లేకపోవడం, మౌలిక సదుపాయాలు లోపించడం గుర్తించారు. ఊపిరాడడం లేదంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేయగా.. కిటికీలు తీయించారు. ఇద్దరు రోగులు ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి, వారిని ఐసోలేషన్ వార్డుకు మార్చాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఐసోలేషన్‌లో ఉంచాలన్నారు. అనంతరం కోవిడ్ ఎస్ఆర్ క్వార్టర్స్, ఐసోలేషన్ వార్డులను పరిశీలించారు. (ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ) నిరంతరం సేవలందాలి.. కరోనా పాజిటివ్ కేసులు, అనుమానితులకు నిరంతరం సేవలందాలని వైద్య సిబ్బందిని జేసీ ఆదేశించారు. రోగులకందించే డైట్ మెనూలో మార్పులు చేయాలన్నారు. మంచి పౌష్టికాహారం అందించాలన్నారు. ప్రతి గదిలోనూ మూడు వాటర్ క్యాన్లు అందుబాటులో ఉంచాలన్నారు. వార్డులను వీలైనన్ని ఎక్కువసార్లు శుభ్రం చేయించాలన్నారు. డ్యూటీ వైద్యులెవరు...? కింది స్థాయి సిబ్బంది డ్యూటీలో ఎవరుంటారన్న బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. మరోసారి పరిశీలనకు వచ్చినప్పుడు ఇవే తప్పులు కనిపిస్తే ఉపేక్షించబోనని హెచ్చరించారు. సదుపాయాలు మెరుగుపరుస్తాం ఆస్పత్రిలోని ఐడీ వార్డులో సమస్యలున్న మాట వాస్తవమే. వీటిని మరింత మెరుగుపరుస్తాం. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారిని ఐసోలేషన్లోకి మార్చాలని ఆదేశించా. ఒక్కో షిప్టులో మూడు క్యాన్ల ప్యూరిఫైడ్ వాటర్‌ను ఉంచాలని చెప్పాం. ప్రస్తుతానికి డైట్ ఒకే కానీ, అందులో మరింత నాణ్యత పెంచేలా చర్యలు తీసుకోవాలన్నాం. శానిటేషన్లోనూ మరిన్ని మార్పులు తీసుకువచ్చి బాధితులకు మెరుగైన సేవలందిస్తాం. – సిరి, జాయింట్ కలెక్టర్ -
దేశంలోనే సరికొత్త చరిత్రకు శ్రీకారం
సాక్షి, విశాఖపట్నం: ‘రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ అనే కార్యక్రమంలో భాగంగా సొంత ఇల్లు లేని అర్హులైన వారికి నివాస స్థల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టారు. గ్రామీణ ప్రాంతంలో ఒకటిన్నర సెంట్లు, పట్టణ ప్రాంతంలో కనీసం ఒక సెంటు చొప్పున ఇంటి స్థలం ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమం అంతా మార్చి 25వ తేదీ ఉగాది రోజున ఒక పండుగలా జరగనుంది. స్థలం ఇవ్వడమంటే పట్టా ఇచ్చేయడమనే గత విధానానికి భిన్నంగా సాగుతుంది ఇప్పటి ప్రక్రియ. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏవిధంగా అయితే లేఅవుట్లు అభివృద్ధి చేస్తారో ఆ మాదిరిగా ప్రభుత్వమే అన్ని ప్రాథమిక వసతులు కల్పించి ఇవ్వాలనేది ఉద్దేశం. అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు ఏర్పాటు చేయడమే గాక ఆ లేఅవుట్లో సామాజిక అవసరాలకు స్థలం కేటాయింపు ఉంటుంది. సరిహద్దులు గుర్తించి, ఆ ప్రకారం రాళ్లు వేయిస్తున్నాం. ఆ స్థలంపై లబ్ధిదారుల కుటుంబంలోని మహిళకు యాజమాన్య హక్కు ఉంటుంది. గతంలో ఇచ్చినట్లు అసైన్డ్ పట్టా మాదిరిగా గాకుండా యాజమాన్య హక్కు పత్రం (కన్వీయన్స్ డీడ్) తయారుచేసి ప్రభుత్వం ఇస్తోంది. అర్హులందరికీ స్థలం కుల, వర్గ, మత, రాజకీయాలకు అతీతంగా ఈ స్థలాల కేటాయింపు కోసం లబ్ధిదారులను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగింది. ఇంటింటికీ వెళ్లి గ్రామ, వార్డు వలంటీర్లు సర్వే నిర్వహించారు. ఎంపికైన లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో, మండల కార్యాలయాల్లో ప్రదర్శించాం. దరఖాస్తు చేసుకున్నా కొంతమందికి ఎందుకు అర్హత లేదో స్పష్టంగా పేర్కొంటూ అనర్హుల జాబితాలను ఉంచాం. