Nava rathurulu
-
AP Navaratnalu Scheme: ‘బండ’బారిన బతుకుల్లో మెరుపులు
కఠెవరపు వెంకటేశ్వర్లుది గుంటూరు జిల్లా తెనాలి స్వస్థలం. బుర్రిపాలెంరోడ్డులో ఓ పక్కగా ఇస్త్రీ బండినే అతడి జీవనాధారం. ఆ పక్క వీధిలోని పూరిల్లే వారి పొదరిల్లు. అత్త, భార్య, ఇద్దరు కుమార్తెలు. ఏనాడో భర్త వదిలేసిన మరదలు, ఆమె కుమార్తె.. అంతా కలిసి ఆ ఇంట్లోనే ఉంటారు. వేంకటేశ్వర్లు పగలంతా ఇస్త్రీ చేసి నాలుగు డబ్బులు సంపాదిస్తే, నాలుగిళ్లలో బట్టలుతికి మరదలు ఆర్జించే మరికొన్ని డబ్బులే ఆ కుటుంబానికి ఆధారం.ఇద్దరి రెక్కల కష్టంతో ఏడుగురి కడుపు నింపాలి. ఎదుగుతున్న పిల్లల చదువులకు, ఏదైనా అనారోగ్యం చేస్తే వైద్యానికి ఎవరో ఒకరిని ప్రాధేయపడటం, రెండేసి, మూడేసి రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చుకోవడం పరిపాటిగా మారింది. ఏళ్లు గడుస్తున్నా ఎదుగూ బొదుగూ లేని జీవితం... గత ప్రభుత్వం ఎలాంటి సాయం చేసిన పాపాన పోలేదు. దీంతో వారి జీవనం దుర్భరంగా మారింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ కుటుంబానికి దశ తిరిగింది. 2019 నుంచి సంతోషాల వెంబడి..నవరత్నాలతో జీవన విధానమే మారిపోయింది. 2024 వచ్చేసరికి పూరిల్లు కాస్తా రేకుల షెడ్డైంది. 67 ఏళ్ల వెంకటేశ్వర్లుకు ఈ ప్రభుత్వం వచ్చాక వృద్ధాప్య పింఛను వస్తోంది. భార్య నాంచారమ్మకు వైఎస్సార్ ఆసరా కింద ఏడాదికి రూ.14 వేల చొప్పున నాలుగు విడతలుగా రూ.56 వేలు ప్రభుత్వం జమచేసింది. డ్వాక్రా సభ్యురాలిగా రూ.2 లక్షల రుణం మంజూరు చేసింది. వసతిదీవెన పథకంతో పెద్దకుమార్తె సాయిగాయత్రి నర్సింగ్ కోర్సు చదువుతోంది. రెండో కుమార్తె దాక్షాయణి ఇంటర్లో ఉన్నపుడు అమ్మ ఒడి డబ్బులు వచ్చాయి.ఇప్పుడు విద్యాదీవెనతో బీసీఏ చదువుతూనే కంపెనీ ఉద్యోగాలకు ఎంపికైంది. భర్త వదిలేసిన నాంచారమ్మ చెల్లెలు నాగలక్ష్మి ఆంటికే చేరింది. ఆమెకు ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. వైఎస్సార్ ఆసరా కింద ఏటా రూ.14 వేల వంతున నాలుగు విడతలుగా రూ.56 వేలు మంజూరు చేసింది. ప్రభుత్వం ఇంటిస్థలం ఇచ్చింది. –తెనాలికొనుగోలు శక్తి పెరుగుతోంది పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇవ్వడం వల్ల వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. మార్కెట్ ఎకానమీ బాగుంటుంది. సంక్షేమ పథకాల కింద వెంకటేశ్వర్లు కుటుంబానికి దాదాపు రూ.5 లక్షల వరకు సమకూరాయి. సమాజంలో నిజమైన మార్పు అంటే ఇదే. ఇలాంటి కొన్ని వేల కుటుంబాలు బాగుపడితే సమాజం ఆర్థికంగా పురోగమించినట్టే. – అయోధ్య శ్రీనివాసరావు, ఎకనామిక్స్ లెక్చరర్, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజి, తెనాలి వేంకటేశ్వర్లు కుటుంబానికి కలిగిన లబ్ధి రూపాయల్లోజగనన్న చేదోడు – 2 50,000 అమ్మ ఒడి- 2 – 80,000 విద్యాదీవెన 37,000 వసతి దీవెన 20,000 వైఎస్సార్ ఆసరా – 2 1,12,000 రైతు భరోసా 6,000 వైఎస్సార్ పింఛను కానుక–2 1,43,000 మొత్తం 4,48,000 -
అమ్మఒడి.. విద్యా విప్లవానికి నాంది
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో అమ్మఒడి పథకం ద్వారా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని చెప్పారు. 14 ఏళ్ల లోపు పిల్లలకు విద్య ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ పేర్కొన్నప్పటికీ, పేదరికం కారణంగా చాలా మందికి పిల్లలను చదివించే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పేదింటి తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకే ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. చిత్తూరులో గురువారం ఆయన అమ్మఒడి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘ప్రతి బిడ్డ అమ్మ ఒడిలో ఎదుగుతుంది. ఆ తల్లి గుండెల్లో పెట్టుకుని బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. తల్లి తన కంటే ప్రాణంగా బిడ్డలను చూసుకుంటుంది. అలాంటి తల్లులను, అక్కచెల్లెమ్మలను నా 3,648 కిలోమీటర్లు ప్రజా సంకల్ప పాదయాత్రలో చూశాను. వారికి పిల్లల చదువులు భారం కాకుడదని భావించాను. అందుకే ఈ పథకాన్ని ఇక్కడ ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా ఈ పథకం కింద రూ.15 వేలు ఇస్తాం’ అని చెప్పారు. ఈ సభలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఈ డబ్బును పాత అప్పులకు జమ చేసుకోరు ‘అమ్మఒడి పథకం ద్వారా చేకూరే లబ్ధి బ్యాంకర్లు మునపటి అప్పులకు జమ చేసుకోకూడదని సూచించాం. బ్యాంకర్లు సహకరించారు. ఈ పథకం కింద దాదాపు 42,12,186 లక్షల మంది తల్లులు, 81,72,224 లక్షల మంది పిల్లలకు మేలు చేకూరుతుంది. వీరికి రూ.6,456 కోట్లు చెల్లించనున్నాం. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు అమ్మఒడి ప్రవేశపెట్టనున్నట్లు పాదయాత్రలో చెప్పాను. ప్రస్తుతం ఇంటర్ వరకు వర్తింప చేస్తున్నాం. వరుసగా ప్రతి ఏటా తల్లుల అకౌంట్లో రూ.15 వేలు జమ అవుతుంది. చదువుకోవాలంటే ముందు కడుపు నిండాలని, తల్లులకు ఆర్థికంగా భరోసా ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ పథకంలో విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఏడాది మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉంటేనే పథకం వర్తిస్తుంది. ఆంగ్ల మాధ్యమంపై ప్రజల ఆకాంక్ష.. చంద్రబాబుకు, పత్రికాధిపతికి, సినిమా యాక్టర్‌కు పట్టడం లేదు. తెలుగు మీడియం కావాలనే నేతలెవరూ, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు వారి పిల్లలను ఆ మీడియంలో చదివించడం లేదు. ఇంగ్లిష్ మీడియం కావాలా.. వద్దా.. అని మిమ్మల్నే అడుగుతున్నా.. మీరిచ్చే సమాధానమే వారికి జవాబు. (కావాలి.. కావాలి.. అంటూ జనం నినాదాలు) ఇంగ్లిష్ మీడియంలో బోధన పేద విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించేలా ఇంగ్లిష్ మీడియంలో బోధన. తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు. మనబడి నాడు–నేడు రూ. 14 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో 9 రకాల మౌలిక సదుపాయాల కల్పన. జగనన్న విద్యా దీవెన పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఎంతైనా సరే పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్. మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పెంచి, పౌష్టికాహారం అందించేలా మెనూలో మార్పులు. రూ.353 కోట్లు అదనంగా కేటాయింపు. జగనన్న వసతి దీవెన వసతి, భోజన ఖర్చులకు కోసం ఏటా రూ.20 వేలు.. రెండు దఫాలుగా చెల్లింపు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించాలి. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఉపాధ్యాయులకు సరైన తర్ఫీదు ఉండాలి. నాణ్యమైన విద్యను అందించినప్పుడే పేద పిల్లలు లక్ష్యం చేరుకుంటారు. అందుకే పోటీ ప్రపంచంలో దీటుగా నిలిచేందుకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టబోతున్నాం. రాబోయే జూన్‌లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేశాం. తెలుగు మీడియం పిల్లలకు కొంత ఇబ్బంది వస్తుంది. దీన్ని అధిగమించేందుకు బ్రిడ్జి కోర్సులు, ఉపాధ్యాయులకు ట్రైనింగ్ కోర్సులు ప్రవేశ పెట్టాం. ఆ తర్వాతి సంవత్సరం నుంచి ఒక్కో తరగతి పెంచుకుంటూ వెళతాం. ఇలా నాలుగేళ్లలో మన పిల్లలు బోర్డు ఎగ్జామ్‌ను ఇంగ్లిష్‌లో రాసే పరిస్థితి వస్తుంది. కొందరు ఇంగ్లిష్ మీడియం వద్దంటున్నారు. ఈనాడు పేపర్‌కు, చంద్రబాబునాయుడుకు, సినిమా యాక్టర్‌కు విన్పించేలా మీ అభిప్రాయం గట్టిగా చెప్పండి. (కావాలంటూ ప్రజలు నినాదాలు చేశారు) 2020 జూన్‌లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్నాం. అప్పుడు 6వ తరగతి చదివే పిల్లలకు 2030లో డిగ్రీ పూర్తి అవుతుంది. 2032లో పీజీ చేస్తారు. 2020లో పుట్టిన పిల్లలు 2040లో డిగ్రీ పూర్తి చేస్తారు. ఆ నాటికి మన పిల్లలు ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడతారు. ఆ మేరకు ప్రభుత్వ బడులను మార్చేస్తాం. సిలబస్‌లో మార్పు తెస్తాం. పేదరికంలో ఉన్న వారి బతుకులు మారాలి. కుల వృత్తితో అన్యాయమైన బతుకు కొనసాగకూడదు. మరో కీలక నిర్ణయం.. మధ్యాహ్న భోజనంలో మార్పులు విద్యార్థులకు మంచి చదువుతోపాటు పౌష్టికాహారం కూడా ముఖ్యమే. మంచి ఆహారం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అందుకే మధ్యాహ్న భోజనం మెనూలో మార్పు తేవాలని సంకల్పించాం. పిల్లల భోజనం మెనూ విషయంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ఆలోచించి ఉండరు. మెనూ మార్పు ద్వారా దాదాపు రూ.200 కోట్లు అదనపు భారం పడుతుంది. భోజనం వండి పెట్టే ఆయాల జీతాలు వెయ్యి రూపాయల నుంచి రూ.3 వేలకు పెంచడం వల్ల రూ.160 కోట్లు అదనంగా ఖర్చవుతుంది. అయినా పిల్లల కోసం ఆ ఖర్చును సంతోషంగా భరిస్తాం. సంక్రాంతి సెలవుల తర్వాత నుంచి కొత్త మెనూ అమలు చేస్తాం. ఆ మెనూ ఇలా ఉంటుంది. సోమవారం : అన్నం, పప్పు చారు, ఎగ్ కర్రీ, స్వీట్ చిక్కీ మంగళవారం : పులిహోర, టామాటా పప్పు, ఉడికించిన గుడ్డు బుధవారం : వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్ చిక్కీ గురువారం : కిచిడీ, టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు శుక్రవారం : అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్ చిక్కీ శనివారం : అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్ తాము వండిన ఆహార పదార్థాలను సీఎంకు రుచి చూపిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు నాడు – నేడుతో ప్రభుత్వ బడుల్లో సమూల మార్పు రాష్ట్రంలో చదువుల విప్లవం కోసం 45 వేల పాఠశాలు, 471 జూనియర్ కళాశాలలు, 3,287 హాస్టళ్లు, 148 డిగ్రీ కళాశాలల్లో నాడు–నేడు ద్వారా మార్పు తెస్తాం. శిథిలావస్థలో ఉన్న బడులను చదువుల దేవాలయాలుగా మార్చాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్నాం. ఇప్పుడు బడుల ఫొటోలు తీశాం. వాటి రూపు రేఖలను పూర్తిగా మార్చేసిన తర్వాత మళ్లీ ఫొటోలు తీసి చూపిస్తాం. ఈ ప్రక్రియను మూడేళ్లలో పూర్తి చేస్తాం. మొదటి దశగా ఈ సంక్రాంతి తర్వాత 15,745 బడుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. టాయిలెట్లు, మంచినీళ్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, పర్నిచర్, గ్రీన్ బ్లాక్ బోర్డు, పెయింటింగ్, కాంపౌండ్లు, ఇతర మరమ్మతులు, ఇంగిస్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం. సగం విద్యా సంవత్సరం గడిచిన తర్వాత గానీ పుస్తకాలు అందని పరిస్థితిని ఏటా చూస్తున్నాం. ఈ పరిస్థితిని మారుస్తూ.. స్కూళ్లు తెరిచే నాటికే ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలందరీకి స్కూల్ కిట్ అందజేస్తాం. అందులో 3 జతలు యూనిఫాం, పుస్తకాలు, బూట్లు, సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగ్ అందజేస్తాం. భోదన ప్రమాణాలు పెంచడంతోపాటు, టీచర్లకు శిక్షణ, విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు ఏర్పాటు చేస్తున్నాం. విద్యా దీవెనతో ఆదుకుంటాం ఇంటర్మీడియట్ తర్వాత 23 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉన్నత చదువులకు వెళ్తున్నారు. మిగతా 77 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదరికంలో ఉన్న మైనార్టీలు, ఇతర వర్గాల్లోని పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువులు మానేస్తున్నారు. అలాంటి వారి కోసం విద్యా దీవెన పథకం ప్రవేశ పెట్టాం. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా తోడుగా ఉంటాం. ఎంతటి చదువులైన చదివేందుకు అవకాశం కల్పిస్తాం. పేదవారికి తోడు–నీడగా ఉండేందుకు వసతి దీవెన పథకం ద్వారా హాస్టల్ ఖర్చులు కూడా భరిస్తాం. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో రూ.10 వేలు.. జూలై, ఆగస్టులో మరో రూ.10 వేలు పేద విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో హాస్టల్ ఖర్చుల కోసం జమ చేస్తాం’ అని సీఎం అన్నారు. పిల్లల మేనమామగా అభ్యర్థిస్తున్నా.. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో అమ్మఒడి పథకాన్ని రూపొందించాం. స్కూళ్ల రూపు రేఖలు మారుస్తున్నాం. ఇంగ్లిష్ మీడియం తీసుకొస్తున్నాం. పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేశాం. మీ స్కూల్ పనితీరులో మీ భాగస్వామ్యం కూడా కావాలి. మీ పిల్లలు వెళ్లే పాఠశాల వాచ్‌మన్ మీద, బాత్రూమ్ల మీద కాస్త ధ్యాస పెట్టండి. బాత్రూం నిర్వహణ, వాచ్‌మన్ జీతం కోసం మీరూ భాగస్వాములు కావాలి. అప్పుడే జవాబుదారితనం పెరుగుతుంది. అందుకోసం మీకు అందించే రూ.15 వేలల్లో రూ.వెయ్యి పాఠశాల నిర్వహణ కోసం పేరెంట్స్ కమిటీకి అప్పగించండి. పాఠశాల రూపురేఖలు మారినా, నిర్వహణ బాగోలేకపోతే పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. అందుకే పాఠశాలల నిర్వహణ బాధ్యత అక్కచెల్లెమ్మలు తీసుకోవాలి. ప్రతి తల్లికి అన్నాగా తోడుగా ఉంటూ.. పిల్లలకు మంచి మేనమామగా అభ్యర్థిస్తున్నా’ అని సీఎం వైఎస్ జగన్ కోరారు. అనంతరం ల్యాప్‌టాప్ ద్వారా బటన్ నొక్కి అమ్మ ఒడి పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, బల్లి దుర్గాప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు. విప్లవాత్మక విద్యకు ఈ పథకాలతో రాచబాట పథకం పేరు ఉద్దేశం వ్యయం జగనన్న అమ్మఒడి పిల్లలందరినీ బడికి పంపాలి రూ.6,456 కోట్లు మధ్యాహ్న భోజనం పేద పిల్లలకు పౌష్టికాహారం అదనంగా రూ.360 కోట్లు నాడు–నేడు స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన రూ.14,000 కోట్లు జగనన్న విద్యా దీవెన అర్హతగల ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి ఫీజు జగనన్న వసతి దీవెన హాస్టల్ ఖర్చులనూ ప్రభుత్వమే భరించడం ఒక్కో విద్యార్థికి ఏటా రూ.20 వేలు అందరి కష్టాలు చూశారు.. అండగా నిలిచారు ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా నాడు ‘నేను విన్నాను.. నేను చూశాను.. నేను ఉన్నాను..’ అన్నారు. అందుకే ప్రజలంతా రావాలి జగన్.. కావాలి జగన్.. అంటున్నారు. ఇవాళ మా మేలు కోసం సీఎం వైఎస్ జగన్ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అమ్మఒడి పథకం ద్వారా మా అమ్మకు రూ.15 వేలు ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి మా బతుకులు మార్చబోతున్నాయి. నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నారు. ఇందుకు సీఎంకు కృతజ్ఞతలు. ఐఏఎస్ అధికారిణి కావడమే నా లక్ష్యం. ఆ దిశగా ఈ కార్యక్రమాలు, పథకాలు నాకెంతో మేలు చేస్తాయని భావిస్తున్నా. అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపుతున్న సీఎం జగన్‌కు మనసారా ధన్యవాదాలు. (ఇంగ్లిష్‌లో మాట్లాడింది) –కల్పవృక్షిణి, పీసీఆర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని, చిత్తూరు అమ్మానాన్నలా, అన్నలా ఆదరిస్తున్నారు మా అమ్మ సహాయ వంటమనిషిగా పనిచేస్తోంది. మా నాన్న నిరుద్యోగి. నా ఆశయం ఐఏఎస్ అధికారి కావడమే. ఈ పథకాన్ని వినియోగించుకుని నేను బాగా చదువుకుంటాను. స్మార్ట్ ఫోన్‌కు ఇచ్చిన ప్రాధాన్యం విద్యార్థుల కంటికి ఇవ్వలేదు. కానీ సీఎం.. వైఎస్సార్ కంటి వెలుగును ప్రారంభించి మా కళ్లకు పరీక్షలు చేయించారు. కళ్లద్దాలను కూడా ఉచితంగా అందజేశారు. రోజూ ఒకే రకమైన భోజనం తిని విసుగు వచ్చేది. ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకంలో పలు మార్పులు చేసి మాకు చక్కటి భోజనం పెట్టనున్నారు. అమ్మానాన్నలా, ఒక అన్నలా ఆలోచించి మాకు ఎంతో మేలు చేస్తున్నారు. – నవ్యప్రజ్వలిక, ఆదర్శ పాఠశాల, శాంతిపురం, చిత్తూరు జిల్లా పిల్లల భవిష్యత్ బాగుపడనుంది సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్.. అందరి కష్టాలు తీర్చేందుకు నవరత్నాలను ప్రకటించారు. వాటిలో కీలకమైంది అమ్మఒడి పథకం. ఈ పథకం మా వంటి పేదలకు ఎంతో మేలు చేస్తోంది. మేము మా పిల్లలను బడికి పంపే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు రూ.15 వేలు సహాయం చేస్తుండడం వల్ల పిల్లలను బడికి పంపించగలుగుతున్నాం. ఇంగ్లిష్ మీడియం మా పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. తద్వారా పిల్లల భవిష్యత్ బాగుపడుతుందనడంలో సందేహం