Navneet Dhaliwal
-
T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)
-
T20 WC 2024: అమెరికా ధనాధన్...
డాలస్: అమెరికా ఆతిథ్య హోదాలో ఆడిందంతే! టి20 ప్రపంచకప్ ఆడే సత్తా ఆ జట్టుకెక్కడిది అని తేలిగ్గా తీసిపారేసే వారికి మెగా మెరుపులతో టోర్నీకే గొప్ప ఆరంభం ఇచ్చింది అమెరికా. రెండు కొత్త జట్లు (కెనడా, అమెరికా) ప్రపంచకప్‌లో ఆడటం తొలిసారే అయినా... ధనాధన్ షోతో సిసలైన క్రికెట్ వినోదాన్ని పంచాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన గ్రూప్ ‘ఎ’ మొదటి మ్యాచ్‌లో అమెరికా 7 వికెట్ల తేడాతో కెనడాపై ఘనవిజయం సాధించింది.టాస్ నెగ్గిన అమెరికా ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్ నవ్‌నీత్ ధలివాల్ (44 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), నికోలస్ కిర్టన్ (31 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. శ్రేయస్ మొవ్వ (16 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆరోన్ జాన్సన్ (16 బంతుల్లో 23; 5 ఫోర్లు) ధాటిగా ఆడారు. అలీఖాన్, హర్మిత్ సింగ్, కోరె అండర్సన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని అమెరికా 17.4 ఓవర్లలోనే మూడే వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసి ఛేదించింది. జట్టు ఖాతా తెరువకముందే స్టీవెన్ టేలర్ (0) డకౌటయ్యాడు. మరో ఓపెనర్, కెపె్టన్ మోనంక్ పటేల్ (16) తక్కువే చేశాడు. 42/2 స్కోరు వద్ద కష్టాల్లో ఉన్న అమెరికాను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆరోన్ జోన్స్ (40 బంతుల్లో 94 నాటౌట్; 4 ఫోర్లు, 10 సిక్స్‌లు) అసాధారణ బ్యాటింగ్‌తో గెలిపించాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడిన జోన్స్... మూడో వికెట్‌కు ఆండ్రీస్ గౌస్ (46 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి 131 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేశాడు. ఈ క్రమంలో ఆరోన్ 22 బంతుల్లో, గౌస్ 39 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. 16వ ఓవర్లో 173 పరుగుల వద్ద ఆండ్రీస్ నిష్క్రమించగా... మరో రెండు ఓవర్లలోనే కోరె అండర్సన్ (3 నాటౌట్)తో కలిసి ఆరోన్ జోన్స్ 14 బంతులు మిగిలుండగానే అమెరికాను గెలిపించాడు. అమెరికా తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 6న పాకిస్తాన్ జట్టుతో, కెనడా తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 7న ఐర్లాండ్‌తో ఆడతాయి. టి20 ప్రపంచకప్‌లో నేడునమీబియా X ఒమన్‌వేదిక: బ్రిడ్జ్‌టౌన్; ఉదయం గం. 6 నుంచిశ్రీలంక X దక్షిణాఫ్రికా వేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంచదవండి: ICC ODI Player Of The Year: అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 WC: తొలి హాఫ్ సెంచరీ ‘మనోడి’దే!.. కెనడా భారీ స్కోరు
క్రికెట్ చరిత్రలో అతి పురాతన సమరంగా అమెరికా, కెనడా మధ్య పోరుకు గుర్తింపు ఉంది. ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నా ఇదే నిజం. 1877లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరిగినా... దానికి చాలా ఏళ్ల క్రితమే అంటే 1844లో మూడు రోజుల క్రికెట్ మ్యాచ్‌లో అమెరికా, కెనడా తలపడినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఇక 180 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అమెరికా, కెనడా మధ్య టి20 వరల్డ్ కప్‌లో పోటీ పడుతున్నాయి. ఇరు జట్లకు టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. డాలస్‌కు ఈ మ్యాచ్ వేదిక. ఈ నేపథ్యంలో స్థానికంగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నంలో మార్కెటింగ్ నిపుణులు కొత్త తరహా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్యాడ్లు, బ్యాట్‌తో ‘స్కోర్ ఫోర్’ అని రాసి ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ బొమ్మ ముద్రించిన టీ షర్ట్‌లను అమ్ముతున్నారు.పీజే గోడ్హాల్స్ అనే ఔత్సాహిక వ్యాపారి, క్రికెట్ అభిమాని ఈ మ్యాచ్ వేదికపై అమ్మకానికి ఉంచాడు. 1849లో చికాగో, మిల్వాకీ నగరాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు లింకన్ అతిథిగా హాజరయ్యారు. కెనడా భారీ స్కోరుటీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్ తొలి మ్యాచ్‌లో భాగంగా యూఎస్ఏతో తలపడుతున్న కెనడా భారీ స్కోరు సాధించింది. డలాస్ వేదికగా టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. కెనడా బ్యాటింగ్‌కు దిగింది.ఓపెనర్లలో ఆరోన్ జాన్సన్(16 బంతుల్లో 23) రాణించగా.. నవనీత్ ధాలివాల్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ 44 బంతులు ఎదుర్కొని 61 పరుగులు సాధించాడు. View this post on Instagram A post shared by ICC (@icc)తొలి హాఫ్ సెంచరీతద్వారా టీ20 వరల్డ్‌కప్-2024లో తొలి హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నవనీత్ రికార్డు సాధించాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ పగ్రాత్ సింగ్(5) నిరాశ పరచగా.. నాలుగో స్థానంలో వచ్చిన నికోలస్ కిర్టాన్ (31 బంతుల్లో 51) అర్ధ శతకంతో రాణించాడు.ఇక వికెట్ కీపర్ బ్యాటర్ శ్రేయస్ మొవ్వా 32 పరుగులు చేసి దిల్లాన్ హేలిగెర్(1)తో కలిసి నాటౌట్‌గా నిలవగా.. దిల్‌ప్రీత్ సింగ్ 11 రన్స్ స్కోరు చేశాడు. ఈ క్రమంలో కెనడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు సాధించింది. యూఎస్ఏ బౌలర్లలో అలీ ఖాన్, హర్మీత్ సింగ్, కోరె ఆండర్సన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.చండీగఢ్‌లో జన్మించిఅక్టోబరు 10, 1988లో పంజాబ్‌లోని చండీగఢ్‌లో జన్మించాడు నవనీత్ ధాలివాల్. అనంతరం కెనడాకు మకాం మార్చిన 35 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. గతంలో కెనడా జాతీయ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. View this post on Instagram A post shared by ICC (@icc)