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి పునఃపరిశీలన చేయించాం. ఆ దశలోనూ అర్హులైనవారికి అవకాశం కల్పించాం. జిల్లాలో 2.50 లక్షల మందికి లబ్ధి జిల్లాలో ఇప్పటివరకూ లెక్క తేలిన లబ్ధిదారులు 2.50 లక్షల మంది. గ్రామీణ ప్రాంతంలో సుమారు 66 వేల మంది ఉన్నారు. వారికి ఒకటిన్నర సెంట్లు చొప్పున స్థలం కేటాయించాలంటే లేఅవుట్లు వేసేందుకు 1,613 ఎకరాల భూమి అవసరమవుతోంది. దీనిలో 1,393 ఎకరాలు అంటే దాదాపు 1,400 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించాం. అదీ ఏ గ్రామంలో లబ్ధిదారులకు ఆ గ్రామ పరిధిలోనే స్థలం ఇవ్వాలనేది లక్షం. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. వేరే గ్రామంలో స్థలం ఇచ్చినా అక్కడ నివాసానికి వెళ్లకపోవచ్చు. అందుకే సాధ్యమైనంత వరకూ ఒక గ్రామంలోని లబ్ధిదారుల కోసం ఆ గ్రామ పరిధిలోనే లేఅవుట్ వేయిస్తున్నాం. ప్రభుత్వ భూమి అందుబాటులో లేనిచోట 171 ఎకరాల అసైన్డ్ భూమి మాత్రమే తీసుకున్నాం. జిరాయితీ భూమి ధరతో సమానంగా పరిహారం ఇచ్చిన తర్వాతే వాటిని సేకరించాం. ఇక ప్రభుత్వ, అసైన్డ్ భూమి అందుబాటులో లేనిచోట 47.64 ఎకరాల మేర జిరాయితీ భూమి కూడా తీసుకున్నాం. ఇందుకు రూ.46.83 కోట్ల మేర బిల్లులు పంపించాం. కొంతమందికి ఇప్పటికే ఆ మొత్తం అందింది కూడా. వీఎంఆర్డీఏకు బాధ్యతలు.. విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) అనేది ఒక ప్రభుత్వ సంస్థ. విశాఖ నగర పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి బాధ్యతలు దీనికే ప్రభుత్వం అప్పగించింది. ప్రతి లేఅవుట్‌లోనూ పక్కాగా రోడ్లు, డ్రెయిన్లు, వీధిదీపాల సహా మౌలిక వసతులన్నీ కల్పించి ఇస్తుంది. ఇందుకు రూ.150 కోట్ల వరకూ ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్చి 25వ తేదీన ఉగాది రోజున పట్టాల పంపిణీకి అన్నీ సిద్ధమవుతాయి. 20 బ్లాక్‌ల్లో లేఅవుట్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీఎంఆర్డీఏ ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఈ బ్లాక్‌లన్నీ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయి. వార్డుల వారీ లబ్ధిదారులకు వారికి సమీప బ్లాక్‌లోనే స్థలం కేటాయించేలా మ్యాపింగ్ చేస్తున్నాం. కన్వీయన్స్ డీడ్స్ సిద్ధం చేస్తున్నాం ప్రతి లబ్ధిదారుడికి కేటాయించిన స్థలానికి సంబంధించి కన్వీయన్స్ డీడ్ (ఆస్తి హక్కు పత్రం)ను ప్రభుత్వం ఇస్తుంది. వాటిని లబ్ధిదారుల కుటుంబంలో మహిళ పేరిట అన్ని వివరాలతో సిద్ధం చేస్తున్నాం. పట్టణంలోనే ల్యాండ్ పూలింగ్.. విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)తో పాటు నర్సీపట్నం, యలమంచిలి పురపాలక ప్రాంతాల్లో మొత్తం 1,84,704 మందికి ఇళ్ల స్థలాలకు అర్హులుగా గుర్తించాం. వారిలో 28,152 మందికి టిడ్కో ఇళ్లను కేటాయిస్తాం. మిగతా 1,56,552 మందికి ఇళ్ల స్థలం ఇవ్వాల్సి ఉంది. జీవీఎంసీ పరిధిలోనే సుమారు 1.52 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వారి కోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమి సమీకరించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికి 5,200 ఎకరాల భూసమీకరణ ప్రక్రియ పూర్తి అయ్యింది. అసైన్డ్ భూమి అనుభవదారులైన రైతులు, ప్రభుత్వ భూమి ఆక్రమణదారులు చాలామంది తమ ఆమోదం తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేదు. వారికి ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి చేసిన లేఅవుట్లో స్థలం ఇస్తారని ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. అధికార యంత్రాంగంపై విశ్వాసం ఉంది. తక్కువ ఖర్చుతోనే.. రాష్ట్రంలో ఇంత తక్కువ మొత్తం ఖర్చుతో భూసేకరణ పూర్తి అయ్యింది మన జిల్లాల్లోనే. దాదాపుగా ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమినే లేఅవుట్ల కోసం వినియోగిస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో మొత్తం 845 లేఅవుట్లు వేస్తున్నాం. వాటిలో 493 లేఅవుట్లు అన్ని విధాలా సిద్ధమయ్యాయి. వాటిలో 33,192 ప్లాట్లను సిద్ధం చేసేశాం. మిగతావి కూడా మరో ఒకటీ రెండు వారాల్లో సిద్ధమవుతాయి. -
ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు : జేసీ
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో అధికారుల పేరుతో రైస్‌మిల్లుర్లు, వ్యాపారులు వద్ద నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, జిల్లాలో మిల్లులు యజమానులు, వ్యాపారులు ఎవరూ అటువంటివారికి ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని జేసీ కె. వెంకటరమణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జిల్లా ఉన్నతాధికారులు పేరుతో వ్యాపారులు నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారని తెలియవచ్చిందని, అటువంటి వారు ఎవరైనా వచ్చినట్లైతే పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. -
అధికారుల గైర్హాజరుపై జేసీ ఆగ్రహం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రజా ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని, ఆలస్యం చేయవద్దని జేసీ స్వర్ణలత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఆమె ఫిర్యాదులు స్వీకరించారు. అయితే, ప్రజావాణికి మున్సిపల్ అధికారులు హాజరు కాకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖ అధికారులు కచ్చితంగా హాజరు కావాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేసి ప్రజావాణికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. శాఖ నుంచి ఓ అధికారిని ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు. ఎక్కువ సంఖ్యలో మున్సిపల్ శాఖకు చెందిన ఫిర్యాదులు వస్తాయని ఆ శాఖ అధికారి లేకుంటే ఎలా అన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ ప్రేమ్‌రాజు, ఐసీడీఎస్‌పీడీ శంకరచారీ, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్యాంసుందర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు నారాయణపేట: సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఇచ్చిన ప్రతీ ఫిర్యాదును వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకట్రావ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాయలంలో ప్రధానంగా భూసమస్యలు, కొత్తపాసుపుస్తకాలు, రికార్డుల సవరణ, భూ సర్వే, పించన్లు తదితర వాటిపై వినతలను అందజేశారు. సంబంధిత అధికారులకు వినతులను పంపించి సత్వరమే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ ఫిర్యాదుదారులకు భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ చీర్ల శ్రీనివాసులు, జడ్పీ సీఈఓ కాళిందిని, ఏఓ బాలాజీ, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎస్పీకి 12 ఫిర్యాదులు ప్రజావాణిలో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్ చేతనకు 12 ఫిర్యాదులు అందాయి. ఈమేరకు ఎస్పీ వారితో మాట్లాడుతూ చట్టప్రకారం పరిష్కరించాల్సినవి తమ పరిధిలో ఉన్నవాటిని పరిశీలిస్తామని, కోర్టు పరిధిలో ఉంటే ఆవి అక్కడే పరిష్కారమవుతాయని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత సీఐ, ఎస్ఐలకు పంపించి పరిష్కరిస్తామన్నారు. -
ఆ అధికారి బదిలీ మేము జీర్ణించుకోలేకపోతున్నాం