లేదు. –శ్రీదేవి, విద్యార్థి తల్లి, పెడగంటిపల్లి గ్రామం, జీడీనెల్లూరు మండలం పిల్లలు బాగా చదువుకునే వాతావరణం పాఠశాలల్లో ఉండాలి.. మంచి చదువులు చెప్పే ఉపాధ్యాయులు ఉండాలి.. చదువులు పేదింటి తల్లులకు భారం కాకూడదు.. పిల్లలకు కడుపు నింపే తిండి ఉండాలి.. ఈ నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ పథకం తీసుకొస్తున్నాం. పేదింటి పిల్లలు పోటీ ప్రపంచంలో దీటుగా నిలిచేలా తయారవ్వాలన్నదే మా లక్ష్యం. అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరుతుంది. అర్హత ఉండి లబ్ధి చేకూరని తల్లులు ఎలాంటి హైరానా పడాల్సిన పనిలేదు. ఫిబ్రవరి 9వ తేదీలోపు.. అంటే నెల రోజుల్లోపు పేర్లు నమోదు చేసుకోండి. అర్హులైన ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తాం. - ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి -
నవరత్నాలతో జనహితం
గ్రామ స్వరాజ్యం అన్నమహాత్మా గాంధీజీ స్వప్నం.. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నబాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచన విధానం నన్నెంతగానో ప్రభావితం చేసింది. వారి ఆలోచనలు, నేటికీ నెరవేరని ప్రజల అవసరాలు..ఈ రెండింటి ప్రేరణతోనే నవరత్నాలు రూపొందాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : అన్ని విధాలా వెనుకబాటు తనం, అవినీతి, దళారీలు, సామాజిక–ఆర్థిక– రాజకీయ వెనకబాటుతనంతో కునారిల్లుతున్న వ్యవస్థను మార్చుకోవాలన్న కృత నిశ్చయంతోనే తమ ప్రభుత్వం ‘నవరత్నాలు’ ప్రకటించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. నవరత్నాల పథకాల ద్వారానే వ్యవస్థలో సత్వర మార్పు సాధ్యమవుతుందని చెప్పారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం హోదాలో జగన్ తొలిసారిగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన 73వ స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రెండున్నర నెలల ప్రభుత్వ పాలనలో ప్రజల మేలు కోరి, వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు, చేసిన చట్టాలు, అమలు చేస్తున్న విధానాలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. మన దేశ స్వాతంత్య్ర ఉద్యమం గొప్ప భావాలతో ముందుకు సాగిందని పేర్కొన్నారు. మూడు రంగుల జెండాకు, ఆ జెండాను ఇదే విజయవాడలో రూపొందించిన పింగళి వెంకయ్య గారికి ఎప్పటికీ మనందరి గుండెల్లో గొప్ప స్థానం ఉంటుంది. మహాత్మా గాంధీ సహా ఎందరో జాతీయోద్యమ నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. భారత మాతకు వందనం చేస్తూ.. ఈ గడ్డమీద పుట్టిన ప్రతి బిడ్డా ఈ గడ్డకు రుణపడి ఉండాలన్న భావం ఉండాలని చెబుతున్నా. స్వాతంత్య్ర పోరాటం మనందరినీ మంచి మార్గంలో నడిపించే మహాశక్తి’ అని సీఎం పేర్కొన్నారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే.. వ్యవస్థను మార్చుకుందాం ‘రాజ్యాంగం అందరికీ ప్రాథమిక హక్కులు ఇచ్చినా, 72 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు మాయని మచ్చలుగా కనిపిస్తున్నాయి. నిరక్షరాస్యత, మాతా శిశు మరణాలు మనం చెబుతున్న అభివృద్ధికి మాయని మచ్చలే. పిల్లలు బడికి వెళ్లలేని పరిస్థితి. మానవాభివృద్ధి సూచికల్లో మనం ఎక్కడున్నామో ఆలోచించుకోవాలి. ఈ 72 ఏళ్లలో దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో ఎంతో అభివృద్ధి ఉంది. అయితే అభివృద్ధితో పాటు దాన్ని అందాల్సిన వారికి అందకుండా ఎక్కడికక్కడ మింగేసే అవినీతి, దళారీ వ్యవస్థ అంతకంటే వేగంగా బలపడింది. మరి ఈ వ్యవస్థను ఇలాగే వదలి వేస్తే మన స్వాతంత్య్రానికి అర్థం ఉంటుందా? అందుకే రెండున్నర నెలల్లోనే ధైర్యంగా ముందడుగులు వేస్తూ.. భారతదేశ సామాజిక న్యాయ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు పెద్ద పీట వేస్తూ తొలి బడ్జెట్ సమావేశాల్లోనే చరిత్ర గతిని మార్చే చట్టాలకు శ్రీకారం చుట్టాం. బీసీలకు శాశ్వత కమిషన్.. విప్లవాత్మకం బీసీ కులాలు బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు.. భారతీయ సంస్కృతి, నాగరికతలకు బ్యాక్ బోన్ క్లాసులు.. అన్న మాటలకు కట్టుబడి శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిన మొట్ట మొదటి ప్రభుత్వం అని చెప్పడానికి గర్విస్తున్నాను. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తింప జేస్తూ చట్టం చేసిన ప్రభుత్వం కూడా మనదే. పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించేలా, స్థానికుల నైపుణ్యాలను పెంచడానికి ప్రభుత్వమే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు పెట్టేలా తొలిసారిగా చట్టం చేస్తున్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి మద్య నియంత్రణలో భాగంగా బెల్ట్ షాపులన్నింటినీ మూయిస్తున్నాం. అక్టోబర్ 1 నుంచి కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే మద్యం దుకాణాలు నడిపేలా నిర్ణయం తీసుకున్నాం. భూ యజమాని హక్కులకు భంగం కలుగకుండా దాదాపు 15 నుంచి 16 లక్షల మంది కౌలు రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసాతో పాటు పంటల బీమా, పంటల పరిహారం అందించేలా చట్టం చేసిన రాష్ట్రం కూడా మనదేనని చెప్పడానికి గర్విస్తున్నాను. గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన 73వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో జాతీయ జెండా ఎగురవేసి గౌరవవందనం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ఎన్నెన్నో విప్లవాత్మక నిర్ణయాలు మానవ అభివృద్ధి సూచికల్ని మెరుగు పరచడంతో పాటు గ్రామీణులకు కూడా సేవలు, సంక్షేమ కార్యక్రమాలు అందించి పట్టణాలు, గ్రామాల మధ్య అంతరం తగ్గించే చర్యలు చేపడుతున్నాం. మౌలిక సదుపాయాల్లోనూ, పరిశ్రమల్లోనూ భారీగా పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. పారదర్శకమైన లంచాలు లేని వ్యవస్థను నెలకొల్పుతున్నాం. పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. రూ.5 వేల గౌరవ వేతనంతో దాదాపు 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించబోతున్నాం. కనీవినీ ఎరుగని రీతిలో 4 లక్షలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా దేశ చరిత్రలోనే రికార్డు నెలకొల్పబోతున్నాం. గ్రామ, వార్డు వలంటీర్ల నియామకంలో కూడా మహిళలకు సగం వాటా ఇస్తున్నాం. అమ్మఒడి, ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాల ద్వారా చదువుల విప్లవం తీసుకురాబోతున్నాం. స్కూళ్ల రూపు రేఖల్ని కూడా మార్చబోతున్నాం. ఆరు నెలల క్రితం వరకు వచ్చిన రూ.1000 పింఛన్ ఇప్పుడు రూ.2,250 అయ్యింది. వచ్చే ఏడాది నుంచి ఏటా రూ.250 పెంచుతూ రూ.3 వేల వరకు పెంచుతాం. పింఛన్ పొందడానికి అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గించాం. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే.. వారి వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉంటే అన్ని వర్గాల వారికి ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా రూ.10 వేలు పింఛన్ ఇస్తున్నాం. తలసీమియా, పక్షవాతం, మస్కులర్ డిస్ట్రాఫీ వంటి వ్యాధులకు కూడా పింఛన్ ఇచ్చే పథకంపై ఆలోచిస్తున్నాం. 104, 108 సర్వీసులను గాడిలో పెడుతున్నాం. పేదలకు 25 లక్షల ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించాం. వైఎస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళల రుణాల మొత్తాన్ని రెండో ఏడాది నుంచి నాలుగు విడతలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం. సున్నా వడ్డీకి రుణాలిస్తాం. 45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు నాలుగు విడతలుగా రూ.75 వేలు సాయం చేసే పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయబోతున్నాం. అందరికీ మేలు చేస్తాం ప్రభుత్వోద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను అమలు చేస్తున్నాం. సీపీఎస్‌కు బదులు పాత పింఛన్ విధానం అమలు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీ వేశాం. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, పారిశుధ్య కార్మికుల జీతాల పెంపునకు మొదటి కేబినెట్లోనే నిర్ణయించాం. పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నాం. స్పందన కార్యక్రమం కింద ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు పరిష్కరిస్తున్నాం. గుళ్లలో పూజారులకు, మసీదుల్లో ఇమాంలకు, మౌజన్లకు, చర్చిలో పాస్టర్లకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలోని రిజర్వాయర్లకు జలకళ వచ్చింది. ఆ దేవుడి చల్లని దీవెనలతోనే ఇది సాధ్యమైంది. అందుకే ఈ స్వాతంత్య్ర దినోత్సవం సభ ద్వారా మనందరమూ ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుదాం. జైహింద్..’ అంటూ సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. అన్ని వర్గాల ప్రజల కోసం ఇలా.. పాఠశాల, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి రూపాయికీ జవాబుదారీ తనం ఉండాలన్న సంకల్పంతో మొత్తం టెండరింగ్ పద్ధతిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా టెండరు పనులను ఖరారు చేసే ప్రక్రియను హైకోర్టు జడ్జి ముందు పెడుతూ ఆయన నిర్ణయమే తుది నిర్ణయంగా మారుస్తున్నాం. ప్రభుత్వ శాఖల్లో రూ.కోటి దాటిన కొనుగోళ్లన్నింటిలో పారదర్శకత పెంచేలా ఆన్లైన్లో పెడతాం. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రవేశ పెట్టడం ద్వారా ల్యాండ్ మాఫియా, అక్రమ రిజిస్ట్రేషన్లు, నకిలీ రికార్డులకు చెక్ పెట్టనున్నాం. రైతులకు బ్యాంకుల నుంచి ఈ ఏడాది రూ.84,000 కోట్లు పంట రుణాలుగా అందించాలని నిర్ణయించాం. రైతులు గడువులోగా తిరిగి చెల్లిస్తే ఆ రుణాల మీద వడ్డీ ఉండదు. ఇప్పటికే 60 శాతానికి పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటిపూటే 9 గంటల కరెంటు సరఫరా చేస్తున్నాం. వచ్చే ఏడాది జూలై నాటికి మిగిలిన 40 శాతం ఫీడర్లలో కూడా పగటిపూటే కరెంటు ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అక్వా రైతులకు రూ 1.50కే యూనిట్ కరెంటును అందిస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుతో పాటు పంటల బీమా కోసం 55 లక్షల మంది రైతుల తరఫున 56 లక్షల హెక్టార్లకు రూ.2,164 కోట్ల ప్రీమియంను ప్రభుత్వమే కడుతుంది. గత ప్రభుత్వ విత్తన బకాయీలు రూ.384 కోట్లు, ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ.1,500లు చొప్పున రూ.300 కోట్లు బోనస్‌గా విడుదల చేశాం. పామాయిల్ రైతులకు అదనపు మద్దతు ధర కోసం రూ.80 కోట్లు విడుదల చేస్తున్నాం. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ పరిస్థితులను బేరీజు వేసేందుకు వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేశాం. రైతు ప్రమాదవశాత్తు మరణించినా, ఆత్మహత్య చేసుకున్నా రైతు కుటుంబానికి రూ.7 లక్షలు పరిహారం అందిస్తున్నాం. 2018 – 19 సంవత్సరానికి రూ.2,000 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం. తుపాను, కరువు వచ్చినప్పుడు రైతన్నలను ఆదుకోవడానికి రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేశాం. రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 చొప్పున ఈ అక్టోబర్ 15వ తేదీ నుంచే అందించబోతున్నాం. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు. రైతుల అభ్యున్నతి కోసం సహకార రంగ పునరుద్ధరణ, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, కోల్డ్ స్టోరేజీలు, ల్యాబ్‌ల ఏర్పాటు, ఉచిత బోర్లు, జలయజ్ఞం పనులు సత్వరమే పూర్తి చేయడంతో పాటు ఇతరత్రా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గోదావరి జలాలను సాగర్, శ్రీశైలంకు తరలించటం ద్వారా కృష్ణా ఆయకట్టును స్ధిరీకరిస్తూ రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రజలకు తాగు, సాగునీరు అందించే కార్యక్రమం ప్రారంభించటానికి ప్రణాళికలు వేస్తున్నాం. 972 కిలోమీటర్ల సముద్ర తీరం, సీ పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్–రోడ్డు కనెక్టివిటీతో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. -
నవ్యపథానికి నవరత్నాలు
కొంగొత్త దారులేవో కనిపిస్తున్నాయి. కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జన రథాన్ని ముందుండి నడిపిస్తున్న సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు నవ్యపథానికి ఊపిరి పోస్తున్నాయి. రోజురోజుకీ రాటుదేలుతున్నాయి. బడుగు జీవుల్లో అణగారిన ఆశలకు కొత్త సత్తువ అందిస్తున్నాయి. నిస్సహాయ మహిళలు మొదలుకుని, నిరాదరణకు గురైన వృద్ధుల వరకూ...లక్ష్మీ కటాక్షం లేని సరస్వతీ బిడ్డల నుంచి...ఆధారం లేని దివ్యాంగుల వరకు భరోసానిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : చిత్తశుద్ధి ఉంటే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయవచ్చో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసి చూపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా సంక్షేమ పథకాల జాడ లేదు. నిరుపేద, సామాన్య ప్రజలపై కక్ష కట్టినట్టు నీరుగార్చారు. దీంతో అన్ని వర్గాల్లో నిరాశ కమ్ముకొంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ ఆశయ సాధనతో ముందుకెళ్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలాంటి సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఇప్పుడా పథకాలు అమలైతే తమనెంతో ఆదుకుంటాయని ప్రజలు ఆశిస్తున్నారు. దీంతో నవరత్నాలు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. వైఎస్సార్ రైతు భరోసా ఆంధ్రప్రదేశ్ మెడలో హరితహారంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా అన్నపూర్ణగా అందరినీ ఆదుకుంటోంది. అయితే నోటికి ముద్దను అందిస్తున్న అన్నదాతల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎకరాకు రూ. 25వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు పెట్టి సాగు చేస్తున్నా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. సరైన మార్కెట్ దొరకడం లేదు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు భారమవుతున్నాయి. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీతో తమ బాధలు తీరుతాయని రైతులు ఆశించారు. కానీ, చంద్రబాబు దా‘రుణం’గా మోసం చేశారు. 2014నాటికి జిల్లాలో ఆరు లక్షల 50వేల మంది రైతులు రూ.13.009కోట్లు రుణంగా తీసుకున్నారు. దీంట్లో రూ.961.93కోట్లు మాత్రమే మాఫీ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఐదెకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రూ.50వేలు ఇస్తామని ప్రకటించారు. ఖరీఫ్ ప్రారంభంలో పెట్టుబడి కోసం వెతుక్కొనే అవసరం లేకుండా ఏటా మే నెలలో నాలుగేళ్ల పాటు రూ. 12,500 చొప్పున ఇస్తామన్నారు. అంతేకాకుండా ధరల తగ్గుదల, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులతో రైతు నష్టపోకుండా ఆదుకునేందుకు రూ. మూడు కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.రెండు వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడంతో రైతన్నలు ఆనందభరితులవుతున్నారు. రాజన్న రాజ్యం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రయోజనం : వైఎస్సార్ రైతు భరోసాతో జిల్లాలో 6.50లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ ఆసరా ‘‘డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాం’’ అంటూ ఎన్నికలప్పుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. రుణమాఫీ సంగతి పక్కనబెట్టి పెట్టుబడి నిధి పేరుతో మహిళల్ని మోసగించారు. రుణాలు మాఫీ కాకపోగా వడ్డీ భారం అదనంగా పడటంతో డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 2014 ఎన్నికల నాటికి జిల్లాలో 89,433 డ్వాక్రా సంఘాలు రూ.1326.47కోట్లు రుణం తీసుకున్నాయి. ఇంతవరకు రూ.573కోట్లు మాత్రమే పెట్టుబడి నిధి కింద డ్వాక్రా మహిళల చేతికందకండా ఖాతాల్లో జమ చేశారు. ఇవి ఖర్చు పెట్టే వీలు లేకుండా ఆంక్షలు పెట్టారు. ఇంకా రూ.823కోట్లు డ్వాక్రా మహిళలకు రావల్సి ఉంది. పెట్టుబడి నిధి కింద వచ్చిన మొత్తం కూడా తీసుకున్న రుణాలకు వడ్డీకే