Neal Mohan
-
యూట్యూబ్‌లో వారికే మొదటి ప్రాధాన్యత: సీఈవో నీల్మోహన్
కంటెంట్ క్రియేటర్లు, ఆర్టిస్టులు యూట్యూబ్‌కు గుండె కాయ లాంటి వారని, వారికే తాను మొదటి ప్రధాన్యత ఇస్తానని యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ స్పష్టం చేశారు. గత నెలలో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆయన యూట్యూబ్ కమ్యూనిటీతో తన భావాలను పంచుకున్నారు. ప్రధాన్యతలు తెలియజేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడిప్పుడే తన సామర్థ్యాలను చాటుతోందని, వీడియోల స్వరూపాన్నే మార్చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే రోజులు ముందున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నుంచి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు కూడా ప్రయోజనం పొందుతారన్నారు. యూట్యూబ్ సరికొత్త ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఫీచర్లను తమ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్లో ప్రవేశపెట్టనుంది. దీంతో కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోలకు అద్భుతమైన హంగులు జోడించేందుకు వీలు కలుగుతుంది. ఏఐ ఉత్పత్తుల్లో ఇప్పటికే ముందున్న ఓపెన్ఏఐ, మైక్రోసాఫ్ట్ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చే లక్ష్యంతో గూగుల్ ఈ ప్రయత్నం చేస్తోంది. చదవండి: త్వరలోనే మోటరోలా కొత్త వర్షన్ మడత ఫోన్లు.. ప్రకటించిన సీఈవో సరికొత్త ఏఐ సాధనాలను విడుదల చేయాలనే ఆతృతలో ఉన్న ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్.. ఇప్పటికే ఉన్న దాని సొంత సాధనాలు, సేవలను మెరుగుపరచడంలో నిదానంగా ఉందని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో పోటీదారులు ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీని, మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ చాట్‌బాట్‌ను విడుదల చేశాయి. కంపెనీకి డిజిటల్ యాడ్లు తగ్గిపోవడం, చాట్బాట్ల కారణంగా కంపెనీ ప్రధాన ఆదాయమైన ఇంటర్నెట్ సెర్చ్ వ్యాపారం మందగించడం వంటి ఎదురుదెబ్బలతో గూగుల్ కూడా గత ఫిబ్రవరిలో బార్డ్ అనే ఏఐ చాట్‌బాట్‌ను ప్రకటించింది. ఏది ఏమైనా ఏఐ విషయంలో గూగుల్ అప్రమత్తంగా ఉందనే విషయం యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ మాటల్లో వ్యక్తమౌతోంది. చదవండి: WTW Report: పెరగనున్న జీతాలు.. ఆసియా-పసిఫిక్‌లో భారత్ టాప్! -
Neal Mohan: యూట్యూబ్ కొత్త సీఈవో జీతమెంతో తెలుసా?
భారత సంతతికి చెందిన నీల్ మోహన్ ఇప్పుడు యూట్యూబ్ కొత్త సీఈవోగా బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే సుసాన్ వోజ్కికీ స్థానంలో నియమితులైన నీల్మోహన్ భారీ ప్యాకేజీ అందుకోబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారతీయ-అమెరికన్ మోహన్.. సుసాన్ వోజ్కికీ నేతృత్వంలోని అత్యంత సీనియర్ అధికారులలో ఒకరిగా యూట్యూబ్ చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్‌గా పనిచేశారు. సీఈఓగా అర్హుల జాబితాలో చాలామంది ఉన్నా నీల్ మోహన్నే యూట్యూబ్ ఎంపిక చేయడం విశేషం. యూట్యూబ్‌లో ఉన్నత స్థాయిలో పనిచేస్తుండటంతో పాటు అనేక ప్రతిష్టాత్మక సంస్థలలో కూడా మోహన్ పని చేశారు. గూగుల్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన కెరీర్ ప్రారంభంలో మైక్రోసాఫ్ట్‌లో చిన్న ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు. గూగుల్‌లో డిస్ప్లే, వీడియో ప్రకటనల విభాగాన్ని పర్యవేక్షించిన ఆయన యూట్యూబ్, గూగుల్ డిస్ప్లే నెట్వర్క్, యాడ్సెన్స్, యాడ్‌మాబ్, డబుల్ క్లిక్ యాడ్ టెక్ వంటి ఉత్పత్తి సేవల బాధ్యతలు నిర్వహించారు. యూట్యూబ్‌కు రాజీనామా చేసిన వోజ్కికీకి యాజమాన్యం భారీ జీతం ఇచ్చేది. మీడియా నివేదికల ప్రకారం నెలకు సుమారు 3,74,829 యూఎస్ డాలర్ల జీతం తీసుకునేవారు ఆమె. అంటే మన కరెన్సీలో రూ. 3.1 కోట్లు. దీని బట్టే..కొత్త సీఈవో నీల్ మోహన్ జీతం అంతకు మించి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. గతంలో నీల్ మోహన్ ట్విటర్‌కు మారకుండా ఉండేందుకు గూగుల్ నుంచి 100 మిలియన్ డాలర్లు బోనస్‌గా అందుకున్నట్లు తెలిసింది. (ఇదీ చదవండి: యూట్యూబ్ సీఈవోగా భారతీయుడు.. అసలు ఎవరీ నీల్ మోహన్!) -
యూట్యూబ్ సీఈవోగా భారతీయుడు.. అసలు ఎవరీ నీల్ మోహన్!
అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలకు సారథ్యం వహించే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో టెక్నాలజీ కంపెనీ సారథ్య బాధ్యతలను భారత సంతతికి చెందిన వ్యక్తి దక్కించుకున్నారు. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌కు సీఈవోగా నీల్ మోహన్ (47) నియమితులయ్యారు. దీంతో నీల్ మోహన్ సైతం ఇతర టెక్ కంపెనీల్లో సీఈవోలుగా విధులు నిర్వహిస్తున్న భారతీయుల జాబితాలో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన నియామకంతో యూట్యూబ్‌కి సుదీర్ఘ కాలంగా.. సీఈవోగా ఉన్న సూసన్ వొజిసికి తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తన బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల క్రితం తాను యూట్యూబ్‌లో చేరినప్పుడు అద్భుతమైన నాయక బృందాన్ని తీసుకురావాలనేది..తన మెుదటి ప్రాధాన్యమని..సూసన్ తెలిపారు. నీల్ మోహన్ అందులో ఒకరని వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్‌లో ఇంటర్ వరకు చదివిన నీల్ మోహన్..యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టే వరకు ఆయన ప్రస్తానం ఎలా సాగిందో తెలుసుకుందాం. ►లక్నోకు చెందిన ఆదిత్యమోహన్, దీపా మొహన్ దంపతులకు నీల్ మొహన్ జన్మించారు. ►ప్రాధమిక విద్య వరకు లక్నో స్థానిక స్కూల్లో చదివిన ఆయన ఇంటర్ హజ్రత్‌గంజ్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. ►1996లో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ►గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తర్వాత 1997లో యాక్సెంచర్‌లో, అదే ఏడాది నెట్ గ్రావిటీ అనే స్టార్టప్‌లో చేరారు. నెట్ గ్రావిటీలో ఆపరేషన్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అక్కడే తాను ఉన్నత శిఖరాలకు చేరుకునేలా బీజం పడిందని నీల్ మొహన్ చెబుతారు. ►1997లోనే నెట్ గ్రావిటీని ప్రముఖ పెట్టుబడుల సంస్థ హెల్మాన్ & ఫ్రైడ్మెన్కు చెందిన డబుల్ క్లిక్ సంస్థ కొనుగులో చేసింది. ఈ కొనుగోలుతో నీల్ మొహన్ న్యూయార్క్‌లో ఉన్న డబుల్ హెడ్ క్వార్టర్స్‌కు షిఫ్ట్ అయ్యారు. అక్కడే కొన్ని సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. ►ముఖ్యంగా డాట్ కామ్ బుడగ పేలిన సమయంలో ఆ గండం నుంచి గట్టేందుకు డబుల్ క్లిక్ సంస్థ నీల్ మోహన్‌పై ఆధారపడింది. అలా తన బిజినెస్ వ్యూహాలతో అదే సంస్థ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ►2003లో ఎంబీఏ చదివేందుకు స్టాన్‌ఫోర్డ్‌కు తిరిగి వచ్చారు. స్టాన్‌ఫోర్డ్‌లో ఉన్నప్పుడు డబుల్ క్లిక్ సంస్థ 1999లో అబాకస్ డైరెక్ట్‌ను కొనుగోలు చేసింది. ►ఆ తర్వాత జరిగిన పరిణామాలతో డబుల్ క్లిక్‌ను, అబాకస్ డైరెక్ట్ ఈ రెండు సంస్థల్ని విలీనం చేయాలనే హెల్మాన్ & ఫ్రైడ్మెన్ యాజమాన్యం ప్రతిపాదనల్ని వెనక్కి తీసుకుంది. ►అదే సమయంలో హెల్మెన్ & ఫ్రైడ్మాన్ కంపెనీ విభజన నేపథ్యంలో డబుల్‌క్లిక్ దీర్ఘకాల సీఈవోగా డేవిడ్ రోసెన్బ్లాట్ను నియమించింది. ►డబుల్ క్లిక్ సీఈవోగా రోసెన్‌బ్లాట్ విధులు నిర్వహించే సమయంలో నీల్ మోహన్ ఎంబీఏ పూర్తి చేశారు. కొన్ని షరతులతో మోహన్ డబుల్ క్లిక్‌లో చేరారు. ►రోసెన్‌బ్లాట్ -మోహన్‌లు కలిసి డబుల్క్లిక్ను అడ్వర్టైజింగ్ ఎక్స్ఛేంజ్, కోర్ యాడ్ టెక్నాలజీ తో పాటు యాడ్ నెట్ వర్క్‌ను విస్తృతం చేసేందుకు కృషి చేశారు. ►యాడ్ నెట్‌వర్క్‌పై కంపెనీగా మార్చేందుకు వారిద్దరూ కలిసి బిజినెస్ ప్రణాళికల్ని 400 స్లైడ్‌లలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశారు. 