సాక్షి,మేడ్చల్(హైదరాబాద్) : మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా రెవెన్యూ శాఖకు బదిలీ కావడం జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. డిప్యూటీ తహసీల్దార్ నుంచి అంచెలు అంచెలుగా ఎదిగిన శ్రీనివాస్‌రెడ్డి జాయింట్ కలెక్టర్ స్థాయికి చేరుకున్నారు. మేడ్చల్ జాయింట్ కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాదిన్నర కాలంలో రెవెన్యూశాఖలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం బొమ్మరాసిపేటలో రైతులను ఒప్పించి భూములను సేకరించగలిగారు. ప్రభుత్వ పథకాలు నేరుగా పేద ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు.జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సందర్శకులు, బాధితులు ఎవరొచ్చినా ఆప్యాయంగా పలకరిస్తూ మర్యాదపూర్వకంగా మెలిగేవారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి ఆదేశాలను పాటిస్తూనే ఉద్యోగులందరితో ఐక్యంగా మెలుగుతూ మంచి అధికారిగా గుర్తింపు సాధించారు. జిల్లా ప్రజల హృదయాన్ని గెలుచుకున్న శ్రీనివాస రెడ్డి బదిలీ ఆగిపోతే బాగుంటుందని ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారు. -
ఎమ్మెస్వోలపై జేసీ అనుచిత వ్యాఖ్యలు
-
జాయింట్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
జాయింట్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
విజయనగరం జిల్లా : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కాకర్ల నాగేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. బెంగుళూరు, విశాఖపట్నంలోని 4 ప్రాంతాల్లో, అనకాపల్లి, విజయనగరం జిల్లాలోని 3 ప్రాంతాల్లో, పశ్చిమ గోదావరి జిల్లా పోతవరం మండలం త్యాజంపూడి గ్రామంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
మా గోడు వినండయ్యా..
మహబూబ్‌నగర్ న్యూటౌన్: మా గోడు వినండయ్యా అంటూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు ప్రజావాణిలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ సమావేశం హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్, జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ కొమురయ్య, మెప్మా పీడీ గోపాల్ ప్రజలనుంచి వినతలు, ఫిర్యాదులు స్వీకరించారు. తిరిగి తిరిగి అలిసిపోతున్నామని, తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు అధికారుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. భూసమస్యలు, పెన్షన్లు, రుణాలు, సర్వే సమస్యలపై పలువురు ఫిర్యాదులు సమర్పించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం తగదని కలెక్టర్ సూచించారు. మొత్తం 89 ఫిర్యాదులు, వినతులు అధికారులకు అందాయి. ప్రజావాణి కార్యక్రమం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ వద్ద ఫిర్యాదుదారులకు ఉచితంగా ఫిర్యాదులను రాసిచ్చారు. ఫిర్యాదులు ఇలా. - పాలమూర్ స్యాండ్ వెబ్సైట్లో హన్వాడ మండలం పేరు లేకపోవడంతో ఇసుకను బుక్ చేసుకునే అవకాశం లేకుండా పోయిందని, స్థానిక వాగుల్లో ఇసుక తీసుకునేందుకు అవకాశం కల్పించాలని టీఆర్ఎస్ నాయకులు కృష్ణయ్య, లక్ష్మయ్య, బసిరెడ్డి, జంబులయ్య తదితరులు కోరారు. - తమకు ఉన్న కొంచెం భూమి కోయిల్‌సాగర్ కాల్వలో పోగా.. మిగిలిన కొంత భూమిని జాతీయ రహదారి 167 నిర్మాణానికి తీసుకుంటామని చెబుతున్నారని దేవరకద్ర మండలం గోప్లాపూర్ రైతులు పేర్కొన్నారు. తమ భూమి కాకుండా అవతలి వైపు రోడ్డు నిర్మించాలని కోరారు. - గ్రామంలో తమ భూమిని దౌర్జన్యంగా ప్లాట్లుగా మారుస్తున్నారని, సహాయం చేయాల్సిన గ్రామ ప్రజా ప్రతినిధి, న్యాయవాది తమపై దౌర్జన్యం చేస్తూ మా భూమిని ప్లాట్లుగా మార్చారని నారాయణపేట మండలం చిన్నజట్రం గ్రామానికి చెందిన అబ్దుల్ మజీద్, కుమారుడు బాబా తమ ఆవేదనను అధికారులకు చెప్పుకున్నారు. - కోస్గి మండల కేంద్రంలో నెహ్రూ పార్కు వద్ద కూరగాయలు అమ్ముకునే 30మందిని ఖాళీ చేయించి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొంటూ మహిళలు, గ్రామస్తులు ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. - గ్రామ సమీపంలోని మొగుళ్ల కుంటను తొలగించి అక్రమంగా ప్లాట్లుగా మార్చేందుకు కబ్జాదారులు వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారని, వెంటనే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని భూత్పూర్ మండలం తాటిపర్తికి చెందిన మత్స్య సహకార సంఘం సభ్యులు డి.