సరిపోలేదు. వీరి కష్టాలకు విముక్తి కలిగించేలా జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రకటించారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. దీంతో మహిళలందరూ జగనన్న పాలన కోసం ఆశగా చూస్తున్నారు. ప్రయోజనం : జిల్లాలో 92457 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఇందులో 8.98లక్షల మందికి ఊరట కలుగుతోంది. పెద్ద కొడుకులా పింఛన్ల పెంపు ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ సరిపోవడం లేదు. పింఛను మంజూరులో వివక్ష చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భరోసా ఇచ్చేందుకు నవరత్నాల్లో ‘‘పింఛను పెంపు’’ ఒక అంశంగా చేర్చారు. ఫించను రూ.1000 నుంచి రూ.2000కు పెంచుతామని ప్రకటించారు. ప్రతి నెలా ఒకటో తేదీన అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రయోజనం : పింఛన్ల పెంపుతో జిల్లాలో ఐదు లక్షల 41వేల 682 మందికిలబ్ధి చేకూరుతుంది. అమ్మఒడి పేదరికంతో చాలామంది చదువుకోలేకపోతున్నారు. వీరికోసమని నవరత్నాల్లో ’అమ్మఒడి’ పథకాన్ని చేర్చారు. ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నెలకు రూ.వెయ్యి, ఆరు నుంచి పదో తరగతి పిల్లలకు రూ.1500, ఇంటర్మీడియట్ చదువుకు రూ.రెండు వేలు చొప్పున తల్లుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. ప్రయోజనం : అమ్మఒడితో జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న మూడు లక్షల మందికి, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న మరో మూడు లక్షల మందికి, ఇంటర్ చదువుతున్న లక్షా 50వేల మంది విద్యార్థులకు భరోసా లభిస్తుంది. పేదలందరికీ ఇళ్లు వైఎస్సార్ హయాంలో సొంత గూడు లేనివారందరికీ పక్కా ఇళ్లు ఇచ్చారు. స్థలాలు కూడా సమకూర్చారు. అర్హులైన ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చారు. చంద్రబాబు సర్కారు ప్రకటనలతో సరిపుచ్చేసింది. పేదలకు పక్కా ఇల్లును కలగా మార్చేసింది. ఈ నేపథ్యంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామన్న హామీకి నవరత్నాల్లో చోటు కల్పించారు. ఇల్లు ఇచ్చిన రోజునే అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తామని, డబ్బు అవసరమైతే పావలావడ్డీకే ఇంటి తనఖాపై రుణం ఇస్తామని తెలిపారు. ప్రయోజనం : జిల్లాలో ఇళ్లు లేని సుమారు లక్షా 50వేల మందికి లబ్ధి చేకూరనుంది. ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం పేదలు కార్పొరేట్ వైద్యం అందించాలని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. జిల్లాలో వేలాది మందికి ప్రాణం పోశారు. ఈ పథకానికి చంద్రబాబు తూట్లు పొడిచారు. తగిన నిధులు మంజూరు చేయకుండా నిరుపేద రోగులను ఇబ్బంది పెడుతున్నారు. ఆరోగ్య శ్రీలో ఆంక్షలు పెట్టి అనేక వ్యాధులను తప్పించడంతో మెరుగైన వైద్యం చేయించుకోలేకపోతున్నారు. అప్పులు చేసి క్పారేట్ వైద్యం చేయించుకోవల్సిన పరిస్థితి రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది చూసి చలించిపోయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నవరత్నాల్లో ఆరోగ్యశ్రీకి ప్రాధాన్యం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బడ్జెట్లో పూర్తిస్థాయిలో నిధులిచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీకి పూర్వవైభవం తీసుకొస్తానని భరోసా కల్పించారు. కిడ్నీ, తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక పింఛను కల్పిస్తామన్నారు. ప్రయోజనం : జిల్లాలో తెల్ల రేషన్ కార్డు ఉన్న 12,44,052మందికి మేలు జరగనుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు జీవం నిరుపేదలు కూడా ఇంజనీర్లు అవ్వాలని..వైద్యులు కావాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు కన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి, వేలాది మంది నిరుపేద విద్యార్థులు ఇంజనీర్లు, వైద్యులుగా తీర్చిదిద్దారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఫీజు ఈ పథకాన్ని నీరుగార్చాయి. చంద్రబాబు వచ్చాక ఆంక్షలు పెట్టి భారీగా కోత పెట్టారు. విద్యార్థులు ఉన్నత చదువులు సాగించలేకపోతున్నారు. కళాశాలల్లో చేరినా తగిన సదుపాయాల్లేక ఉన్నత విద్య ఆశను అర్ధాంతరంగా చిదిమేసుకుంటున్నారు. విద్యార్థుల ఇబ్బందులపై స్పష్టమైన అవగాహన ఉన్న జగన్మోహన్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి మళ్లీ జీవం పోస్తానని ప్రకటించారు. వైద్య విద్య, ఇంజినీరింగ్, డిగ్రీ తదితర కోర్సులు చదివే విద్యార్థులందరికీ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ^è దువుకయ్యే ఖర్చు భరించడంతో పాటు వసతి, భోజనం కోసం ప్రత్యేకంగా రూ.20వేలు అందజేస్తామని ప్రకటించారు. ప్రయోజనం : జిల్లాలో సుమారు లక్షా 50వేల విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. జలయజ్ఞానికి చేయూత రైతులకు సాగునీరు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జల యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద పీట వేశారు. లక్షలాది ఎకరాలకు నీరందించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు వచ్చాక ఆ ప్రాజెక్టులకు అంచనాలు పెరగడం తప్ప పూర్తి కావడం లేదు. వైఎస్సార్ పూర్తి చేసిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడం తప్ప మధ్యలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే చొరవ చూపడం లేదు.