శక్తివంతమైన భారత్ నిర్మాణమే లక్ష్యం
► బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్
► కరీంనగర్లో నవభారత నిర్మాణ్ ర్యాలీ
కరీంనగర్‌సిటీ : శక్తివంతమైన భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ అన్నారు. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు సోమవారం చేస్తున్న ఆందోళనను వ్యతిరేకిస్తూ కరీంనగర్లో నవభారత్ నిర్మాణ్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి పెద్దసంఖ్యలో బీజేపీ, బీజేవైం కార్యకర్తలు త రలివచ్చారు. రాజీవ్‌చౌక్, టవర్, బస్టాండ్, తెలంగాణచౌక్ మీదుగా ర్యాలీ స ర్కస్గ్రౌండ్కు చేరుకుంది. ఉగ్రవాదం, నల్లధనాన్ని వెలికితీయడం, అవినీతి ని నిర్మూలించడం, నకిలీనోట్లకు అడ్డుకట్ట వేసేందుకు పెద్ద నోట్ల మార్పిడి అని ముద్రించిన ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్నారు. బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ ఇన్నాళ్లు పాలించిన కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు దేశాభి వృద్ధిని విస్మరించి స్వార్థపూరితంగా వ్యవహరించాయన్నారు. పెద్దనోట్ల మా ర్పిడి నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోరుు ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు.
పెద్దనోట్ల మార్పిడితో లక్షల కోట్ల రూపాయలు బ్యాం కుల్లో డిపాజిట్లు కావడంతో తక్కువ వడ్డీకి ఎక్కవ రుణాలు ఇచ్చే అవకాశం ఏర్పడిందన్నారు. ప్రజలందరూ తప్పుడు ప్రచారం నమ్మకుండా ఇతరుల డబ్బును తమ ఖాతాలో జమ చేసుకోవద్దన్నారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాలు ఇచ్చిన బంద్‌ను ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. బీజేపీ, బీజేవైఎం నాయకులు బేతి మహేందర్‌రెడ్డి, బోరుునిపల్లి ప్రవీణ్‌రావు, కటకం లోకేశ్, దుబాల శ్రీనివాస్, సింగిరాల రామరాజు, ముజీబ్, కచ్చు రవి, పొన్నం మొండయ్యగౌడ్, చిట్టిబాబు, రెడ్డవేని రాజు, ప్రవీణ్, బోనాల నరేశ్, తిరుపతి, శేఖర్, వామన్, మహేశ్, సంతోష్, కొంరయ్య, వేణు, గూడెల్లి ఆంజనేయులు, రాజేందర్‌రెడ్డి, జగన్, జశ్వంత్, సత్యం, సృజన్, రమేశ్, శ్రీనివాస్, అఖిల్, రమణారెడ్డి, భాస్కర్, సారుులు పాల్గొన్నారు.