కృష్ణయ్య, బాలకిష్టయ్య, వెంకటయ్య ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. -
దేశ భవిష్యత్ ఓటరుపై ఆధారపడి ఉంది
మెదక్ మున్సిపాలిటీ: దేశ భవిష్యత్తు ఓటరుపై ఆధారపడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ నగేశ్ విద్యార్థులకు సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవంలో భాగంగాలో శుక్రవారం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు కోసం నమోదు చేసుకోవాలన్నారు. ఓటుహక్కు నమోదు చేసుకుంటే సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యంలో యువతదే కీలక పాత్ర అని, దేశం అభివృద్ధి చెందాలంటే ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఓటరు నమోదు పట్ల ఇళ్లు, పట్టణాలు, గ్రామాల్లో చైతన్యం కల్పించాలన్నారు. ఆర్డీఓ మెంచు నగేశ్ మాట్లాడుతూ యువత తలుచుకుంటూ ఏదైన సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ యాదగిరి, డీటీ మహేందర్, ఆర్ఐ చరణ్, వీఆర్ఓ నాగరాజు, ప్రిన్సిపాల్ నరసింహం, సింహారెడ్డి, పెద్దిరాజు, మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అమరావతి, అధ్యాపకులు వెంకటేశ్వర్లు, కృష్ణ ప్రసాద్, కిరణ్‌కుమార్, నాగరాణి, జ్యోతి,రేఖ, రూహితరణమ్, సరళ, శృతి, సలీమ్ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర భక్తులకు ఇబ్బంది రానివ్వకండి
జంగారెడ్డిగూడెం : అంత్యపుష్కరాల ఏర్పాట్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జాయింట్ కలెక్టర్(జేసీ) పి.కోటేశ్వరరావు ఆదేశించారు. పట్టిసీమ, గూటాల పుష్కర ఘాట్లలో అంత్య పుష్కరాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన సమీక్షించారు. పుష్కరాల ఏర్పాట్లు బాగుండాలని, చిన్న చిన్న పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రత్యేకంగా పారిశుధ్యంపై దృష్టిపెట్టాలన్నారు. రెండు ఘాట్లలోను 12 బోట్లు, 30 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్టు జేసీ తెలిపారు. మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచి, ఒక స్పీడ్ బోటును కూడా సిద్ధం చేయాలని సూచించారు. గోదావరిలో ఒకవేళ నీటి మట్టం తగ్గినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు ఘాట్లలోను పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. భక్తులకు అవసరమైన ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. అవసరమైతే బస్సులను కూడా పెంచాలని సూచించారు. ఘాట్ల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి మద్యం దుకాణం లేకుండా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదావరి నదిలో భక్తులు వేసే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. గోదావరిలో బోట్లలో నిరంతరం పహరా నిర్వహించాలన్నారు. భక్తులు పూజలు నిర్వహించుకునేందుకు అవసరమైన పురోహితులను కూడా నియమించాలని సూచించారు. ఆర్డీవో ఎస్.లవన్న, డీఎస్పీ జె.వెంకటరావు, మద్ది ఈవో పి.వివ్వనాథరాజు, అసిస్టెంట్ ఎంవీఐ శ్రీనివాస్, పోలవరం తహసీల్దార్ ముక్కంటి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.