ఈ నేపథ్యంలో మహానేత తలపెట్టిన జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని నవరత్నాల్లో భాగంగా ప్రకటించారు. ప్రయోజనం : ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న కాలువల ఆధునికీకరణకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 3,361 కోట్లు కేటాయించారు. జిల్లాకు రూ.1,679.24 కోట్లు కేటాయించారు. వైఎస్సార్ ఉండగా రూ.639.92 కోట్ల విలువైన ఐదు ప్యాకేజీలకు టెండర్లు ఖరారయ్యాయి. టెండర్లు ఖరారు కాని చోట కాలువలు అధ్వానంగా ఉన్నాయని, 2009లో రూ.9.01 కోట్లతో పూడికతీత పనులు చేపట్టారు. బాబు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో డెల్టా ఆధునికీకరణపై శీతకన్ను వేశారు. ఈ నాలుగేళ్లలో బడ్జెట్ కేటాయింపులు సుమారు రూ.350 కోట్లు కాగా, దీనిలో 70 శాతం మాత్రమే అంటే రూ.245 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు దివంగత నేత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ముసురుమిల్లి ప్రాజెక్టును 2007లో దివంగత నేత వైఎస్సార్ జలయజ్ఞంలో నిధులు కేటాయించారు. దీని తొలి అంచనా రూ.207 కోట్లు. ఇప్పటి వరకు రూ.54 కోట్లు ఖర్చుపెట్టారు. దీనిలో రూ.50 కోట్లు వైఎస్సార్ హయాంలోనే ఖర్చుపెట్టారు. నాలుగేళ్లలో చంద్రబాబు రూ.నాలుగు కోట్లు మంజూరు చేశారు. ఇంకా 15 శాతం పనులు చేయాల్సి ఉంది. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే వీటన్నింటికీ మోక్షం కలగనుంది. దశల వారీగా మద్య నిషేధం సంపాదించే వ్యక్తి మద్యానికి అలవాటు పడితే ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతోంది. కాపురాలను కూల్చేస్తుంది. మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీనికి చెక్ పెట్టేందుకు మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని జగన్ హామీ ఇచ్చారు. మద్యం అమ్మకాలను ఆదాయ వనరులుగా చూస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ఆలోచనకు భిన్నంగా తమ ప్రభుత్వం వ్యవహరిస్తుందని భరోసానిచ్చారు. ప్రయోజనం : వేలాది కుటుంబాలకు మేలు చేయనుంది. కాపురాలను నిలబెట్టనుంది. జిల్లాలో 538 దుకాణాలు, 44 రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిన్నింటి ద్వారా రోజుకి రూ. ఐదు కోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. దశల వారీ మద్య నిషేధం వలన ఈ సొమ్ము అంతా ఆదా అవుతుంది. -
విజయదశమి
ప్రాచీన కాలం భారతీ యులకు ప్రకృతి పట్ల భయ భక్తులూ, ప్రేమాదరాలూ ఎక్కువ. ప్రకృతి మాతకు కృతజ్ఞతలు ప్రకటించడం ధర్మంగా పూర్వులు భావించేవారు. రుతుచక్ర గతిలో తమ చుట్టూ ఉన్న జగత్తు ఎప్పటికప్పుడు కొత్త అందాలతో కనిపిస్తుంటే స్పందించకుండా ఉండ లేకపోయేవారు. వానలు వెనుకబట్టి నదులూ, చెరువులూ, కుంటలూ మళ్లీ జల సంపదతో కళకళలాడుతుంటే; ఆకాశం నిర్మలమై, మళ్లీ పగళ్లు ఎప్పుడూ లేనంత ఆహ్లా దకరంగా కనిపిస్తుంటే పిండారబోసినట్టు ఒప్పే పండు వెన్నెలలతో శారదరాత్రులు మెరిసిపోతుంటే ఆ ఆనం దంలో అప్రయత్నంగా ‘అమ్మ’వారు గుర్తుకొచ్చేది. దానికి తోడు ఆధ్యాత్మిక, పౌరాణిక కారణాల వల్ల కూడా ఆశ్వయుజ శుక్లపక్షాన్ని పర్వదినాలుగా జరుపు కునే ఆనవాయితీ ఏర్పడింది. శరత్కాలం కనిపించగానే పులకింతతో భారతీయులు తొమ్మిదిరోజులు సుదీర్ఘమైన నవరాత్రి ఉత్సవం జరుపుకుంటారు. అమ్మలగన్న అమ్మను, అన్ని రకాల అలంకారాలతో ఉపచారాలతో ఆరాధించి ఆనందిస్తారు. అమ్మవారిని ఆరాధించే ఆనవాయితీ శ్రీరామ చంద్రుడి సమయం నుంచి ఉన్నదే. ‘శరదృతువు మొదల యింది. ఆశ్వయుజం ఆరంభమైంది. ఇప్పుడు నువ్వు నవరాత్రి వ్రతం శ్రద్ధగా నిర్వర్తించు. కష్టాలలో ఉన్నప్పుడు ఈ వ్రతం చేస్తే శుభం కలుగుతుంది. రావణ వధ కోసం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చేయాలి. నేనే ఆధ్వర్యం వహించి నీ చేత వ్రతం చేయిస్తాను!’ అని నారదుడు శ్రీరాముడి చేత జగదంబికను ప్రతిష్టింపచేసి ఉపవా సాలూ, నిత్యార్చనలూ, జపాలూ, హోమాలూ యథా విధిగా చేయించగా, అష్టమి నాటి రాత్రి అమ్మవారు ప్రత్య క్షమై ఆశీర్వదించి వెళ్లిందట. దశమి నాడు విజయదశమి పూజ చేసి శ్రీరా ముడు యుద్ధయాత్ర ఆరంభించి దిగ్వి జయం సాధించాడు. వరాల బలంతో అహంకరించి, అన్ని రకాల దుష్కృత్యాలకు ఒడిగడుతూ త్రిమూర్తులను కూడా ధిక్కరించి గెలిచి నిలిచిన మహిషాసురుడిని సకల దేవతా తేజో స్వరూ పిణిగా అవతరించిన జగన్మాత మట్టుపెట్టిన మంచిరోజు విజయదశమి. సాధు రక్షణ కోసం, ‘అజన్మ’ అయిన జగ న్మాత జన్మనెత్తడం,‘అరూప’ అయిన తల్లి మహిషా సుర మర్దని రూపం దాల్చ డం మహాద్భుత లీల. దేవీనవరాత్రులను వంగదేశీయులు వైభవంగా జరుపుకుం టారు. తమ ఇంటి ఆడ పడుచు దుర్గాదేవి ఏడాదంతా రాతి గుండె భర్తతో అష్టకష్టాల కాపురంచేసి నాలుగు రోజులు ఉండి వెళ్లడానికి పుట్టిం టికి వస్తుందని వారు భావిస్తారు. షష్ఠీ, సప్తమీ, అష్టమీ, నవమీ వారితో గడిపి, విజయదశమికి మెట్టినింటికి వెళ్లి పోతుంది. ఆడ పడుచు ఉన్న నాలుగు రోజులూ గొప్ప సంబరం. విజయ దశమినాడు కన్నీరు కారుస్తూ ఆమెకు వీడ్కోలు చెబుతారు. అక్షయ తృతీయలాగా విజయదశమి కూడా అన్ని శుభకార్యాల ఆరంభానికి (ప్రధానంగా అక్ష రాభ్యా సానికి) అనువైన పెట్టని ముహూర్తం. యా దేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా నమః తస్యై, నమః తస్యై, నమః తస్యై, నమో నమః! - ఎం. మారుతిశాస్త్రి