2005 డిసెంబర్ నెలలో డబుల్ క్లిక్ - హెల్మెన్ అండ్ ఫ్రైడ్ మెన్ బోర్డ్‌కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. ► 2007 ఏప్రిల్ 13న గూగుల్ 3.1 బిలియన్లకు డబుల్ క్లిక్‌ను కొనుగోలు చేసింది. దీంతో గూగుల్ యాడ్ నెట్ వర్క్ దశ మారిందని గూగుల్ ఎగ్జిక్యూటివ్ సుసాన్ వోజ్కికీ నమ్ముతారు. 2007లో అధికారికంగా గూగుల్‌లో మోహన్ గూగుల్‌లో చేరారు. సుసాన్ వోజ్కికీ - మోహన్లో 15 ఏళ్ల పాటు ఆమె కలిసి పనిచేశారు. ►ముఖ్యంగా గూగుల్ - డబుల్‌క్లిక్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్‌లో కీలక పాత్ర, 2010లో 85 మిలియన్లతో డిస్ప్లే అడ్వటైజింగ్, ఎక్ఛేంజీ బిడ్డింగ్ కంపెనీ ఇన్వైట్ మీడియా కొనుగోలులో ముఖ్య పాత్ర పోషించారు. ►గూగుల్‌లో డిస్ప్లే, వీడియో యాడ్స్ విభాగాల్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ►2015లో మోహన్ యూట్యూబ్ (గూగుల్ అనుబంధ సంస్థ)లో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా చేరారు. 2010 - 2020 మధ్య కాలంలో యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ ప్రీమియం , యూట్యూబ్ షార్ట్‌లు, యూట్యూబ్ ఎన్ఎఫ్టిలతో యూట్యూబ్‌లో సరికొత్త ఒరవడిని సృష్టించారు. ►తాజాగా సుసాన్ వోజ్కికి తర్వాత యూట్యూబ్ సీఈవోగా మోహన్ ఎంపికయ్యారు -
Neal Mohan యూట్యూబ్ కొత్త సీఈవో: మరోసారి ఇండియన్స్ సత్తా
సాక్షి, ముంబై: గ్లోబల్ టెక్ కంపెనీలకు సారధులుగా భారతీయ సంతతికి చెందిన నిపుణులు సత్తా చాటుతున్నారు. తాజాగా వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ సీఈవోగా ఇండో అమెరికన్ నీల్మోహన్ నియమితులయ్యారు. తొమ్మిదేళ్ల పాటు యూట్యూబ్ సీఈవోగా పనిచేసిన సుసాన్ వోజ్కికీ తప్పుకోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. భారతీయ-అమెరికన్ నీల్మోహన్ 2015 నుండి యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీచేసిన మోహన్ గతంలో మైక్రోసాఫ్ట్‌తో పాటు పలు టెక్ కంపెనీల్లో కూడా పనిచేశారు. మరోవైపు దాదాపు పాతికేళ్లపాటు గూగుల్‌కు పనిచేసిన తాను జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నానని సుసాన్ చెప్పారు. తన వ్యక్తిగత ప్రాజెక్టులకు సంబంధించి కొత్త పని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తన కెరీర్లో 2007లో డబుల్‌క్లిక్ కొనుగోలుతో గూగుల్‌కు వచ్చినప్పటినుంచీ దాదాపు 15 సంవత్సరాలు మోహన్‌తో కలిసి పనిచేశాననీ ఆమె చెప్పారు. అయితే గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్పిచాయ్కు సలహాదారుగా మార నున్నారని సమాచారం. Thank you, @SusanWojcicki. It's been amazing to work with you over the years. You've built YouTube into an extraordinary home for creators and viewers. I'm excited to continue this awesome and important mission. Looking forward to what lies ahead... https://t.co/Rg5jXv1NGb — Neal Mohan (@nealmohan) February 16, 2023 సుసాన్ వోజ్కికీ కాగా ఇప్పటికే గ్లోబల్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ సంతతికి చెందిన సీఈవోల జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ పెప్సికో ఇంద్రా నూయి, తమ ప్రత్యేకతను చాటుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో నీల్ మోహన్ చేరడం విశేషం.