
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో అధికారుల పేరుతో రైస్‌మిల్లుర్లు, వ్యాపారులు వద్ద నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, జిల్లాలో మిల్లులు యజమానులు, వ్యాపారులు ఎవరూ అటువంటివారికి ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని జేసీ కె. వెంకటరమణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జిల్లా ఉన్నతాధికారులు పేరుతో వ్యాపారులు నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారని తెలియవచ్చిందని, అటువంటి వారు ఎవరైనా వచ్చినట్లైతే పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment