‘లోక్‌పాల్’కు కేజ్రీవాల్ తిలోదకాలు
న్యూఢిల్లీ: ‘జనలోక్‌పాల్’ ఉద్యమాన్ని ఆమ్ఆద్మీపార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ త్యజించారని నయా దౌర్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంజీవ చిబ్బర్ అన్నారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌పై చిబ్బర్ పోటీకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. సురక్షితమై ఢిల్లీ అసెంబ్లీ సీటును కేజ్రీవాల్ ఎంచుకోవద్దని కోరారు. అన్నా హజారే ఉద్యమానికి వెన్నెముకలా పనిచేసిన నిపుణులతో ఎన్డీపీ నూతనంగా ఏర్పడిందని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 35 మంది డాక్టర్లు, ఇంజినీర్లను ఎన్డీపీ రంగంలోకి దింపనున్నదని చెప్పారు.
ఆమ్ఆద్మీ అధినేత కేజ్రీవాల్‌తో తమ పార్టీ నిజాయితీగా ఎన్నికల యుద్ధానికి తలపడుతుందని చెప్పారు. జన్‌లోక్‌పాల్ ఉద్యమంపై కేజ్రీవాల్ కట్టుబ డి ఉన్నాడా అని ప్రశ్నించారు. అయితే, కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎందుకు ఆ సీటు ను పరిత్యజించారని, మళ్లీ ఎన్నికలు నిర్వహిం చడం వల్ల ఖజానాపై మరింత భారం పడుతోందని అన్నారు. ‘తమ పార్టీ వివిధ రంగాల్లో నిపుణులైన వారితో ఏర్పాటైందని, అన్నా జన్‌లోక్‌పాల్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఓటు బ్యాంక్ లేదా రాజకీయ విద్వేషాలకు తమ పార్టీ దూరంగా ఉంటుందని’ చెప్పారు.
ఇప్పటికే తమ పార్టీ మొదటి జాబితాలో 10 అభ్యర్థులను ప్రకటించిందని, ఇందులో ఇద్దరు డాక్టర్లు, ఇద్ద సాయుధళాల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారని తెలిపారు. ‘ మా పార్టీ ఇంజనీర్లు, డాక్టర్లు, న్యాయవాదులు, ఇంకా పలువురు వివిధ రంగాలకు చె ందిన నిపుణులు, అన్ని వర్గాల ప్రజలు ప్రాతినిద్యం వహిస్తున్నారని’ చెప్పారు. రక్షణరంగం, ఆరోగ్యం, విద్య, ఆర్థికం, విద్యుత్ తదితర ంగాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నదన్నారు. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది సభ్యులున్నారని, 3 లక్షల మంది ఢిల్లీలో ఉన్నారని అన్నారని ఆ పార్టీ మీడియా ఇన్చార్జి బ్రిజేష్ భట్ పేర్కొన్నారు.