సొంతింటి ముందు కుటుంబంతో వెంకటేశ్వర్లు
కఠెవరపు వెంకటేశ్వర్లుది గుంటూరు జిల్లా తెనాలి స్వస్థలం. బుర్రిపాలెంరోడ్డులో ఓ పక్కగా ఇస్త్రీ బండినే అతడి జీవనాధారం. ఆ పక్క వీధిలోని పూరిల్లే వారి పొదరిల్లు. అత్త, భార్య, ఇద్దరు కుమార్తెలు. ఏనాడో భర్త వదిలేసిన మరదలు, ఆమె కుమార్తె.. అంతా కలిసి ఆ ఇంట్లోనే ఉంటారు. వేంకటేశ్వర్లు పగలంతా ఇస్త్రీ చేసి నాలుగు డబ్బులు సంపాదిస్తే, నాలుగిళ్లలో బట్టలుతికి మరదలు ఆర్జించే మరికొన్ని డబ్బులే ఆ కుటుంబానికి ఆధారం.
ఇద్దరి రెక్కల కష్టంతో ఏడుగురి కడుపు నింపాలి. ఎదుగుతున్న పిల్లల చదువులకు, ఏదైనా అనారోగ్యం చేస్తే వైద్యానికి ఎవరో ఒకరిని ప్రాధేయపడటం, రెండేసి, మూడేసి రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చుకోవడం పరిపాటిగా మారింది. ఏళ్లు గడుస్తున్నా ఎదుగూ బొదుగూ లేని జీవితం... గత ప్రభుత్వం ఎలాంటి సాయం చేసిన పాపాన పోలేదు. దీంతో వారి జీవనం దుర్భరంగా మారింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ కుటుంబానికి దశ తిరిగింది.
2019 నుంచి సంతోషాల వెంబడి..
నవరత్నాలతో జీవన విధానమే మారిపోయింది. 2024 వచ్చేసరికి పూరిల్లు కాస్తా రేకుల షెడ్డైంది. 67 ఏళ్ల వెంకటేశ్వర్లుకు ఈ ప్రభుత్వం వచ్చాక వృద్ధాప్య పింఛను వస్తోంది. భార్య నాంచారమ్మకు వైఎస్సార్ ఆసరా కింద ఏడాదికి రూ.14 వేల చొప్పున నాలుగు విడతలుగా రూ.56 వేలు ప్రభుత్వం జమచేసింది. డ్వాక్రా సభ్యురాలిగా రూ.2 లక్షల రుణం మంజూరు చేసింది. వసతిదీవెన పథకంతో పెద్దకుమార్తె సాయిగాయత్రి నర్సింగ్ కోర్సు చదువుతోంది. రెండో కుమార్తె దాక్షాయణి ఇంటర్‌లో ఉన్నపుడు అమ్మ ఒడి డబ్బులు వచ్చాయి.
ఇప్పుడు విద్యాదీవెనతో బీసీఏ చదువుతూనే కంపెనీ ఉద్యోగాలకు ఎంపికైంది. భర్త వదిలేసిన నాంచారమ్మ చెల్లెలు నాగలక్ష్మి ఆంటికే చేరింది. ఆమెకు ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. వైఎస్సార్ ఆసరా కింద ఏటా రూ.14 వేల వంతున నాలుగు విడతలుగా రూ.56 వేలు మంజూరు చేసింది. ప్రభుత్వం ఇంటిస్థలం ఇచ్చింది. –తెనాలి
కొనుగోలు శక్తి పెరుగుతోంది
పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇవ్వడం వల్ల వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. మార్కెట్ ఎకానమీ బాగుంటుంది. సంక్షేమ పథకాల కింద వెంకటేశ్వర్లు కుటుంబానికి దాదాపు రూ.5 లక్షల వరకు సమకూరాయి. సమాజంలో నిజమైన మార్పు అంటే ఇదే. ఇలాంటి కొన్ని వేల కుటుంబాలు బాగుపడితే సమాజం ఆర్థికంగా పురోగమించినట్టే. – అయోధ్య శ్రీనివాసరావు, ఎకనామిక్స్ లెక్చరర్, ఏఎస్‌ఎన్ డిగ్రీ కాలేజి, తెనాలి
వేంకటేశ్వర్లు కుటుంబానికి కలిగిన లబ్ధి రూపాయల్లో
జగనన్న చేదోడు – 2 50,000
అమ్మ ఒడి- 2 – 80,000
విద్యాదీవెన 37,000
వసతి దీవెన 20,000
వైఎస్సార్ ఆసరా – 2 1,12,000
రైతు భరోసా 6,000
వైఎస్సార్ పింఛను కానుక–2 1,43,000
మొత్తం 4,48,000
Comments
Please login to add a commentAdd a comment