Nawabpet mandal
-
పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి ఆత్మహత్య.. నీవు లేని లోకం నాకొద్దు అంటూ ..
సాక్షి, నవాబుపేట(మహబూబ్‌నగర్): పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తండావాసుల సమాచారం మేరకు వివరాలిలా.. నవాబుపేట మండలం వెంకటేశ్వరతండా పంచాయతీలోని మామిడిచెట్టుతండాకు చెందిన శాంతి(21) అదే తండా పక్కన ఉన్న కోమటికుంటతండాకు చెందిన శివ(25) ప్రేమించుకున్నారు. అయితే, వీరి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలపలేదు. ఇదిలాఉండగా, శాంతి తన తల్లిదండ్రులతో కలిసి ఈనెల 3వ తేదీన పూణె వెళ్లింది. శివ ఇక్కడే ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, తమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోరనే బాధతో పూణెలో ఉన్న ప్రియురాలు శాంతి 14వ తేదీ సోమవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలియడంతో.. నీవు లేని లోకం నాకేందుకు అంటూ ప్రియుడు శివ షాద్‌నగర్ నుంచి తన తండాకు వస్తు మార్గమధ్యలో సువర్ణకూటీర్ వద్ద పురుగుమందు తాగాడు. చదవండి: ఏడేళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆలయానికి వెళ్తున్నానని చెప్పి అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని దారిగుండా వెళ్లేవారు చూసి షాద్‌నగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. తల్లిదండ్రులు నీలమ్మ, సేవ్యాలకు శివ ఒక్కడే కుమారుడు కావడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. అటు పూణెలో కూతురును కోల్పోయిన పూల్‌సింగ్, చంద్రమ్మల కుటుంబం రోదనలతో గిరిజన తండాలో విషాదచాయలు అలుముకున్నాయి. చదవండి: చూడకూడనిది చూసిందని.. కన్నకూతురినే.. -
కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు
నవాబుపేట: కీడు శంకించిందని మహాత్మా గాంధీ విగ్రహాన్ని పక్కనపడేశారు. ఏళ్ల తరబడి చెట్టు కింద బాపూజీ విగ్రహం పడి ఉంది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. మూఢనమ్మకాలతో ప్రతిష్ఠించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పెట్టిన చోటే శిథిలమైంది. వివరాలిలా ఉన్నాయి. సుమారు 40 ఏళ్ల కిందట మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని గురుకుంటలో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని అక్కడి ఉపాధ్యాయులు, గ్రామస్తులు తెప్పించారు. చదవండి: మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: మంత్రి కేటీఆర్ ఆ సమయంలో ఓ ఉపాధ్యాయుడికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కీడు శంకించిన గ్రామస్తులు ఆ విగ్రహాన్ని పోమాల్కు పంపించారు. అక్కడ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండగా ఓ గ్రామ పెద్ద అనారోగ్యాంతో ఇబ్బందులు పడ్డాడు. దీంతో 30 ఏళ్ల కిందట మండల కేంద్రం నవాబుపేటకు తీసుకొచ్చారు. ఇక్కడా ప్రతిష్టించేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో విగ్రహం కాస్తా శిథిలావస్థకు చేరింది. చదవండి: మద్యం తాగితే రూ.10 వేల జరిమానా -
కడ్చర్లలో దారుణం;ఉల్లి కోసం రైతు హత్య!
-
ఉల్లి కోసం రైతు హత్య!
నవాబుపేట, న్యూస్‌లైన్: ఆకాశాన్నంటున్న ధరతో సామాన్యులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఉల్లిగడ్డ.. ఓ అమాయక రైతు హత్యకు కారణమైంది. బుధవారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలం కడ్చర్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఊరడి ఎల్లయ్య(60) తనకున్న నాలుగెకరాల్లో పత్తి, క్యారెట్, వంగ సాగు చేశాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో భోజనం చేసి పొలానికి వెళ్లాడు. పొలం వద్ద ఇదివరకే క్వింటాలు ఉల్లిగడ్డలను విత్తనం కోసమని గడ్డికప్పి దాచి ఉంచారు. దాని పక్కనే ఉన్న చెట్టు కింద ఎల్లయ్య నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు వచ్చి, ఉల్లిగడ్డలను సంచుల్లో నింపుకుంటుండగా ఎల్లయ్య నిద్ర లేచి వారిని అడ్డుకున్నాడు. దీంతో వారు ఎల్లయ్య తలపై కర్రతో గట్టిగా మోదారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో దుండగులు ఉల్లిగడ్డలను అక్కడే వదిలి పారిపోయారు. గురువారం ఉదయం పక్కపొలం రైతులు.. ఎల్లయ్య చనిపోయిన విషయం గమనించి కుటుంబ సభ్యులకు తెలిపారు. భూ తగాదాలే కారణమై ఉండొచ్చు: ఎస్పీ ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాజకుమారి స్పందిస్తూ... భూ తగాదాలే ఎల్లయ్య హత్యకు కారణంగా తాము భావిస్తున్నామని, ఈ మేరకు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు మాత్రం ఉల్లిగడ్డల దొంగతనానికి వచ్చిన వారే హత్యకు పాల్పడినట్లుగా చెబుతున్నారని చెప్పారు. ఈ రెండు కోణాల్లోనూ విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని గురువారం రాత్రి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు.